23, మే 2025, శుక్రవారం

సమస్య - 5130

24-5-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె”

(లేదా...)

“శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో”

20 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    బాగులేదు నేడు వాతావరణమని
    హెచ్చరికల ప్రభుత యెరుక పరుచ
    చెట్టు నీడ వీడి చేరులోపు ప్రజ ల
    శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె!

    చంపకమాల
    దినమున నింగి మేఘముల దిబ్బగ మారుచు గర్జనంబులన్
    వినగను కష్టమై మెరయ వేళకు హెచ్చరికల్ ప్రసారమై
    జనులట చెట్టునీడ విడి శాలను చేరెడు లోపునన్ మహా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో!

    రిప్లయితొలగించండి
  2. మనసది కల్లు కోరెఁ బెను మబ్బులు వీడని జోరు వానలో
    కనులకుఁ దాటి చెట్టొకటి కన్పడె నాలుక పీకుచుండగన్
    తనరగ నెక్కె తాళమును తత్సమయమ్మునకే భయంకరా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో!!

    రిప్లయితొలగించండి
  3. వర్ష ఋతువు వచ్చి వాన కురియుచుండ
    నంతరిక్షమందు నంబుధరము
    లోకటికొకటి కూడి యొత్తిడి నొంద న 
    శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె

    రిప్లయితొలగించండి
  4. (సంజయుడు దృతరాష్ట్రునితో చెప్పే మాటలు)
    చ.
    కనుగొన సేనలన్ గళ వికార గభీర మహోగ్ర నాదముల్
    వణుకుల గొల్పు రీతులుగ ప్రాభవమొప్పగ జేసి, కౌరవా
    ళిని యడచంగఁ బూనెను చరించి ఘటోత్కచుడాజిలోన నా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో !

    రిప్లయితొలగించండి

  5. తనయ పెండ్లి కొరకు ధాన్యమ్ము తెప్పించి
    యారు బయట దాని నార బోయ
    భీకరమగు నట్టి విస్ఫోటనముతో న
    శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె.


    తనయకు బెండ్లిజేయుటకు ధాన్యము కావలె నంచు భూరిగా
    ధనము వ్యయించి తెచ్చి యట ధామము ముందున నారబోయగా
    స్తనతము భీకరమ్మయిన శబ్దము జేయుచు నచ్చటన్ మహా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. ఆ॥ శని శనివలెఁ బట్ట శంకరుఁడైనను
      విష్టువైన మిగుల వెఱవఁ గాను
      నరుని నలునిఁ బట్టి నలుప నాశ్చర్యమా!
      శని శనివలెఁ బడఁగ సర్వఁమడఁగె

      చం॥ శని శనివోలె పట్టగను శంకరుడైనను విష్ణువైననున్
      శనిని భరించి దాల్చఁగను సాధ్యమ దాగుచు పోరిపోవగా
      ను నలుని పాప మెట్టిదియొ నొప్పిని మిక్కిలి హెచ్చుగాఁ గనెన్
      శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమమొనర్చె నయ్యయో

      కర్నాటకలో శని శనిలా పట్టకుండా కరుణామూర్తిగా ఉండాలని చేసే పూజలు అధికమండి. తూగోజిలో రావులపాలెం క్రొత్తపేట మధ్య మందపల్లి (అనుకుంటాను) శని పూజలు జరుగుతాయండి. శని దానమొకరు గ్రహిస్తారు

      తొలగించండి
  7. వర్షఋతువులోన వానజల్లు కురిసి
    చెట్టునీడకొరకు చేరుకొనగ
    వృక్ష శిఖరమందు పెళపెళ మనుచు న
    శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె

    చినుకులు మేఘగర్జనలు చిందరవందర సేయుచుండగా
    జనకుడొకండు పర్వులిడె చప్పున తానొక చెట్టు నీడకై
    తన పరివారమున్ దరలె తత్సమ యంబున నొక్క భీకరా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో

    రిప్లయితొలగించండి
  8. వాన కురియ మునిగె పంటచేను, మడిసె
    నశనిపాతమునకు హాలికుండు
    పడిన కష్టమునకు ఫలితమా వాని న
    శని శనివలెఁ బడఁగ సర్వమడఁగె

    రిప్లయితొలగించండి
  9. అనయము పంటచేనుకడ హాళిగ సేద్యము సల్పి స్వేదమున్
    ధనమును ధారబోసితివి దక్కినదేమిటి నీకు హాలికా?
    చినుకులు మారి యుప్పెనగ ఛిద్రమొనర్చెను పంట, దారుణా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో
    (దారుణ+అశని=దారుణాశని)

    రిప్లయితొలగించండి
  10. వాన కాల మందు వర్షాలు జోర య్యె
    నురుము మెరుపు లపుడు మించు చుండ
    ఫెళ ఫె ళ మను రవము పిక్క టి ల్లo గ న
    శని శని వలె పడగ సర్వ మడ గె

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండవ పాదంలో మెరుపు లురుము లపుడు మించు చుండ అని సవరణ చేయడమైనది

      తొలగించండి
  11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సమస్య:
      “శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో”

      చంపకమాల:

      1 కనివినెరుంగలేని కలికాలపు వింతలు కల్గెనీ ధరన్
      అనయము నెవ్వరేని తమకాపద వచ్చిన లెక్కసేయరే ?
      వినయము సేయ పూజలను వీడదు యేలిననాటి కర్మమౌ
      “శని, శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో”


      2 అనయము సేసి సృష్టిలయ యంబరకేశుడ యంధకాంతకా!
      వినయము పుర్రెమాలలను వేడుక దాల్తువు కాటి వాసివై
      కనదగు నెట్లు జేరితివి కర్మను వీడక చెట్టుతొర్రనన్
      “శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో”

      తొలగించండి
  12. ఆట పాట లందు నందఱు సెలరేఁగి
    పొలము లోన నుండ నలసి సొలసి
    పైరు పైన నంత దారుణ రీతి న
    శని శనివలెఁ బడఁగ సర్వ మడఁగె


    తన ఘన కోపమే తనకు దారుణ శత్రు వనంగ నిక్కమే
    కని విని నేర నట్టి గతి కార్యము వే ఫలియించు వేళలో
    గొనముల నీచ మైన దగు కోపము నిత్య నిజక్షమా వినా
    శని శని వోలె వచ్చి పడి సర్వము నాశ మొనర్చె నయ్యయో

    రిప్లయితొలగించండి
  13. ఘనమగు మంచు కొండలకు కమ్మని యూహలతోడ నేగి నే
    ననువగు బందు మిత్రులును హర్షము గూడగ, పెక్కు కోవెలల్
    కనుగొని పోవు చుండపథి, క్రన్నన రాలిన కొండ ప్రక్క, ద
    ర్శని శనివోలె వచ్చి పడి, సర్వము నాశమొనర్చె నయ్యయో
    దర్శని: దారి

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పొలమునందు జనులు కలుపు తీయుచు
    నుండ
    చినుకు పడగ చేర చెట్టు కడకు
    గట్టిగా నురుముచు చెట్టు మీద నొక న
    శని, శనివలెఁ బడగ సర్వమడగె.

    రిప్లయితొలగించండి
  15. పంట లెల్ల పండె పైకమందునుగదా
    నప్పుతీరు ననుచు నన్నదాత
    తలచు చుండ మదినిధరణిలోజారెన
    *శని శని వలె బడుగు సర్వ ముడిగె*

    అనయముపట్టినాగలినినాపకదున్నుచువిత్తునాటగన్
    తనువును వంచిరేబవలుతాను శ్రమించగ వ్యర్థ మయ్యెగా
    ఘనముగజోరువానయునకాలమునందున వచ్చినంతనా
    శని శనివోలె వచ్చి పడి సర్వము నాశమొనర్చె నయ్యయో

    రిప్లయితొలగించండి