6, జూన్ 2025, శుక్రవారం

సమస్య - 5144

7-6-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము”

(లేదా...)

“లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్”

(నిజానికి ర-ల యతి నాకు ఇష్టం లేనిది. కాని ఇప్పుడందరూ యథేచ్ఛగా వాడుతున్నారు)

16 కామెంట్‌లు:

  1. మాస్కును ధరించుట జనులు మరచియుండ
    లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము
    మరల యనుచు బిలచు చున్న మంకుపయిన
    దయనుజూపక దండించు తరుణమిదియె

    రిప్లయితొలగించండి
  2. తేటగీతి
    ఉగ్రవాదంపు శిబిరాలకూతమగుచు
    మాటిమాటికి ప్రజలను కాటువేయు
    కోలుకొనలేని రీతిగ గూల్చి వారి
    లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము!


    ఉత్పలమాల
    ఆకరమౌచు నుగ్రులకు హానికరమ్ముగ భారతానికిన్
    బాకు విజృంభనమ్మది యపాయము గూర్చునుమానుకోదనన్
    నూకలు చెల్ల ధూర్తులట నుగ్గొనరన్ శిబిరాలు దూరుచున్!
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్!

    రిప్లయితొలగించండి
  3. భక్తి పరిశుభ్రతలతోడ బంధమమరె
    హరిహరీయని కార్యాలయమును చేర
    రాక యింటినుండి పని సౌలభ్యమమరె
    లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము

    శోకము తప్పునంచు పరి శుభ్రత నేర్చిరి పౌరులెల్లరున్
    నూకలు చెల్లురో యనుచు నోములు నోచిరి గాదె, యిల్లగున్
    నాకమటంచు తెల్పెగద నాణ్యత తోపని యింటి నుండియే
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్

    రిప్లయితొలగించండి
  4. మాకులు మందులన్నియును మాకడ నుండెను సాగనంపగన్
    తేకువ గల్గువారలము ధీబల భారత ధీర జాతికిన్
    జీకును చింత లేదు, చితి సిద్ధము జేసితి చీని జబ్బుకున్
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్!!

    రిప్లయితొలగించండి

  5. పాప భీతిని విడనాడి వసుధ నరుడు
    స్వార్థమందున చరియించు వానిలోన
    మానవత నింపితివినాడు మహిని, తిరిగి
    లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము.


    ప్రాకటమౌచు మానవుల ప్రాణములన్ హరియించు వేళలో
    శోకము స్వార్థ చిత్తుడట చోద్యమదేమొ పరోప కారియై
    యాకలి దీర్చుచున్ తగుసహాయము సేసెనె ప్రేమ నింపుచున్
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్.

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. తే॥ సోకుచు బలహీనముగను జూడఁ గాను
      జనుల వ్యాధి నిరోధక శక్తి పెరుఁగు
      నటుల వర్తిలుచు చనెడి పటిమ వడసి
      లోక హితమునుఁ గూర్చఁ గరోన రమ్ము

      ఉ॥ లోక హితంబొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్
      బ్రాకుచు మెల్ల మెల్లగను వ్యాధి నిరోధక శక్తి హెచ్చఁగన్
      సోకుచు మానవాళికినిఁ జూడనటుల్ బలహీన రీతిగన్
      భీకర రూపుఁ దాల్చకను భీతినిఁ గొల్పని స్థాయినెంచుచున్

      ఈవిధంగా వ్యాధి నిరోధక శక్తి హెచ్చగలదండి. వాక్సిన్ చేసే పని నీవే చేయుమని అంతర్భావ మండి.

      తొలగించండి
  7. ఉగ్ర వాదులు చెలరేగి రుర్వి యందు
    వారి నరికట్ట యోగ్యమై పరిఢ విల్లి
    విశ్వ రూపము జూపించి ప్రీతి తోడ
    లోక హితమును గూర్చ కరో న రమ్ము

    రిప్లయితొలగించండి
  8. నిన్న నేర్చిన పాఠముల్ నేడుమరచి
    విచ్చలుగ మెల్గ తగునొకో వెరపులేక
    ప్రజలలో యుదాసీనత బాపుటకును
    లోకహితమునుఁ గూర్చఁ గరోన రమ్ము

    రిప్లయితొలగించండి
  9. భీకరమై జనావళిని భీషణ దుఃఖ దవానలంబునన్
    వీఁకను ద్రోసివైచి పరివేదన గూర్చినయా కరోననున్
    పీకనునొక్కి పాతరనువెట్టియు నేడిటులేల బల్కెదో
    "లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్"?

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:భారతాదు లున్నవి ధర్మ భాషణముల
    లోకహితమునుఁ గూర్చగరో!నరమ్ము
    లందె యుద్రేకమును నింపు నట్టి బూతు
    కథల జదివిన నీ కెట్లు గలుగు బుద్ధి?
    (లోకహితమును గూర్చగ రో!=లోకహితాన్ని కూర్చటానికి రా!అని సంబోధన.)

    రిప్లయితొలగించండి
  11. ఉ:శోకము నింపుచున్ మతము జూచుచు హత్యలు జేయునట్టి యా
    మూకల జీల్చి వేసి ,జగమున్ దగ రక్షణ జేయు వారికే
    ప్రాకటమౌ కిరీట మది ప్రాప్తము గాగ సతమ్ము గోరుచున్
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్”
    (కరోన అంటే కిరీటం అని అర్థం. లోక హితము చేసేవారికి దక్కాలని కిరీటాన్ని స్వాగతిస్తున్నాను.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:లోకమునందు చెప్పులకు లోటొక టుండదు కాని మెత్తనై,
    చౌకగ నుండి రోగులకు చక్కని సౌఖ్యము నిచ్చు దృష్టితో
    నాకొక యూహ తట్టినది నాదు ప్రణాళిక నాచరించుచున్
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్”
    (కరోనా అనేది ఒక చెప్పుల కంపెనీ. ఈయన మెడికల్ యుటిలిటీ తో చెప్పుల తయారీ కి ఒక మోడల్ తయారు చేసాడు.దాన్ని అమలు చెయ్యమని కరోనా కంపెనీ ని కోరుతున్నాడు.)

    రిప్లయితొలగించండి
  13. వెక్కసముగ హింసించితివి చెలఁగి మును
    పక్కట కరమ్ము టక్కరి వై జనులను
    మించి వర్తింప నేల శాంతించు మెంచి
    లోక హితమునుఁ గూర్పఁ గరోన రమ్ము


    ప్రాకెను దేశ దేశములఁ గ్రన్ననఁ గ్రూరత వింత వింతగా
    రూకల కై నిరంతరము లోకులు ఘాతుకు లైరి నిర్దయన్
    వీఁకను భూమి భారమును వెన్నుఁడు దీర్ప జనించి నట్టులన్
    లోక హితం బొనర్పఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్

    ఉత్పలమాల:

    సోకు కరోన వ్యాధియని, శోధన సేసిరి శ్రేయ మింటనే
    లోకుల పాపమే పెరిగె, లోపములెంచియు సాటివారినిన్
    బాకుల మాటలే విసిరి, బాధలు పెట్టగ మంచివారినే
    లోకహితం బొనర్చఁగఁ గరోనను రమ్మని స్వాగతించెదన్.

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మనుజు లారోగ్య సూత్రాలు మానకుండ
    నాచరించగ జేయుచు నడలకుండ
    నప్రమత్తత కలిగించి యనవరతము
    లోక హితమునుఁ గూర్చఁ గరోన! రమ్ము.

    రిప్లయితొలగించండి