26-6-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ”
(లేదా...)
“నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే”
కందంభద్రమ్మైన విదురతన్నిద్రాణమ్మైన పటిమ నిగుడగ నంతచ్ఛిద్రమ్మైన జడత్వపునిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ! శార్దూలవిక్రీడితముభద్రమ్మైన సరస్వతీ కరుణనభ్యాసించు సంకల్పమైనిద్రాణంబగు పాండితీ ప్రభలవే నీరాజనాలందగన్విద్రావింప నధైర్యమున్ గలతలన్ వీడంగ నజ్ఞానమన్నిద్రాహీనుఁడు రోగి గాఁడు! కవితానిష్యంది కల్పాగమే! !
శా. అద్రుల్ వోలిక నిల్చు భావమలతో నగ్రస్థితిన్ నిల్వగన్ హృద్రాజ్యంబుల నేలి కావ్యలలనన్ హేమంబుగా తీర్చగన్ భద్రాత్ముండగు నీశు కొల్చి గృహమున్ వాసిన్ ప్రకాశించు న న్నిద్రాహీనుడు రోగి కాదు కవితా నిష్యంది కల్పాగమే !
సద్రచనాసక్తి కలిగి ముద్రాధిక గ్రంథములను మోదము తోడన్ భద్రముగ చదువు నరుడటు నిద్రా హీనుండు, కవన నిష్ణాతుండౌ
నిద్రాణమైన జగతికియుద్రేక పరచు కవితలె యుక్తమటంచున్ నిద్రాహారాలు మానిననిద్రాహీనుండు, కవన నిష్ణాతుండౌ.నిద్రాణమ్మయినట్టి జాతిని పునర్నిర్మాణమున్ జేయగా నుద్రేకమ్మును మేలుకొల్పుటదియే యుక్తమ్ముగా నెంచుచున్ నిద్రాహారము లెల్ల మాని కవితల్ నిత్యమ్మిటన్ వ్రాసెడిన్ నిద్రాహీనుఁడు రోగి గాఁడు, కవితానిష్యంది కల్పాగమే.
కం॥ భద్రమొసఁగ మానవులకునిద్ర విడిచి యోచనలకు నెలవై హితమున్ముద్రించు రచనలఁ గనెడినిద్రా హీనుండు కవన నిష్ణాతుండౌశా॥ క్షుద్రమ్ముల్ దలపోయకుండఁగ సదా కూర్చంగ విద్వత్తుతోనిద్రాణమ్ముగ నున్న యోచనలటుల్ నిద్రన్ విసర్జించుచున్భద్రమ్మెంచుచు మానవాళికి మహిన్ వాటమ్ము సూచించెడిన్నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే!వాటము పొందికైనది అనుకూలమైనది (నిఘంటువు సహాయమండి)
భద్రముగ దాచిన ధనముక్షుద్రులు గొనిపోయెదరను గుబులున నుండన్భద్రాద్రి రాముని గొలుచునిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ
విద్రోహులఁ దునుమాడగ నుద్రేకంబొసగుఁ గావ్యముత్ప్రేరకమైభద్రాత్ముండైన సుకవినిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌవిద్రోహుల్ చెలరేగుచుండ విధిగా విద్వత్కవుల్ వ్రాయరేనిద్రాణంబగు జాతి మేల్కొనునటుల్ నిష్కర్షగాఁ బల్కుచున్నిద్రాసక్తత లేనివాడు సతమున్ నిర్జించునీలోకమున్నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే
కందం
రిప్లయితొలగించండిభద్రమ్మైన విదురతన్
నిద్రాణమ్మైన పటిమ నిగుడగ నంత
చ్ఛిద్రమ్మైన జడత్వపు
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ!
శార్దూలవిక్రీడితము
భద్రమ్మైన సరస్వతీ కరుణనభ్యాసించు సంకల్పమై
నిద్రాణంబగు పాండితీ ప్రభలవే నీరాజనాలందగన్
విద్రావింప నధైర్యమున్ గలతలన్ వీడంగ నజ్ఞానమన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు! కవితానిష్యంది కల్పాగమే! !
శా.
రిప్లయితొలగించండిఅద్రుల్ వోలిక నిల్చు భావమలతో నగ్రస్థితిన్ నిల్వగన్
హృద్రాజ్యంబుల నేలి కావ్యలలనన్ హేమంబుగా తీర్చగన్
భద్రాత్ముండగు నీశు కొల్చి గృహమున్ వాసిన్ ప్రకాశించు న
న్నిద్రాహీనుడు రోగి కాదు కవితా నిష్యంది కల్పాగమే !
సద్రచనాసక్తి కలిగి
రిప్లయితొలగించండిముద్రాధిక గ్రంథములను మోదము తోడన్
భద్రముగ చదువు నరుడటు
నిద్రా హీనుండు, కవన నిష్ణాతుండౌ
రిప్లయితొలగించండినిద్రాణమైన జగతికి
యుద్రేక పరచు కవితలె యుక్తమటంచున్
నిద్రాహారాలు మానిన
నిద్రాహీనుండు, కవన నిష్ణాతుండౌ.
నిద్రాణమ్మయినట్టి జాతిని పునర్నిర్మాణమున్ జేయగా
నుద్రేకమ్మును మేలుకొల్పుటదియే యుక్తమ్ముగా నెంచుచున్
నిద్రాహారము లెల్ల మాని కవితల్ నిత్యమ్మిటన్ వ్రాసెడిన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు, కవితానిష్యంది కల్పాగమే.
కం॥ భద్రమొసఁగ మానవులకు
రిప్లయితొలగించండినిద్ర విడిచి యోచనలకు నెలవై హితమున్
ముద్రించు రచనలఁ గనెడి
నిద్రా హీనుండు కవన నిష్ణాతుండౌ
శా॥ క్షుద్రమ్ముల్ దలపోయకుండఁగ సదా కూర్చంగ విద్వత్తుతో
నిద్రాణమ్ముగ నున్న యోచనలటుల్ నిద్రన్ విసర్జించుచున్
భద్రమ్మెంచుచు మానవాళికి మహిన్ వాటమ్ము సూచించెడిన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే!
వాటము పొందికైనది అనుకూలమైనది (నిఘంటువు సహాయమండి)
భద్రముగ దాచిన ధనము
రిప్లయితొలగించండిక్షుద్రులు గొనిపోయెదరను గుబులున నుండన్
భద్రాద్రి రాముని గొలుచు
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ
విద్రోహులఁ దునుమాడగ
రిప్లయితొలగించండినుద్రేకంబొసగుఁ గావ్యముత్ప్రేరకమై
భద్రాత్ముండైన సుకవి
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ
విద్రోహుల్ చెలరేగుచుండ విధిగా విద్వత్కవుల్ వ్రాయరే
నిద్రాణంబగు జాతి మేల్కొనునటుల్ నిష్కర్షగాఁ బల్కుచున్
నిద్రాసక్తత లేనివాడు సతమున్ నిర్జించునీలోకమున్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే