8-6-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్”
(లేదా...)
“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కందంనాటకమే జీవితమనినేటికి గలవాడననుచు నిక్కక దయ సాపాటునిడు చుండి, రాగన్పూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్ఉత్పలమాలనాటకమట్లుగన్ జరుగు నమ్మిన నమ్మక పోయినన్ భువిన్నేటికి గల్గ రేపటికి నీరగు సంపదలంచు జాలి సాపాటును బాటసారులకు పంచగ నిత్యమహో! గతమ్మునన్పూటకు దిక్కు లేదు మఱి, భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!
కం॥ ఆటగఁ దిరిపము నెత్తుచు పూటకు గతిలేదటంచుఁ బొందిన బిరుదున్ జేటునుఁ బాపు శివుఁడె కదపూటకు గతిలేనివాఁడె ప్రోచును జనులన్ఉ॥ ఆటగ బిక్షమెత్తినను హార్దము భక్తిని నిల్పి మ్రొక్కుమాచేటును బాపు శంకరుఁడు శ్రేయముఁ గూర్చుచు వేడినంతనేకోటలు దాటు ప్రేమనిడుఁ గోరిన వారికిఁ గల్పవృక్షమౌపూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్
జూటమున శశిని దాల్చుచుకాటిని తిరుగాడు వాడు కల్మష గళుడేపాటలపతియైన శివుడుపూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్.జూటము నందు చందురుడు శూలము చేతిన గల్గి నిత్యమున్ కాటిని సంచరించు ధరకార్ముకుడాతడె చర్మముండ యాపాటల యన్నపూర్ణ సగభాగము గాగల యాది భిక్షుకున్ పూటకు దిక్కు లేదు,ౄ మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్.
వాటముఁ జూడ బిక్షువగు, వహ్ని లలాటమునుండె, బూషలౌకాటులు వేయు పాములన, కప్పెర హస్తముఁబట్టి భిక్షకైపేటలు సంచరించుచును వేడిన వారిని కాచు శూలికిన్పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
ఆటల యందున గెలిచెనుపూటకు గతి లేనివాఁడె ; ప్రోచును జనులన్పాటవమును మెచ్చుకొనుచుసాటి యెవరు లేరని యిడు సంపద తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
కాటిని తిరుగాడు జటాజూటుడు నిరతముఁ గనుటకు చోద్యమనంగన్జీటికి మాటికి వరమిడిపూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్కాటిని సంచరించునట కల్మష కంఠుడు నిత్యమున్ జటాజూటుడు భస్మ ధారియగు సూక్ష్ముడు చూడఁ ద్రిశూలపాణియైచాటగ వచ్చుగాదె మరి జాబిలితాల్పుని నాదిభిక్షుగాపూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
ఆటల నాడెడు బాలురు చేటును గలిగించు పనులు జేయుచు నుండన్ దీటుగ స్పందించి యపుడు పూటకు గతి లేని వాడె ప్రోచును జనులన్
కం:మాటాడెను దైవజ్ఞుడుపూట గడువ టీల నమ్ము బుడుతని గని "యమ్మా! టీ బాలుడె ప్రభువగుపూటకు గతి లేని వాడె ప్రోచును జగమున్(చాయ్ వాలా భవిష్యత్తు లో దేశాన్ని పరిపాలిస్తా డని జ్యోతిష్యుడు అన్నట్టు.)
ఉ:పూటకు తిండి లేకయు ప్రభుత్వము దిట్టుచు సామ్యవాది యైమాటలు బల్కు నొక్క డభిమానము తో నిలువంగ నెన్నికన్ తోటి జనమ్ము మెచ్చకయు తోచియు తోచక బల్కి రిట్టులన్"పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
కూటము రుద్రావాసముమేటి తిరిపెగాడతండు మేదినియందున్చేటును తాఁ దొలగించునుపూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్
కూటము వల్లకాడు తను కోరడు భోగము భాగ్యమెన్నడున్మేటియతండు భక్తులకు మేలగు నభ్యుదయమ్ము గూర్చుటన్కూటికి నన్నపూర్ణకడ క్షుత్తును దీర్చఁగనేగు శర్వుకున్పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్
మేటి ధనవంతుఁ డాతఁడు సాటి కుబేరునకు నెన్నఁ జక్కఁగ నెత్తెం గోటికిఁ బడగ లనఁగఁ దాఁబూటకు గతి లేని వాఁడె! ప్రోచును జనులన్ కోటలఁ గాంచఁ డుండుటకుఁ గుంజర చర్మము కట్టు గుడ్డ యౌఁ గాటిఁ జరించు చుండుఁ దమిఁ గంఠము నందు వెలుంగుఁ బుఱ్ఱెలే కూటికి బిచ్చ మెత్త వలెఁ గొంకక నిత్తెము నాదిబిక్షువే పూటకు దిక్కు లేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్
కోటలు లేకున్నను తాదీటుగ చేయుచు పనులను తీరుగ నెపుడున్మాటలు మంచిగ నాడుచుపూటకు గతిలేని వాడు ప్రోచును జనులన్జూటము నందుగంగనిడి శూలియు చేతను దాల్చికప్పెరన్వాటికలేకతిర్గుసతివామపు భాగమునందుయొప్పగన్మాటలతోనుతింపగనుమానసమందునమెచ్చుశూలికిన్*“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”*
సమస్య: "పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”ఉత్పలమాల (లు) :1 చేటును గల్గగా సరియు శ్రేయము గూర్చగ వచ్చు శీఘ్రమే రోటను గట్ట నందసతి రోదన చేయుచు యక్ష మోక్షమున్ పూటకు తింటివా యనెడు పుణ్యము తల్లికి దక్క నిచ్చెనే నాటక సూత్రధారి మరి న్యాయము తిన్నది పాలువెన్నయే పూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్2 పూటకుపూటకున్ లయము పూరణ యంచును కాశి వీధులన్ నాటక జన్మ దీర్చ మరి నాయకుడీతడు మోక్ష మీయగన్ చాటుగ పూర్ణ చేరి కయి జాచును నా యమ పాత్ర నింపగా పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.నీటుగ బూడిద నలదుచుకాటిని రేయింబవళ్లు కాయుచునుండున్కూటికి తిరిపంబెత్తుచుపూటకు గతిలేనివాడె ప్రోచును జనులన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికందం
తొలగించండినాటకమే జీవితమని
నేటికి గలవాడననుచు నిక్కక దయ సా
పాటునిడు చుండి, రాగన్
పూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్
ఉత్పలమాల
నాటకమట్లుగన్ జరుగు నమ్మిన నమ్మక పోయినన్ భువిన్
నేటికి గల్గ రేపటికి నీరగు సంపదలంచు జాలి సా
పాటును బాటసారులకు పంచగ నిత్యమహో! గతమ్మునన్
పూటకు దిక్కు లేదు మఱి, భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!
కం॥ ఆటగఁ దిరిపము నెత్తుచు
రిప్లయితొలగించండిపూటకు గతిలేదటంచుఁ బొందిన బిరుదున్
జేటునుఁ బాపు శివుఁడె కద
పూటకు గతిలేనివాఁడె ప్రోచును జనులన్
ఉ॥ ఆటగ బిక్షమెత్తినను హార్దము భక్తిని నిల్పి మ్రొక్కుమా
చేటును బాపు శంకరుఁడు శ్రేయముఁ గూర్చుచు వేడినంతనే
కోటలు దాటు ప్రేమనిడుఁ గోరిన వారికిఁ గల్పవృక్షమౌ
పూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్
రిప్లయితొలగించండిజూటమున శశిని దాల్చుచు
కాటిని తిరుగాడు వాడు కల్మష గళుడే
పాటలపతియైన శివుడు
పూటకు గతి లేనివాఁడె, ప్రోచును జనులన్.
జూటము నందు చందురుడు శూలము చేతిన గల్గి నిత్యమున్
కాటిని సంచరించు ధరకార్ముకుడాతడె చర్మముండ యా
పాటల యన్నపూర్ణ సగభాగము గాగల యాది భిక్షుకున్
పూటకు దిక్కు లేదు,ౄ మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్.
వాటముఁ జూడ బిక్షువగు, వహ్ని లలాటమునుండె, బూషలౌ
రిప్లయితొలగించండికాటులు వేయు పాములన, కప్పెర హస్తముఁబట్టి భిక్షకై
పేటలు సంచరించుచును వేడిన వారిని కాచు శూలికిన్
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఆటల యందున గెలిచెను
రిప్లయితొలగించండిపూటకు గతి లేనివాఁడె ; ప్రోచును జనులన్
పాటవమును మెచ్చుకొనుచు
సాటి యెవరు లేరని యిడు సంపద తోడన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికాటిని తిరుగాడు జటా
రిప్లయితొలగించండిజూటుడు నిరతముఁ గనుటకు చోద్యమనంగన్
జీటికి మాటికి వరమిడి
పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్
కాటిని సంచరించునట కల్మష కంఠుడు నిత్యమున్ జటా
జూటుడు భస్మ ధారియగు సూక్ష్ముడు చూడఁ ద్రిశూలపాణియై
చాటగ వచ్చుగాదె మరి జాబిలితాల్పుని నాదిభిక్షుగా
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిఆటల నాడెడు బాలురు
రిప్లయితొలగించండిచేటును గలిగించు పనులు జేయుచు నుండన్
దీటుగ స్పందించి యపుడు
పూటకు గతి లేని వాడె ప్రోచును జనులన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:మాటాడెను దైవజ్ఞుడు
రిప్లయితొలగించండిపూట గడువ టీల నమ్ము బుడుతని గని "య
మ్మా! టీ బాలుడె ప్రభువగు
పూటకు గతి లేని వాడె ప్రోచును జగమున్
(చాయ్ వాలా భవిష్యత్తు లో దేశాన్ని పరిపాలిస్తా డని జ్యోతిష్యుడు అన్నట్టు.)
ఉ:పూటకు తిండి లేకయు ప్రభుత్వము దిట్టుచు సామ్యవాది యై
రిప్లయితొలగించండిమాటలు బల్కు నొక్క డభిమానము తో నిలువంగ నెన్నికన్
తోటి జనమ్ము మెచ్చకయు తోచియు తోచక బల్కి రిట్టులన్
"పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
కూటము రుద్రావాసము
రిప్లయితొలగించండిమేటి తిరిపెగాడతండు మేదినియందున్
చేటును తాఁ దొలగించును
పూటకు గతి లేనివాఁడె ప్రోచును జనులన్
కూటము వల్లకాడు తను కోరడు భోగము భాగ్యమెన్నడున్
రిప్లయితొలగించండిమేటియతండు భక్తులకు మేలగు నభ్యుదయమ్ము గూర్చుటన్
కూటికి నన్నపూర్ణకడ క్షుత్తును దీర్చఁగనేగు శర్వుకున్
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్
మేటి ధనవంతుఁ డాతఁడు
రిప్లయితొలగించండిసాటి కుబేరునకు నెన్నఁ జక్కఁగ నెత్తెం
గోటికిఁ బడగ లనఁగఁ దాఁ
బూటకు గతి లేని వాఁడె! ప్రోచును జనులన్
కోటలఁ గాంచఁ డుండుటకుఁ గుంజర చర్మము కట్టు గుడ్డ యౌఁ
గాటిఁ జరించు చుండుఁ దమిఁ గంఠము నందు వెలుంగుఁ బుఱ్ఱెలే
కూటికి బిచ్చ మెత్త వలెఁ గొంకక నిత్తెము నాదిబిక్షువే
పూటకు దిక్కు లేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్
కోటలు లేకున్నను తా
రిప్లయితొలగించండిదీటుగ చేయుచు పనులను తీరుగ నెపుడున్
మాటలు మంచిగ నాడుచు
పూటకు గతిలేని వాడు ప్రోచును జనులన్
జూటము నందుగంగనిడి శూలియు చేతను దాల్చికప్పెరన్
వాటికలేకతిర్గుసతివామపు భాగమునందుయొప్పగన్
మాటలతోనుతింపగనుమానసమందునమెచ్చుశూలికిన్
*“పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”*
సమస్య:
రిప్లయితొలగించండి"పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
ఉత్పలమాల (లు) :
1 చేటును గల్గగా సరియు శ్రేయము గూర్చగ వచ్చు శీఘ్రమే
రోటను గట్ట నందసతి రోదన చేయుచు యక్ష మోక్షమున్
పూటకు తింటివా యనెడు పుణ్యము తల్లికి దక్క నిచ్చెనే
నాటక సూత్రధారి మరి న్యాయము తిన్నది పాలువెన్నయే
పూటకు దిక్కులేదు మఱి భూజను లెల్లరఁ బ్రోచు నెప్పుడున్
2 పూటకుపూటకున్ లయము పూరణ యంచును కాశి వీధులన్
నాటక జన్మ దీర్చ మరి నాయకుడీతడు మోక్ష మీయగన్
చాటుగ పూర్ణ చేరి కయి జాచును నా యమ పాత్ర నింపగా
పూటకు దిక్కు లేదు మఱి భూజనులెల్లరఁ బ్రోచునెప్పుడున్”
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
నీటుగ బూడిద నలదుచు
కాటిని రేయింబవళ్లు కాయుచునుండున్
కూటికి తిరిపంబెత్తుచు
పూటకు గతిలేనివాడె ప్రోచును జనులన్.