29-1-2026 (గురువారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్”(లేదా...)“పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ”
(ఒక శతావధాన సమస్య... ఎవరు ఎప్పుడు అడిగారో గుర్తు లేదు)
ఆద్యంతము భారత కథ నధ్యయనము జేసియుండి , యందున నీవేచోద్యముగ నుడువు చుంటివిప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్
ప్రద్యుమ్నుం డెవ్వడనుచు నుద్యోగార్థిని యడుగగ నుత్తర మిడె నా యుద్యోగార్థియె యిట్టుల ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.మద్యంబన్నను ప్రాణమిచ్చు ఖలుడే మాన్యుండ్రు వారించినన్ మద్యంబెచ్చుగ గ్రోలి వచ్చె నటకున్ మైకమ్ము తో తూలు చున్ విద్యాహీనుడతండు కాన పలికెన్ వీక్షిం పగా నిట్టులన్ పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ.
హృద్యంబౌ సఖియంచు నర్జునుని శ్రీకృష్ణుండు న్యాయమ్ముగాసద్యోనిశ్చయబుద్ధితోడ ననిలో సంరక్షణన్ జేయగావేద్యుండైన మురారి నందనునిగా విశ్వంబునం జూడగన్ప్రద్యుమ్నుండనువాడు పాండవులలో భావింపగా నొక్కడౌ
ప్రద్యుమ్నా యని భక్తులుహృద్యముగా పిల్తురుగద కృష్ణ నృపాలున్సద్యోరక్షకుడనగాప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్ప్రద్యుమ్నాయని వాసుదేవుని సదా ప్రార్థింత్రుగా భక్తులేహృద్యంబైన స్వరూపమున్న ఘనుడా కృష్ణుండు చందో మహావిద్యాలంకృత యోగి పాండుసుతులన్ వెన్నంటియుండుంగదాప్రద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ
ఈ సమస్య బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 27వ శతావధానము (దుబాయి) లో శ్రీమతి లలితాభరత్ గారిది (24).
కం॥ విద్యా హీనుఁడు పత్రమువిద్యావేత్తగ పడయఁగ విజ్ఞాపకుఁడైమద్యము మత్తునఁ బలికెనొప్రద్యుమ్నుం డొకఁడు పంచ పాండవులందున్శా॥ విద్యా హీనుఁడు పాఠశాలనటులన్ విజ్ఞాపకుండై చనన్విద్యావేత్తగ పత్రమున్ బడసి చూపించంగ, బోధించెనోమద్యంబున్ జవిచూచి మత్తుఁ గని యున్మాదమ్ముతో నీవిధిన్ప్రద్యుమ్నుం డను వాఁడు పాండవులలో భావింపగా నొక్కఁడౌవిజ్ఞాపకుడు అధ్యాపకుడు
విప్రుని వేషంలో మత్స్యయంత్రమును ఛేదించిన అర్జునుని నేపధ్యంలో.... ద్యుమ్నుడు = ప్రకాశించు వాడుకందంప్రద్యుమ్నుఁడు హరితనయుఁడుప్రద్యుమ్నుని యందమమరె పార్థుని కట ధృష్టద్యుమ్న సహజఁ గొను విప్ర ద్యుమ్నుండొకడు పంచపాండవులందున్శార్దూలవిక్రీడితముప్రద్యుమ్నుండన రుక్మిణీ సుతుఁడు పుష్పాస్త్రుండు నిక్కంబుగన్ప్రద్యుమ్నుండగు రూపమందుగనఁగన్ బార్థుండు నెగ్గంగ ధృష్టద్యుమ్యానుజనే స్వయంవరమునన్ సాధించు వీరుండు విప్ర ద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ
కం:పద్యప్రబంధములలోప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవులందున్సద్యశము గన్న విజయుడువిద్యార్థిగ నున్న నాకు బ్రియ మగు పాత్రల్.(ప్రభావతీ ప్రద్యుమ్నం లో ప్రద్యుమ్నుడి పాత్ర,విజయవిలాసం లో అర్జునుదు పాత్ర వీడికి నచ్చాయి. )
శా:విద్యార్థిన్ గని ప్రశ్న వేయగ "మహావీరుండు,సేనాని యున్,సద్యజ్ఞోద్భవు డెవ్వ?" డంచు గురు వీషత్ సంశయమ్మొందుచున్"పద్యుమ్నుం" డను వాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ”సద్యుక్తిన్ గల్గించు శ్యాలకుడు దృష్టద్యుమ్నుడే కాదొకో?(పాండవుల సేనాపతి ఎవరు ?అని గురువు అడిగితే విద్యార్థి దృష్టద్యుమ్నుడు అనక పొరబాటున ప్రద్యుమ్నుడు అన్నాడట.పేర్ల లో పోలిక ఉంది కదా!)
చైద్యుని వల దన నుభయులు వాద్యమ్ములు మ్రోగుచుండ భారత రణమం దాద్యులు, చేరని వీరుఁడు ప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవు లందున్ [అందున్ = ఆ భారత రణములో] వేద్యుం డీతఁడు మారుతాత్మజుఁ డనన్ విశ్వంబునం దింపుగా సద్యః కోప యశో విరాజితుఁ డిలన్ సంగ్రామ నైపుణ్యు లం దాద్యుం డాజి విజేత భీముఁడు సహస్రానేక మాతంగ వత్పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ [ప్రద్యుమ్నుండు = మంచి బలము కలవాఁడు]
ప్రద్యుమ్ను గూర్చి యడుగగమద్యము గ్రోలుచు నొకండు మత్తు న పలికె నాప్ర ద్యు మ్ను డెవ రన గా ప్రద్యు మ్ను o డొకడు పంచ పాండవు లందు న్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ప్రద్యుమ్నుండెవ్వ రనుచువిద్యాహీనుని యడుగగ వింతగ పలికెన్మద్యము త్రాగిన మత్తునప్రద్యుమ్నుం డొకడు పంచపాండవులందున్.
ఆద్యంతము భారత కథ
రిప్లయితొలగించండినధ్యయనము జేసియుండి , యందున నీవే
చోద్యముగ నుడువు చుంటివి
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్
రిప్లయితొలగించండిప్రద్యుమ్నుం డెవ్వడనుచు
నుద్యోగార్థిని యడుగగ నుత్తర మిడె నా
యుద్యోగార్థియె యిట్టుల
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్.
మద్యంబన్నను ప్రాణమిచ్చు ఖలుడే మాన్యుండ్రు వారించినన్
మద్యంబెచ్చుగ గ్రోలి వచ్చె నటకున్ మైకమ్ము తో తూలు చున్
విద్యాహీనుడతండు కాన పలికెన్ వీక్షిం పగా నిట్టులన్
పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ.
హృద్యంబౌ సఖియంచు నర్జునుని శ్రీకృష్ణుండు న్యాయమ్ముగా
రిప్లయితొలగించండిసద్యోనిశ్చయబుద్ధితోడ ననిలో సంరక్షణన్ జేయగా
వేద్యుండైన మురారి నందనునిగా విశ్వంబునం జూడగన్
ప్రద్యుమ్నుండనువాడు పాండవులలో భావింపగా నొక్కడౌ
ప్రద్యుమ్నా యని భక్తులు
రిప్లయితొలగించండిహృద్యముగా పిల్తురుగద కృష్ణ నృపాలున్
సద్యోరక్షకుడనగా
ప్రద్యుమ్నుం డొకఁడు పంచపాండవులందున్
ప్రద్యుమ్నాయని వాసుదేవుని సదా ప్రార్థింత్రుగా భక్తులే
హృద్యంబైన స్వరూపమున్న ఘనుడా కృష్ణుండు చందో మహా
విద్యాలంకృత యోగి పాండుసుతులన్ వెన్నంటియుండుంగదా
ప్రద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ
ఈ సమస్య బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 27వ శతావధానము (దుబాయి) లో
తొలగించండిశ్రీమతి లలితాభరత్ గారిది (24).
కం॥ విద్యా హీనుఁడు పత్రము
రిప్లయితొలగించండివిద్యావేత్తగ పడయఁగ విజ్ఞాపకుఁడై
మద్యము మత్తునఁ బలికెనొ
ప్రద్యుమ్నుం డొకఁడు పంచ పాండవులందున్
శా॥ విద్యా హీనుఁడు పాఠశాలనటులన్ విజ్ఞాపకుండై చనన్
విద్యావేత్తగ పత్రమున్ బడసి చూపించంగ, బోధించెనో
మద్యంబున్ జవిచూచి మత్తుఁ గని యున్మాదమ్ముతో నీవిధిన్
ప్రద్యుమ్నుం డను వాఁడు పాండవులలో భావింపగా నొక్కఁడౌ
విజ్ఞాపకుడు అధ్యాపకుడు
విప్రుని వేషంలో మత్స్యయంత్రమును ఛేదించిన అర్జునుని నేపధ్యంలో....
రిప్లయితొలగించండిద్యుమ్నుడు = ప్రకాశించు వాడు
కందం
ప్రద్యుమ్నుఁడు హరితనయుఁడు
ప్రద్యుమ్నుని యందమమరె పార్థుని కట ధృ
ష్టద్యుమ్న సహజఁ గొను వి
ప్ర ద్యుమ్నుండొకడు పంచపాండవులందున్
శార్దూలవిక్రీడితము
ప్రద్యుమ్నుండన రుక్మిణీ సుతుఁడు పుష్పాస్త్రుండు నిక్కంబుగన్
ప్రద్యుమ్నుండగు రూపమందుగనఁగన్ బార్థుండు నెగ్గంగ ధృ
ష్టద్యుమ్యానుజనే స్వయంవరమునన్ సాధించు వీరుండు వి
ప్ర ద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ
కం:పద్యప్రబంధములలో
రిప్లయితొలగించండిప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవులందున్
సద్యశము గన్న విజయుడు
విద్యార్థిగ నున్న నాకు బ్రియ మగు పాత్రల్.
(ప్రభావతీ ప్రద్యుమ్నం లో ప్రద్యుమ్నుడి పాత్ర,విజయవిలాసం లో అర్జునుదు పాత్ర వీడికి నచ్చాయి. )
శా:విద్యార్థిన్ గని ప్రశ్న వేయగ "మహావీరుండు,సేనాని యున్,
రిప్లయితొలగించండిసద్యజ్ఞోద్భవు డెవ్వ?" డంచు గురు వీషత్ సంశయమ్మొందుచున్
"పద్యుమ్నుం" డను వాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ”
సద్యుక్తిన్ గల్గించు శ్యాలకుడు దృష్టద్యుమ్నుడే కాదొకో?
(పాండవుల సేనాపతి ఎవరు ?అని గురువు అడిగితే విద్యార్థి దృష్టద్యుమ్నుడు అనక పొరబాటున ప్రద్యుమ్నుడు అన్నాడట.పేర్ల లో పోలిక ఉంది కదా!)
చైద్యుని వల దన నుభయులు
రిప్లయితొలగించండివాద్యమ్ములు మ్రోగుచుండ భారత రణమం
దాద్యులు, చేరని వీరుఁడు
ప్రద్యుమ్నుం డొకఁడు, పంచపాండవు లందున్
[అందున్ = ఆ భారత రణములో]
వేద్యుం డీతఁడు మారుతాత్మజుఁ డనన్ విశ్వంబునం దింపుగా
సద్యః కోప యశో విరాజితుఁ డిలన్ సంగ్రామ నైపుణ్యు లం
దాద్యుం డాజి విజేత భీముఁడు సహస్రానేక మాతంగ వ
త్పద్యుమ్నుం డనువాఁడు పాండవులలో భావింపఁగా నొక్కఁడౌ
[ప్రద్యుమ్నుండు = మంచి బలము కలవాఁడు]
ప్రద్యుమ్ను గూర్చి యడుగగ
రిప్లయితొలగించండిమద్యము గ్రోలుచు నొకండు మత్తు న పలికె నా
ప్ర ద్యు మ్ను డెవ రన గా
ప్రద్యు మ్ను o డొకడు పంచ పాండవు లందు న్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రద్యుమ్నుండెవ్వ రనుచు
విద్యాహీనుని యడుగగ వింతగ పలికెన్
మద్యము త్రాగిన మత్తున
ప్రద్యుమ్నుం డొకడు పంచపాండవులందున్.