31-1-2026 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా”(లేదా...)“మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్”
గణితావధాని పృచ్ఛకుడైన శిష్యునితో.. కందంచూడుమిదె గుణింతము మరికూడిక నేర్పుటకనంగఁ గూర్చిన పాదంబోడక రెండింతల పద్మూడునకున్ నాల్గు గలుగ ముప్పది యగురా!ఉత్పలమాలచూడు గుణింతమున్ మరియు సొంపగు కూడికలన్ సమస్యలోజోడుగఁ గూర్చినారనఁగ చోద్యములేదిక పూరణంబు నేనోడక జేసెదన్ వినఁగ నొప్పనిపించు., గుణించి రెండు, పద్మూడును, నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
ఏడుకు మూడును గలుపుముతోడుగ పదమూడు గలిపి తొందరపడకన్జోడింపఁగ సరవిని నొకమూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడే ముప్పది యెటులగు ?మూడునకున్ నాల్గుగలుప ముప్పది యగురా !బాడుగకు నాలుగేలర !వేడుకగా పక్క సున్న పెట్టిన జాలున్
కూడికల నేర్పమంచునువేడగ నేనొప్పుకొనుచు వివరించితినే యేడు పదహారు మరియుమూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా.నేడది భానువారమని నీదరి జేరితి శ్రద్ధజూపుచున్ కూడిక నేర్పమంచు నను గోరగ జెప్పుచు నుంటి రెండుతో నేడును హెచ్చవేసి మరియింపుగ తొమ్మిది కల్పి దానికిన్ మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్.
మూడునకేడు కలిపి పదుమూడును కూడిన లభించు మొత్తముతోడన్గూడిక చేయుట సులభముమూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురామేడము నేర్చుకొంటివిట మేలొనగూడును లెక్కలందునన్నేడిటఁ జేసిచూపితివి నేర్చిన కూడిక నిశ్చయంబుగామూడున కేడుకల్పి పదుమూడును గూడిన వచ్చు సంఖ్యకున్మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్[మేడము = కూడిక]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ధన్యవాదాలు గురూజీ 🙏
గణితంలో కూడికలు:ఉ త్పలమాల:ఏడుకు మూడునుంగలిపి యేమరకన్ మరి వచ్చుదానికిన్తోడుగ నేడునున్ గలిపి తొందరపాటును వీడి దానికిన్జోడుగ నారునుం గలిపి చోద్యముగా దలపోయకన్ వెసన్మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వాడె కదా పురత్రయము వంచన జేయగ నాల్గువేదముల్ జూడగ వాజిలై వెలయ జొక్కుచు నీలగళుండు నయ్యెడన్ వేడగ నొక్కబాణమున వేగమె గూల్చెను ముప్పదింటినిన్ మూడును నాల్గునుం గలుప ముప్పదియౌగద లెక్కజూచినన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
వేడుక గా లెక్కించుచు మూడుకు నిరువది ని కలిపి ముచ్చట మీ రన్ కూడగ పిదపను దానికిమూడు నకు న్ నా ల్గు కలుప ము ప్పది యగు రా!
కం:మూడు పదులు ముప్పది యగుమూడును గల్పంగ నదియె ముప్పది మూడౌనేడును దీసియు ముప్పదిమూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా”(10×3=30. 30+3=33. 33-7=26. 26+4=30)
ఉ:మూడు పదుల్ గనంగ నది ముప్పది, దానిన దీసి వేయు మీ యేడును! నిప్పు డెంత? యది యిర్వది మూడగు కాదె బాలకాయేడుపు మో మదేల? నిక నిర్వది మూడుకు నీవు చక్కగామూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్”(10×3=30. 30-7=23. 23+3+4=30)
కం॥ వాడుక జూదము నొకటికి వాఁడు పది నిడుటనుచు నొక పరి మూడిడఁగన్గూడుఁ గనె నాలుగు పడఁగమూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురాఉ॥ వేడుక జూదమందొకటి పెట్టినచోఁ బది రెట్లనంగనేవీడక మూడు రూకలట ప్రీతిగ నుంచఁగ గవ్వలాటలన్జూడఁగ నాలుగంకెలకుఁ జొచ్చిన వెంటనె నెగ్గి పోవఁగన్మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్మరొక పూరణండి(జూదములో బాగు పడినవారు లేరు కాని స్టాక్ మార్కెట్ వర్తకంలో ఇది జరిగనదే)ఉ॥ వీడక మూడు లక్షలను బెట్టఁగ వర్తక మందునావిధిన్జూడఁగ నాల్గు వర్షములు చుక్కల తాకెను వృద్ధిచెందుచున్గూడగ మూడు లక్షలటు గొప్పగ ముప్పది లక్షలయ్యెనేమూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
పాడిగ వ్రాయం దగ నీ మూడు పదమ్ములను జరణముల గతి భళిరా వేడుక మీఱఁగ నింపుగ మూడునకున్, నాల్గు, గలుప ముప్పది యగురా [ముప్పది = త్రిపద; మూడునకున్నాల్గు గలుప] నేఁడును వాడ వాడలను నెమ్మి చరించి గణింప నింపుగాఁ బాడిగ సుప్రసిద్ధములు భారత వాఙ్మయ మందుఁ జక్కఁగా మూడు చతుష్టయమ్ముల సమూహము నాఱు త్రయమ్ము లిద్ధరన్ మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్ [వేదోపాయ దుష్ట చతుష్టయములు; గుణ తాప కాల ఋ ణేషణ మూర్తి త్రయములు]
అర్ధ కందానందం :)మాథ్సు సో సింపుల్ యు నో :)మూడున కిరువది మూడామూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఏడను ఫలితము లభ్యముమూడునకున్ నాల్గు గలుప;ముప్పదియగురాఏడున కిరువది కలుపుచుమూడును కూడినను ఫలిత మొకటే కదరా!
ఏడునెనిమిది తోడ హెచ్చవేసిరెండుతో సమముగా విడదీసి వరలునట్టి అందునున్ ఐదును తగ్గచేసి మూడు నాలుగు కలిపిన ముప్పది కదాగతంలో ఈ సమస్యను ఎవరో పూరించారు మన బ్లాగులో ఇది నేను పూరించినది కాదు
గణితావధాని పృచ్ఛకుడైన శిష్యునితో..
రిప్లయితొలగించండికందం
చూడుమిదె గుణింతము మరి
కూడిక నేర్పుటకనంగఁ గూర్చిన పాదం
బోడక రెండింతల ప
ద్మూడునకున్ నాల్గు గలుగ ముప్పది యగురా!
ఉత్పలమాల
చూడు గుణింతమున్ మరియు సొంపగు కూడికలన్ సమస్యలో
జోడుగఁ గూర్చినారనఁగ చోద్యములేదిక పూరణంబు నే
నోడక జేసెదన్ వినఁగ నొప్పనిపించు., గుణించి రెండు, ప
ద్మూడును, నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
ఏడుకు మూడును గలుపుము
రిప్లయితొలగించండితోడుగ పదమూడు గలిపి తొందరపడకన్
జోడింపఁగ సరవిని నొక
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిమూడే ముప్పది యెటులగు ?
రిప్లయితొలగించండిమూడునకున్ నాల్గుగలుప ముప్పది యగురా !
బాడుగకు నాలుగేలర !
వేడుకగా పక్క సున్న పెట్టిన జాలున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికూడికల నేర్పమంచును
వేడగ నేనొప్పుకొనుచు వివరించితినే
యేడు పదహారు మరియు
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా.
నేడది భానువారమని నీదరి జేరితి శ్రద్ధజూపుచున్
కూడిక నేర్పమంచు నను గోరగ జెప్పుచు నుంటి రెండుతో
నేడును హెచ్చవేసి మరియింపుగ తొమ్మిది కల్పి దానికిన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్.
మూడునకేడు కలిపి పదు
రిప్లయితొలగించండిమూడును కూడిన లభించు మొత్తముతోడన్
గూడిక చేయుట సులభము
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
మేడము నేర్చుకొంటివిట మేలొనగూడును లెక్కలందునన్
నేడిటఁ జేసిచూపితివి నేర్చిన కూడిక నిశ్చయంబుగా
మూడున కేడుకల్పి పదుమూడును గూడిన వచ్చు సంఖ్యకున్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
[మేడము = కూడిక]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిగణితంలో కూడికలు:
రిప్లయితొలగించండిఉ త్పలమాల:
ఏడుకు మూడునుంగలిపి యేమరకన్ మరి వచ్చుదానికిన్
తోడుగ నేడునున్ గలిపి తొందరపాటును వీడి దానికిన్
జోడుగ నారునుం గలిపి చోద్యముగా దలపోయకన్ వెసన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివాడె కదా పురత్రయము వంచన జేయగ నాల్గువేదముల్
రిప్లయితొలగించండిజూడగ వాజిలై వెలయ జొక్కుచు నీలగళుండు నయ్యెడన్
వేడగ నొక్కబాణమున వేగమె గూల్చెను ముప్పదింటినిన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌగద లెక్కజూచినన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివేడుక గా లెక్కించుచు
రిప్లయితొలగించండిమూడుకు నిరువది ని కలిపి ముచ్చట మీ రన్
కూడగ పిదపను దానికి
మూడు నకు న్ నా ల్గు కలుప ము ప్పది యగు రా!
కం:మూడు పదులు ముప్పది యగు
రిప్లయితొలగించండిమూడును గల్పంగ నదియె ముప్పది మూడౌ
నేడును దీసియు ముప్పది
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా”
(10×3=30. 30+3=33. 33-7=26. 26+4=30)
ఉ:మూడు పదుల్ గనంగ నది ముప్పది, దానిన దీసి వేయు మీ
రిప్లయితొలగించండియేడును! నిప్పు డెంత? యది యిర్వది మూడగు కాదె బాలకా
యేడుపు మో మదేల? నిక నిర్వది మూడుకు నీవు చక్కగా
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్”
(10×3=30. 30-7=23. 23+3+4=30)
కం॥ వాడుక జూదము నొకటికి
రిప్లయితొలగించండివాఁడు పది నిడుటనుచు నొక పరి మూడిడఁగన్
గూడుఁ గనె నాలుగు పడఁగ
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
ఉ॥ వేడుక జూదమందొకటి పెట్టినచోఁ బది రెట్లనంగనే
వీడక మూడు రూకలట ప్రీతిగ నుంచఁగ గవ్వలాటలన్
జూడఁగ నాలుగంకెలకుఁ జొచ్చిన వెంటనె నెగ్గి పోవఁగన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
మరొక పూరణండి
(జూదములో బాగు పడినవారు లేరు కాని స్టాక్ మార్కెట్ వర్తకంలో ఇది జరిగనదే)
ఉ॥ వీడక మూడు లక్షలను బెట్టఁగ వర్తక మందునావిధిన్
జూడఁగ నాల్గు వర్షములు చుక్కల తాకెను వృద్ధిచెందుచున్
గూడగ మూడు లక్షలటు గొప్పగ ముప్పది లక్షలయ్యెనే
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
పాడిగ వ్రాయం దగ నీ
రిప్లయితొలగించండిమూడు పదమ్ములను జరణముల గతి భళిరా
వేడుక మీఱఁగ నింపుగ
మూడునకున్, నాల్గు, గలుప ముప్పది యగురా
[ముప్పది = త్రిపద;
మూడునకున్
నాల్గు
గలుప]
నేఁడును వాడ వాడలను నెమ్మి చరించి గణింప నింపుగాఁ
బాడిగ సుప్రసిద్ధములు భారత వాఙ్మయ మందుఁ జక్కఁగా
మూడు చతుష్టయమ్ముల సమూహము నాఱు త్రయమ్ము లిద్ధరన్
మూడును నాల్గునుం గలుప ముప్పదియౌఁ గద లెక్కఁ జూచినన్
[వేదోపాయ దుష్ట చతుష్టయములు; గుణ తాప కాల ఋ ణేషణ మూర్తి త్రయములు]
అర్ధ కందానందం :)
రిప్లయితొలగించండిమాథ్సు సో సింపుల్ యు నో :)
మూడున కిరువది మూడా
మూడునకున్ నాల్గు గలుప ముప్పది యగురా
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఏడను ఫలితము లభ్యము
మూడునకున్ నాల్గు గలుప;ముప్పదియగురా
ఏడున కిరువది కలుపుచు
మూడును కూడినను ఫలిత మొకటే కదరా!
ఏడునెనిమిది తోడ హెచ్చవేసి
రిప్లయితొలగించండిరెండుతో సమముగా విడదీసి వరలునట్టి
అందునున్ ఐదును తగ్గచేసి
మూడు నాలుగు కలిపిన ముప్పది కదా
గతంలో ఈ సమస్యను ఎవరో పూరించారు మన బ్లాగులో ఇది నేను పూరించినది కాదు