శా:యాగమ్మో,తపమో,జపమ్మునొ,యుపన్యాసమ్మునో కోరుచున్ రాగా వారికి దీర్థ మిచ్చు నొక మర్యాదన్ సదా జూపుమా పోగౌచున్ గుడి నాధిపత్యములకై పోరాడుచున్ వచ్చి యీ యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్” (చివరి పాదం లోది ఆగం.గుడికి భక్తి తో కాక పదవులకి,ఆధిపత్యాలకి చేరి ఆగాలు చేసే వాళ్లకి మద్యము ఇవ్వాలి,తీర్థం కాదు అని విసుగుతో అన్నట్టు.)
తేటగీతి
రిప్లయితొలగించండియాగమొనరింప మౌనులు నాజ్యమెంత్రు
యుగ్రవాదుల మారణహోమమెంచి
మానవత్వమన్నది పాయ, పూని దుష్ట
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు!
శార్దూలవిక్రీడితము
తొలగించండియాగంబెంచి మునీశ్వరుల్ భువిని నాజ్యంబగ్నికర్పించుచున్
సాగింపన్దగు గాదె లోకహితమున్ సాధించు సంకల్పమై
దాగన్ మారణహోమమున్ సలుపుగోదానుగ్రవాదంపు దు
ర్యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపూర్వ జన్మపు బుణ్యంబు బొసగు ననగ
రిప్లయితొలగించండిపౌరు లందరి క్షేమంబు గోరు నపుడు
తీరు లోకక ళ్యాణమై దేలు మధువు
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
కొరుప్రోలు రాధాకృష్ణ రావు
తల్లిదండ్రుల నీతము దప్పినంత
రిప్లయితొలగించండిదుష్ట సాంగత్యము బడసి దుష్టులగుచు
మంచి తలపుల గావించ మనసునుండి
త్యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
శా.
రిప్లయితొలగించండిజాగృద్దర్ప విశేష భావములెదన్ జ్వాలల్ వలెన్ రేగి యా
భోగాళిన్, సిరి, వేల్పులేమలను వే పూర్ణమ్ముగా దక్కగం
బ్రాగద్రిన్ దనుజేంద్రుఁ గోర్కెకయి దుర్వారోగ్ర హింసల్ సదా యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్ !
రిప్లయితొలగించండిసంతతమ్మితరుల వినాశమును గోరు
క్షుద్ర పూజలు నిర్వహించు జురభుండు
తాను హద్దుల దాటి యధర్మపు శవ
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు.
భోగాలెన్నియొ కోరువారలకిటన్ మోదమ్మునే కూర్చ కా
యోగుల్ స్వాములు స్వార్థ చిత్తమున నత్యుత్సా హమున్ జూపుచున్
సాగింపన్ దలబోయు దుర్మతులకున్ సంతృప్తి కై క్షుద్రమౌ
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్.
తోటయింటను బ్రతుకు సంతోషమిడగ
రిప్లయితొలగించండిభోగ మలరగ మత్తున మునిగి తేలి
నిలిచి యెన్నిక లందున గెలుపు కోరి
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
సాగింపన్ వలె మత్తులోన బ్రతుకుల్ సంతృప్తి చేకూరగా
భోగాలందునఁ దేలియాడు ప్రముఖుల్ మోసాల ముంచెత్తుచున్
వాగాడంబరులై సదా పదవులే వాంఛించుచున్ గెల్పుకై
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్
భక్తి శ్రద్ధ ల తోడుత పరమ శివుని
రిప్లయితొలగించండిధ్యాన మందున మునుగ రే జ్ఞాను లగుచు
యాగ మొనరించు వారు :: మద్యమును గొంద్రు
దురిత ములు సేయ బూనెడు దుష్ట జనులు
విశ్వకళ్యాణ మొనగూర్చ వేదవిదులు
రిప్లయితొలగించండిజన్నముల సల్పుచుందురు సాజముగను
సోమపానము జేయుట నీమమౌట
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
యాగంబుల్ జనపాళి శ్రేయమును సౌహార్దమ్ముగా గూర్చగన్
రిప్లయితొలగించండియోగుల్ భక్తిగ నాచరించెదరు సంయోజించుచున్ మంత్రముల్
రాగద్వేషములన్ వహించి జనకల్యాణమ్ము లక్షింపకన్
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్
తే.గీ:యాగ మొనరించుచు బ్రసాద మందుకొంద్రు
రిప్లయితొలగించండివైదికాలయముల లోన భక్తి పరులు
గ్రామదేవతా ప్రీతికి,కల్లు వోసి
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు”
సమస్య:
రిప్లయితొలగించండి“యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
శార్దూలము:
సేగింబే మనకంచు దైత్యులు మదిన్ సేమంబుకై యొప్పిరే
నాగంబున్ గిరిజుట్టి జిల్కగను నాణ్యంబౌ సుధా భాగమున్
లాగం వాలము బట్టి చిల్కగను, దా లాభంబనే వారలే.
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
త్యాగంబున్ వలదంచు శ్రీహరియు దా దాల్చేను స్త్రీ రూపమే
శా:యాగమ్మో,తపమో,జపమ్మునొ,యుపన్యాసమ్మునో కోరుచున్
రిప్లయితొలగించండిరాగా వారికి దీర్థ మిచ్చు నొక మర్యాదన్ సదా జూపుమా
పోగౌచున్ గుడి నాధిపత్యములకై పోరాడుచున్ వచ్చి యీ
యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
(చివరి పాదం లోది ఆగం.గుడికి భక్తి తో కాక పదవులకి,ఆధిపత్యాలకి చేరి ఆగాలు చేసే వాళ్లకి మద్యము ఇవ్వాలి,తీర్థం కాదు అని విసుగుతో అన్నట్టు.)
నీతు లెల్ల వక్కాణింత్రు చేత లందు
రిప్లయితొలగించండివానిఁ బాటింప నొల్లరు పరుల కంచుఁ
గలియుగమ్మున గూఢమ్ముగ నిశ లందు
యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు
పోఁగొట్టన్ దురితౌఘ మెల్ల నదియే పో మం దగుం దిప్ప నా
తీగం జక్క మథింప సోమరసమే దేవౌఘ పానం బహో
రాగం బొప్ప జనింప మద్య మనియున్ బ్రహ్మల్ వచింతుర్గదా
యాగంబుం బొనరించు వారలకు మద్యం బిచ్చుటే యొప్పగున్
[ఆగము = పాపము]
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిసమస్య:
రిప్లయితొలగించండియాగంబున్నొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
శార్దూలము:
ఆగంబేనట నీలపాటలను, నా యానంద పేకాటలన్
రాగంబుల్ వినగాను తోచె, భళిరా ! రాజ్యంబులే గెల్చిరా !
వీగంగా సరి యాటలేక గనుమా వీడంగనౌ యాటలే
యాగంబున్నొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”
జనుల బలహీనతలు గాని జగతి యందు
రిప్లయితొలగించండికాసులకొరకాసపడుచుకల్లలాడి
వారలనుమోసగించుచు వడిగ క్షుద్ర
*"యాగ మొనరించు వారు మద్యమును గొంద్రు”*
భోగమ్ముల్ సతతమ్మకోరుచుమదిన్ మోమోటమున్చెందకన్
రాగంబున్ కనపర్చుచున్ పరులతోలాభంబునొందంగనా
భోగాసక్తులుచేయనెంచుచెపుడున్ పొచ్చెమ్ము లేచేయుచున్
*“యాగంబుం బొనరించు వారలకు మద్యంబిచ్చుటే యొప్పగున్”*