19, జూన్ 2023, సోమవారం

సమస్య - 4454

20-6-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్”
(లేదా...)
“కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్”

23 కామెంట్‌లు:

  1. తెప్పగవకుళామాతయు
    మెప్పుననాకాశరాజుమీరకయాజ్ఞన్
    ఒప్పుగతలపగనావేం
    గప్పకుసుందరికిపెండ్లిఘనముగజరిగెన్

    రిప్లయితొలగించండి
  2. ఒప్పుల కుప్ప యటంచును
    కొప్పున మల్లెలను దాల్చు కొమ్మను గని తా
    నొప్పుకొనగ ముదమున వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.

    రిప్లయితొలగించండి
  3. అప్పటికప్పుడు ప్రాజ్ఞుడు
    గొప్పగ జాతకఫలములు కుదిరినవనగా
    గొప్పింటను పుట్టిన వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గొప్ప కుటుంబమందడరి కోరిన కన్యక సమ్మతింపగా
      చప్పున పండితుండు తమ జాతక చక్రము లెంచి యొప్పగా
      నప్పటికప్పుడే మనువుకై తపియించిన వన్నె కాడు వెం
      కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్

      తొలగించండి
  4. తప్పొనరించితిమనగనె
    చప్పున నిరువురికి మనువు సలుపగ నెంచన్
    నొప్పుగ నేడుదయమె వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. కందం
      అప్పడు దిరుమల గిరికని
      గొప్పఁగ నాకాశరాజు కూతురినిడఁగా
      నొప్పగ మోదమొదవ వెం
      కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

      ఉత్పలమాల
      అప్పడటంచుఁ దిర్మలకు నాంగికమొప్పగ నీరజాక్షునిన్
      గొప్పగ పద్మ తండ్రి తన కూతురికెంచఁగ నీడుజోడుగా,
      నప్పుగ పైకమున్ గొసర నాదరణాన కుబేరుఁడీయ, వెం
      కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్

      తొలగించండి

  6. ఒప్పులకుప్ప యప్పడతి యూర్వశియే గననందమందు నే
    నొప్పెద బెండ్లియాడగ మహోన్నత సద్గుణ రాశినంచు తా
    జెప్పగ నాలకించి పరిసించుచు పెద్దలు సమ్మతింప వేం
    కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్.

    రిప్లయితొలగించండి
  7. ఒప్పునశ్రీనివాసుగని, యూహలదేలుచుపద్మయుండగా
    తప్పునుబట్టకేముదముామునుబొందిరిపెద్దలందఱున్
    నప్పినపెండ్లియౌటగనినందముతోడుతకూడవారువేం
    కప్పకుసుందరాంగికినయంబునపెండిలియయ్యెచూడగన్

    రిప్లయితొలగించండి

  8. కం:
    తప్పక పోవలె పెండ్లికి,
    చెప్పకుమంటివిక చాలు చిన్నా లేలే
    దుప్పటి నింకను నీవిటు
    కప్పకు, సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్”

    రిప్లయితొలగించండి
  9. కొప్పుల రంగయాత్మజుడు కోరి
    వరించియు కన్యనొక్కతిన్
    తిప్పల జెంది స్నేహమును దిన్నగ
    జేసియు దించి ప్రేమలో
    చెప్పెను దండ్రికిన్నతడు చిత్తమ
    టంచును సమ్మతించ వెం
    కప్పకు సుందరాంగికి నయంబుగ
    పెండిలి యయ్యె జూడగన్

    రిప్లయితొలగించండి
  10. ముప్పది యే ళ్ల వయస్సున
    నొప్పగు కన్యకను గాంచె ను ద్వా హము కై
    యప్పుడె. యొ ప్పి క తో వే o
    కప్ప కు సుందరికి పెండ్లి ఘన ము గ జరిగె న్

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మెప్పగు గుణములు గల్గిన
    కుప్పిలి పురవాసియైన కోమలితోడన్
    అప్పాపేటను మన వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.

    మెప్పగు రూపమున్ గలిగి మెల్పగు వర్తనమెంచునట్టిదౌ
    కుప్పిలి పట్నవాసియగు కోమలిగాంచి వరించిన సంగతెంచగన్
    అప్పయు తండ్రియున్ ముదమునంది ననుజ్ఞ నొసంగినంత వెం
    కప్పకు సుందరాంగికి నయంబుగ బెండిలి యయ్యె జూడగన్.

    రిప్లయితొలగించండి
  12. తిప్పల నన్ని దాటుకొని తీరగు జీవన మంద నెంచుచున్
    మెప్పు గడించు కొల్వు గొని మేటిగ నల్గురి లో రహించుచున్
    గొప్పగ నత్త కూతురగు కోమలి డెందము గెల్వ నంత వెం
    కప్పకు సుందరాంగికి నయంబుగ బెండిలి యయ్యె జూడఁగన్!
    (అత్త కూతురి పేరు కోమలి)

    రిప్లయితొలగించండి
  13. కొప్పున పూవులన్ ముడిచి కోవెలకేగుచునుండ భక్తితో
    నొప్పులకుప్పయౌ సుదతి నొక్కదినంబున గాంచినంతనే
    చప్పున మోహముప్పతిలి చానను పెండిలియాడ నెంచ వెం
    కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి
  14. ఒప్పగు సింగారముతో
    కొప్పున పూవులు ముడిచిన కోమలినిగనన్
    చప్పున నొప్పుకొనఁగ వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    రిప్లయితొలగించండి
  15. డప్పుల ఢమఢమ లు ను వీ
    రప్ప భజంత్రీ లుమిగుల రవములు కాగా
    యప్పనపల్లి పురపు వెం
    కప్పకు సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్

    రిప్లయితొలగించండి
  16. డప్పుల మ్రోత లొప్పుగను డాండలు దాటగ సుస్వ రంబుతో
    నప్పుర వాసులందరును నాహయనంగను సంతసంబుతో
    నప్పనపల్లి గ్రామమున నాశ్రిత లోకము గౌరవించ,వెం
    కప్పకు సుందరాంగికి నయంబుగఁ బెండిలి యయ్యెఁ జూడఁగన్

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    చెప్పక కన్నియ కులమును
    యొప్పుగ ప్రేమించి సద్గుణోన్నతుడు తుదిన్
    ఒప్పించగ పెద్దల వెం
    కప్పకు,సుందరికి పెండ్లి ఘనముగ జరిగెన్.

    రిప్లయితొలగించండి