తేటగ సాగు మా బ్రతుకు ధీవనమంతయు బ్రహ్మమే కదా మేటి ఫలంబు కోరినను మేమిట రాముని గానలేమొకో ? చాటితివమ్మ దానవులె చక్కగ చూపునటంచు నా మహా తాటక పూజ్యురాలనుచు దాపసులెల్లరు గొల్చిరింపుగన్ !
ఉ. తేటగ సాగు మా బ్రతుకు ధీవనమంతయు బ్రహ్మమే కదా మేటి ఫలంబు కోరినను మేమిట రాముని చూడలేమొకో చాటితివమ్మ దైత్యతతి చక్కగ చూపునటంచు నా మహా తాటక పూజ్యురాలనుచు దాపసులెల్లరు గొల్చిరింపుగన్ !
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిపూని కౌశికు యాగము పూర్తి చేయ
రామలక్ష్మణుల నిలువ సేమమొదవె
దాశరథి బాణహతిఁ గూల ధన్యజీవి
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి!
ఉత్పలమాల
వాటికఁ జేరి యజ్ఞమును భంగము సేయ సుతద్వయంబుతో
దీటుగ రామలక్ష్మణులు త్రెంచగ నిల్వగ వారికంఠముల్
వేటుగ రామబాణమున వీడగ ప్రాణము ధన్యజీవిగన్
దాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్!
తేటగ సాగు మా బ్రతుకు ధీవనమంతయు బ్రహ్మమే కదా
రిప్లయితొలగించండిమేటి ఫలంబు కోరినను మేమిట రాముని గానలేమొకో ?
చాటితివమ్మ దానవులె చక్కగ చూపునటంచు నా మహా
తాటక పూజ్యురాలనుచు దాపసులెల్లరు గొల్చిరింపుగన్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి"దానవులె చక్కగ చూపుదురంచు" అనండి.
మునుల యాగము లందున ముప్పు నిడిన
రిప్లయితొలగించండిముదిత ; రక్కసి యయినను పూజ్యుడైన
రాముడు విడిన శిఖికి మరణము నొంద
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిబూటకమైన గ్రంధములు పూటకునొక్కటి వ్రాసి సత్యమున్
రిప్లయితొలగించండిలోటుగ జేసి దుష్టులను లోకమునన్ గడు మంచి వారిగన్
జాటు విషంబు నిత్యము ప్రజా హృదయంబుల నింపు వ్రాతలో
తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండితేటగ సాగు మా బ్రతుకు ధీవనమంతయు బ్రహ్మమే కదా
మేటి ఫలంబు కోరినను మేమిట రాముని చూడలేమొకో
చాటితివమ్మ దైత్యతతి చక్కగ చూపునటంచు నా మహా
తాటక పూజ్యురాలనుచు దాపసులెల్లరు గొల్చిరింపుగన్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిబడి ముఖమ్మైన జూడని పామరుండు
మద్యమున్ విరివిగ గ్రోలి మత్తు తోడ
ప్రక్కనున్న మిత్రులతోడ పలికె నిటుల
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి.
ఏటికి నిట్టి మాటలవి యే యకృతాత్ముడు పల్కెనిట్లు దో
షాటుల జాతి వారలకు సద్గుణ మబ్బునె తాపసుండ్రకున్
జేటునొనర్చు దుర్మతిని శీధువు గ్రోలి వచింతు వెప్పుడా
తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్.
తే॥ చాలు మాటకు ప్రాణము సత్యముకద
రిప్లయితొలగించండిబొంకఁగ ఫలమేమి విరియు బుద్ధిఁ గనుమ
తాటకి మునుల బాధించఁ దగున పలుకఁ
దాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి
ఉ॥ ఘాటుగ బాధపెట్టెనటు ఘాతుక రీతినిఁ దాపసాళినిన్
దాటక, పూజ్యరాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చిరింపుగన్
మాటకు నిల్చి కానలకు మాన్యుఁడు రాముఁడు చాగ వీడకన్
దాటక నేమమెప్పుడును ధాత్రిజ సాగఁగ నీడయై సదా
ముక్తి మార్గముఁ గనుగొని భక్తి తోడ
రిప్లయితొలగించండితపము నాచరించుచునున్న తాపసులను
తాను నిర్బంధ నముసేయ తాళలేక
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి
చీటికిమాటికిన్ సలిపి చిత్రసమస్యల పూరణంబులన్
ధాటిగ పద్యమల్లెడు బుధానుని కిచ్చిన కైపదమ్మిదే
'తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్'
దీటగు నేర్పుతోడ మరి దీనినిగాంచి పరిష్కరింపుమా
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండితాపసుల యాగమును గావ దవముకేఁగి
రిప్లయితొలగించండిదాశరథి గూల్చె తాటకన్ ధనువుఁ బూని
దశరథాత్మజు చేతిలో తనువు వీడ
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిధాటిగ సల్పుయాగముల ధ్వంసము చేయుచు తాపసాళికిన్
రిప్లయితొలగించండిజేటును గూర్చు రక్కసుల జెండగ రాముఁడుచేరి దావమున్
తాటకఁజంపె, సాధువుల తల్లడపెట్టగనెట్లు బల్కెదో
తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్?
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఎంత పుణ్యము చేసెనో యే మొ గాని
రిప్లయితొలగించండిముక్తి పొందియు మిక్కిలి మోద మందె
ననుచు భాగ్యమన్న నదియే ఘన మటంచు
తాటక న్ బూ జ్యు రాల నె దాప సా ళి
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే.గీ:యజ్ఞభంగముల్ గావించి, యతుల జంపి,
రిప్లయితొలగించండిమనుజమాంసమ్ము దినెడు తామస గణమ్ము
తాటకన్ బూజ్యురాలనెఁ, దాపసాళి”
యామె యతివ యైనను వధ్యురాలె యనగ
(తామసులు అనగా రాక్షసులు ఆమెను పూజ్యురా లన్నారు.తాపసులు అన లేదు.)
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ:నోటికి మాంసమే రుచియు,నొవ్వగ జేసెడు భాష యిష్టమౌ,
రిప్లయితొలగించండిపూటకు పూటకున్ మనుజ భోజన మెక్కువ రాక్షసాళికే
తాటక పూజ్యురాలనుచుఁ, దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్
ధాటిగ దాని జంపగనె దాశరథిన్ దమ ప్రాణదాతగన్.
(దాని నోటికి మాంసము,దుర్భాష ఇష్టం.ఆమె రాక్షసులకే పూజ్యురాలు.)
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది
తొలగించండిఅభినందనలు
తిరుగు చుండంగ వనమం దెదురు పడంగ
రిప్లయితొలగించండినన్ను బోలు శిరోజాళి యన్ను లందు
మిన్న కున్న దంచు మురిసి కన్ను లదరఁ
దాటకన్బూజ్యురా లనెఁ దాపసాళి
[తాపస +అళి = తాపసాళి; తాపసుని బోలు తుమ్మెద]
కాటికిఁ బోవ నిశ్చయము కాల వశమ్మున నెల్ల వారికిం
గైటభ దైత్య మర్దనుఁడు కంజ దళాక్షుఁడు రామ చంద్రుఁడే
మాటలఁ జెప్ప శక్యమె రమాపతి చేతి లయమ్ముఁ గాంచెనే
తాటక పూజ్యురా లనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్
మీ పూరణ అద్భుతంగా ఉంది
తొలగించండిఅభినందనలు
ధాటిగ కాననమ్ములను దాడుల చేయుచు మానవాళిపై
రిప్లయితొలగించండివాటముగా భుజించుచు నవారితము మౌనుల బాధపెట్టగా
దీటుగ చంపె రాఘవుడు, త్రెళ్ళెను రాముని చేతిలోన నా
తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్!
మీ పూరణ బాగున్నది అభినందనలు
తొలగించండిరెండవ పాదంలో గణభంగం. సవరించండి
సమస్య:
రిప్లయితొలగించండితాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్
ఉత్పలమాల:
కూటమి గూడి రావణుని కూరిమి సేవల జేయు రక్కసిన్
ఆటగ యజ్ఞ గుండముల యార్పెడి తాటక నీచ చేతలన్
ఓటమి జేసి చంపగ నయోధ్య నృపుండుయె యామె భాగ్యమే,
తాటక పూజ్యురాలనుచుఁ దాపసు లెల్లరుఁ గొల్చి రింపుగన్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
రక్ష చేయగ యాగమున్ రాముడపుడు
బాణములను సంధించి గుర్వాజ్ఞ తోడ
సంహరించి రక్కసిని మోక్షమ్ము నివ్వ
తాటకన్ బూజ్యురాలనెఁ దాపసాళి.