14-1-2026 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్”(లేదా...)“తనకున్ శత్రువులైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా”(భరతశర్మ గారి శతావధానంలో వేంకట కృష్ణకుమార్ గారి సమస్య)
కందంఅనయము దేవుని నమ్ముచుఁదన కర్తవ్యమున సాగు ధర్మపరునిపైకొనసాగ దాడు, లణచుచుతన శత్రువులైన జనుల, దైవము ప్రోచున్
తనకలిని గలుగ జేయునుతన శత్రువులైన జనుల దైవము ; ప్రోచున్తనపయి నమ్మక ముంచినమనుజుల సర్వ సమయముల మాన్యత తోడన్
చెనటి నగుచు నీవరివని మనమున దలువ పొరపాటు మన్నింపు మటం చు నమసము చేసి నంతనె తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్.వినుమా శాంతిని గోరి వచ్చె నిటకున్ వెన్నుండు సత్ప్రీతి తో వినడీ మూర్ఖుడు ధార్తరాష్ట్రు డనుచున్ వృద్ధుండనెన్ ద్రోణుతో మొన తా గోరగ నేమి గాంచగ పృథా పుత్రుండ్రె యా పాండవుల్తనకున్ శత్రువు, లైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా.
కందం
రిప్లయితొలగించండిఅనయము దేవుని నమ్ముచుఁ
దన కర్తవ్యమున సాగు ధర్మపరునిపై
కొనసాగ దాడు, లణచుచు
తన శత్రువులైన జనుల, దైవము ప్రోచున్
తనకలిని గలుగ జేయును
రిప్లయితొలగించండితన శత్రువులైన జనుల దైవము ; ప్రోచున్
తనపయి నమ్మక ముంచిన
మనుజుల సర్వ సమయముల మాన్యత తోడన్
రిప్లయితొలగించండిచెనటి నగుచు నీవరివని
మనమున దలువ పొరపాటు మన్నింపు మటం
చు నమసము చేసి నంతనె
తన శత్రువులైన జనుల దైవము ప్రోచున్.
వినుమా శాంతిని గోరి వచ్చె నిటకున్ వెన్నుండు సత్ప్రీతి తో
వినడీ మూర్ఖుడు ధార్తరాష్ట్రు డనుచున్ వృద్ధుండనెన్ ద్రోణుతో
మొన తా గోరగ నేమి గాంచగ పృథా పుత్రుండ్రె యా పాండవుల్
తనకున్ శత్రువు, లైనవారిని సదా దైవంబు ప్రోచుం గదా.