ఉ:అర్కుడు రాక మున్నె కడు నార్తిగ చాయి ని వెట్ట సింగు తా శర్కర పాత్ర బట్ట నిమిషమ్మున వచ్చిన కోతి గుంజె నా శర్కర పాత్ర ,యూహ గొన జాలని వాడయి తెంపు జేయు నా మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే” (సిక్కు లంతా సింగ్ అనే పేరు పెట్టుకుంటారు. అలాంటి సింగ్ ఒకడు.)
కందం
రిప్లయితొలగించండిసింగమునని రావణుఁడున్
రంగమ్మున వాలి తోడ రాణించకయే
కంగుతిని సంధికొగ్గుచు
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్!
ఉత్పలమాల
తర్కము వీడుచున్ జెలఁగ దానవ సింహము రావణుండహో!
కర్కశమొల్కి వాలి కొని కంధులముంచఁగ చావుఁదప్పఁ దా
నర్కలినొంచి సంధికి దశాస్యుడునొగ్గుచు వెన్నుఁజూపుచున్
మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే!
సంగతి వివరింతు వినుము
రిప్లయితొలగించండిసింగము నెదిరించ బూని చెంగున దూకెన్
లాంగూలి యాగహనమున
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
కర్కశమైన జంతువునిఁ గాంచితి నేనొక కాననందునన్
బేర్కొను చుంటి కన్గొనిన వింతగ తోచెడి సన్నివేశమున్
దర్కవితర్కముల్ విడిచి తప్పక నమ్ముము వాస్తవమ్మిదే
మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే
జంగలమున నొక్క దినము
రిప్లయితొలగించండిపింగళమడుసునఁ బొరలగ వింతగ దోచెన్
చెంగున దుముకుచు రాగా
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
మర్కటముల్ సటాంకములు మానుగ నెక్కొనునా వనంబునన్
రిప్లయితొలగించండిమర్కటమొక్క రోజున ప్రమాదవశంబున పంకమందునం
దుర్కుచు వచ్చి జారిపడి యుగ్రచతుష్పదమట్లు గానగన్
మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే
మంగపతిని దరిసించెడి
రిప్లయితొలగించండియింగమున దిరుమలకేగ నెగయుచు దనపై
చంగున దుముకగనే నర
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
రిప్లయితొలగించండిలింగడు భస్మాసురునకు
సంగము నీడేర్చి పిదప జంకుచు తలపై
గంగ కలవాడు పారుటె
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్.
కర్కటి భూషణున్ గొలిచి కామితమౌ వరమందు కొన్న యా
కర్కశ మానసంబు గల కర్వరి దుష్టుడు వెంబడింపగా
మర్కతురంభదారి ఖలు మానిసి దిండును గాంచి పారుటే
మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే.ృ
కం॥ రంగుల బాలల చిత్రము
రిప్లయితొలగించండినింగికెగయు హాస్యరసము నిండఁగ నటులన్
జెంగున దూకఁగ భయపడి
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
ఉ॥ పేర్కొన హాస్య మొప్పఁగను బిల్లల మక్కువ హెచ్చు చుండఁగన్
గర్కశ దృశ్య యోజితముఁ గాంచఁగ నొప్పరు చిత్రమందునన్
దర్కము నెంచఁగన్ దగదు తాల్చగ హాస్యము నట్లు చూపఁగన్
మర్కట రాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే
టామ్ అండ్ జెఱ్ఱీ లాగనండి
అంగననటబంధించగ
రిప్లయితొలగించండినంగుళమునువిడకవెదికి నవనిజగనుచున్
ఛెంగున వనికూల్చ, నసుర
*“సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్”*
అర్కుని చెంతనే చదువు లభ్యసనమ్మొనరించి నట్టి యా
మర్కట శ్రేష్టుడౌహనుమ మానులు విర్చుటగాంచి వేగమే
కర్కశులైన రాక్షసులు కట్టుచు పాశము తోచనంగనా
*“మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే*
కం:మంగళ తోరణముల గ
రిప్లయితొలగించండిట్టంగా మామిడి తరువును టక టక నెక్కెన్
కంగారు పడుచు నా నర
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్”
రంగడు చింత చిగురు కై
రిప్లయితొలగించండిచెంగట నున్న వృక్షమెక్కి చిక్కని శాఖా
ముంగిట భయపడి యా నర
సింగము వానరము గాంచి చివ్వున బా రె న్
ఉ:అర్కుడు రాక మున్నె కడు నార్తిగ చాయి ని వెట్ట సింగు తా
రిప్లయితొలగించండిశర్కర పాత్ర బట్ట నిమిషమ్మున వచ్చిన కోతి గుంజె నా
శర్కర పాత్ర ,యూహ గొన జాలని వాడయి తెంపు జేయు నా
మర్కటరాజముం గని ప్రమాదమటంచును బాఱె సింహమే”
(సిక్కు లంతా సింగ్ అనే పేరు పెట్టుకుంటారు. అలాంటి సింగ్ ఒకడు.)
అంగమ్ములు కంపింపఁగ
రిప్లయితొలగించండినింగినిఁ దాఁకంగ భీతి నిబ్బర మెడఁదన్
భంగమ్ము గాఁగఁ బల్లియ
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
అర్క సుతాత్మ మిత్రుఁడు మహా బలశాలి మరుత్సుతుండు సం
పర్కము గాఁగ యుద్ధమునఁ బట్టణ రాజము లంక లోపలం
దర్కము మాని రాక్షస వితానము వాఱెఁ జమూ సమూహమే
మర్కటరాజముం గని ప్రమాద మటంచును బాఱె సింహమే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అంగమున కగ్గి పెట్టగ
చెంగున లంకంత తిరిగి చిచ్చును బెట్టన్
కంగారు చెందిన నసుర
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్.
రంగయ తోటను దృఢమగు
రిప్లయితొలగించండిదొంగదియగు కపి పలముల దోచుకు తినగన్..
బెంగగ వచ్చిన యా నర
సింగము వానరముఁ గాంచి చివ్వునఁ బాఱెన్
సురేష్ కుమార్ రామోజు