4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5580

5-9-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును”

(లేదా...)

“పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్”

(పట్వర్ధన్ గారి శతావధానంలో అక్కెర కరుణాసాగర్ గారి సమస్య)

17 కామెంట్‌లు:

  1. కామెంట్లు పోస్ట్ కావడం లేదని మిత్రులు చెప్తున్నారు.

    రిప్లయితొలగించండి
  2. మిత్రులు తమ పూరణలను పోస్ట్ చేయలేకపోవడానికి కారణమేమిటో నాకు బోధపడడం లేదు. సెట్టిగులలో మార్పు చేసినా ఫలితం ఉండడం లేదు.
    నా వాట్సప్ నెం. 7569822984. ఈ నెం.కు ఫోన్ చేసి కాని, మెసేజ్ రూపంలో కాని మీ వాట్సాప్ ఫోన్ నెం. తెలియజేస్తే మిమ్మల్ని 'శంకరాభరణం' వాట్సాప్ సమూహంలో చేరుస్తాను. మీ పూరణలను అక్కడ పోస్ట్ చేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. "పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును"

    తేటగీతి:
    హృద్యమగు రీతి జెప్పిన పద్యములను
    సద్యశమ్ము ప్రాప్తించును సత్కవులకు
    పసిమి పదగుంఫనము లేని పనికిరాని
    పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును

    "పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్"

    శార్దూలము:
    హృద్యమ్మౌ పదగుంఫనమ్ముగదురన్ హేరాళమౌ వర్ణనల్
    పద్యాలందున నేర్చికూర్తురు కవుల్ ప్రజ్ఞానిధుల్ గావునన్
    విద్యాగంధము లేక కావ్యముల సంవీక్షింపకన్ వ్యర్థమౌ
    పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్

    రిప్లయితొలగించండి
  4. వక్ర మార్గము పట్టించి వంత గూర్చు
    పద్యములు సెప్పకుడు విన్న పాప మగును ధర్మ దేవత శ్లా ఘి o చు నిర్మ లంపు
    పథ ము జూపించ వలయును పద్య మిలకు

    రిప్లయితొలగించండి
  5. మా పొరుగింటావిడ, మా శ్రీమతి ఆలపించే విష్ణుసహస్రనామ పారాయణము, తమయింటికి వినిపిస్తుంది, తాను అంటుతో ఉన్నానని ఆలపించవలదని వింటే పాపమని అభ్యంతరం చెప్పినది. ఆ నేపథ్యంలో నేటి నా పూరణలు:

    తేటగీతి
    భక్తి ప్రార్థనల్ మీరు మీ వాసమందు
    నాలపించ మా గృహమున నలరుచుందు
    నంటు మాయింట నేడన నట్టివైన
    పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును!

    శార్దూలవిక్రీడితము
    వద్యమ్ముల్ భగవంతునిన్ గొలుచుచున్వల్లించు సంకీర్తనల్
    హృద్యమ్మై తమరాలపించ విని మాయింటన్ దరింపంగ మీ
    విద్యల్ ముచ్చట గొల్పు ప్రస్తుతముమా వీటన్ రజస్సైనఁ ద
    త్పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్!

    రిప్లయితొలగించండి
  6. శా॥ హృద్యమ్మైచను ఛందమున్ బొదిగి పూరించంగ సద్భావనల్
    వేద్యమ్మేనగుఁ బాఠకాళికిని నైవేద్యమ్ముగా నొప్పెడిన్
    మద్యమ్మట్టులఁ గ్రోలి దుష్టతను సమ్మానించుచున్ వ్రాయఁగన్
    బద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్

    రిప్లయితొలగించండి
  7. -
    బ్లాగులందు వ్యాఖ్యలతో పదపడచునిదె
    పద్యములు సెప్పకుడు విన్న బాపమగును
    గూగులమ్మి నిదురపోయె గోడు గోడు
    మనిరి పంచదశపులోక మానుజులగొ!



    రిప్లయితొలగించండి
  8. అరయ మందాకినీ జల మంచితమ్ము
    స్నాన మాడంగ నఘములు సడలి పోవుఁ
    బానమున కయోగ్యము లంచు భవ్య విష్ణు
    పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాప మగును


    [పద్యములు = పాదము లందుఁ బుట్టినవి]
    విద్యావేత్తలు మెచ్చ రెవ్వరును నీ విశ్వంబునం దక్కటా
    యాద్యంతమ్ములు లేక వ్యర్థ గిర లత్యంతమ్ము దొర్లంగ నా
    గద్యా లైనను నింక దుష్ట కవితా కాయమ్ము మిథ్యోక్తముల్
    పద్యాల్ సెప్పకుఁ డయ్య యివ్విధినిఁ బాపం బౌను వీనిన్ వినన్

    రిప్లయితొలగించండి

  9. విద్యనేర్వని నేతను విజ్ఞుడనెడి
    వాద్య బృందాన జేరిన వ్యర్థుడగుచుఁ
    మద్యమును జవిచూచిన మధురమనుచుఁ
    పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును

    ఆద్యంతమ్ములు లేని నిర్గుణునిపై నప్రీతి కల్గింప నై
    వేద్యంబందున నాసివైన సరుకుల్ వేయించు దుర్మార్గునిన్
    విద్యాగంధము లేని నేతను మహా విజ్ఞానిగా జూపుచున్
    బద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్

    రిప్లయితొలగించండి
  10. జిలేబి గారూ, మీ పద్యం బాగున్నది. కాకుంటే మొదటి పాదంలో యతి తప్పింది. సవరించండి.

    రిప్లయితొలగించండి
  11. చోద్యమయ్యె నీయోచన జూచు చుండ
    వద్యయనుట ; సతిపతుల భాషణవిని
    సద్యము దలచిన నెరిగ సంగతిపయి
    పద్యములు సెప్పకుఁడు ; విన్నఁ బాపమగును”

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    భావ స్పష్టత ముఖ్యము పద్యమునకు
    ప్రాసకు,యతి,గణములకు భంగము గల
    పదుగురికి యుపయోగము పడని యట్టి
    పద్యములు సెప్పకుడు విన్నఁ బాపమగును.

    రిప్లయితొలగించండి
  13. నీతులన్ జెప్ప దలచుచు భీతి లేక
    నీ సమాజపు నియమాల రోసి తినని
    చెప్పు పరమ బూతు లగు చౌడప్ప వయిన
    పద్యములు సెప్పకుఁడు విన్నఁ బాపమగును.


    హృద్యంబై పఠియించినంత నవియే యింపై మదిన్ దోచుచున్
    విద్యా వంతుల మెప్పు పొందు నవియే, విశ్వాన చౌడప్ప యే
    వేద్యుండైనను గాంచ బూతులనె యుద్వేలమ్ముగా వాడె నా
    పద్యాల్ సెప్పకుఁడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్.

    రిప్లయితొలగించండి