11-5-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్”
(లేదా...)
“ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో”
(మొన్నటి పట్వర్ధన్ గారి శతావధానంలో పి.యల్. నాగేశ్వర రావు గారి సమస్య)
కం॥ మర్మముఁ గాంచడె దుష్టులునిర్మలునభిమన్యుఁ జంప నీతిని కనకన్ధర్మము నెంచని ద్విషులకు ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజునకనిన్ఉ॥ మర్మముఁ గాంచడేల యభిమన్యుని బాలునిఁ జుట్టుముట్టిరేధర్మము పాపమెంచకను దానవ రీతినిఁ గూల్చ దుష్టులైమర్మముఁ గాంచడేలనొకొ మారక యున్నను బాడియౌనొకోధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమోద్విషనులు శత్రువులుఅభిమన్యుని వధ తరువాతనే ధర్మరాజు ద్రోణునితో ప్రోద్బలముపై అశ్వత్థామ హతః అని గట్టిగా కుంజరః అని మెల్లగా అంటాడండి. అందుకే అభిమన్యు వధను తీసుకున్నాను
కార్ముకము ద్రోణుడు విడ నధర్మపరుల యోటమి యిక తథ్యం బనెడిన్ మర్మంబు నెఱుగక నది యధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్.మర్మమెఱుంగడేమి కడు మాన్యుడు ద్రోణుడు యుద్ధభూమిలో కార్ముకమున్ ద్యజించనిచొ కాలుడు సైతము భీతిచెందడే ధర్మము వీడకున్న నిక ధాత్రిని ధర్మము గెల్చు లెట్టులో ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో. *(అశ్వత్థామ మరణించాడని ధర్మజునితో చెప్పించుటకు ముందు కృష్ణుని మాటలుగా)*
ధర్మవిరుద్ధమైన కడు ద్వైధ్యఁపు జూదమునందు కౌరవుల్మర్మము లేమెరుంగని యమాయక జీవుల పాండుపుత్రులన్నిర్మలచిత్తులన్ పరమ నీచపుబుద్ధిని నొవ్వజేయగన్ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
కర్మానుసారమే మతిధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్మర్మమ్ము లెఱుకయేగదనిర్మూలించగ గురువును నిజమును దాచెన్దుర్మతియౌ సుయోధనుడు ద్యూతముకై పిలువంగ వెంటనేకర్మకు బద్ధుడై చనెను కష్టములన్ గొని తెచ్చు కేళికైధర్మము తప్పి యొడ్డెఁ గద తానట పందెము ధర్మపత్నినేధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
నిర్మలమౌ లలినొందుచుదుర్మార్గులయినను గూడ తొలుతగ దలచన్అర్మిలి జూపకనుండ నధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
మర్మఁపు జూదమునందుననిర్మలులగు పాండుసుతుల నీచపుబుద్ధిన్ధర్మముడిపి యోడించిరిధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
దుర్యోధనుని మానసము... కందంధర్మము తప్పడటంచునుధర్మజుని పొగుడుదురు ప్రజ, ద్రౌణి చనియెనన్నిర్మొహమాటపు బొంకునుధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్? ఉత్పలమాలధర్మము తప్పడెప్పుడని తప్పెట మోతగ లోకమందునన్ధర్మజు నొప్పిరే జనులు, ద్రౌణి గతించెనటంచు బొంకెనేనిర్మొహమాట తత్వమున! నేరము కాదొకొ యుద్ధమందునన్ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో?
దుర్మతులైన సంస్థులతి దుష్కరకార్యకలాపవృత్తులైనిర్మల శాంతి కాముకుల నేలను గూల్చిరి గాదె నేడికన్మర్మపు సంధి మాటలను మాయను బన్నుచు మాటువేతురేధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
నిర్మల హృదయము గల్గియు ధర్మము బాటించు నతడు ధర్మము వీ డె న్ కర్మగ బొంకుట జూడ గ ధర్మ మ్మ ని యెంచ దగున ధర్మ జు న కని న్
కార్ముక ముండ నరుని కడఁ గూర్మిని సాఁక వసుదేవు కొడుకు సతతమున్ ధర్మమును వీడి పలుకుట ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్ మర్మము దాఁచుచున్ దురభిమాన ధనుండు సుయోధనుండు దాఁ బేర్మి నటించి పాచికల వేడుక నాడెద మంచుఁ బిల్వ రాడ్ధర్మము కాదు కా దనుట తల్చె నెడంద యుధిష్ఠురుం డటుల్ ధర్మము ధర్మ మంచు మది ధర్మజుఁ డెంచు టదేమి ధర్మమో
ధర్మము మరువని వాడనిధర్మపరులిలను నిరతము తననుపొగడగన్మర్మములెరిగిననాత డ*“ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్”*దుర్మతులైన కౌరవులు తొయ్యలినా సభ గేలిచేయగామర్మ మదేమొ కాని యట మౌనము పూనుచు వంచె శీర్షమున్చర్మము చీల్చి చంపకను శాంతము తోడను నాత డివ్విధిన్*“ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
కం॥ మర్మముఁ గాంచడె దుష్టులు
రిప్లయితొలగించండినిర్మలునభిమన్యుఁ జంప నీతిని కనకన్
ధర్మము నెంచని ద్విషులకు
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజునకనిన్
ఉ॥ మర్మముఁ గాంచడేల యభిమన్యుని బాలునిఁ జుట్టుముట్టిరే
ధర్మము పాపమెంచకను దానవ రీతినిఁ గూల్చ దుష్టులై
మర్మముఁ గాంచడేలనొకొ మారక యున్నను బాడియౌనొకో
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
ద్విషనులు శత్రువులు
అభిమన్యుని వధ తరువాతనే ధర్మరాజు ద్రోణునితో ప్రోద్బలముపై
అశ్వత్థామ హతః అని గట్టిగా కుంజరః అని మెల్లగా అంటాడండి. అందుకే అభిమన్యు వధను తీసుకున్నాను
కార్ముకము ద్రోణుడు విడ న
రిప్లయితొలగించండిధర్మపరుల యోటమి యిక తథ్యం బనెడిన్
మర్మంబు నెఱుగక నది య
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్.
మర్మమెఱుంగడేమి కడు మాన్యుడు ద్రోణుడు యుద్ధభూమిలో
కార్ముకమున్ ద్యజించనిచొ కాలుడు సైతము భీతిచెందడే
ధర్మము వీడకున్న నిక ధాత్రిని ధర్మము గెల్చు లెట్టులో
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో.
*(అశ్వత్థామ మరణించాడని ధర్మజునితో చెప్పించుటకు ముందు కృష్ణుని మాటలుగా)*
ధర్మవిరుద్ధమైన కడు ద్వైధ్యఁపు జూదమునందు కౌరవుల్
రిప్లయితొలగించండిమర్మము లేమెరుంగని యమాయక జీవుల పాండుపుత్రులన్
నిర్మలచిత్తులన్ పరమ నీచపుబుద్ధిని నొవ్వజేయగన్
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
కర్మానుసారమే మతి
రిప్లయితొలగించండిధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
మర్మమ్ము లెఱుకయేగద
నిర్మూలించగ గురువును నిజమును దాచెన్
దుర్మతియౌ సుయోధనుడు ద్యూతముకై పిలువంగ వెంటనే
కర్మకు బద్ధుడై చనెను కష్టములన్ గొని తెచ్చు కేళికై
ధర్మము తప్పి యొడ్డెఁ గద తానట పందెము ధర్మపత్నినే
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
నిర్మలమౌ లలినొందుచు
రిప్లయితొలగించండిదుర్మార్గులయినను గూడ తొలుతగ దలచన్
అర్మిలి జూపకనుండ న
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
మర్మఁపు జూదమునందున
రిప్లయితొలగించండినిర్మలులగు పాండుసుతుల నీచపుబుద్ధిన్
ధర్మముడిపి యోడించిరి
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
దుర్యోధనుని మానసము...
రిప్లయితొలగించండికందం
ధర్మము తప్పడటంచును
ధర్మజుని పొగుడుదురు ప్రజ, ద్రౌణి చనియెనన్
నిర్మొహమాటపు బొంకును
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్?
ఉత్పలమాల
ధర్మము తప్పడెప్పుడని తప్పెట మోతగ లోకమందునన్
ధర్మజు నొప్పిరే జనులు, ద్రౌణి గతించెనటంచు బొంకెనే
నిర్మొహమాట తత్వమున! నేరము కాదొకొ యుద్ధమందునన్
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో?
దుర్మతులైన సంస్థులతి దుష్కరకార్యకలాపవృత్తులై
రిప్లయితొలగించండినిర్మల శాంతి కాముకుల నేలను గూల్చిరి గాదె నేడికన్
మర్మపు సంధి మాటలను మాయను బన్నుచు మాటువేతురే
ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో
నిర్మల హృదయము గల్గియు
రిప్లయితొలగించండిధర్మము బాటించు నతడు ధర్మము వీ డె న్
కర్మగ బొంకుట జూడ గ
ధర్మ మ్మ ని యెంచ దగున ధర్మ జు న కని న్
కార్ముక ముండ నరుని కడఁ
రిప్లయితొలగించండిగూర్మిని సాఁక వసుదేవు కొడుకు సతతమున్
ధర్మమును వీడి పలుకుట
ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్
మర్మము దాఁచుచున్ దురభిమాన ధనుండు సుయోధనుండు దాఁ
బేర్మి నటించి పాచికల వేడుక నాడెద మంచుఁ బిల్వ రా
డ్ధర్మము కాదు కా దనుట తల్చె నెడంద యుధిష్ఠురుం డటుల్
ధర్మము ధర్మ మంచు మది ధర్మజుఁ డెంచు టదేమి ధర్మమో
ధర్మము మరువని వాడని
రిప్లయితొలగించండిధర్మపరులిలను నిరతము తననుపొగడగన్
మర్మములెరిగిననాత డ
*“ధర్మమ్మని యెంచఁ దగున ధర్మజున కనిన్”*
దుర్మతులైన కౌరవులు తొయ్యలినా సభ గేలిచేయగా
మర్మ మదేమొ కాని యట మౌనము పూనుచు వంచె శీర్షమున్
చర్మము చీల్చి చంపకను శాంతము తోడను నాత డివ్విధిన్
*“ధర్మము ధర్మమంచు మది ధర్మజుఁ డెంచుటదేమి ధర్మమో