9, జూన్ 2025, సోమవారం

సమస్య - 5147

10-6-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మనము మార్దవ మాతని పనియొ హింస”

(లేదా...)

“మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ”

18 కామెంట్‌లు:

  1. పలలమమ్ముచు బ్రతికెడు వాడతండు
    మంచితనమునకాతఁడు మారుపేరు
    వృత్తి ధర్మమ్మెపుఁడు నెరవేర్చుఁ గాని
    మనము మార్దవ మాతని పనియొ హింస

    రిప్లయితొలగించండి
  2. మాంస విక్రయ మొనరించు మనుజు డొకడు
    మంచి తనమున మించిన మాన్యు డయ్యు
    వృత్తి ధర్మము చేత ను విధి యు లేక
    మనము మార్దవ మాతని పనియె హింస

    రిప్లయితొలగించండి
  3. తలచినది చెప్పు చుండెడి తరుణమందు 
    చేతులన్యవి ధంబుగ చేయు‌చుండ
    మనము మార్దవ మాతని పనియొ హింస
    ప్రభువులటుల జేయగ నది పాటికాదు 

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    హరి దశావతారమ్ముల తరచి చూడ
    శిష్టజన వత్సలత్వము శిరముఁదాల్చి
    దుష్టజన భంజనమ్మున దుముకు! వెరసి
    మనము మార్దవ మాతని పనియె హింస!

    చంపకమాల
    కనగ దశావతారముల కారణమెంచియు పద్మనాభునిన్
    దన శరణమ్ము గోరిన విధమ్మున శిష్టుల రక్షఁ జేయఁగన్
    దునుమును దుష్టులన్ జెలఁగి తోయజ నేత్రుఁడు సూడ మొత్తమున్
    మనము శిరీషమార్దవము! మారణహోమమె నిత్యకృత్యమౌ!!

    రిప్లయితొలగించండి
  5. ఘనముగ జన్మనెత్తెనట కంజదళాయితపత్రనేత్రుడే
    చనుమిక చంపిరండనెడు శాసకునాజ్ఞకు బద్ధులై చనన్
    కనుగొని గోపబాలుఁడిఁక కర్బర మూకను మట్టుబెట్ట, ౘా
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ.

    రిప్లయితొలగించండి

  6. కోరి మాంసమ్ము భుజియించు వారి కిటను
    పలము నమ్ముచు జీవించు వర్తకుండు
    కాన త్రుంచు మృగమ్ముల గాని వాని
    మనము మార్దవ , మాతని పనియొ హింస.



    మనుగడ కోసమై విపణి మాంసమభీష్టమటంచు కోరెడిన్
    జనులకు కౌచు నమ్మెడి కసాయిల మైతిమి కాంచ మాకు జీ
    వనమది కాన జంతువుల ప్రాణము తీయక తప్పదయ్యె మా
    మనము శిరీషమార్దవము, మారణహోమమె నిత్యకృత్యమౌ.

    రిప్లయితొలగించండి
  7. మనుజుడొకండు వాడు ప్రియ మంజుల భావ విశేష పూర్ణుడై
    యనఘ ధురీణ సత్యవచనాలయ భూతదయా గురుండునై
    మనుగడకై తలారిగను మస్తక ఖండన కార్య కర్తగన్
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ!!

    రిప్లయితొలగించండి

  8. తే॥ కనఁబడు పగిది నెమ్మది కనుఁగొనఁ గను
    ద్రచ్చి యతి క్రూరులు నటుల తనరు జనుల
    నరసి నాషాఢభూతుల వరలఁ దెలుపు
    ”మనము మార్దవ మాతని పనియె హింస”

    చం॥ కనబఁడు రీతి కోమలము కాంచఁగ లోతుగ దుష్టబుద్ధియే!
    తనరఁగ కొందరీ పగిది తారక మంత్ర మటంచుఁ గూర్చిరే
    వినదగు మేటి సామెతను విజ్ఞతఁ బాయక నుండ నిట్టులన్
    మనమున శిరీష మార్దవము మారణహోమమె నిత్య కృత్యమౌ

    పంచతంత్రములోని మిత్రభేదములో కరటకుని ద్వార విష్ణుశర్మ (పరవస్తు చిన్నయసూరి) అప్పుడే హెచ్చరించినారండి.

    రిప్లయితొలగించండి
  9. సతము మారణ హోమము సల్పు వాడు
    లక్షణమ్ములు కనుగొన రాక్షసుండు
    కఠిన హృదయమ్ము గలవాడు కాంచముపశ
    మనము మార్దవ మాతని పనియొ హింస

    ఘనమగు దేహధారణము కల్గిన వాడిని పూర్వజన్మలో
    వినయము నాదు లక్షణము వీరుడి నైవెలుగొందువాడ నా
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ
    నని ముని శాపమీయగ వినాశము కల్గెను జీవనంబునన్

    రిప్లయితొలగించండి
  10. ఘనమగు భక్తి తత్పరత గల్గిన వేఁటరి వానివృత్తిలో
    ధనసముపార్జనార్థమయి తాను వధించును మూగజీవులన్
    కనగనతండు సాత్వికుఁడు, కల్లలెరుంగని సౌమనస్వికిన్
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:చిత్రరంగము నందు బ్రసిద్ధు డైన,
    రమ్య భాషణు డైనట్టి రాజనాల
    మనము మార్దవ, మాతని పనియొ హింస
    జేసి,చేయించుటయె యన్ని చిత్రకథల.
    (రాజనాల మంచివాడే కానీ సినిమా కథలలో అతని పని అంతా హింసే. )

    రిప్లయితొలగించండి
  12. (2)చం:మన మురళీధరుండు కడు మంచిగ నుండును,వాని నన్యులే
    మన ముఖ మందు చిర్నగవె యంతము కా దది యేమి చిత్రమో
    మనము శిరీషమార్దవము, మారణహోమమె నిత్యకృత్యమౌ
    తన వగు నేర శోధకకథాచయమందు భయమ్ము గొల్పగన్.
    (నేరశోధకకథలు=డిటెక్టివ్ కథలు.రచయిత మంచి వాడే కానీ అతని డిటెక్టివ్ నవలల్లో మారణహోమం నిత్యకృత్యం.)

    రిప్లయితొలగించండి
  13. రావణుండు లంకాపతి రాక్ష సాధి
    పుండు సంతత కామ లోలుండు వాఁడు
    లోభి క్రూర కర్ముఁడు వాని లోనఁ గనము
    మనము మార్దవ మాతని పనియొ హింస


    జను లొనరించు నట్టి యఘ సంచయ మెన్ని శమింపఁజేయఁగాఁ
    దనరును దక్క కోపమును దాల్పఁడు సుంతయు నేరి పైననున్
    వనజ హితాత్మ జాత సమవర్తికి దక్షిణ దిక్కు నేతకున్
    మనము శిరీషమార్దవము మారణ హోమమె నిత్య కృత్యమౌ

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ

    చంపకమాల:

    కనగను రావణాసురుడు కామితమిచ్చెడు నీశు భక్తుడే
    వినడుగ కైకసీ సుతుడు వీరుడు దానని విర్రవీగుచున్
    నెనరున వావిలేక స్నుషనే చెరబట్టగ శాపమందినన్
    మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ

    రిప్లయితొలగించండి

  15. హాని‌ తలపెట్టడెవరికీ‌ హాయిపంచు‌
    చివరకతగాడు‌‌ సైన్యాన చేరినాడు‌
    వేల‌ శత్రువులనుచంపి‌ వీరుడయ్యె‌
    మనము‌ మార్దవ‌ మాతని పనియె‌ హింస



    చేయ‌ పనులులేవునడుప‌ జీవనంబు‌
    కుదిరె‌ మాంసవిక్రయశాల‌ కొలువు‌తనకు‌
    సాత్వి‌కుడతగాడుతనది‌ జాలిగుండె
    తప్ప‌ దతనికి‌ వేరొక‌ దారి‌ లేదు
    మనము‌ మార్దవ మాతని‌ పనియె‌ హింస

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    జంతువుల కోసి వాటి మాంసమ్ము నమ్ము
    వాడు, తల్లిదండ్రులకు సేవ యొనరించు
    ధర్మ వ్యాధుని చరితము ధన్యతమము
    మనము మార్దవ మాతని పనియె హింస.

    రిప్లయితొలగించండి
  17. మంచి పనులు సతము చేయు మాన్యుడతడు
    పెద్ద లందున చూపును పేర్మి నెపుడు
    మాంస మమ్మును వృత్తికై మహిని తాను
    మనము మార్దవ మాతని పనియె హింస.



    వినుమివిసత్యవాక్యములు విశ్వము నందున పుట్టు చుండుతా
    ననయముభక్తవృందములనాదరమొప్పగకాచుచున్సదా
    దునుముచుదుష్టులన్ భువిని తోయజ నాభుడు చూడ సర్వమున్
    *"మనము శిరీషమార్దవము మారణహోమమె నిత్యకృత్యమౌ”*

    రిప్లయితొలగించండి