31, జనవరి 2026, శనివారం

సమస్య - 5368

1-2-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా”
(లేదా...)
“చెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా”

15 కామెంట్‌లు:

  1. అప్పుడు జరిగిన దానికి
    నొప్పి యనుభవించలేక నుడివిన దానిన్
    చెప్పుచు నుంటివిగద మరి
    "చెప్పు తెగుద్ది" యనుమాట శిష్టమ దొసఁగా ?

    రిప్లయితొలగించండి
  2. కందం
    ' చెప్పులు క్రొత్తవి కొనుచును
    ద్రిప్పుచు గట్టిగను లాగి తీరును జూడన్
    జప్పున నమ్ము వణిజుడన
    "చెప్పు తెగుద్ది" యను మాట శిష్టమ? దొసఁగా?

    ఉత్పలమాల
    త్రిప్పుచుఁ జూచి వాటిదగు తీరు పటిష్ఠమొ? కాదొ? యంచు నే
    చెప్పులు క్రొత్తవిన్ గొనుచు జేతను లాగి పరీక్షఁ జేయఁగన్
    జప్పున నమ్ము వర్తకుడు జాగ్రతనెంచుచు నన్నుఁ జూచియున్
    "జెప్పు తెగుద్ది" యన్న నుడి శిష్టమొ? దుష్టమొ? తేల్చి చెప్పుమా!

    రిప్లయితొలగించండి

  3. ఎప్పుడు వ్యవహారికముల
    నొప్పుగ నొప్పరు కద బుధులుర్విని గాదే
    యిప్పుడిట గల పదముగని
    చెప్పు, తెగుద్ది యను మాట శిష్టమ? దొసఁగా.?


    తప్పని యెంచి గ్రామ్యముల దక్షత గల్గు కవీంద్రు లైన వా
    రెప్పుడు వాడబోరనుచు నెల్లరు చెప్పెడి మాట సత్యమా?
    యిప్పుడు పద్య పాదమున నెవ్వరొ వ్రాసిన మాట గాంచుచున్
    జెప్పు, తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా.

    రిప్లయితొలగించండి
  4. తప్పులు వెదకెడు వాడవు
    చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా
    చప్పున తేల్చి నుడువుమా
    చెప్పక నిలుచుంటివేని జెప్పు తెగునికన్

    తప్పిది తప్పటంచుఁ బ్రతితప్పును బట్టుట నీకు సాధ్యమా
    తప్పులనెంచిచూచెడి ప్రతాపము కల్గిన దిట్టవైనచో
    చెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా
    చెప్పకనున్న పక్షమున చెప్పు తెగుద్దిక నిశ్చయంబుగా

    రిప్లయితొలగించండి
  5. తప్పులుసేయువాడొకడు దర్పముతోడను పల్కె నార్యులన్
    ముప్పునముంచునంచు మది మూర్ఖపు పద్ధతి వీడలేక తా
    నెప్పుడు దిద్దుకోడెవడు హేయపుపోకడజూపి పల్కినన్
    చెప్పుతెగుద్దియన్ననుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా!

    రిప్లయితొలగించండి
  6. ఒప్పగ జెప్పుమయ్య! యిది
    యోచన కందక యున్నదెట్టులో!
    తిప్పలుతప్పవేమి? మన
    తీయని తెన్గున వాడుమాటలన్
    దొప్పునొ? లేదొ! యీ పదము
    యొక్కవిధమ్మది యే ప్రయోగమో?
    చెప్పు,  "తెగుద్ది" యన్న నుడి
    శిష్టమొ దుష్టమొ తేల్చిచెప్పుమా!

    రిప్లయితొలగించండి
  7. సమస్య : “చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా”

    కం. తప్పులఁ జప్పున బట్టగ
    నెప్పుడు సిద్ధంబగు నలినేక్షణ నీవే
    చెప్పుము తప్పొప్పులనిట ,
    "చెప్పు తెగుద్ది" యను మాట శిష్టమ దొసఁగా ?

    రిప్లయితొలగించండి
  8. చెప్పును పాదరక్షయని చెప్పుట యొప్పును తప్పుకాదు నే
    జెప్పు పదమ్ములన్నియును శిష్టములై దనరారు నెన్నఁడున్
    జెప్పను దుష్టమౌ పదము జెప్పన నర్థము 'నుగ్గడిం' చనన్
    చెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా

    రిప్లయితొలగించండి
  9. కం॥ తిప్పల పాలునుఁ జేయుచుఁ
    దప్పుల నెన్నుచు సతతము దార వరలగా
    నొప్పిని పతియన మారవొ
    చెప్పు, తెగుద్ది యను మాట శిష్టమా దొసఁగా

    ఉ॥ ఒప్పుచుఁ బెండ్లియాడిన మహోగ్రతఁ దాల్చుచు మాటిమాటికిన్
    దప్పులనెన్ని బాధనిడు తామర కంటియె భార్యయైనచోఁ
    దిప్పల పాలునై బ్రదుకు తేలఁగ నీవిధి సాగ నెంచినన్
    జెప్పు, తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా

    తెగుద్ది అంటే మన బంధము తెగుతుంది అనే అర్థంతో నండి

    రిప్లయితొలగించండి
  10. కం:ఇప్పటి నాటకముల లో
    "చెప్పు తెగుద్ది" యను మాట శిష్టమ, దొసఁగా?
    యొప్పగ పాత్రౌచిత్యము
    మెప్పు నిడును శ్రామికాళి మృదు హృదయమ్ముల్
    (శిష్టమ=శిష్ట మైనదే. )

    రిప్లయితొలగించండి
  11. ఉ:చెప్పవె తెన్ గు పండితుడ! చిల్లర గానివి కావె, పాఠముల్
    చెప్పక యాడు పిల్ల పయి చేతులు వేయుచు నుంటి వేమి రా?
    "చెప్పు తెగుద్ది" యన్న నుడి శిష్టమొ దుష్టమొ! తేల్చి చెప్పుమా
    చెప్పు త్రెగంగ ని న్నెవడు చెంపను గొట్టిన పాప మందువే?
    (చెప్పు తెగుద్ది అనే మా భాష శిష్టమో,దుష్టమో తరవాత సంగతి. నువ్వు ఆడ పిల్ల మీద చెయ్యి వేస్తున్నావు. కాబట్టి ని న్నెవడైనా నిజం గా చెప్పుతో కొడితే తప్పా?)

    రిప్లయితొలగించండి
  12. కుప్పలుఁ దెప్పలు గ్రామ్యము
    లిప్పుడు పద్యమ్ము లందు నీక్షింపఁగ నేఁ
    డెప్పురి కేఁగినఁ జెప్పుమ
    చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసఁగా


    ఎప్పగి దిట్టి సూత్రము బుధేంద్రుఁడు చిన్నయ సూరి చెప్పె మే
    మప్పగిదిం గొనన్ వగ లనర్హము లెన్నఁగ నేరి కైననుం
    జెప్పిన నార్య పుంగవులు చెడ్డయినం గొన నర్హమౌ ననం
    జెప్పు తెగుద్ది యన్న నుడి శిష్టమొ దుష్టమొ తేల్చి చెప్పుమా

    [వగ = ఆలోచన]

    రిప్లయితొలగించండి
  13. గప్పున కకుభపు మైకం
    బొప్పగ పండితుడవంచు బుధ! మరిచితివా
    తుప్పర తెంపరల నడుమ
    చెప్పు తెగుద్ది యను మాట శిష్టమ దొసగా?




    రిప్లయితొలగించండి
  14. గొప్పగ రోషంబూ నియు
    తప్పుగ దూషించు వేళ తగని విధాన న్
    చప్పున పలుకుట జూడగ
    చెప్పు తెగుద్ది యను మాట శిష్ట మ? దొ స గా?

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    అప్పును గైకొన్న నరుడు
    తప్పుకు తిరుగ నొకరోజు తనకు కనపడన్
    అప్పిచ్చిన వాడు పలికె
    'చెప్పు తెగుద్ది' యను మాట శిష్టమ?దొసగా?

    రిప్లయితొలగించండి