6-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు”
(లేదా...)
“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్”
ఆటవెలదివంశనాశనాన వాలెను రారాజు!పాండునందనులకు పట్టమందెధర్మరక్షణమున దండించి వైరికికీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు!ఉత్పలమాలపాడిగ నెంచ ధర్మజుఁడు భావ్యమటంచును సంధిఁ గూర్పఁగన్వీడుచు భేషజమ్ములను విజ్ఞత జూపుమనంగఁ గౌరవుల్దాడిగ బందిఁ జేయఁ గన దండనమెంచె! నధర్మ మైనచోఁగీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
పాలు పట్టెదనని వచ్చిన పూతనయనెడి యసుర కన్య నణచి నటులజిన్నతనము నందె చెడ్డ మనుజులకుకీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు
ధర్మ రక్ష కొఱకు ధరణి లో జన్మించి సజ్జ నాళి బ్రోవ సాహ సించి జగతి యందు నున్న జనులలో దురితు కు కీడొ సంగు వాడు కృష్ణుడo ద్రు
ఆ॥ నందనందనుఁడుగ విందుఁ జేసిన చిన్నికన్నఁడు తగు పగిదిఁ గాయు చుండ సజ్జనుల, సుజనుల సఖుఁడు దుర్జనులకుకీడొసంగు వాఁడు గృష్ణుఁ డంద్రుఉ॥ వేడుక మీర గోపికల ప్రేమనుఁ గాంచిన చిన్ని కన్నఁడేచూడఁగ సజ్జనాళికిల శోభలఁ గూర్చుచుఁ బాండుపుత్రులన్నీడగ నిల్చి ప్రోచెనని నేమముఁ బాసిన దుర్జనాళికిన్గీడు నొసంగు వాఁడనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
ధర్మమిలను నిలుప ధరణినవత రించినట్టి ఘనుడు వాడె యక్షధరుడుశిష్టులనిల రక్షజేయ దుష్టులకునుకీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు.దూడల రక్ష జేయీటకు దుక్శృతి గర్వమడంచె మడ్గునన్ వేడెనటంచు నప్పుడట బ్రీతిని జూపి నొసంగె గాదుటే చేడియ కంబరమ్ములను శిష్టుల బ్రోవగ దుష్టశ్రేణికిన్ కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్.
మేడలు మిద్దెలన్నియును మేలును గూర్చునె వృద్ధ జాతికిన్గూడలు జారి కీళ్లరిగి గోడలు పట్టెడి కష్టమేలకోవాడని యవ్వనంబదియు వచ్చిన మోదమునొంద వచ్చు మాకీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్!!మాకు + ఈడు = మాకీడుఈడు = యవ్వనము
బాలకుండయినను పరమాత్ముడే గదాదైత్యుల మదమడచి తనరుచుండుతనను చంప వచ్చు దనుజులకే సదాకీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రుచూడగ బాలుడైనను యశోద సుతుండు మహాత్ముడే గదాకీడొనరింప వచ్చినను కిమ్మన కుండు సదా విపత్తులన్గూడ గ్రహించుచున్ దనను కూల్చగ వచ్చిన రక్కసీడుకేకీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
ధర్మమునకు హాని ధరలోన గలిగినసాధుజనుల రక్ష సలుపు కొరకునవతరించి యాతఁడవనిలో దుష్టులకీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు
చోడుమలెన్ని గల్గినను శోధనలన్ భరియించి యోర్మితోవీడక ధర్మమార్గమును పేర్మిఁ జరించెడు సజ్జనాళికిన్తోడుగనిల్చి దుర్జనుల దుర్మదమున్ గుదియించ వారికిన్కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
నల్లనైన మేను పెల్లుగ విలసిల్లఁ గొంటె పనులు సేయ వెంట వెంట మీఱి పసితనమున మేనమామ కకట కీడొసంగు వాఁడు కృష్ణుఁ డంద్రు క్రీడి సఖుండు బాంధవుఁడు కృష్ణుఁడు భారత యుద్ధ వేళలోఁ దోడుగ నుండ సంతతము తోరము కన్పడఁ జేష్ట లందు నా జాడలు ధర్మరాడ్వరుని సంపదకున్ నల రాడ్వరేణ్యు శ్రీ కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్ [శ్రీకి +ఈడు = శ్రీ కీడు]
సమస్య:కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్ఉత్పలమాల:వీడు నసాధ్యుడే యనుచు, వీధుల వాడల నెందుఁ జూచినన్ తోడుగ గోపబాలురను తోషము మీరగ వెన్న దొంగిలన్ మోడుల శాపమున్ దొలఁగఁ, మోదము జంపగ రాక్షసాళికే కీడునొసంగువాడనుచు, గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
సమస్య:కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్ఉత్పలమాల:వేడుక తల్లి గర్భమున వేదన దీర్చగ బుట్టె శ్రీహరే పీడను గల్గ భూసతికి పీచమడంచియు దుష్టశిక్షణన్ తోడును నీడగా నిలిచి దోషుల శిక్షల పాలనంబుతో కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ధర్మము నిలుపంగ ద్వాపర యుగమునఅవతరించి నాడు నవని పైనశిష్ట జనులఁ గాచి దుష్టుల కెల్లనుకీడొసంగు వాడు గృష్ణుఁ డంద్రు.
ఆటవెలది
రిప్లయితొలగించండివంశనాశనాన వాలెను రారాజు!
పాండునందనులకు పట్టమందె
ధర్మరక్షణమున దండించి వైరికి
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు!
ఉత్పలమాల
పాడిగ నెంచ ధర్మజుఁడు భావ్యమటంచును సంధిఁ గూర్పఁగన్
వీడుచు భేషజమ్ములను విజ్ఞత జూపుమనంగఁ గౌరవుల్
దాడిగ బందిఁ జేయఁ గన దండనమెంచె! నధర్మ మైనచోఁ
గీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
పాలు పట్టెదనని వచ్చిన పూతన
రిప్లయితొలగించండియనెడి యసుర కన్య నణచి నటుల
జిన్నతనము నందె చెడ్డ మనుజులకు
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు
ధర్మ రక్ష కొఱకు ధరణి లో జన్మించి
రిప్లయితొలగించండిసజ్జ నాళి బ్రోవ సాహ సించి
జగతి యందు నున్న జనులలో దురితు కు
కీడొ సంగు వాడు కృష్ణుడo ద్రు
ఆ॥ నందనందనుఁడుగ విందుఁ జేసిన చిన్ని
రిప్లయితొలగించండికన్నఁడు తగు పగిదిఁ గాయు చుండ
సజ్జనుల, సుజనుల సఖుఁడు దుర్జనులకు
కీడొసంగు వాఁడు గృష్ణుఁ డంద్రు
ఉ॥ వేడుక మీర గోపికల ప్రేమనుఁ గాంచిన చిన్ని కన్నఁడే
చూడఁగ సజ్జనాళికిల శోభలఁ గూర్చుచుఁ బాండుపుత్రులన్
నీడగ నిల్చి ప్రోచెనని నేమముఁ బాసిన దుర్జనాళికిన్
గీడు నొసంగు వాఁడనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
రిప్లయితొలగించండిధర్మమిలను నిలుప ధరణినవత రించి
నట్టి ఘనుడు వాడె యక్షధరుడు
శిష్టులనిల రక్షజేయ దుష్టులకును
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు.
దూడల రక్ష జేయీటకు దుక్శృతి గర్వమడంచె మడ్గునన్
వేడెనటంచు నప్పుడట బ్రీతిని జూపి నొసంగె గాదుటే
చేడియ కంబరమ్ములను శిష్టుల బ్రోవగ దుష్టశ్రేణికిన్
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్.
మేడలు మిద్దెలన్నియును మేలును గూర్చునె వృద్ధ జాతికిన్
రిప్లయితొలగించండిగూడలు జారి కీళ్లరిగి గోడలు పట్టెడి కష్టమేలకో
వాడని యవ్వనంబదియు వచ్చిన మోదమునొంద వచ్చు మా
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్!!
మాకు + ఈడు = మాకీడు
ఈడు = యవ్వనము
బాలకుండయినను పరమాత్ముడే గదా
రిప్లయితొలగించండిదైత్యుల మదమడచి తనరుచుండు
తనను చంప వచ్చు దనుజులకే సదా
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు
చూడగ బాలుడైనను యశోద సుతుండు మహాత్ముడే గదా
కీడొనరింప వచ్చినను కిమ్మన కుండు సదా విపత్తులన్
గూడ గ్రహించుచున్ దనను కూల్చగ వచ్చిన రక్కసీడుకే
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
ధర్మమునకు హాని ధరలోన గలిగిన
రిప్లయితొలగించండిసాధుజనుల రక్ష సలుపు కొరకు
నవతరించి యాతఁడవనిలో దుష్టుల
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు
చోడుమలెన్ని గల్గినను శోధనలన్ భరియించి యోర్మితో
రిప్లయితొలగించండివీడక ధర్మమార్గమును పేర్మిఁ జరించెడు సజ్జనాళికిన్
తోడుగనిల్చి దుర్జనుల దుర్మదమున్ గుదియించ వారికిన్
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
నల్లనైన మేను పెల్లుగ విలసిల్లఁ
రిప్లయితొలగించండిగొంటె పనులు సేయ వెంట వెంట
మీఱి పసితనమున మేనమామ కకట
కీడొసంగు వాఁడు కృష్ణుఁ డంద్రు
క్రీడి సఖుండు బాంధవుఁడు కృష్ణుఁడు భారత యుద్ధ వేళలోఁ
దోడుగ నుండ సంతతము తోరము కన్పడఁ జేష్ట లందు నా
జాడలు ధర్మరాడ్వరుని సంపదకున్ నల రాడ్వరేణ్యు శ్రీ
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్
[శ్రీకి +ఈడు = శ్రీ కీడు]
సమస్య:
రిప్లయితొలగించండికీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
ఉత్పలమాల:
వీడు నసాధ్యుడే యనుచు, వీధుల వాడల నెందుఁ జూచినన్
తోడుగ గోపబాలురను తోషము మీరగ వెన్న దొంగిలన్
మోడుల శాపమున్ దొలఁగఁ, మోదము జంపగ రాక్షసాళికే
కీడునొసంగువాడనుచు, గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
సమస్య:
రిప్లయితొలగించండికీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
ఉత్పలమాల:
వేడుక తల్లి గర్భమున వేదన దీర్చగ బుట్టె శ్రీహరే
పీడను గల్గ భూసతికి పీచమడంచియు దుష్టశిక్షణన్
తోడును నీడగా నిలిచి దోషుల శిక్షల పాలనంబుతో
కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ధర్మము నిలుపంగ ద్వాపర యుగమున
అవతరించి నాడు నవని పైన
శిష్ట జనులఁ గాచి దుష్టుల కెల్లను
కీడొసంగు వాడు గృష్ణుఁ డంద్రు.