16-6-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్”(లేదా...)“ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్”
చాలిక నీ వెజ్జఱికముబేలా! ప్రాణాంతకమగు వేల యిదియె మామూలౌషధముల వేలనెహాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్.
మేలంబాడగరాదుగఆలముసేకగరళము నాలుకనంటన్మూలముద్రుంచునురోగముహాలాహలమిడగఁజేయునాయుర్వృద్ధిన్
మేలని వైద్యులు కొందరుకాలము మారిన దనుచును గరళ ము దోడన్వీలగు చికిత్స యనుచున్హాలాహల మిడ జేయు నాయుర్వృ ద్దిన్
కాలము దాపించె నకటకాలుని మహిషంపుకాలి గజ్జెలు మ్రోగెన్జాలము సేయక వేగమెహాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
కాయంబందున సంక్రమించె విష రోగంబయ్యదిన్ ద్రుంచగన్ నీయత్నంబది రిత్తయయ్యె గదనే నేనొక్కటిన్ జెప్పుచున్ సాయంబందగ జేతు రోజొకపరిన్ స్వల్పమ్ముగా మందుగా నాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్.
గోకులంలో గోప జనులందరు పంటకు ముందు చేసే పూజలో హలము మొదలైన వ్యవసాయ పరికరాలను పూజలో పెట్టండి అని బ్రాహ్మణుడు చెబుతూ...హేలగ పూజాక్రతువునహాలికులను గూర్చి విప్రుడార్తిని బలికెన్మేలుగ "వల్లవజన సింహాలా! హల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
వేలాకోలమ్మేయిదికాలమ్మే చెల్లి పోవు గరళము గ్రోలన్ఏలా చేయునొ తెలియదుహాలాహల మిడగజేయు నాయుర్వృద్ధిన్
కాలము జేసెదరందరుహాలాహల మిడఁగఁ ; జేయు నాయుర్వృద్ధిన్మేలగు సాదము గుదుచుచువాలెము మరువక యె దేహ వడనొన రించన్
క్రొవ్విడి వెంకట రాజారావు: వ్రాలిన దీర్ఘ రుజలకై మేలగు నౌషధములందు మేటి భిషక్కుల్ కీలించు మందు లందలి హాలాహలమిడగజేయు నాయుర్వృద్ధిన్. కాయంబంతయుజేరి నొంచెడివియౌ కాఠిన్య రోగమ్ములన్ మాయంబౌనటు జేయు మందులను క్షేమంబెంచి శ్రేష్టమ్ముగా నాయుర్వేదపు శాస్త్రరీతి నిడి వారారోగ్యమున్ గాకయే నాయుర్వృద్ధిని గోరుకున్న నిడుమా హాలాహలంబుందగున్.
మేలగు శక్తిని కోరినమూలికలన్ వాడదగును మోతాదులలోవేళకు నిర్ణీతంబుగహాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్ఆయుర్వేదము నాశ్రయించు సతతంబారోగ్య సంప్రాప్తికైకాయంచూర్ణము వాడినన్ కలుగునా కామెర్ల రోగాలికన్మాయోపాయము లేనియౌషధములన్ మాఱాడకన్ వాడుమాఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్
ప్రాయంబందున బల్మి వీఁగె నకటా ప్రాణాంతకంబాయెనేకాయంబంతయుఁ గ్రుంగిపోయి బ్రతుకన్ కష్టంబుగా తోచెడిన్చేయంగాదగు యత్నమంతిమముగన్ సిద్ధింప సంక్షేమమేఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్
కం॥ ఏలను భయమౌషధమునమూల పదార్థముగ నుండు మోతాదుననేమేలగు గరళముఁ గనుమాహాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్శా॥ సామాన్యమ్ముగ నౌషధమ్ముల జనుల్ సారించి శోధించఁగానేమాత్రమ్మును హానిఁ జేయని విషమ్మే యుండు మోతాదులోనీమాత్రమ్మునకేల భీతి కనఁగా నివ్విద్ధి సత్యమ్మెగా“ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబున్ దగన్”
కందంమేలన వేప ను, చేదగుహాలాహల మనుచు తినఁగ నాక్షేపింపన్బాలా! తగునే నిజ మాహాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్శార్దూలవిక్రీడితముకాయంబందున రోగమేదయిన నిక్కచ్చిన్ నివారించి పెన్సాయమ్మొందగ జేయు వేపగుళికన్ చాలించి 'హాలాహలమ్మా' యెన్ నా కని యొప్పవే లలన? శ్రేయమ్మంద నొప్పంగ మీకాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడు మా 'హాలాహలంబుం' దగన్!
కాలుని జేరును వెంటనె హాలాహల మిడఁగఁ, జేయు నాయుర్వృద్ధిన్ బాలను ద్రాగిన జీవికి పాలకె యాశక్తి గలదు,బలమును నిచ్చున్
ఆయా! పాలను వేడి చేసి పిదపన్ హైమావతీమాతకున్ నాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా ,హాలాహలంబుం దగన్ మాయారోగము వచ్చువారికి యిడన్ మత్తిల్లి వేపోదురేకాయంబంతయు రంగు మారును గదా కాలాగ్ని సోకంగ నే
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ. కాలము చేయుట తథ్యముహాలాహల మిడగఁ; జేయు నాయుర్వృద్ధిన్మేలగు నాహారమ్మును వాలాయముగా జరిపెడు వ్యాయామంబున్.
రిప్లయితొలగించండిచాలిక నీ వెజ్జఱికము
బేలా! ప్రాణాంతకమగు వేల యిదియె మా
మూలౌషధముల వేలనె
హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్.
మేలంబాడగరాదుగ
రిప్లయితొలగించండిఆలముసే
కగరళము నాలుకనంటన్
మూలముద్రుంచునురోగము
హాలాహలమిడగఁజేయునాయుర్వృద్ధిన్
మేలని వైద్యులు కొందరు
రిప్లయితొలగించండికాలము మారిన దనుచును గరళ ము దోడన్
వీలగు చికిత్స యనుచున్
హాలాహల మిడ జేయు నాయుర్వృ ద్దిన్
కాలము దాపించె నకట
రిప్లయితొలగించండికాలుని మహిషంపుకాలి గజ్జెలు మ్రోగెన్
జాలము సేయక వేగమె
హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
రిప్లయితొలగించండికాయంబందున సంక్రమించె విష రోగంబయ్యదిన్ ద్రుంచగన్
నీయత్నంబది రిత్తయయ్యె గదనే నేనొక్కటిన్ జెప్పుచున్
సాయంబందగ జేతు రోజొకపరిన్ స్వల్పమ్ముగా మందుగా
నాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్.
గోకులంలో గోప జనులందరు పంటకు ముందు చేసే పూజలో హలము మొదలైన వ్యవసాయ పరికరాలను పూజలో పెట్టండి అని బ్రాహ్మణుడు చెబుతూ...
రిప్లయితొలగించండిహేలగ పూజాక్రతువున
హాలికులను గూర్చి విప్రుడార్తిని బలికెన్
మేలుగ "వల్లవజన సిం
హాలా! హల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
వేలాకోలమ్మేయిది
రిప్లయితొలగించండికాలమ్మే చెల్లి పోవు గరళము గ్రోలన్
ఏలా చేయునొ తెలియదు
హాలాహల మిడగజేయు నాయుర్వృద్ధిన్
కాలము జేసెదరందరు
రిప్లయితొలగించండిహాలాహల మిడఁగఁ ; జేయు నాయుర్వృద్ధిన్
మేలగు సాదము గుదుచుచు
వాలెము మరువక యె దేహ వడనొన రించన్
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండివ్రాలిన దీర్ఘ రుజలకై
మేలగు నౌషధములందు మేటి భిషక్కుల్
కీలించు మందు లందలి
హాలాహలమిడగజేయు నాయుర్వృద్ధిన్.
కాయంబంతయుజేరి నొంచెడివియౌ కాఠిన్య రోగమ్ములన్
మాయంబౌనటు జేయు మందులను క్షేమంబెంచి శ్రేష్టమ్ముగా
నాయుర్వేదపు శాస్త్రరీతి నిడి వారారోగ్యమున్ గాకయే
నాయుర్వృద్ధిని గోరుకున్న నిడుమా హాలాహలంబుందగున్.
మేలగు శక్తిని కోరిన
రిప్లయితొలగించండిమూలికలన్ వాడదగును మోతాదులలో
వేళకు నిర్ణీతంబుగ
హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
ఆయుర్వేదము నాశ్రయించు సతతంబారోగ్య సంప్రాప్తికై
కాయంచూర్ణము వాడినన్ కలుగునా కామెర్ల రోగాలికన్
మాయోపాయము లేనియౌషధములన్ మాఱాడకన్ వాడుమా
ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్
ప్రాయంబందున బల్మి వీఁగె నకటా ప్రాణాంతకంబాయెనే
రిప్లయితొలగించండికాయంబంతయుఁ గ్రుంగిపోయి బ్రతుకన్ కష్టంబుగా తోచెడిన్
చేయంగాదగు యత్నమంతిమముగన్ సిద్ధింప సంక్షేమమే
ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబుం దగన్
కం॥ ఏలను భయమౌషధమున
రిప్లయితొలగించండిమూల పదార్థముగ నుండు మోతాదుననే
మేలగు గరళముఁ గనుమా
హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
శా॥ సామాన్యమ్ముగ నౌషధమ్ముల జనుల్ సారించి శోధించఁగా
నేమాత్రమ్మును హానిఁ జేయని విషమ్మే యుండు మోతాదులో
నీమాత్రమ్మునకేల భీతి కనఁగా నివ్విద్ధి సత్యమ్మెగా
“ఆయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా హాలాహలంబున్ దగన్”
కందం
రిప్లయితొలగించండిమేలన వేప ను, చేదగు
హాలాహల మనుచు తినఁగ నాక్షేపింపన్
బాలా! తగునే నిజ మా
హాలాహల మిడఁగఁ జేయు నాయుర్వృద్ధిన్
శార్దూలవిక్రీడితము
కాయంబందున రోగమేదయిన నిక్కచ్చిన్ నివారించి పెన్
సాయమ్మొందగ జేయు వేపగుళికన్ చాలించి 'హాలాహల
మ్మా' యెన్ నా కని యొప్పవే లలన? శ్రేయమ్మంద నొప్పంగ మీ
కాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడు మా 'హాలాహలంబుం' దగన్!
కాలుని జేరును వెంటనె
రిప్లయితొలగించండిహాలాహల మిడఁగఁ, జేయు నాయుర్వృద్ధిన్
బాలను ద్రాగిన జీవికి
పాలకె యాశక్తి గలదు,బలమును నిచ్చున్
ఆయా! పాలను వేడి చేసి పిదపన్ హైమావతీమాతకున్
రిప్లయితొలగించండినాయుర్వృద్ధినిఁ గోరుకొన్న నిడుమా ,హాలాహలంబుం దగన్
మాయారోగము వచ్చువారికి యిడన్ మత్తిల్లి వేపోదురే
కాయంబంతయు రంగు మారును గదా కాలాగ్ని సోకంగ నే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
కాలము చేయుట తథ్యము
హాలాహల మిడగఁ; జేయు నాయుర్వృద్ధిన్
మేలగు నాహారమ్మును
వాలాయముగా జరిపెడు వ్యాయామంబున్.