1, మే 2023, సోమవారం

సమస్య - 4410

2-5-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మంగళసూత్రమును మహిళ మగనికిఁ గట్టెన్”
(లేదా...)
“మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

39 కామెంట్‌లు:

  1. అంగననవ్యతఁజూపుచు
    జంగమదేవరతనపతిజతగానుండన్
    ముంగిటముద్దునుజేయుచు
    మంగళసూత్రమునుమహిళమగనికిగట్టెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    అంగన కోరిన మీదట
    లింగాయతులంత్రమొసఁగ శ్రీకరమనుచున్,
    సంగరము వాప మ్రొక్కియు
    మంగళసూత్రమును, మహిళ మగనికిఁ గట్టెన్

    ఉత్పలమాల
    చెంగట భక్తితోనడుగ శ్రీకరమంచును లింగధారులున్
    ముంగిట మంత్రముల్ సదివి ముచ్చట తీర నొసంగ నంత్రమున్,
    సంగరముల్ నివారణము సక్కగ జేయునటంచు మ్రొక్కియున్
    మంగళసూత్రమున్, మహిళమానక కట్టెను భర్తకున్ దమిన్

    రిప్లయితొలగించండి
  3. గంగశిరంబునన్గనగగౌరికినర్థముదేహమిచ్చెగా
    జంగమదేవరాతఁడునుచాలగమెచ్చుచుశక్తినాత్మలో
    నింగికినేలకున్ముడినినేర్పునగూర్చుచుసామ్యపద్ధతిన్
    మంగళసూత్రమున్మహిళమానకగట్టెనుభర్తకున్దమిన్

    రిప్లయితొలగించండి
  4. మంగళ కరమని నమ్మును
    మంగళ సూత్రమును మహిళ:: మగనికి గట్టెన్
    పొంగగ భక్తి మనమ్మున
    రంగని పూజారి యొస గ రక్ష గ పాణి న్

    రిప్లయితొలగించండి
  5. మంగళ కార్యమున్ జరుప మానస
    మందున దల్చియింటిలో
    మంగళవారమే మిగుల మంచి ద
    టంచును నమ్మివెంటనే
    కంగన యింటి దేవతకు గారవ
    పూజయొనర్చ జేతికిన్
    మంగళ సూత్రమున్ మహిళ మానక
    కట్టెను భర్తకున్ దమిన్.

    రిప్లయితొలగించండి

  6. సింగడు మేటి నట్టుగ ప్రసిద్ధిని పొందిన వాడటంచు నా
    సంగడికాడు కోరెనని జవ్వని వేషము వేయువేళ న
    ర్థాంగి యలంకరించుచు వరాసిని గట్టెను కంఠమందునన్
    మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్.

    రిప్లయితొలగించండి

  7. అంగన పాత్రలు వేసెడి
    వెంగడు చంద్రమతి పాత్ర వేసెడు వేళన్
    సింగారించుచు నప్పుడు
    మంగళసూత్రమ్ము వధువు మగనికి కట్టెన్.

    రిప్లయితొలగించండి
  8. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మంగళగౌరి వ్రతమ్మున
    పింగస్ఫటికంపు రంగు వెదజిందెడి సా
    రంగములదోడ నల్లిన
    మంగళసూత్రమ్ము వధువు మగనికి కట్టెన్.

    రిప్లయితొలగించండి
  9. అంగున వధువుకు కట్టెను
    మంగళసూత్రమును ; మహిళ మగనికిఁ గట్టెన్
    వంగిన నాతని మెడలో
    బంగారపు హారమొకటి బహు నేరుపుతో

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి:

    అంగనలందరు గూడియు
    ముంగిట సావిత్రి నోము మురియుచు జేయన్
    చెంగున పెట్టిన రంగుల
    మంగళసూత్రమ్ము మహిళ మగనికి కట్టెన్.

    రిప్లయితొలగించండి
  11. మంగళగిరి దాపునగల
    కొంగల కోనేటిజలముఁ గొనిన జనులలో
    వెంగలి చేష్టలు వొడమగ
    మంగళసూత్రమును మహిళ మగనికిఁ గట్టెన్

    రిప్లయితొలగించండి
  12. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గంగకు తోడిపత్నియగు గౌరిని క్షేమమొసంగ గోరుచున్
    మంగళగౌరి పూజలను మంతుగ సల్పెడి కాలమందునన్
    పింగళవర్ణ పుష్పముల పేనిన రూపగు నోముతోరమౌ
    మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుందమిన్.

    రిప్లయితొలగించండి
  13. పొంగిన హలాహలమ్మున్
    మ్రింగెద నని శివుడుపల్క లింగని సతియే
    చెంగున కట్టెను రక్షను
    మంగళసూత్రమును మహిళ మగనికిఁ గట్టెన్

    పొంగులు వారు హాలహలమున్ గని భీతిలి దేవదానవుల్
    చెంగున జంగమయ్యకడ జేరి శివా! శరణంచు వేడగా
    మంగళ కట్టె భర్త గళమందున చక్కని రక్షరేకునే
    మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్

    రిప్లయితొలగించండి
  14. బెంగిలి భర్త సుస్థమతి వేగముగా దిగబాఱుచుండ నా
    యంగన దేవళంబుకడ నర్చన కేగగ నర్చకుండొగిన్
    మంగళమౌను నీపతికి మానినియంచొక రక్షనీయనా
    మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్

    రిప్లయితొలగించండి
  15. కంగన హిందీ సీనెమా హీరోహిని పేరు. ఈ మధ్య కాలములో వార్తా పత్రికలలో ప్రతిరోజూ ఆమె పేరే


    రిప్లయితొలగించండి
  16. కం॥ లొంగని జబ్బున స్వస్థత
    భంగము గాఁగ తన భర్త బాగు కటంచున్
    జంగమ యోగియొసంగిన
    మంగళ సూత్రమ్ము మహిళ మగనికిఁ గట్టెన్

    ఉ॥ అంగన స్వప్నమందుఁ గన హాస్యపు దృశ్యము తెల్పె భర్తకున్
    మంగళ సూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్
    కొంగునఁ గట్టుకున్నదఁట కోరిక మీరఁగ భర్తనట్టులన్
    ముంగిట ముగ్గు లేసెనఁట ముద్దుగ వంటలఁ జేసి భర్తయే!

    రిప్లయితొలగించండి
  17. భంగము‌ కలిగెను‌ పెండ్లికి‌
    రంగడు‌ కట్నము‌ గురించి రంకెలు‌ వేయన్‌
    టంగునకోపము‌ పూనగ‌
    మంగళ‌ సూత్రంబు‌ వధువు‌ మగనికి‌ కట్టెన్.

    రిప్లయితొలగించండి
  18. మరొక పూరణ సామాజిక స్పృహకు

    కం॥ కృంగద ధర్మముఁ గనఁగ స్వ
    లింగ వివాహము ముదమని లేచిన నిటులన్
    భంగమనుష్ఠానమునకు
    మంగళ సూత్రమ్ము మహిళ మగనికిఁ గట్టన్

    (స్వలింగ వివాహములో ఆడ మగ నిర్ణయము దుర్లభమైనందున)

    రిప్లయితొలగించండి
  19. కొంగలదీవి నీరమున కొందరు జజ్జరకాండ్రు సోద్యమౌ
    జాంగులవమ్మునుంగలుప సర్వులు గ్రోలఁగ చిత్త భ్రాంతితో
    వెంగళులై చరించుచు వివేకము గోల్పడినారు వింతగా
    మంగళసూత్రమున్ మహిళమానక కట్టెను భర్తకుం దమిన్

    (జాంగులవము=విషము / రసాయనము)

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    అంగనకున్ గట్టె వరుడు
    మంగళసూత్రమును; మహిళ మగనికిఁ గట్టెన్
    మంగళము కలుగ నెంచుచు
    మంగళకరమైన తోరమని కరమునకున్.

    రిప్లయితొలగించండి
  21. పొంగగ నుల్లము గాంచుచు
    మంగళసూత్రమును మహిళ మగనికిఁ గట్టెన్
    చెంగునకట్టినతోరము
    కంగారేమియునుపడక గట్టిగ నపుడే

    పొంగుచు నుండగా మనము భూరిగ మ్రొక్కుచు భక్తితో డనా
    *“మంగళసూత్రమున్ మహిళ మానక కట్టెను భర్తకుం దమిన్”*
    బంగరుకంకణమ్మునటబంధువులెల్లరుచూచుచుండగా
    మంగళ శ్లోకముల్ వినుచు మానసమందున హెచ్చ మోదమున్.

    రిప్లయితొలగించండి