30, జూన్ 2025, సోమవారం

సమస్య - 5169

1-7-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే”

(లేదా...)

“స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా”

28 కామెంట్‌లు:

  1. క్షితిపతి దుష్టుడయినచో
    నతనిని మెచ్చుకొ నుచుండి యభిమతి నొందన్
    చతురత జూపించగలుగు 
    స్తుతమతులు కవులు ;  వచింత్రు దోషమ్ములనే

    రిప్లయితొలగించండి
  2. కందం
    అతి ప్రోత్సాహకరమ్ముగ
    యతిఛందోప్రాసలొప్ప ననుకూలముగన్
    వెతవిడ శిష్యులు మృదువుగ
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే

    చంపకమాల
    యతిగతి ప్రాస ఛందముల నద్భుతరీతిని కందిశంకరుల్
    మతిగొన శిష్యకోటి కతిమన్నన దోషనివారణమ్ములన్
    సతతము నోర్మితోఁ దెలిపి సద్యశమందిరి! సున్నితంబుగన్
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సూచిత సవరణతో కందం:

      కందం
      అతి ప్రోత్సాహకరమ్ముగ
      యతియు గణప్రాసలొప్ప ననుకూలముగన్
      వెతవిడ శిష్యులు మృదువుగ
      స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే

      తొలగించండి
  3. చ.
    అతులిత మాధురీ మహిమ నందగఁ గోరితివీవు మిత్రమా
    ప్రతినగ నీదు సౌమ్యముగ భాసిలు బద్యమునందుఁ జిందు కా
    వ్యతలను జిక్కులై విడని వ్యాకరణమ్మున సంశయమ్ములన్
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా !

    రిప్లయితొలగించండి
  4. అతికుతుకమ్ముతో ప్రశితులందరు వ్రాసిన పద్యపూరణల్
    యతులను బ్రాసలన్ మరియు వ్యాకరణమ్ముల సంస్కరించగన్
    ప్రతి దివసమ్ము శిష్యులను ప్రాగహరమ్ముగ దీర్చిదిద్దునా
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా

    రిప్లయితొలగించండి
  5. లు కవులు వచింత్రు దోషమ్ములనే

    చం॥ సతతము భూతకాలమున సౌఖ్యముఁ గాంచుచునుండి నేఁడిటుల్
    పతనముఁ జెందె సంస్కృతియు పాలసులైరి జనాళి యంచు వి
    స్తృతముగ వ్రాయు వారిమదిఁ జేరున శాస్త్రపు వృద్ధియే యహో
    స్తుతమతులైన సత్కవులు, దోషములన్ వచియింత్రు సర్వదా

    పాలసుడు దుర్జనుడు

    చంపకమాలలో అహో నుండి స్తుతమతులైన సత్కవులు వరకు వ్యంగ్యమండి. కొంతమంది వాదన ఇది. శాస్త్ర సౌలభ్యాలు వాడుకుంటూనే శాస్త్రాన్ని నిందిస్తారు. అలాగే గతమును పొగడుతూ ప్రస్తుతాన్ని అవహేళన చేస్తారు.

    రిప్లయితొలగించండి

  6. మతి లేని వారు నీదు క
    వితలను సవరింపలేరు విబుధుండా! సం
    స్కృతుల కలువగవలయు నా
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే.


    మతిచెడి మాటలాడకు సుమా! పొరపాటు లవెన్నొ యున్న నీ
    కృతి సవరింపగా వలయు, కీర్తిగడించిన కోవిదుండ్రు నీ
    వృతమున నున్నవారికి కవిత్వము జూపిన మేలు వారలా
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా.

    రిప్లయితొలగించండి
  7. క్షితిపతి దుష్టుడయ్యెనని క్షేమముగోరుచు దాని కోసమై
    యతనిని మెచ్చురీతిగనె నాశువు గావ్యములెన్ని యోనిడన్
    చతురత జూపగల్గుదురు చాలవిధంబుల నేర్పు తోడుగా
    స్తుతమతులైన సత్కవులు  ; దోషములన్ వచియింత్రు సర్వదా

    రిప్లయితొలగించండి
  8. అతులిత మైన కవిత్వము
    సతతము నందించు వారు సత్కవులుగదా
    కృతుల సమీక్షకు లగుదురు
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే

    అతులిత మైనకావ్యముల నందగ జేతురు పండితోత్తముల్
    జతనపు శబ్ద పాటవము సాటి బుధానుల పుస్తకంబులన్
    సతతము వీక్షసేయుదురు సల్పిన కావ్య సమీక్షలందునన్
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా

    రిప్లయితొలగించండి
  9. మితమగు జ్ఞానపు శిష్యులు
    స్వత హాగా రచన జేయ పరిశీలన గా
    చతురత తో గురువు లపుడు
    స్తుత మతులు కవులు వచింత్రు దోష మ్ము లనే

    రిప్లయితొలగించండి
  10. కం:స్తుతియించక యతిశయముగ
    గతమున గల గొప్ప పూర్వకాలపు ధర్మ
    క్షితి దెలిపి సంస్కరించగ
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే”
    (గతమంతా గొప్పదే అని మెచ్చుకోక దాని లోని దోషాలని సంస్కరణ బుద్ధితో తెలియ జేస్తారు."మంచి గతమున కొంచేమేనోయ్" అని గురజాడ అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  11. చం:గతమును గూర్చి గొప్పలనె కైతల దెల్పుచు దేశభక్తి యం
    చతి యొనరింప జాలునె?యథార్థ మెరుంగుచు పూర్వకాల మం
    దతి యనిపించు మూర్ఖతల నంతట నాపియు, భావి దిద్దగా
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా”

    రిప్లయితొలగించండి
  12. స్తుతియించిన గర్వముచేఁ
    బతితుం డగు నని తలంచి పన్నుగఁ గృతులన్
    వితతమ్ముగఁ బొగడ రెపుడు
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే


    వితత విశుద్ధ వర్తన వివేకులు సర్వ జనప్రకాండ స
    మ్మతముగ భాష పైన నభిమానము మూరిన కారణమ్ముచే
    నితర కవీంద్ర కావ్యముల నెందయినం బరికింపఁ దోఁచినన్
    స్తుతమతు లైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా

    రిప్లయితొలగించండి
  13. సమస్య:
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచయింత్రు సర్వదా!!

    చంపకమాల :

    చతురతతోడ జ్ఞానులిల చక్కగ చెప్పుచు సంస్కరింతురే
    స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచయింత్రు సర్వదా
    కతిపయ తప్పులన్ సరగు కానక నొవ్వక జెప్పి చూతురే
    మితమగు మాటలన్ పరుల మిక్కిలి మార్చ శ్రమంబు గల్గినన్

    రిప్లయితొలగించండి
  14. యతులను పాటించకనే
    మతికట తోచినది వ్రాయు మందుడె యైనన్
    హితమును సతతము కోరెడు
    *"స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే”*

    రిప్లయితొలగించండి
  15. యతులనెరుంగకన్ మది రయమ్ముగ వ్రాయగనెంచ పద్యముల్
    సతతము తప్పులే దొరల చక్కగ బోధను చేయుచున్సదా
    మతికిని నర్థమౌనటుల మానుగ దెల్పుచు‌ శంకరాదులున్
    *“స్తుతమతులైన సత్కవులు దోషములన్ వచియింత్రు సర్వదా”*


    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమః
    గురువుగారికి నమస్కారములు. చాలాకాలము తరువాత సమస్యపూరణ చేయుచున్నాను. తప్పులను సరిదిద్దవలసినదిగా ప్రార్థన.

    మత కుల ప్రాంతపు ద్వేషము
    సతతము రగిలించునట్టి సాహిత్యముతో
    మతి చెరచు మందమతులా
    స్తుతమతులు? కవులు? వచింత్రు దోషమ్ములనే

    మతములు ప్రాంతముల్ కులము మాత్రము నెంచుచు రెచ్చగొట్టుచున్
    సతతము ద్వేషపూరితపు స్వార్థపుభావము నూరిపోయుచున్
    హితమును జెప్పలేని మతిహీనులు కొందరు వ్రాయ నౌదురే
    స్తుతమతులైన సత్కవులు? దోషములన్ వచి యింత్రు సర్వదా.
    💐💐🙏🙏

    రిప్లయితొలగించండి

  17. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అతి మధురపు మాటలతో
    కుతుకమ్మున వ్రాసినట్టి కొన్ని కవితలున్
    హితవుగ సవరణ కోరగ
    స్తుతమతులు కవులు వచింత్రు దోషమ్ములనే.

    రిప్లయితొలగించండి