17, మే 2025, శనివారం

సమస్య - 5124

18-5-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్”

(లేదా...)

“గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”

19 కామెంట్‌లు:

  1. కందం
    మోయగ లేనన్ని పనులుఁ
    బాయక యడ్డము పడంగ పద్యమ్మునకున్
    శ్రేయమన సెలవుఁగొనఁ జిరు
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్!

    ఉత్పలమాల
    మోయగ లేనివై కొలువు ముందరి కార్యములెల్ల నిత్యమున్
    బాయక యడ్డమై యెపుడు పద్యము వ్రాయగ వీలు కల్గదే!
    శ్రేయమనంగనే సెలవు చిక్కెడు రీతిగ శ్రాంతినొందఁగన్
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్!

    రిప్లయితొలగించండి
  2. సోయగము నొందు కొరకయి
    నేయుడు పేర్కొనిన నూనె నెరయున నంగన్
    పూయుచు నుండగ నిప్పుడు
    కాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్

    రిప్లయితొలగించండి
  3. ప్రాయపువాడు రచించగ
    గాయని గానమొనరించె కడు రమ్యముగా
    హాయిగ ప్రేక్షకులు పొగడఁ
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్

    ప్రాయపువాడు వ్రాసెఁ గడు రమ్యముగా జనరంజకమ్ముగా
    గాయకురాలు పాడెనట కర్ణము లందునఁ దేనె నింపుచున్
    హాయిగ ప్రేక్షకాళి మదిఁ హత్తుకు పోయెను చిత్రగీతమే
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్

    [గాయము = గానము, పాట]

    రిప్లయితొలగించండి

  4. తోయలి ద్రౌపది కది వై
    ధేయుని కూల్చెడి తరుణము దీధితి కగు చ
    క్రాయుధ మది తా చేసిన
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్.



    శ్రేయకరుండతండు జన క్షేమకరుండగు నల్లనయ్య వై
    ధేయుడు వృద్ధశర్మునకు దేహజుడౌ శిశు పాలు ద్రుంచెడిన్
    బీయువు మేలొనర్చెగద భీరువు కృష్ణకు చక్రివేలికిన్
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్.

    రిప్లయితొలగించండి
  5. కం॥ ప్రాయపు వయసున మనమును
    మాయలఁ జేయుచు గడసరి మగువయె దోఁచన్
    సోయగపు మరులునఁ గనెడి
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్

    ఉ॥ ప్రాయపు మోహమందునటు భవ్య సుహాస మనోహరాకృతిన్
    మాయలఁ జేయ నబ్జముఖి మానస చోరిణియై చెలంగుచున్
    సోయఁగ మొప్ప దోఁచఁ గను సోలుచు సొక్కఁగ నయ్యె నిచ్చకున్
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్

    అబ్జముఖి పద్మమువంటి ముఖము గల వనిత, చెలగు ప్రకాశించు, సోలు వివశత్వము, సొక్కు పరవశించు, ఇచ్చ మనస్సు (అన్ని పదాలు నిఘంటువు సహాయంతో నండి)

    రిప్లయితొలగించండి
  6. కాయము జీవిత భారము
    మోయుచు బడ లియు ను పెక్కు పొర బాటు లతో
    చేయని దొ సగులు చేసియు
    గాయము కడు సుందర ము గా కని పిం చె న్

    రిప్లయితొలగించండి
  7. ఆ యెలనాఁగ దేవళఁపు ప్రాంగణమందునఁ గానవచ్చెనా
    మాయలమారి ముగ్ధసుకుమారి ననున్గని వాలుచూపులన్
    గాయమొనర్చినా యెదను గాసిలజేసెను తీయనైననా
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్

    రిప్లయితొలగించండి
  8. ఆ యెడ నొచ్చుచు నుండిన
    నాయత రీతినిఁ బసిండి యచ్చపు ఛాయం
    బాయక నిగనిగ లాడుచు
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్


    సోయగ ముప్పతిల్లు బహు సున్నిత తంతు సమన్వితమ్ములౌ
    మాయని మంచి రంగుల సమంచిత కాంతుల నీను బట్టలం
    దోయజ పత్ర లోచనకుఁ దొడ్గఁగ నింపుగఁ జిత్ర వర్ణపుం
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్

    రిప్లయితొలగించండి
  9. కౌరవ సభలో
    రోయుచు ధర్మ వాక్కులను క్రూర మనస్సున చెంతకేగి వా
    లాయము చుట్టుముట్టగ నిరాయుధు డంచును, నవ్విచూప నా
    రాయణ విశ్వరూపము, పరాత్పరు కాంచు బుధాళి దృష్టిలోన్
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్
    అసనారె

    రిప్లయితొలగించండి
  10. ఆయెలనాగ వనమునన్
    గాయనమొనరించుచుండ గాంచితి మదిలో
    బ్రాయము గాయమొనర్చఁగ
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్

    రిప్లయితొలగించండి
  11. సమస్య:
    “గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”

    ఉత్పలమాల:

    న్యాయము గాదు భూసురుడ నాకడ నిల్చియు ద్రోవఁజెప్పమన్
    కాయము దీరి మానవులు కామితమంచును కోరు స్వర్గమున్
    సాయము సేయ వేడెదను జవ్వని కోరిక దీర్చుమా మనో
    “గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”

    (ప్రవరాఖ్యుడు గృహంబునకేగవలయు దారిని చెప్పుమన వరూధిని చిత్తపు పోకడ)

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    గాయము చేతికి కాగా
    ప్రేయసి గాయమ్ము పైన ప్రేమగ నిమరన్
    మాయగ బాధయు తగ్గెను
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్.

    రిప్లయితొలగించండి
  13. కాయంబున సూదులతో
    వేయించుచు పచ్చబొట్టు ప్రియసఖి పేరున్,
    మాయా ప్రేమలొ పడి, యా
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్”

    సురేష్ కుమార్ రామోజు

    రిప్లయితొలగించండి
  14. కం:తీయని ప్రేమ విఫలమై
    యా యువకుడు దేవదాసు కది హృదయమునన్
    గాయము కాగ ,నటన నా
    గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్”
    (దేవదాసు హృదయం లోని గాయం అక్కినేని నటన లో చాలా అందం గా కనిపించింది.)

    రిప్లయితొలగించండి
  15. ఉ:తీయని ప్రేమ దెల్పగనె తిట్టితి వీ వొక నాదు,గుండె నా
    గాయము దుర్భర మ్మగుచు గాఢవిరక్తిని దెచ్చె బిమ్మటన్
    తీయని ముద్దు నీవిడగ దిగ్గున చెంపకు గాయ మయ్యె నా
    గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”
    (ఆమె ప్రేమని అవమానిస్తే ఆ గాయం బాధ పెట్టింది.ఆ తరవాత ఎప్పుడో ఆమె ప్రేమని మన్నించి ముద్దు పెట్టుకుంటే గాయ మైంది.ఆ గాయం సుఖం గా,అందం గా ఉంది.)

    రిప్లయితొలగించండి
  16. తోయలి సీతకు వనమున
    చేయగ గాయము పిచుకయు శ్రీరఘ రామున్
    చేయివడితాకగా నా
    *"గాయము గడు సుందరమ్ముగాఁ గనిపించెన్”*


    సాయము చేయజానకికి స్వాంతము నందు జటాయు వెంచగన్
    వేయగ రావణాసురుడువేటునుకూలెనుభూమిపైవడిన్
    కాయముపోయినన్ మదికి కల్గదు ఖేదము కాచువేళ నౌ
    *“గాయము సుందరమ్ముగ సుఖప్రదమై కనిపించె నంతటన్”*

    రిప్లయితొలగించండి