12-11-2023 (ఆదివారం) కవిమిత్రులారా, ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది... “బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్” (లేదా...) “బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్”
ఎల్లలు లేని గారవ మొకింత విచక్షణయేని లేక నీ పిల్లలపైన జూప నతి ప్రేమగ నయ్యది లగ్గు కాదు నీ పిల్లల భావి జీవితము వేదనపాలగు, మేర మీరుచో బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్”
నల్లన పాలని నుడివితి
రిప్లయితొలగించండినల్లము తీపంటి పుల్లన మధువనుచునే
కల్లల పులినని తేల్చితి
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్.
కందం
రిప్లయితొలగించండిఉల్లము రంజిలఁ దీయఁగ
నల్లిన భాగవతకావ్యమలరింపంగన్
దెల్లమన దాని ముందర
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
ఉత్పలమాల
ఉల్లము రంజిలన్ మలచె నుత్తమ భాగవతామృతమ్ము తా
నల్లన భక్తితత్వమున నందగ ముక్తిని పోతనాఖ్యుడున్
దెల్లమనంగ గ్రోలితిని దీయదనంబును దానిముందరన్
బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్
కల్లలు బలికెడు జనులo
రిప్లయితొలగించండిదెల్లరి లో మేటి యగుచు నెన్నగ నొకచో
నుల్లము రంజిల్లు నటుల
బెల్లము చేదంటి వినిన బెద్దలు. మెచ్చ న్
చెల్లదు నీమాటెన్నడు
రిప్లయితొలగించండివెళ్లకు సతియింటకుచెడి వేగిర పడకన్
ఇల్లరికమ్మున పతికిన్
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
చెల్లని వాగ్దానంబులు
రిప్లయితొలగించండికొల్లలుగను జేయునట్టి కుమతులుబల్కే
కల్లలు తీయగనుండా
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
మెల్లన నీమధుమేహము
రిప్లయితొలగించండిఅల్లట గల్గించి మనుజునారడి జేయున్
చెల్లదురా చాపల్యము
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
రిప్లయితొలగించండినల్లని జడగల చిన్నది
యుల్లము నే దోచెనంచు నుత్సాహముతో
పిల్లా నీ నుడులను విన
బెల్లము చేదంటి, వినిన పెద్దలు మెచ్చన్.
తల్లియె యల్లమౌనని లతాంగి కళత్రమె బెల్లమౌనటం
చెల్లరు పల్కుచుండగ సహించితి, నా సతి కోపమందు నీ
తల్లియె యున్నచోటు దరిదాపుకు రానన నిల్లుటాలనే
బెల్లము చేదనన్, వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్.
పల్లె జనుల కోరికపై
రిప్లయితొలగించండికల్లలను నుడువుట లోన ఘనతను జూపన్
మెల్లగ వారికి జెప్పుచు
బెల్లము చేదంటి , వినిన పెద్దలు మెచ్చన్
ఉ.
రిప్లయితొలగించండిఅల్లము తల్లి, బెల్లముగ నాలిని నెన్నిక నానుడయ్యెనే
*బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్*
తెల్లమిగా వచించె సహదేవుడు భాగవతంబు గ్రోలగా
నెల్లరు భాగ్యవంతులయి యీప్సితమైన రుచుల్ గడింపరే.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిబెల్లముచుట్టూ చూడగ
తొలగించండినెల్లప్పుడు క్రమ్ముచుండు నీగలగుంపే
బెల్లపుటాకర్షణగని
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
అల్లము తల్లిదండ్రులని యారుద్ర పల్కె సుభాషితంబునే
బెల్లము భార్యయేననుచు పెద్దలు చెప్పుట యుక్తమైనదే
బెల్లము లాగుచుండునట పిల్లల చిత్తము నెల్లవేళలా
బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్
చేదు = ఆకర్షించు
ఉల్లము దోచగా పడతి ఉక్కిరి బిక్కిరియై మనమ్మునన్
తొలగించండికల్లలు బల్కునెల్లరును కన్నెను ప్రేమలొ దింపగోరుచున్
చెల్లని గాలిమాటలవి చేటును తెచ్చును నమ్మబోకు మా
బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్
రిప్లయితొలగించండి-
అందరికీ దీపావళి శుభాకాంక్షలతో
అల్లపు తీపిని మెచ్చుచు
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
ఫుల్లాబ్జాక్షి కృప కురియ
నుల్లంబొప్పంగ స్వస్తినుడివిరి నాపై
జిలేబి
ఎల్లలు మీరిన తగులము
రిప్లయితొలగించండిపిల్లలపై జూప వారి పెంపకమందున్
చెల్లదు, మితిమీరి తినఁగ
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
ఎల్లలు లేని గారవ మొకింత విచక్షణయేని లేక నీ
రిప్లయితొలగించండిపిల్లలపైన జూప నతి ప్రేమగ నయ్యది లగ్గు కాదు నీ
పిల్లల భావి జీవితము వేదనపాలగు, మేర మీరుచో
బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నా రసజ్ఞతన్”
కం॥ మెల్లఁగ మధుమేహ మిలను
రిప్లయితొలగించండిజల్లఁగ వేళ్ళూని విరియ స్వస్థతకు జనుల్
బెల్లముఁ దినుటను మానఁగ
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్
ఉ॥ మెల్లఁగ ధాత్రి లోన మధుమేహము హెచ్చఁగ నెందరెందరో
చల్లఁగ బెల్లమున్ దినుటఁ జాలని వీడఁగ వైద్య సూచనల్
గల్లలు గావుగావనుచు గాంచుచు సత్యము నేఁడు చూడఁగన్
బెల్లము చేదనన్ వినిన పెద్దలు మెచ్చిరి నారసజ్ఞతన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
అల్లరి కృష్ణుని పాటలు
పిల్లలు తియ్యగను పాడ వీనులవిందై
యుల్లము రంజిలు చుండగ
బెల్లము చేదంటి వినిన పెద్దలు మెచ్చన్.