31-5-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును”
(లేదా...)
“అప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్”
అవసర సమయమున నాదుకొనగవచ్చియడుగ కుండ దానె యర్ద మిడినహితుని లలి నెరుగక నించుక రూకలయప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలదినమ్మి ఋణము నిచ్చి నగుబాటు చెందుచుకాళ్లవేళ్లఁబడిన కరుగకుండకాపురములగూల్చ, రేపుమాపులనునేయప్పుఁ దీర్చువాఁడె? యధముఁ డగును!ఉత్పలమాలతప్పక దీర్తునీ ఋుణము తల్లియె సాక్షియటంచు నొందియున్తిప్పల కాళ్లవేళ్లఁ బడి దీర్చుమనంగను జాలిమృగ్యమైద్రిప్పుచు గూల్చ కాపురము రేపని మాపని చెల్లువేయకేయప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్!
వలసి నపుడొ సంగు వాని కి తప్పక నప్పుదీర్చు వాడె ::యధము డగును మొండి కేసి త్రిప్పు మూ ర్ఖు డు లోకాన మంచి తనము పోయి మo కు గాడె
ఉ.తిప్పలు వేగలేక యిక దిక్కులు దోచని కాలమొందినంజిప్పిలు గంటి ధారలను జెమ్మకు లొంగుచు చోరబుద్ధిచేఁ దప్పులు సేసి విత్తమును దమ్ముగఁ దెచ్చి మదించి వాటితో నప్పులు దీర్చు వాడధముడౌనని చెప్పెను నీతి శాస్త్రముల్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
చెంత ధనము లేక చేబదులును గొనిసిరియె చేరె నంచు తిరిగి యిచ్చిమరల లేమి లోన మ్రగ్గంగ నేలరా? యప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును.ఎప్పుడు జ్ఞాతి నాశము మహీతలమందున కోరు దుష్టుడే కుప్పలు తెప్పలున్ ధనము కుచ్ఛితు డౌచును జూద మాడమంచప్పుల ద్వార దాయసుతు నంతము గోరుచు నిచ్చినట్టి యాయప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్.
అప్పులిచ్చి వెంట తప్పక పడినచోనప్పుల నెగవేయు ముప్పు తప్పుచెప్పులరగ కుండ చెల్లింప నెంచిననప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగునుచెప్పిన మాటలన్ మరచి చేసిన యప్పులఁ దీర్చకున్నచోచప్పున వానినారసి యశక్తునిగా గణియించు లోకమేయప్పుల యూబిలోమునిగి యప్పులు క్రొత్తగ జేసి పాతవౌయప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ద్రవిణ మా బకాయి రద్దు చేయబడునోయ్తీర్చ బోకు నీవు తీసుకున్న నప్పు చేసి తినుము పప్పుకూడు హితుడఅప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
ఆ.వె:అప్పు తీర్చ కున్న నతని ఋణము నెల్లనెత్తి వేసి,సొమ్ము లిచ్చి నట్టివాని ఋణము నందు పైస తగ్గక యున్న నప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును”(మా బ్యాంకుల లో ఋణ మాఫీ ప్రభుత్వాలే చేసే అతి పెద్ద రాజకీయపు అవినీతి.ఎవడు ఎగ గొడతాడో వాడి అప్పు మాఫీ అవుతుంది.ఎవడు నీతిగా కడతాడో వాడికి ఏ లాభం లేదు.అంటే అవినీతిని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నట్టు.)
ఉ:"అ ప్పెగవేయు వానికి సమాదరణన్ ఋణముక్తి నిచ్చి యాయప్పుల దీర్చు నీతిపరు లందున నే దయ జూపకున్న నా యప్పులఁ దీర్చువాఁ డధముఁడౌ"నని చెప్పెను, "నీతిశాస్త్రముల్చెప్పెనె యీ విధాన" మని? "ఛీ" యనె నార్థికశాస్త్రవేత్తయే.(పై ఋణ మాఫీ విధానాన్ని ఏ నీతి శాస్త్రా లైనా చెప్పాయా?అని ఆర్థిక వేత్తయే ఛీ కొట్టాడు.అది అర్థశాస్త్రం కాదు. నీతి శాస్త్రమూ కాదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఉ:అప్పును జేసి యైనను ఘృతాశన జేయు మటంచు నాస్తికుల్ జెప్పిరి పూర్వకాలమున,చెప్పిరె వారలె యైన చక్కగా నప్పులఁ దీర్చువాఁ డధముఁడౌ నని ?చెప్పెను నీతిశాస్త్రముల్”తప్పది యప్పు దీర్చని విధాన మటంచునె మానవాళికిన్.(పూర్వం చార్వాకు లైన "ఋణం కృత్వా ఘృతం పిబేత్"అన్నారే కానీ అప్పు ఎగగొట్ట మని చెప్ప లేదు.నీతి శాస్త్రాలు అలా అసలే చెప్పవు.)
వాట్సప్ సమూహంలో సమీక్షించిన పూరణలను ఇక్కడ పరిశీలించలేదు. గమనించండి.
ద్రవ్య నిధుల ధనము తస్కరించుటయే పరిశ్రమాధిపతుల లీల నేఁడు నేఁటి వర్తకుండు పాటవమునఁ బల్కు నప్పుఁ దీర్చు వాఁడె యధముఁ డగును ఎప్పుడు గుట్టుగాను దనరింపఁగ నొప్పెడి దాని నక్కటా యిప్పనిఁ జేయ నిట్టుల సహింపఁ దరమ్మె దురాకృతమ్మునుం దప్పని నేరినం జలముఁ దాలిచి మూత్రవిసర్జనంబుఁ దా నప్పులఁ దీర్చువాఁ డధముఁ డౌనని చెప్పెను నీతి శాస్త్రముల్ [అప్పు = నీరు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
అప్పరావు సేయు నప్పులు దండిగతీర్చుమనఁగఁ బెట్టు తిప్పలెన్నొపలుకుచుండు నీతివాక్యము లిట్టులఅప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
అప్పుల యప్పరావతఁడు నాగడకాడొనరించునప్పులన్తిప్పలువెట్టు దీరికగ తీర్చక జేసినయప్పు లెన్నఁడున్చెప్పుచునుండు నీతులను చేయును భాషణ మివ్విధంబుగన్అప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.అప్పు చేసి తీర్చ నాలస్యమున్ జేసియప్పు నిడిన వాని త్రిప్పుకొనుచువాయిదాలు వేసి వత్సరాల పిదపయప్పు దీర్చు వాడె యధముడగును.
అవసర సమయమున నాదుకొనగవచ్చి
రిప్లయితొలగించండియడుగ కుండ దానె యర్ద మిడిన
హితుని లలి నెరుగక నించుక రూకల
యప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండినమ్మి ఋణము నిచ్చి నగుబాటు చెందుచు
కాళ్లవేళ్లఁబడిన కరుగకుండ
కాపురములగూల్చ, రేపుమాపులనునే
యప్పుఁ దీర్చువాఁడె? యధముఁ డగును!
ఉత్పలమాల
తప్పక దీర్తునీ ఋుణము తల్లియె సాక్షియటంచు నొందియున్
తిప్పల కాళ్లవేళ్లఁ బడి దీర్చుమనంగను జాలిమృగ్యమై
ద్రిప్పుచు గూల్చ కాపురము రేపని మాపని చెల్లువేయకే
యప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్!
వలసి నపుడొ సంగు వాని కి తప్పక
రిప్లయితొలగించండినప్పుదీర్చు వాడె ::యధము డగును
మొండి కేసి త్రిప్పు మూ ర్ఖు డు లోకాన
మంచి తనము పోయి మo కు గాడె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండితిప్పలు వేగలేక యిక దిక్కులు దోచని కాలమొందినం
జిప్పిలు గంటి ధారలను జెమ్మకు లొంగుచు చోరబుద్ధిచేఁ
దప్పులు సేసి విత్తమును దమ్ముగఁ దెచ్చి మదించి వాటితో
నప్పులు దీర్చు వాడధముడౌనని చెప్పెను నీతి శాస్త్రముల్ !
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచెంత ధనము లేక చేబదులును గొని
సిరియె చేరె నంచు తిరిగి యిచ్చి
మరల లేమి లోన మ్రగ్గంగ నేలరా?
యప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును.
ఎప్పుడు జ్ఞాతి నాశము మహీతలమందున కోరు దుష్టుడే
కుప్పలు తెప్పలున్ ధనము కుచ్ఛితు డౌచును జూద మాడమం
చప్పుల ద్వార దాయసుతు నంతము గోరుచు నిచ్చినట్టి యా
యప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్.
అప్పులిచ్చి వెంట తప్పక పడినచో
రిప్లయితొలగించండినప్పుల నెగవేయు ముప్పు తప్పు
చెప్పులరగ కుండ చెల్లింప నెంచిన
నప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
చెప్పిన మాటలన్ మరచి చేసిన యప్పులఁ దీర్చకున్నచో
చప్పున వానినారసి యశక్తునిగా గణియించు లోకమే
యప్పుల యూబిలోమునిగి యప్పులు క్రొత్తగ జేసి పాతవౌ
యప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిద్రవిణ మా బకాయి రద్దు చేయబడునోయ్
రిప్లయితొలగించండితీర్చ బోకు నీవు తీసుకున్న
నప్పు చేసి తినుము పప్పుకూడు హితుడ
అప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆ.వె:అప్పు తీర్చ కున్న నతని ఋణము నెల్ల
రిప్లయితొలగించండినెత్తి వేసి,సొమ్ము లిచ్చి నట్టి
వాని ఋణము నందు పైస తగ్గక యున్న
నప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును”
(మా బ్యాంకుల లో ఋణ మాఫీ ప్రభుత్వాలే చేసే అతి పెద్ద రాజకీయపు అవినీతి.ఎవడు ఎగ గొడతాడో వాడి అప్పు మాఫీ అవుతుంది.
ఎవడు నీతిగా కడతాడో వాడికి ఏ లాభం లేదు.అంటే అవినీతిని ప్రభుత్వాలే ప్రోత్సహిస్తున్నట్టు.)
ఉ:"అ ప్పెగవేయు వానికి సమాదరణన్ ఋణముక్తి నిచ్చి యా
రిప్లయితొలగించండియప్పుల దీర్చు నీతిపరు లందున నే దయ జూపకున్న నా
యప్పులఁ దీర్చువాఁ డధముఁడౌ"నని చెప్పెను, "నీతిశాస్త్రముల్
చెప్పెనె యీ విధాన" మని? "ఛీ" యనె నార్థికశాస్త్రవేత్తయే.
(పై ఋణ మాఫీ విధానాన్ని ఏ నీతి శాస్త్రా లైనా చెప్పాయా?అని ఆర్థిక వేత్తయే ఛీ కొట్టాడు.అది అర్థశాస్త్రం కాదు. నీతి శాస్త్రమూ కాదు.)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఉ:అప్పును జేసి యైనను ఘృతాశన జేయు మటంచు నాస్తికుల్
రిప్లయితొలగించండిజెప్పిరి పూర్వకాలమున,చెప్పిరె వారలె యైన చక్కగా
నప్పులఁ దీర్చువాఁ డధముఁడౌ నని ?చెప్పెను నీతిశాస్త్రముల్”
తప్పది యప్పు దీర్చని విధాన మటంచునె మానవాళికిన్.
(పూర్వం చార్వాకు లైన "ఋణం కృత్వా ఘృతం పిబేత్"అన్నారే కానీ అప్పు ఎగగొట్ట మని చెప్ప లేదు.నీతి శాస్త్రాలు అలా అసలే చెప్పవు.)
వాట్సప్ సమూహంలో సమీక్షించిన పూరణలను ఇక్కడ పరిశీలించలేదు. గమనించండి.
రిప్లయితొలగించండిద్రవ్య నిధుల ధనము తస్కరించుటయే ప
రిప్లయితొలగించండిరిశ్రమాధిపతుల లీల నేఁడు
నేఁటి వర్తకుండు పాటవమునఁ బల్కు
నప్పుఁ దీర్చు వాఁడె యధముఁ డగును
ఎప్పుడు గుట్టుగాను దనరింపఁగ నొప్పెడి దాని నక్కటా
యిప్పనిఁ జేయ నిట్టుల సహింపఁ దరమ్మె దురాకృతమ్మునుం
దప్పని నేరినం జలముఁ దాలిచి మూత్రవిసర్జనంబుఁ దా
నప్పులఁ దీర్చువాఁ డధముఁ డౌనని చెప్పెను నీతి శాస్త్రముల్
[అప్పు = నీరు]
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఅప్పరావు సేయు నప్పులు దండిగ
రిప్లయితొలగించండితీర్చుమనఁగఁ బెట్టు తిప్పలెన్నొ
పలుకుచుండు నీతివాక్యము లిట్టుల
అప్పుఁ దీర్చువాఁడె యధముఁ డగును
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅప్పుల యప్పరావతఁడు నాగడకాడొనరించునప్పులన్
రిప్లయితొలగించండితిప్పలువెట్టు దీరికగ తీర్చక జేసినయప్పు లెన్నఁడున్
చెప్పుచునుండు నీతులను చేయును భాషణ మివ్విధంబుగన్
అప్పులఁ దీర్చువాఁ డధముఁడౌనని చెప్పెను నీతిశాస్త్రముల్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
అప్పు చేసి తీర్చ నాలస్యమున్ జేసి
యప్పు నిడిన వాని త్రిప్పుకొనుచు
వాయిదాలు వేసి వత్సరాల పిదప
యప్పు దీర్చు వాడె యధముడగును.