26, నవంబర్ 2023, ఆదివారం

సమస్య - 4597

27-11-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పేరు లేనివాఁడె పెద్దదిక్కు”
(లేదా...)
“పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్”

16 కామెంట్‌లు:


  1. నీతి లేని నేత గోతులెన్నో త్రవ్వి
    ధనము కూడ బెట్టి దాచు కొనను
    నిర్మలాత్ముడైన నిజముగా నవినీతి
    పేరు లేని వాడె పెద్ద దిక్కు.

    రిప్లయితొలగించండి
  2. అమలినహృదయుడును నాదర్శ ప్రాయుడు,
    పరుల మేలు గోరు పావనుండు
    ప్రజల పలుకుల తన వర్తన యడచెడు
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు.

    రిప్లయితొలగించండి
  3. “పేరు లేనివాఁడె పెద్దదిక్కు”

    ఆ॥వె॥
    గొప్పపేరుయుండిగొప్పకులస్థుడై
    గొప్పధనికుడైనగొప్పకాదు
    పెద్దయనగమంచిపేరుండవలె చెడ్డ

    పేరు లేనివాఁడె పెద్దదిక్కు

    గాదిరాజుమధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  4. ఉ॥
    ఊరననేదొనేదిశలనుండెనొ నెట్లుపుట్ఠెనో

    పేరనతల్లిదండ్రులదిపెట్టినదెయ్యదొ వారలెవ్వరో

    చేరెను షిర్దిపల్లెనటు చింతలుదీర్చెనుసాయిబాబ హో

    పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్

    గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  5. ఆటవెలది
    ఎన్నికల సమరము హేయమయ్యెను నేడు
    కోట్ల ధనము దోచు కుతుకమువ
    కొలువునందు నేత గుణము నెంచుము, సెడ్డ
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు

    ఉత్పలమాల
    పారెడు మాటలన్ ధనము పంచెదమంచును బేద వారికిన్
    గోరెదరోట్ల నోట్లిడుచుఁ గోట్ల ధనమ్మును దోచు బుద్ధితోన్
    దారుణమౌను యార్థిక పథమ్మది! నేతగ నెన్న ధూర్తుడన్
    బేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్

    రిప్లయితొలగించండి

  6. పుడమి లోన జనులు భువనరక్షకుడంచు
    పిలిచి భక్తి తోడ కొలుచువాడు
    పరమమతడు పిలువ స్థిరముగా నొక్కటే
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు.

    రిప్లయితొలగించండి
  7. శక్తి కొలది తాను సాయమ్ము జేయుచు
    సేవ జేయు చుండు చిత్త మలర
    పరుల మెప్పు కొఱకు పాటు పడడు గాన
    పేరు లేని వాడె పెద్ద దిక్కు

    రిప్లయితొలగించండి
  8. పదవి యుండ నేమి ఫలము ,జనులకెల్ల
    సేవ జేయు గుణము జెంద కున్న,
    సడ్డ సేయు వాడె చాలు దడవ,గొప్ప
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు

    రిప్లయితొలగించండి
  9. పొట్టకూటికొరకుపురమునకేతెంచి
    మంచిపనులు చేసి మాను గాను
    జనులమెప్పునందిజవముగా నేయింటి
    *"పేరు లేనివాఁడె పెద్దదిక్కు”*

    రిప్లయితొలగించండి
  10. మంచి పనులు చేసి మన్ననలొందుచు
    నార్తులయెడఁ జూప నాదరమ్ము
    చిన్నవాడయినను మిన్నయై దనరారు
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు

    రిప్లయితొలగించండి

  11. ధారుణి జీవకోటికిని త్రాణయె తానని కొల్చెడిన్ నిరా
    కారుడు నాదియంతముల గాంచగ లేని సమస్త సృష్టికా
    ధారము వాడెయైన యధిదైవతమాతడు పిల్వ నొక్కటే
    పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్.

    రిప్లయితొలగించండి
  12. దూరదేశమేగి దురదృష్ట వశమున
    చిక్కులందుపడిన బిక్కమొగము
    ముక్కుమొగమెరుగక దిక్కులు చూడగా
    పేరు లేనివాఁడె పెద్దదిక్కు

    కోరిన విద్యనేర్చుకొనఁ క్రొత్తగు ప్రాంతము చేరనెంచి తా
    దూరమునుండివచ్చి కడు తొందరపాటున చిక్కులన్ బడన్
    గోరని సాయమై తనను కొండొక మాత్రము నాదరించగా
    పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్

    రిప్లయితొలగించండి
  13. భారము నీదెయంచు కడు భక్తిగ సాగిలి మ్రొక్కి వేడినన్
    కోరిన కోర్కెలన్నియును కూరిమి దృక్కులఁ దీర్చు వానికిన్
    లేరట యెవ్వరున్ గృహము లేదట భక్తుల యార్తిఁ దీర్చునా
    పేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్

    రిప్లయితొలగించండి
  14. ఆ॥ పరుల మేలుఁ గోరి పాటు పడుచు నుండి
    పేద వారలకిల పెన్నిధిగను
    గుప్త సాయమొసఁగి గుర్తింపుఁ గోరని
    పేరు లేని వాఁడె పెద్ద దిక్కు

    ఉ॥ భారము మోయు వాఁడతఁడు బాధలఁ దీర్చెడి వాఁడతండిలన్
    గోరినఁ జాలునార్తిగను గోరఁగఁ బేరిదటంచు లేదయా
    పారముఁ జేర్చు వాఁడతఁడు ప్రార్థనఁ జేసిన చాలు భక్తితోఁ
    బేరెది లేనివాఁడె మన పెన్నిధి ప్రోవఁగఁ బెద్దదిక్కగున్

    రిప్లయితొలగించండి
  15. భారముమోయువాడుమదిభారముతీర్చుచునుండువాడునా
    ధారము తానెయై సతము దాపున నిల్చుచు నండదండగా
    ధారుణినెల్లకాచెడునిధానియునైనపరాత్పరుండునే
    పేరెది లేనివాడు మనపెన్నిధి ప్రోవగ పెద్దదిక్కగున్.

    రిప్లయితొలగించండి