25-5-2023 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా”(లేదా...)“శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా”(ఛందోగోపనం)
మర్దనజేయుమధర్మముసర్దగసంఘముతలకొనిశాంతినిబొందన్అర్థముబొందగనలజడిశార్దూలముపైననెక్కి ాగుమువిబుధా
కందంమర్దన జేసియు మహిషునిదుర్దశ లోకమునఁ బాపె దుర్గయె! పొగడన్నిర్దిష్ట ఛందమనగన్శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా!
శార్దూలవిక్రీడితమువాలాయమ్ముగ లోకులన్ మహిషుఁడున్ బాధింప క్రూరుండుగన్జాలిన్జూపియు దుర్గయే దునిమినన్ సాక్షాత్ జగన్మాతవౌలీలల్ స్తోత్రము సేయ ఛందమొదవన్ ప్రీతిన్ మహాభక్తి శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
జాలంబేలను సాగు మెల్ల కవులున్ సంప్రీతిజెందన్ వడిన్వాలాయంబుగ వ్రాయుచున్ నిరతమున్ప్రజ్ఞానమేపారగానేలీలన్ నడిపింతువో వృత్తమునునిన్నేజూచుచున్నారు శార్దూలంబెక్కి భయంబు వీడి చనుమారూఢింగవీంద్రోత్తమా
మార్దవమే యది కాదదియార్దితమని ఖరహరప్రియ యటంచు కవీగార్దభ మేలా? పద్యము శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా.కాలంబయ్యది జారుచుండె రవి యాకాశమ్ము నే వీడెడిన్ వైళమ్మిప్పుడు జేరవచ్చెగద నీ పాండిత్యమున్ జూపుచున్ లీలామానస మూర్తియైన గిరధారిన్ గూర్చి వర్ణింప శా ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా.
నిర్దిష్టమైన భావమునిర్దారితమైన చోట నిండుగ తోచన్మార్దవ పదముల పూనికశార్దూలముపైన నెక్కి సాగుము విబుధా
జ్వాలాపూర్ణిమ నాటి వెన్నెల వలెన్ సౌఖ్యంబు చేకూర్చగాలీలావంతుడవై లిఖించితివిగా లెక్కింపగన్ శ్రేష్టమైకాలాతీతముగా వసించు విధమున్ గాంక్షించి పద్యాలు శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
వర్ధిల్లగ నీ పాండితినిర్దిష్టములౌ ఛందములను నేర్వగ వలెరామార్దవమువీడి జవమునశార్దూలముపైన నెక్కి సాగుము విబుధా
శా.మూలాధారము మంత్ర శాస్త్రము సుధీ ! మ్రొక్కంగ దివ్యంబుగన్శూలాద్యాయుధముల్ త్రిమూర్తుల వరాల్, శోకాల బోగొట్టెడిన్సాలగ్రామము లింగ శక్తి మహిమల్ సౌఖ్యంబు జేకూర్చు, *శా**ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా!*
వర్ధన మౌ గద కీర్తియుమార్థవమగు పద ముల o దు మధుర పు టూహ ల్నిర్థిష్ట ము గాపద్య ముశార్దూ లము పైన నెక్కి సాగుము విభు దా!
ఆలమ్మందున తమ్మిమొగ్గరమునం దత్యంత ధీరోద్ధతిన్నేలంగూల్చెను శత్రుసంచయము దానిక్కంపు శౌర్యంబుతోబాలుండౌ అభిమన్యు శౌర్యగుణమున్ వర్ణింప పద్యమ్ము శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
నిర్ధిష్టమైన పగిదినిదుర్దాంతంబౌ విజయుని దోర్బలమునునీమార్దవ పదగుంఫనమునశార్దూలముపైన నెక్కిసాగుము విబుధా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వాలంబేమియులేనివానరముగావాగన్సభాకోవిదుల్ప్రేలన్మాటలధీరుగానిలువుమీపెంపేదగావెందునున్పోలంజాలినవాక్కుపుత్రుడవునీభోగంబుజూపంగశార్దూలంబెక్కిభమ్మువీడిచనుమారూఢిన్కవీంద్రోత్తమా
కం॥ మార్దవము లేని నడవడి శార్దూలము లేని పద్య సంహితముఁ గనన్నిర్దయ జనులకు పొసఁగునశార్దూలముపైన నెక్కి సాగుము విబుధాశా॥ లీలా మానుష సూత్ర ధారి ఘనమౌ లీలల్ వచించంగ శార్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమామేలైనట్టి కవిత్వ రీతియు నిదే మేధావి వర్గంబుకౌకాలమ్మేదియు నైన ఖ్యాతి వెలయున్ గావ్యమ్ము నుచ్చిష్టమైఅనుకోకుండా గణదోషాలు వచ్చినందున రెండు మార్లు సవరించాల్సి వచ్చింది. మన్నించాలి
వర్ధితమగు భావంబునునిర్ధిష్టంబగు భాషా ప్రయోగ నెప్పెరి గుణముల్నిర్ధారిత పద్య మదియెశార్దూలము పైన నెక్కి సాగుము విబుధా.
అర్ధాంతరముగనాపకవ్యర్థపదంబులనువీడి పద్యములల్లన్స్పర్ధనుగెలుచుటతథ్యముశార్దూలము పైననెక్కి సాగుము విబుధా
మర్దనజేయుమధర్మము
రిప్లయితొలగించండిసర్దగసంఘముతలకొనిశాంతినిబొందన్
అర్థముబొందగనలజడి
శార్దూలముపైననెక్కి ాగుమువిబుధా
కందం
రిప్లయితొలగించండిమర్దన జేసియు మహిషుని
దుర్దశ లోకమునఁ బాపె దుర్గయె! పొగడన్
నిర్దిష్ట ఛందమనగన్
శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా!
శార్దూలవిక్రీడితము
తొలగించండివాలాయమ్ముగ లోకులన్ మహిషుఁడున్ బాధింప క్రూరుండుగన్
జాలిన్జూపియు దుర్గయే దునిమినన్ సాక్షాత్ జగన్మాతవౌ
లీలల్ స్తోత్రము సేయ ఛందమొదవన్ ప్రీతిన్ మహాభక్తి శా
ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
జాలంబేలను సాగు మెల్ల కవులున్ సంప్రీతి
రిప్లయితొలగించండిజెందన్ వడిన్
వాలాయంబుగ వ్రాయుచున్ నిరతమున్
ప్రజ్ఞానమేపారగా
నేలీలన్ నడిపింతువో వృత్తమునునిన్నేజూ
చుచున్నారు శా
ర్దూలంబెక్కి భయంబు వీడి చనుమా
రూఢింగవీంద్రోత్తమా
రిప్లయితొలగించండిమార్దవమే యది కాదది
యార్దితమని ఖరహరప్రియ యటంచు కవీ
గార్దభ మేలా? పద్యము
శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా.
కాలంబయ్యది జారుచుండె రవి యాకాశమ్ము నే వీడెడిన్
వైళమ్మిప్పుడు జేరవచ్చెగద నీ పాండిత్యమున్ జూపుచున్
లీలామానస మూర్తియైన గిరధారిన్ గూర్చి వర్ణింప శా
ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా.
నిర్దిష్టమైన భావము
రిప్లయితొలగించండినిర్దారితమైన చోట నిండుగ తోచన్
మార్దవ పదముల పూనిక
శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా
జ్వాలాపూర్ణిమ నాటి వెన్నెల వలెన్ సౌఖ్యంబు చేకూర్చగా
తొలగించండిలీలావంతుడవై లిఖించితివిగా లెక్కింపగన్ శ్రేష్టమై
కాలాతీతముగా వసించు విధమున్ గాంక్షించి పద్యాలు శా
ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
వర్ధిల్లగ నీ పాండితి
రిప్లయితొలగించండినిర్దిష్టములౌ ఛందములను నేర్వగ వలెరా
మార్దవమువీడి జవమున
శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా
శా.
రిప్లయితొలగించండిమూలాధారము మంత్ర శాస్త్రము సుధీ ! మ్రొక్కంగ దివ్యంబుగన్
శూలాద్యాయుధముల్ త్రిమూర్తుల వరాల్, శోకాల బోగొట్టెడిన్
సాలగ్రామము లింగ శక్తి మహిమల్ సౌఖ్యంబు జేకూర్చు, *శా*
*ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా!*
వర్ధన మౌ గద కీర్తియు
రిప్లయితొలగించండిమార్థవమగు పద ముల o దు మధుర పు టూహ ల్
నిర్థిష్ట ము గాపద్య ము
శార్దూ లము పైన నెక్కి సాగుము విభు దా!
ఆలమ్మందున తమ్మిమొగ్గరమునం దత్యంత ధీరోద్ధతిన్
రిప్లయితొలగించండినేలంగూల్చెను శత్రుసంచయము దానిక్కంపు శౌర్యంబుతో
బాలుండౌ అభిమన్యు శౌర్యగుణమున్ వర్ణింప పద్యమ్ము శా
ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
నిర్ధిష్టమైన పగిదిని
రిప్లయితొలగించండిదుర్దాంతంబౌ విజయుని దోర్బలమునునీ
మార్దవ పదగుంఫనమున
శార్దూలముపైన నెక్కిసాగుము విబుధా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివాలంబేమియులేనివానరముగావాగన్సభాకోవిదుల్
రిప్లయితొలగించండిప్రేలన్మాటలధీరుగానిలువుమీపెంపేదగావెందునున్
పోలంజాలినవాక్కుపుత్రుడవునీభోగంబుజూపంగశా
ర్దూలంబెక్కిభ
మ్మువీడిచనుమారూఢిన్కవీంద్రోత్తమా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ మార్దవము లేని నడవడి
రిప్లయితొలగించండిశార్దూలము లేని పద్య సంహితముఁ గనన్
నిర్దయ జనులకు పొసఁగున
శార్దూలముపైన నెక్కి సాగుము విబుధా
శా॥ లీలా మానుష సూత్ర ధారి ఘనమౌ లీలల్ వచించంగ శా
ర్దూలంబెక్కి భయమ్ము వీడి చనుమా రూఢిం గవీంద్రోత్తమా
మేలైనట్టి కవిత్వ రీతియు నిదే మేధావి వర్గంబుకౌ
కాలమ్మేదియు నైన ఖ్యాతి వెలయున్ గావ్యమ్ము నుచ్చిష్టమై
అనుకోకుండా గణదోషాలు వచ్చినందున రెండు మార్లు సవరించాల్సి వచ్చింది. మన్నించాలి
వర్ధితమగు భావంబును
రిప్లయితొలగించండినిర్ధిష్టంబగు భాషా ప్రయోగ నెప్పెరి గుణముల్
నిర్ధారిత పద్య మదియె
శార్దూలము పైన నెక్కి సాగుము విబుధా.
అర్ధాంతరముగనాపక
రిప్లయితొలగించండివ్యర్థపదంబులనువీడి పద్యములల్లన్
స్పర్ధనుగెలుచుటతథ్యము
శార్దూలము పైననెక్కి సాగుము విబుధా