19, మే 2023, శుక్రవారం

సమస్య - 4425

20-5-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కామ లోభ మోహమ్ములఁ గలుగు ముక్తి”
(లేదా...)
“కామము లోభమోహములఁ గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్”
(ఆముదాల మురళి గారి చిత్తూరు శతావధాన సమస్య)

15 కామెంట్‌లు:

  1. వికలమైనట్టివేదనవిశ్వపతిని
    విడువలేనట్టివేదనవెఱ్ఱియగుచు
    అంతరంగానవదలనిహంసమౌని
    కామలోభమోహమ్ములగలుగుముక్తి

    రిప్లయితొలగించండి

  2. పరమ పదమును కాంక్షించు వారికిలను
    రామనామస్మరణ మదే రమ్య పథము
    ప్రీతితో జపియించుచు విడిచి నంత
    కామ లోభ మోహమ్ములఁ , గలుగు ముక్తి.


    ప్రేమగ నాదరించి భువి పేదల యాకలి దీర్చు వారలై
    నేమము తప్పకుండ కడు నిష్ఠగ సాధన జేయగోరి యా
    రాముని దివ్యనామమె నిరంతర ధానమె యౌచు రోసినన్
    కామము లోభమోహములఁ , గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్.

    రిప్లయితొలగించండి
  3. నీతి‌ పట్లను‌ కామంబు‌ నిలుపునట్టి
    నోటి‌ దురుసుకు‌ లోభంబు‌ నోచునట్టి
    దైవ‌ చింతనా‌ మోహమ్ము‌ దక్కినట్టి‌
    కామ‌ లోభ‌ మోహమ్ములఁ గలుగు‌ ముక్తి‌

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    లోనివన నరిషడ్వర్గమూని నిన్ను
    భువి నధోగతి పాల్సేయు నవగుణముల
    కూడక మదమత్సరములఁ, గ్రోధ సహిత
    కామ, లోభ, మోహమ్ములఁ గలుగు ముక్తి

    ఉత్పలమాల
    భూమి నధోగతిన్ బడక పూనియు నారగు లోని శత్రులన్
    నీమము లాచరించుచును నెమ్మదిఁ బోరి జయింప జూడుమా
    తామస రాజసాలనెడు తన్మద, మత్సర, క్రోధమాదిగన్
    కామము లోభమోహములఁ, గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్

    రిప్లయితొలగించండి
  5. ఉ.

    నేమపు తీర్థయాత్రలను నిశ్చల భక్తిని జేయుచుండెడిన్
    సోమరసమ్ము నొందు క్రియ శోభను బుణ్యము నిచ్చు రీతియే
    క్షేమము నిచ్చెడిన్ మదముఁ జెందరు క్రోధము మత్సరంబులన్
    *కామము లోభమోహములఁ గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్.*

    రిప్లయితొలగించండి
  6. మరల మరల జన్మించెడి మాయనుండి
    వైదొలగు మార్గమేకద పరమ పదము
    విశ్వనాథుని స్మరణలో వీడనాడఁ
    కామ లోభ మోహమ్ములఁ గలుగు ముక్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామము క్రోధమున్ మదము కారణభూతులు నాశనంబుకై
      ధీమతులైనవారు చని దివ్యపదంబును చేరనెంచినన్
      నీమము తప్పకన్ శివుని నిత్యముఁ గొల్చుచు వీడగల్గినన్
      కామము లోభమోహములఁ గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్

      తొలగించండి
  7. ఇహము నందున మనుజుల కహము నిలుపు
    కామ లోభ మోహమ్ములఁ ; గలుగు ముక్తి
    కొద్దిగ కనికరము దాన గుణము లుండ ,
    దీని నెరిగి మనుట తగు తెన్ను యగును

    రిప్లయితొలగించండి
  8. వైరు లా ర్గురి గెలిచిన వార లగుచు
    ధర్మ రక్షణ సత్కర్మ దైవ చింత
    వ లయు ననుచు ను తప్పక వదలి నపుడె
    కామ లోభ మో హమ్ముల గ లుగు ముక్తి

    రిప్లయితొలగించండి
  9. తే॥ ధర్మ మార్గముఁ గామించు దక్షతున్న
    లుప్త మెఱుఁగని సుగుణపు లోభమున్న
    సర్వుల హితము మోహించు సరసతున్న
    కామ లోభ మోహమ్ములఁ గలుగు ముక్తి

    ఉ॥ కామము భక్తి తత్పరత కాఁగను మారని లోభమైచనన్
    నేమము తోడఁ గొల్చినను నిత్యము మోహముఁ బెంచి విష్ణువున్
    ధామముఁ గోరి పాదముల దగ్గర చేరుటటంచు లీనమై
    కామము లోభమోహములఁ గల్గును మోక్షము దేవుఁడివ్వగన్

    రిప్లయితొలగించండి
  10. భక్తినెద నిల్పి యీశులో సక్తమగుచు
    శక్తికొలదిగ పూజింప యుక్తమగును
    యమనియమముల పాటించి యదుపుఁజేయ
    కామ లోభ మోహమ్ములఁ, గలుగు ముక్తి


    నీమముఁ దప్పకన్ సతమునిర్మల భక్తి పురస్సరమ్ముగా
    నీమనమందునన్ నిలిపి నిర్గుణ రూపుని దేవదేవునిన్
    క్షేమముఁగూర్చ సర్వులకు సేయగ పూజ త్యజించి నిచ్చలున్
    కామము లోభమోహములఁ, గల్గును మోక్షము దేవుఁ డివ్వఁగన్

    రిప్లయితొలగించండి
  11. ఈమహి జన్మమెత్తి పరమేశ్వురు నెప్పుడు
    సన్నుతించినన్
    నీమము నీతి ధర్మములు నిత్యము దప్పక
    యాచరించినన్,
    నీ మది జేరకుండ గడు నీచపు కోర్కులు
    సుప్రసిద్ధమౌ
    కామము లోభ మోహముల, గల్గును
    మోక్షము దేవుడివ్వగన్ .

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.

    మోక్ష గామికిన్, భక్తితో దీక్ష తోడ
    దేవదేవుని గొల్చుచు దినము దినము
    వీడకనె ధర్మపథమును, విడిచి నంత
    కామ,లోభ,మోహమ్ములఁ; గలుగు ముక్తి.

    రిప్లయితొలగించండి
  13. పగలురేయియనకభక్తిభావమూని
    చిత్తమునతలచుకొనుచుశ్రీశునెపుడు
    గడుపుచుండినచాలునుకాలము విడి
    కామలోభమోహమ్ముల,గలుగుముక్తి

    రిప్లయితొలగించండి