14-11-2023 (మంగళవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”(లేదా...)“భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?”(ఆముదాల మురళి గారికి ధన్యవాదాలతో...)
తేటగీతిస్వపరి పాలనన్ బడయఁగ మాతృభూమిదిటవు గలిగి పోరాడెడు పటిమ మరచియరసి లంచాల రాజ్యమ్ము నాంగ్లులేలభారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?ఉత్పలమాలధీరులు స్వేచ్ఛకై చెలఁగి దిక్కులనొక్కటి చేసి తెల్లలున్బారెడు వ్యూహముల్ మలచి పంతము సేకొన స్వార్థచిత్తమైవారల లంచముల్ మరగి వంచన మీరగ నాంగ్లపాలనన్భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
మద్యమును ధనమును పంచి మంత్రియగుచుదోచుచు ప్రజాధనమ్మును దొరగ వెలుగుస్వార్థ పరుడైన దుర్మతి సభలలోనభారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?పౌరులయోటుచే గెలిచి పాలకులౌచు ప్రజా ధనమ్మునేభూరిగ మ్రింగు వారలగు మూర్ఖులు వేదిక లెక్కినిత్యమున్ ధారుణి యందు శ్రేష్ఠమగు ధర్మము గల్గిన నాదు దేశమీభారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
అన్యుడు దన దేశమునుండి యరుగుదెంచి,వింతలన్నిటి గని కడువెరగు నొంది,జనులొసగిన యాతిధ్యము జవిగొనగనెభారతము స్వర్గమన, దేశభక్తుఁ డగున?
దేశసేవను మాటను తీసివేసి కాసుల పయి కోర్కె పెరుగ కానిపనులకొల్లలుగచేయుచుండెడి కూళుడెపుడు*“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”*
భారత దేశమందునను భాగ్యవిహీనులు లేక తిండియున్దారుణమైన బాధలను దాముసహించుచు లేకనీడయున్మీరిన సంకటాలుగొని మేదినిబ్రత్కెడు వారలన్ గనిన్ భారతభూమిస్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?”
భారతదేశమున్ విడచి ప్రాగ్ర్యముగా పరదేశమందునన్కోరి వసించి సంపదల కొల్లలుగా గడియించి స్వార్థమేపారగ జన్మభూమి యగు భారతి యున్నతినిన్ దలంపకన్భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
వ్యర్థమైనట్టి విద్యయు వైద్యరీతిపచ్చి యవినీతి మృగ్యమౌ పాపభీతిస్వార్థపరులైననేతల పాలనమునభారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?దారుణమైనవిద్య దరిదాపున చూడని వైద్యనేమమున్తీరని దుఃఖమున్ మరియు తీవ్రతనొందిన నీతిబాహ్యతన్వారక నుండు దుష్టపరిపాలన దక్షతలేని నేతలున్భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
స్వార్థ మవినీతి గల్గిన పాల కుండుసభ ల యందున ప లుకుట సరియు గాదునమ్మ శక్యము గాదండ్రునటన గానిభారతము స్వర్గ మన దేశ భక్తుడగున?
దేశ సంక్షేమమును గూర్చి ధ్యాసవీడిస్వార్థ చింతనతో మెల్గి సంతతమ్మువేదికల నూకదంపుగా బింకమడరభారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?
తే॥ ఉచితముల మత్తును గరపి యోట్లు కొనుచురాజకీయ నాయకులిట్లు రభసఁ జేసిప్రజల భిక్షుకులుగ మార్చఁ బ్రగతి గనకభారతము స్వర్గమన దేశ భక్తుఁ డగునఉ॥ నేర చరిత్రులే యిపుడు నీతినిఁ బాయమటంచుఁ బల్కుచున్జేరిరి రాజకీయమున సేవలఁ జేతుమటంచుఁ గుత్సితుల్భూరిగ సంపదల్ బడయఁ బుణ్యము పాపము నెంచకన్ గనన్భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ
అందరూ కాదనుకోండి
-భారతము స్వర్గమన దేశభక్తుఁ డగు; నవతకు మారు పేరైనది; భవ్యమగు సనాతనమ్ము వెలయ నేటి నవతకు సరియైన మార్గము చూపెడు వేదభూమిజిలేబి
ఉ.పారగ గంగ సస్యమను భాగ్యము మౌనుల గ్రంథ భాష్యముల్శారదగాఁడు పల్కుటయు సత్యము ధర్మము నిల్చు నేలగాశారద రాత్రులందు కవి సంబరమొందుచు దన్మయత్వమున్*భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?*
పిన్నక నాగేశ్వరరావు.హనుమకొండ.సేవ దేశమ్ము కోసము చేయకుండత్యాగ భావమ్ము లేని చేతలను సలిపిస్వార్ధ పరుడైన నేతయే సభలయందు. మాటలను చెప్పి కోటలు దాటునట్లుభారతము స్వర్గమన దేశభక్తు డగున?
తేటగీతి
రిప్లయితొలగించండిస్వపరి పాలనన్ బడయఁగ మాతృభూమి
దిటవు గలిగి పోరాడెడు పటిమ మరచి
యరసి లంచాల రాజ్యమ్ము నాంగ్లులేల
భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?
ఉత్పలమాల
ధీరులు స్వేచ్ఛకై చెలఁగి దిక్కులనొక్కటి చేసి తెల్లలున్
బారెడు వ్యూహముల్ మలచి పంతము సేకొన స్వార్థచిత్తమై
వారల లంచముల్ మరగి వంచన మీరగ నాంగ్లపాలనన్
భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
మద్యమును ధనమును పంచి మంత్రియగుచు
రిప్లయితొలగించండిదోచుచు ప్రజాధనమ్మును దొరగ వెలుగు
స్వార్థ పరుడైన దుర్మతి సభలలోన
భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?
పౌరులయోటుచే గెలిచి పాలకులౌచు ప్రజా ధనమ్మునే
భూరిగ మ్రింగు వారలగు మూర్ఖులు వేదిక లెక్కి
నిత్యమున్
ధారుణి యందు శ్రేష్ఠమగు ధర్మము గల్గిన నాదు దేశమీ
భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
రిప్లయితొలగించండిఅన్యుడు దన దేశమునుండి యరుగుదెంచి,
వింతలన్నిటి గని కడువెరగు నొంది,
జనులొసగిన యాతిధ్యము జవిగొనగనె
భారతము స్వర్గమన, దేశభక్తుఁ డగున?
దేశసేవను మాటను తీసివేసి
రిప్లయితొలగించండికాసుల పయి కోర్కె పెరుగ కానిపనుల
కొల్లలుగచేయుచుండెడి కూళుడెపుడు
*“భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?”*
భారత దేశమందునను భాగ్య
రిప్లయితొలగించండివిహీనులు లేక తిండియున్
దారుణమైన బాధలను దాము
సహించుచు లేకనీడయున్
మీరిన సంకటాలుగొని మేదిని
బ్రత్కెడు వారలన్ గనిన్
భారతభూమిస్వర్గమని వాకొను
వాఁడెటు దేశభక్తుఁడౌ?”
భారతదేశమున్ విడచి ప్రాగ్ర్యముగా పరదేశమందునన్
రిప్లయితొలగించండికోరి వసించి సంపదల కొల్లలుగా గడియించి స్వార్థమే
పారగ జన్మభూమి యగు భారతి యున్నతినిన్ దలంపకన్
భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
వ్యర్థమైనట్టి విద్యయు వైద్యరీతి
రిప్లయితొలగించండిపచ్చి యవినీతి మృగ్యమౌ పాపభీతి
స్వార్థపరులైననేతల పాలనమున
భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?
దారుణమైనవిద్య దరిదాపున చూడని వైద్యనేమమున్
తీరని దుఃఖమున్ మరియు తీవ్రతనొందిన నీతిబాహ్యతన్
వారక నుండు దుష్టపరిపాలన దక్షతలేని నేతలున్
భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?
స్వార్థ మవినీతి గల్గిన పాల కుండు
రిప్లయితొలగించండిసభ ల యందున ప లుకుట సరియు గాదు
నమ్మ శక్యము గాదండ్రునటన గాని
భారతము స్వర్గ మన దేశ భక్తుడగున?
దేశ సంక్షేమమును గూర్చి ధ్యాసవీడి
రిప్లయితొలగించండిస్వార్థ చింతనతో మెల్గి సంతతమ్ము
వేదికల నూకదంపుగా బింకమడర
భారతము స్వర్గమన దేశభక్తుఁ డగున?
తే॥ ఉచితముల మత్తును గరపి యోట్లు కొనుచు
రిప్లయితొలగించండిరాజకీయ నాయకులిట్లు రభసఁ జేసి
ప్రజల భిక్షుకులుగ మార్చఁ బ్రగతి గనక
భారతము స్వర్గమన దేశ భక్తుఁ డగున
ఉ॥ నేర చరిత్రులే యిపుడు నీతినిఁ బాయమటంచుఁ బల్కుచున్
జేరిరి రాజకీయమున సేవలఁ జేతుమటంచుఁ గుత్సితుల్
భూరిగ సంపదల్ బడయఁ బుణ్యము పాపము నెంచకన్ గనన్
భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ
అందరూ కాదనుకోండి
తొలగించండి-
రిప్లయితొలగించండిభారతము స్వర్గమన దేశభక్తుఁ డగు; న
వతకు మారు పేరైనది; భవ్యమగు స
నాతనమ్ము వెలయ నేటి నవతకు సరి
యైన మార్గము చూపెడు వేదభూమి
జిలేబి
ఉ.
రిప్లయితొలగించండిపారగ గంగ సస్యమను భాగ్యము మౌనుల గ్రంథ భాష్యముల్
శారదగాఁడు పల్కుటయు సత్యము ధర్మము నిల్చు నేలగా
శారద రాత్రులందు కవి సంబరమొందుచు దన్మయత్వమున్
*భారతభూమి స్వర్గమని వాకొనువాఁడెటు దేశభక్తుఁడౌ?*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
సేవ దేశమ్ము కోసము చేయకుండ
త్యాగ భావమ్ము లేని చేతలను సలిపి
స్వార్ధ పరుడైన నేతయే సభలయందు.
మాటలను చెప్పి కోటలు దాటునట్లు
భారతము స్వర్గమన దేశభక్తు డగున?