1, మే 2025, గురువారం

సమస్య - 5110

2-5-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మూడు కన్నులు గలవు శంభుఁడను గాను”

(లేదా...)

“కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్”

(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో డా. ఆచార్య ఫణీంద్ర గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    భక్తిభావాన గర్వమ్ము భంగపఱచ
    గుడుల కేగెడు వారికి గుర్తురానె?
    గంగతోనుండి జూటమ్ము గలిగి మీద
    మూడు కన్నులు గలవు శంభుఁడను గాను!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చంపకమాల
      వెలయగ భక్తి భావమది వీడగ గర్వము దైవసన్నిధిన్
      కొలిచెడు వారలున్ గుడుల గూడెదరంచన గుర్తుపట్టరే?
      కలిగితి జూటమున్ సిగ దిగంబర రూపమునందినంతటన్
      గలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్

      తొలగించండి
  2. భక్త జనులు పగులగొట్టి భక్తితోడ
    నన్ను దైవాని కర్పించి సన్నుతింత్రు
    నారి కేళమందురుగద నన్నుజూచి
    మూడు కన్నులు గలవు శంభుఁడను గాను

    సలిలము వచ్చిచేరుగద సత్వరమే మరి సద్దుసేయకే
    విలసితమౌను ముచ్చటగ పీతువులే మరి మూడుగా సదా
    ఫలమని నారికేళమని పల్కుచు నుందురు నన్ను చూడగా
    కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్

    రిప్లయితొలగించండి
  3. మనుజలోకంపు నీవుల మ్రాను సుతుఁడ
    దేవళములందు నను నివేదింత్రు జనులు
    మూడు కన్నులు గలవు శంభుఁడను గాను
    నారికేళమ్ము నామము నారిఁగాను

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. తే॥మూడు కన్నులు గలవు శంభుఁడను గాను
      చెట్టు కగ్రమున వసింతు శ్రేయ మొదవఁ
      గొలువ దేవున కొసఁగవె కోరినన్నె
      తెలిపె నారికేళము తగు తెలివిఁ గనుచు

      చం॥ కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుడన్
      వెలసితి చెట్టుకగ్రమున వేడుచుఁ బూజలు సేయ నొప్పనో
      చలనముఁ గాంచకుండినను సారము నందున దిట్ట నేనయా
      తెలుపుమ నాదు నామమనిఁ దిన్నగఁ గోరెను నారికేళమే!

      తొలగించండి

  5. భూరి చదువులు గలిగిన బుధుడ వీవు
    చెప్పు మంటి నేనెవరినో చెలిమి కాడ
    మూడు కన్నులు గలవు శంభుఁడను గాన
    టంచని యడగ టెంకాయ యంచు తెలిపె.


    చెలమరి వీవెగాన నను చేరగ రమ్మని నారికేళమే
    పిలవగ భీతివీడుచును పేరిమి జూపుచు దాని చెంతకున్
    కులుకులనీనుచున్ గదులు గుమ్మడినడ్గెను నేనెవండనో
    కలిగితి మూడుకన్నులను గంగయు దోడయె గాను శంభుడన్.

    రిప్లయితొలగించండి
  6. పొలుపుగ భక్తిభావమునఁ బూజలు సేసి నివేదనమ్ముగా
    పలువురు నన్ను దేవునకు పన్నుగ నర్పణసల్పుచుంద్రు నేఁ
    గలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్
    పిలుతురు నారికేళమను పేరున నెల్లరు నన్నుఁ బ్రీతితో

    రిప్లయితొలగించండి
  7. పదవ తరగతి పిల్లల ఫలితములను
    తెలుపగనె విజయము నొందితినని నాకు
    మూడు నెమలికన్నుల మౌళి ముద్దుగనిడ
    మూడు కన్నులు గలవు శంభుఁడను గాను

    రిప్లయితొలగించండి
  8. దాహమును బాపగ నెపుడు దరికి వత్తు
    నౌషధ గుణము లెన్నియో నందజేతు
    *“మూడు కన్నులు గలవు శంభుఁడను గాను”*
    తెలుపుడయ్యనేనెవరినో తీరుగాను.


    తెలుపుడు బాలులార మరి తీరుగ దెల్సిన మీరలిప్పుడున్
    చెలువము తోడ పట్టుదురు స్త్రీ లు‌ కరమ్ముల యందు ప్రేమతో
    *“కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్”*
    నలసిన వేళలందు వడి నందగ చేసెద తీపి నీరమున్


    రిప్లయితొలగించండి
  9. పిల్ల వానిని ప్రశ్నించె పెద్ద యొ కడు
    మూడు కన్నులు గలవు శం భు డను గాను
    చెప్పు మెవ రది యన గనె చెప్పె నపుడు
    ణారి కే ళ మ ది యనుచు నవ్వె నతడు

    రిప్లయితొలగించండి
  10. రిప్లయిలు
    1. జనుల దాహార్తి తీర్తును జక్కఁగాను
      సకల జనులు డెందమ్ములఁ దికమక పడి
      గింజుకొన నేల నేఁ దాటి ముంజె నయ్య
      మూడు కన్నులు గలవు శంభుఁడను గాను


      వెలసెను దట్ట మైన పరివేష్టిత విస్తృత కుడ్యరాజమే
      చెలఁగెను దంతుసంచయ మశీర్ణ వరాయస భద్ర దుర్గమే
      చెలువుఁడ నేను జిత్ర ఫల శేఖర సన్నుత నారికేళముం
      గలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్

      తొలగించండి
  11. తే.గీ:భార్య పై కోపమును నేను బడయ నొక్క
    దృష్టి బరపెద నంత నా దృష్టి కేదొ
    మూడు, కన్నులు గలవు శంభుఁడను గాను”
    కాల్చి వేయగ మూడవ కన్ను లేదు.
    (ఇక్కడ మూడు అంటే మూడుతుంది అని అర్థం. భార్య మీద కోపం తో చూస్తుంటాడు కానీ దాని వల్ల వీడి కంటికే ఏదో మూడుతుంది.వీడేమీ ఫాలాక్షుడు కాదు.)

    రిప్లయితొలగించండి
  12. చం:కలిగిన దొక్క కన్నె,యది కానక శుక్లము వచ్చె,సోకు గా
    కలిగెను కండ్ల జోడు,మరి కానగ లేనని భార్య గంగ యే
    తలపక యింత కష్టమని దారిని జూపుచు నుండు బ్రేమ చే
    కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్”
    (వీడికి ఒక కన్నే ఉంది.దానికీ శుక్లమే.కళ్ల జోడుంది.కనుక మూడు కళ్లు.భార్య పేరు గంగ.
    కళ్ల జోడు ఉంటే నాలుగు కళ్లు అని,కర్ర ఉంటే మూడు కాళ్లు అని చెప్పుకోవటం సహజమే కదా!మొత్తానికి కొబ్బరి కాయి కాక భిన్నం గా పూరిద్దా మని.)

    రిప్లయితొలగించండి
  13. సమస్య
    “కలిగితి మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ గాను శంభుఁడన్”

    చంపకమాల:

    అలిగితి యమ్మ తిట్టెనని యాకలి లేదని వంకబెట్టుచున్
    పొలుపుగ యుండనోపు కద పొందిక జీవన మార్గ యానమున్
    తలపొగరంత తీరి, తలిదండ్రుల మూడవ నేత్రమున్, కనం
    గలిగితి, మూడు కన్నులను గంగయుఁ దోడయెఁ, గాను శంభుఁడన్”

    (తలిదండ్రులను గౌరవించని పుండరీకుని (పాండురంగడు) పశ్చాత్తాపము)
    (ఘంటసాల వారి పాట అమ్మా అని పిలిచినా ఆలకించవేమమ్మా,,,పాట గుర్తొచ్చి)

    ( sri Kodanda Rao Ayyagari .. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    పుండరీకునకు తెరుచుకున్న మూడవ నేత్రం జ్ఞాననేత్రం, మూడు కన్నులలోను గంగాప్రవాహమై ఉబికిన అశ్రుధారలు. మంచి ఊహ.)

    రిప్లయితొలగించండి
  14. మూడు కన్నులు గలవు శంభుఁడను గాను”
    కాకపోతిని పశు,పక్షి, తోక గలదు.
    కడలినసలు కాను జలము కలిగి యుంటి,
    సరస మతులార నా నామమెరుక గలర.?

    సురేష్ కుమార్ రామోజు.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పొడవుగా నున్న చెట్టుపై పుట్టుచుందు
    దైవ పూజకే శుభమున కైన గాని
    నా యవసరము తప్పక నరులకుండు
    మూడు కన్నులు గలవు శంభుడను గాను
    తెలిసి పోయెనా టెంకాయ తీరు గనగ.

    రిప్లయితొలగించండి