27-6-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
(లేదా...)
“అండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”
మెండుగ నుడికిన పప్పునుపిండియుఁ దగు చింత పులుసు వేసి పొగిచినన్వెండియు దినుసులు మఱి కూష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.
కందంపండినవని పొరుగింటనుదండిగ, మాకొక్కటివ్వ, దంపతి పలికెన్వండెద, శామీలపు కూష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ!
శార్దూలవిక్రీడితముపండంగన్ పొరుగింటిలో పెరడునన్ బంపించ మాయింటికిన్దండమ్మంచును గారవించి సతియే దట్టించి తా నింగువన్వండంగన్ దగురీతి పక్వముగ సర్వామోదమౌ భూతికూష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!(బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు/చారు నేపథ్యంగా...)
కం:వండగ శాకము లెన్నియుపండుగ యాచారి కగును పప్పును వేయన్ నిండుగ మాంసాహారమునండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”(భోజనానికి వచ్చిన వారిలో ఒకడు ఆచారి.ఒకడు జార్.)
శా:దండమ్ముల్ పలు బెట్టి పిల్చితి జమీందారైన యా జారునిన్,దండన్ వేసితి స్వాగత మ్మనుచు, మోద మ్మొందు విం దిచ్చితిన్,వండన్ గుమ్మడి కాయ కూర మురిసెన్,వాడింక నా వాడె కూ ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”(చాలా హైక్లాస్ జారిణి. జమీందారైన జారుణ్ని ఇంత మర్యాద తో వలలో వేసింది.ఆ గుమ్మడికాయ కూరకే జమీందారు తన వా డైపోతాడని నమ్మకం.)
కం॥ మెండగు రుచులను వలచిరినిండుగ మనుజులు ధరణిని నెరి పలలమటుల్వండి తిను జనులు తెలిపిరి యండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌశా॥ వండంగన్ దరుశాకమూలముల భవ్వంబంచు భావించఁగన్గండల్ పుష్టిగ వృద్ధిఁ జెందునని శాకాహారులౌ భోక్తలున్ జండా పాఁతుచుఁ దెల్పిరే జనులు మాంసాహార భోజ్యంబులోనండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!నెరి ఆచారము విధము (నిఘంటువు సహాయమండి)
దండి పిరిమితో నీవిటవండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే చండిక! సుగంధ ద్రవ్యపు బండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలైన ధాన్యాకముల్ బండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా. *(బండము....వస్తుసామాగ్రి)*
శా.పండై ముగ్గెను దీపితోఁ బనస యాస్వాదింపగం జక్కగానిండెం జెట్టున కొమ్మపైఁ గనగ నా నేత్రంబులుల్లాసమై పండెన్, ముక్కలు కోసి వంటను వడిన్ వాడం దగుం దండ్రి బ్ర హ్మాండమ్ముం, గలుపంగఁ జారునకు దివ్య స్వాదమందెన్ గదా !
పండుగ దివసమునందునవండిన పాకముల లోన ప్రముఖత నొందన్కొండికగ మురిగొనిన కూష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
దండి పిరిమితో నీవిటవండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే చండిక! ముక్కలుగను కూష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలున్ ప్రవర్ధిల్లు కూష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా.
వండుట పరిపాటియె బ్రహ్మాండమగు రుచినిడు వంట నానందముతోవండెడు పదార్థమున కూష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌపండున్ పంటలు మిక్కుటంబుగ సదా వారున్న గ్రామాన బ్రహ్మాండంబౌరుచి నిచ్చు వంట లవియే మాధుర్యముప్పొంగులేవండెన్ భామిని పప్పుచారు శుచిగా పాకంబు నందొక్క కూష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా
వండుట యందున నేరుపు మెండుగ జూపు వన జాక్షి మేలిమి కూర న్ వండుచు ముక్కలు గా కూ ష్మా o డము గలుపo గ జారు క ద్భు త రుచి యవ్
మెండుగ నుడికిన పప్పును
రిప్లయితొలగించండిపిండియుఁ దగు చింత పులుసు వేసి పొగిచినన్
వెండియు దినుసులు మఱి కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.
కందం
రిప్లయితొలగించండిపండినవని పొరుగింటను
దండిగ, మాకొక్కటివ్వ, దంపతి పలికెన్
వండెద, శామీలపు కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ!
శార్దూలవిక్రీడితము
తొలగించండిపండంగన్ పొరుగింటిలో పెరడునన్ బంపించ మాయింటికిన్
దండమ్మంచును గారవించి సతియే దట్టించి తా నింగువన్
వండంగన్ దగురీతి పక్వముగ సర్వామోదమౌ భూతికూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!
(బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు/చారు నేపథ్యంగా...)
కం:వండగ శాకము లెన్నియు
రిప్లయితొలగించండిపండుగ యాచారి కగును పప్పును వేయన్
నిండుగ మాంసాహారము
నండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
(భోజనానికి వచ్చిన వారిలో ఒకడు ఆచారి.ఒకడు జార్.)
శా:దండమ్ముల్ పలు బెట్టి పిల్చితి జమీందారైన యా జారునిన్,
రిప్లయితొలగించండిదండన్ వేసితి స్వాగత మ్మనుచు, మోద మ్మొందు విం దిచ్చితిన్,
వండన్ గుమ్మడి కాయ కూర మురిసెన్,వాడింక నా వాడె కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా”
(చాలా హైక్లాస్ జారిణి. జమీందారైన జారుణ్ని ఇంత మర్యాద తో వలలో వేసింది.ఆ గుమ్మడికాయ కూరకే జమీందారు తన వా డైపోతాడని నమ్మకం.)
కం॥ మెండగు రుచులను వలచిరి
రిప్లయితొలగించండినిండుగ మనుజులు ధరణిని నెరి పలలమటుల్
వండి తిను జనులు తెలిపిరి
యండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ
శా॥ వండంగన్ దరుశాకమూలముల భవ్వంబంచు భావించఁగన్
గండల్ పుష్టిగ వృద్ధిఁ జెందునని శాకాహారులౌ భోక్తలున్
జండా పాఁతుచుఁ దెల్పిరే జనులు మాంసాహార భోజ్యంబులో
నండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా!
నెరి ఆచారము విధము (నిఘంటువు సహాయమండి)
రిప్లయితొలగించండిదండి పిరిమితో నీవిట
వండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే
చండిక! సుగంధ ద్రవ్యపు
బండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.
దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే
రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే
భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలైన ధాన్యాకముల్
బండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా.
*(బండము....వస్తుసామాగ్రి)*
శా.
రిప్లయితొలగించండిపండై ముగ్గెను దీపితోఁ బనస యాస్వాదింపగం జక్కగా
నిండెం జెట్టున కొమ్మపైఁ గనగ నా నేత్రంబులుల్లాసమై
పండెన్, ముక్కలు కోసి వంటను వడిన్ వాడం దగుం దండ్రి బ్ర
హ్మాండమ్ముం, గలుపంగఁ జారునకు దివ్య స్వాదమందెన్ గదా !
పండుగ దివసమునందున
రిప్లయితొలగించండివండిన పాకముల లోన ప్రముఖత నొందన్
కొండికగ మురిగొనిన కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ”
దండి పిరిమితో నీవిట
రిప్లయితొలగించండివండిన వంటలవి యెల్ల బ్రహ్మాండంబే
చండిక! ముక్కలుగను కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ.
దండై వచ్చిరి వంట సేయగను బ్రాతఃకాలమున్ కొమ్మలే
రండో బాలకులార యంచు పిలువన్ బ్రాజ్ఞా నిధుల్ వారలే
భాండమ్మందున నున్న వంట గని ద్రవ్యాలున్ ప్రవర్ధిల్లు కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా.
వండుట పరిపాటియె బ్ర
రిప్లయితొలగించండిహ్మాండమగు రుచినిడు వంట నానందముతో
వండెడు పదార్థమున కూ
ష్మాండముఁ గలుపంగఁ జారు కద్భుత రుచియౌ
పండున్ పంటలు మిక్కుటంబుగ సదా వారున్న గ్రామాన బ్ర
హ్మాండంబౌరుచి నిచ్చు వంట లవియే మాధుర్యముప్పొంగులే
వండెన్ భామిని పప్పుచారు శుచిగా పాకంబు నందొక్క కూ
ష్మాండమ్మున్ గలుపంగఁ జారునకు దివ్యస్వాదమందెన్ గదా
వండుట యందున నేరుపు
రిప్లయితొలగించండిమెండుగ జూపు వన జాక్షి మేలిమి కూర న్
వండుచు ముక్కలు గా కూ
ష్మా o డము గలుపo గ జారు క ద్భు త రుచి యవ్