25, జూన్ 2023, ఆదివారం

సమస్య - 4459

26-6-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాన నననాన నననాన తాన నాన”
(లేదా...)
“తానన నాననా ననన తానన నానన నాననా ననా”

21 కామెంట్‌లు:

  1. బడుగు జీవుల బాధల బాపు దనుచు
    పెక్కు హామీలు గుప్పించి పీఠ మెక్కి
    పదవి పొందియు మరచిన వాని గాంచి
    తాన నన నాన నన నాన తాన నాన
    ననుచు రాగమ్ము నొక్కండు నాల పించె

    రిప్లయితొలగించండి
  2. గానమేగదచూడగగారవమున
    వినగమాటలుసభలనువిిడువనేత
    జనముచేవులనుమ్రోగునుసరిగమలును
    తాననననాననననానతాననాన

    రిప్లయితొలగించండి
  3. "తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు"
    అన్న పద్యమ్ము వల్లింప మనెను గురుడు
    మరచి నట్టియా శిష్యుండు మనము నందు
    తాన నననాన నననాన తాన నాన

    రిప్లయితొలగించండి
  4. వర్ష ధారలు సూదులై వరుస బొడువ,
    పులకరించిన తరువులు ఫలము లొదల,
    మెట్లపై జారు సవ్వడు లిట్లు మ్రోగె,
    తాన నననాన నననాన తాననాన !!!

    రిప్లయితొలగించండి
  5. వేనకువేలుబాసలునువిందుమునేన్నికవేళయందునన్
    కోనలకోండలందునహకోయనికూయుదురయ్యలందఱున్
    మానకమ్రోగుచుండుగదమంగళవాద్యములట్లువీనులన్
    తానననాననాననననానననానననాననాననా

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    తెలుపఁ బోయెడు పద్యమ్ము తేటగీతి
    వినుము శిష్య! యని గురువనెను గళాన
    తాళగతులను రాగాన మేళవించి
    "తాన నననాన నననాన తాన నాన"

    ఉత్పలమాల
    మానిత శిష్యవత్సలత మంచిగ చందము నత్పలమ్మునున్
    పూనిక నేర్పుచున్ గురువు ముందు గణాల విధమ్ము సెప్పి తా
    నానక తాళపున్ గతుల నందగ రాగమునిట్లు దీసెనే
    "తానన నాననా ననన తానన నానన నాననా ననా "

    రిప్లయితొలగించండి

  7. పింగళకపు బిందియపైన పిన్నడొకడు
    భూరిలోహపు చెంబుతో మోదినంత
    నదియె రవళించు రాగమే యద్భుతమ్ము
    తాన నననాన నననాన తాన నాన


    భానుడు రుద్రరూపమున బాలము రాల్చెడు కాలమందునన్
    చానయె తాళలేననుచు చల్లని నీటి సరోవరమ్మునన్
    స్నానము చేయునత్తరి మనమ్మది పొంగగ తీసె రాగమే
    తానన నాననా ననన తానన నానన నాననా ననా.

    రిప్లయితొలగించండి
  8. రాను నేనన నేనన రాను నేను
    కాకి కేకకు కేకకు కాకు కేక
    తాకు కోకకు కోకకు తాకు కోక
    తాన నననాన నననాన తాన నాన

    రిప్లయితొలగించండి
  9. పశువులైనను శిశువులు పాములైన
    పాట వినినంత తలలూపి పరవశించు
    గాన కోకిల కమ్మని గళము పాడు
    తాన నననాన నననాన తాన నాన

    రిప్లయితొలగించండి
  10. గానమె ప్రాణమంచెపుడు గానసుధాంబుధి నోలలాడునా
    గానకళా విశారదుడు కమ్మని గాత్రమునందు నెన్నడున్
    గానసరస్వతిన్ స్థిరముగా పలికించును తన్మయంబునన్
    తానన నాననా ననన తానన నానన నాననా ననా

    రిప్లయితొలగించండి
  11. ఉ.

    కోనలు కొండలన్ గుహల గోరిక పుట్టుట యాత్రలంపుటన్
    మేనులు నేకమైనపుడు మెచ్చుచు బ్రేమను జూపు వేళలో
    వైనము పల్లవించు రస వాక్కుల వాహిని రాగ బంధమే
    *తానన నాననా ననన తానన నానన నాననా ననా.*

    రిప్లయితొలగించండి
  12. వీణ శృతిచేసి పలికించు జాణవీవు
    శుద్ధ మగురీతి వినిపించి చూపి నావు
    రమ్య రసరమ్య గమకాల రాగమాల
    తాన నననాన నననాన తాన నాన

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గానము పారవశ్యమిడు గాత్రము కమ్మగనొప్పుచుండినన్
      గానమె శ్రోతకున్ మదిన కాంక్షలు రేపును హాయిగూర్చుచున్
      గానకళావిశారదులఁ గాంచిన భారతి పొంగిపోవదా
      తానన నాననా ననన తానన నానన నాననా ననా

      తొలగించండి
  13. సూనిని పెండ్లి పిమ్మటను సోద్యము
    గొల్పెడు వేడ్కలోపలన్
    గాన కచేరి జర్గినది కన్నుల పండుగ
    గూర్చె వాద్యముల్
    వీనుల విందు గూర్చెగద వీణ మృదంగ
    పు నాద మిట్టులన్
    తానన నాననా ననన తానన
    నానన నాననాననా .

    రిప్లయితొలగించండి
  14. తే॥ సాధనముఁ జేసి సంగీత సౌరభమున
    సర్వులుఁ దనియ విబుధుఁడు సరసముగను
    బాడె కీర్తన లిటులను బరవశించి
    తాన నననాన నననాన తాన నాన

    ఉ॥ వీణను రాగతాళములు భేషుగ సంయమనమ్ముఁ జేయుచున్
    మేనులు పారవశ్యమున మిక్కిలి మోదము నొందు రీతిగన్
    వీనుల విందుగా నొకఁడు పేరిమి మీరఁగఁ బాడెనిట్టులన్
    దానన నాననా ననన తానన నానన నాననా ననా

    రిప్లయితొలగించండి
  15. వీరు వారను భావంబు నెఱుక నీక
    యన్ని జాతుల వారికి మిన్నగాను
    ఫలము లందెడు విధముగ పనులు సేతు
    మనుచు పీఠము నార్జించి హాయి నొందె
    తాన నననాన నననాన తాన నాన.

    రిప్లయితొలగించండి
  16. మానగ లేను  మోహమును  మానక జాలను గామవాంఛలున్ 
    మానగ లేను క్రోధమును, మానగ సాధ్యమె రాగ వాసనల్ 
    మానుప జేయవే ,దయను  మాధవ  సఖ్యుడ నాగభూషణా
    తానన నాననా ననన తానన నానన నాననా ననా”

    రిప్లయితొలగించండి
  17. మానసమందుమత్తుగనుమాధవునామమునేతలంచుచున్
    వీనులవిందుగావినగవేణువుగానమువించనెంచుచున్
    మానినివేచియండెనటమానుగపాటలనాలకించగా
    తానననాననానననతానననానననాననాననా

    రిప్లయితొలగించండి

  18. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    బాలురిర్వురు పాటలు పాడుచుండ
    తాళమున్ రాగములు రెండు తప్పకుండ
    పాత చిత్రము నందలి పాటనొకటి
    పాడుటకు ముందు నిట్టుల పల్లవి యనె
    తాన నననాన నననాన తాన నాన.

    రిప్లయితొలగించండి

  19. పిన్నక నాగేశ్వరరావు.
    హనుమకొండ.

    బాలురిర్వురు పాటలు పాడుచుండ
    తాళమున్ రాగములు రెండు తప్పకుండ
    పాత చిత్రము నందలి పాటనొకటి
    పాడుటకు ముందు పల్కిరి పల్లవిటుల
    తాన నననాన నననాన తాన నాన.

    (రెండవ పూరణము)
    వ్యాకరణము నేర్పు తెలుగు పండితుండు
    తేటగీతి పద్య గణముల్ దెలియజేసి
    సులభముగ జ్ఞప్తియందు నుంచువిధమనుచు
    పాటరూపాన లయతోడ పాడెనిటుల
    తాన నననాన నననాన తాన నాన.
    **************************************


    రిప్లయితొలగించండి