30-1-2026 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది”(లేదా...)“దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్”
తేటగీతిశక్తికొలది పనులఁ జేయ సాధ్యమగునులేదు కాదటంచున్ జెప్ప లేక పనులభారము తలకెత్తు కొనెడు వాక్కను సిరిదాన మొనరింపఁ గల్గు బాధలు గడిందిఉత్పలమాలపూనుచు బాధ్యతల్ నెఱుప ముఖ్యము సేసెడు కొల్వునందునన్లేనివి కానివాటికిని లేదని జెప్పుటలుత్తమంబు మీరానక మోదమందెదరు! హద్దులెరుంగక కార్యభార వాగ్దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
వలదటంచు చెప్పిననేమి భానుమాటవినక కొనితెచ్చుకొనెకదా పెద్దనిదురయార్కి, యతని గాధయె తెల్పె నవని యందుదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.సూనుని జేరి జన్మదుడు సుద్దులు చెప్పుచు నుండె నివ్విధిన్ మానుమపాత్రదానమని మర్కుడు సూచన జేసినన్ శచీజానికి యంగరాజు కవచమ్మునొసంగి మరించె గాంచగాదానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్.
దీనుల యార్తిఁబాపుటయె ధ్యేయముగా నొనరింప దానమున్దాని ఫలంబు దాతలకు దక్కుట తథ్యము పుణ్యమబ్బు నాదాన మపాత్రమైన పరితాపము శాపముగా పెనంగఁగాదానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
శకటమదుపుదప్పి విపత్తు జరిగియుండ ,గాయపడినట్టి వారిని గాంచినంత ,వయసు మీరినగూడను , వలచి రక్థ దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'రక్తదాన..'
🙏
దాన గుణమున్న మనుజుడు దాత యగునుదాన మొనరింప స్వర్గము దక్కునంద్రుసొంత మిసిమిని బరులదౌ సొత్తును ప్రతిదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది[ప్రతిదానము = వినిమయము]దానము సేయువారలకు దక్కును స్వర్గము నిశ్చయంబుగా దానము మంచిదైనయెడ దానిని మెత్తురుగాదె లోకులేదానము హీనమైనయెడ దానిని దెల్పుచు గొంతునెత్తి సందానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్[దానము = వితరణము; దానము = పాలనము దానము = పాలనము; సందానము = ఖండన]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
మానవనాథుడౌ బలిని మాయల వామనుడర్థియై ధరన్ జానెడు నేల వేడగను సమ్మతి నిచ్చెడు వేళ శుక్రుడున్ దీనతజెందుదీవనియు ధీరత బల్కెను రాజవర్యుతో దానముసేయు వారలకు దారుణబాధలు గల్గు మెండుగన్
తే.గీ:గాన మొనరింప మూర్ఖసంఘమ్ము నందుపాన మొనరింప తాళమ్ము వద్ద పాలు నహము బొందు వారల కు వేదాంత విద్యదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది”
తే॥ హద్దు లేని యీవి జనుల కాపదఁ గనుఁగర్ణుఁడటుల నశించుటఁ గాంచి బుద్ధిఁబడయక చనఁగఁ జెడి పోరె వసుధ నట్టిదాన మొనరింప గల్గు బాధలు గడిందిఉ॥ దానముఁ జేసి కర్ణుఁడటు దాతగ ధాత్రి గడించెఁ గీర్తినిన్గాని వివేక శూన్యుఁడుగ గాసిలె రక్షణ వీడి పోవఁగన్మానముఁ బ్రాణమున్ గనఁ బ్రమాదముఁ దెల్పఁగ నీవి ముప్పగున్ దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
ఉ:కానక యార్థికస్థితిని,కమ్మగ పేదకు దోచు రీతి, విజ్ఞానము బెంపు జేయక, బ్రజన్ దమ వోట్లుగ నే తలంచి వాగ్దానము లెన్నొ చేయ నుచితమ్ముల,కయ్యవి భార మౌను వాగ్దానము సేయువారలకు, దారుణ బాధలు గల్గు మెండుగన్”
చేతి కెముక లేని విధాన చేయు నట్టి దాన మొ నరింప గల్గు బాధ లు గడింది పాత్ర మెరిగియు చేసెడి పవిత్ర మగు దాన మున పుణ్య ము లభించు ధరణి యందు
లంచముం గొన్న యట్టి నరప్రవరునకధిక బాధలు కల్గెడు విధము జనులు స్వప్రయోజన మాశించి సతమపప్రదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది వైన మెఱింగి యింపుగను వంచనముల్ వల దన్న విత్త విజ్ఞానులె యాచరింప నిల సాధ్యము కాదని తాము నేరినన్ మానక గెల్వ నెన్నికల మంతన మాత్మ నొనర్చి వ్యర్థ వాగ్దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
ధ్యానము చేయుచున్ హరిని, యాయము లోన నొకింత భాగమున్ దీనుల కిచ్చుచున్ భువి సుధీవరు లెల్లెడ ఖ్యాతి నందెడిన్హీనుల చేరదీయఁ దగ దెప్పుడు, బాసటకై యపాత్రమౌ దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్అసనారె
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.పరిమితము లేని దానము వలన కొందరంతమైతిరి గద తెలియకనె; యట్టివారిలో నుండె కర్ణుడున్ 'బలి' యనంగదాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.
తేటగీతి
రిప్లయితొలగించండిశక్తికొలది పనులఁ జేయ సాధ్యమగును
లేదు కాదటంచున్ జెప్ప లేక పనుల
భారము తలకెత్తు కొనెడు వాక్కను సిరి
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
ఉత్పలమాల
పూనుచు బాధ్యతల్ నెఱుప ముఖ్యము సేసెడు కొల్వునందునన్
లేనివి కానివాటికిని లేదని జెప్పుటలుత్తమంబు మీ
రానక మోదమందెదరు! హద్దులెరుంగక కార్యభార వా
గ్దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
రిప్లయితొలగించండివలదటంచు చెప్పిననేమి భానుమాట
వినక కొనితెచ్చుకొనెకదా పెద్దనిదుర
యార్కి, యతని గాధయె తెల్పె నవని యందు
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.
సూనుని జేరి జన్మదుడు సుద్దులు చెప్పుచు నుండె నివ్విధిన్
మానుమపాత్రదానమని మర్కుడు సూచన జేసినన్ శచీ
జానికి యంగరాజు కవచమ్మునొసంగి మరించె గాంచగా
దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్.
దీనుల యార్తిఁబాపుటయె ధ్యేయముగా నొనరింప దానమున్
రిప్లయితొలగించండిదాని ఫలంబు దాతలకు దక్కుట తథ్యము పుణ్యమబ్బు నా
దాన మపాత్రమైన పరితాపము శాపముగా పెనంగఁగా
దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిశకటమదుపుదప్పి విపత్తు జరిగియుండ ,
రిప్లయితొలగించండిగాయపడినట్టి వారిని గాంచినంత ,
వయసు మీరినగూడను , వలచి రక్థ
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'రక్తదాన..'
🙏
తొలగించండిదాన గుణమున్న మనుజుడు దాత యగును
రిప్లయితొలగించండిదాన మొనరింప స్వర్గము దక్కునంద్రు
సొంత మిసిమిని బరులదౌ సొత్తును ప్రతి
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
[ప్రతిదానము = వినిమయము]
దానము సేయువారలకు దక్కును స్వర్గము నిశ్చయంబుగా
దానము మంచిదైనయెడ దానిని మెత్తురుగాదె లోకులే
దానము హీనమైనయెడ దానిని దెల్పుచు గొంతునెత్తి సం
దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
[దానము = వితరణము; దానము = పాలనము
దానము = పాలనము; సందానము = ఖండన]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిమానవనాథుడౌ బలిని మాయల వామనుడర్థియై ధరన్
రిప్లయితొలగించండిజానెడు నేల వేడగను సమ్మతి నిచ్చెడు వేళ శుక్రుడున్
దీనతజెందుదీవనియు ధీరత బల్కెను రాజవర్యుతో
దానముసేయు వారలకు దారుణబాధలు గల్గు మెండుగన్
తే.గీ:గాన మొనరింప మూర్ఖసంఘమ్ము నందు
రిప్లయితొలగించండిపాన మొనరింప తాళమ్ము వద్ద పాలు
నహము బొందు వారల కు వేదాంత విద్య
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది”
తే॥ హద్దు లేని యీవి జనుల కాపదఁ గనుఁ
రిప్లయితొలగించండిగర్ణుఁడటుల నశించుటఁ గాంచి బుద్ధిఁ
బడయక చనఁగఁ జెడి పోరె వసుధ నట్టి
దాన మొనరింప గల్గు బాధలు గడింది
ఉ॥ దానముఁ జేసి కర్ణుఁడటు దాతగ ధాత్రి గడించెఁ గీర్తినిన్
గాని వివేక శూన్యుఁడుగ గాసిలె రక్షణ వీడి పోవఁగన్
మానముఁ బ్రాణమున్ గనఁ బ్రమాదముఁ దెల్పఁగ నీవి ముప్పగున్
దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఉ:కానక యార్థికస్థితిని,కమ్మగ పేదకు దోచు రీతి, వి
రిప్లయితొలగించండిజ్ఞానము బెంపు జేయక, బ్రజన్ దమ వోట్లుగ నే తలంచి వా
గ్దానము లెన్నొ చేయ నుచితమ్ముల,కయ్యవి భార మౌను వా
గ్దానము సేయువారలకు, దారుణ బాధలు గల్గు మెండుగన్”
చేతి కెముక లేని విధాన చేయు నట్టి
రిప్లయితొలగించండిదాన మొ నరింప గల్గు బాధ లు గడింది
పాత్ర మెరిగియు చేసెడి పవిత్ర మగు
దాన మున పుణ్య ము లభించు ధరణి యందు
లంచముం గొన్న యట్టి నరప్రవరున
రిప్లయితొలగించండికధిక బాధలు కల్గెడు విధము జనులు
స్వప్రయోజన మాశించి సతమపప్ర
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది
వైన మెఱింగి యింపుగను వంచనముల్ వల దన్న విత్త వి
జ్ఞానులె యాచరింప నిల సాధ్యము కాదని తాము నేరినన్
మానక గెల్వ నెన్నికల మంతన మాత్మ నొనర్చి వ్యర్థ వా
గ్దానము సేయు వారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
ధ్యానము చేయుచున్ హరిని, యాయము లోన నొకింత భాగమున్
రిప్లయితొలగించండిదీనుల కిచ్చుచున్ భువి సుధీవరు లెల్లెడ ఖ్యాతి నందెడిన్
హీనుల చేరదీయఁ దగ దెప్పుడు, బాసటకై యపాత్రమౌ
దానము సేయువారలకు దారుణ బాధలు గల్గు మెండుగన్
అసనారె
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పరిమితము లేని దానము వలన కొంద
రంతమైతిరి గద తెలియకనె; యట్టి
వారిలో నుండె కర్ణుడున్ 'బలి' యనంగ
దాన మొనరింపఁ గల్గు బాధలు గడింది.