5, అక్టోబర్ 2026, సోమవారం

సమస్య - 5611

6-10-2026 (మంగళవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్”

(లేదా...)

“సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే”

(న.చ. సాహిత్ శతావధానంలో బైరపనేని పోతురాజు చౌదరి గారి సమస్య)

13 కామెంట్‌లు:

  1. దైతేయుని సతి యొందిన
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్ ,
    జాతుడు పెరిగిన పిమ్మట
    ఈ తావిషము పయికతడు యెత్తెడు భీతిన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    రీతిగఁ జేసెడు తపమున
    కాతంకము గూర్చెననుచు త్ర్యక్షుడు మాడ్చన్
    బాతకము తనదని రమా
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్!

    ఉత్పలమాల
    భూతగణాధిపుండు గిరి పుత్రినిఁ గొన్నఁ దదీశ్వరాంశ సం
    భూతకుమారసంభవము పోగొను నంచును దారకాసురున్,
    బ్రీతిగఁ బూన్చ మన్మథుని ప్రేల్చగఁ ద్ర్యంబకుటగ్ని, మాధవీ
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే!

    రిప్లయితొలగించండి
  3. పరీక్షిన్మహారాజుతో శుక బ్రహ్మ:

    భూతలమందునసరిలే
    దా తపమెంతోకఠినము ధ్వంసముజేయన్
    చేతలుడిగెనునృపా! దితి
    *సూతిని గని నాకవిభుడు శోకితుడయ్యెన్*

    (హిరణ్యకశిపుని కఠోర తపస్సు ధ్వంసం చేయలేక ఇంద్రుడు శోకితుడైనాడని భావము)

    రిప్లయితొలగించండి

  4. సీతను గాయ పరచెనని
    కాతాళముతో రఘుపతి ఘాసిని వేయన్
    పీతువు కోల్పోయిన తన
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్.


    నాతియె కోరె నంచు యదు నందను డంతట సత్య భామతో
    నా తెఱగంటి రేణిదగు నారెము వేలుపు జెట్టుకై సమా
    ఘాతము జేయు పాళమున కైటభ ప్రద్విషు డైన దేవకీ
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే.

    రిప్లయితొలగించండి
  5. ఆతత బల్లిదుండతఁడు హానిని గూర్చఁగ గట్టుదాయకున్
    చేతమునందు పూనికను జేయుచు వచ్చిన పంక్తికంథరున్
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే
    భీతి వహించిరెల్లరును భీకర యుద్ధము గాంచినంతటన్

    రిప్లయితొలగించండి
  6. ఉ॥ గాతము నందుఁ బడ్డ గతిఁ గౌరవ పాండవ యుద్ధమన్ననే
    ద్యోతకమయ్యెఁ బుత్రునకుఁ దోరపు పోరున రక్ష నెంచఁగన్
    యాతన హెచ్చఁగన్ సుతునకాపద నెంచుచు నట్లు భాస్కరున్
    సూతినిఁ గాంచి నాకపతి శోకము నొందెను ప్రాణభీతిచే

    సూతి సంతు

    (ప్రాణభీతి పుత్రుని గురించి అండి. తండ్రికుండే సహజ సిద్ధమైన ప్రేమతో భయపెట్టినదని అండి)

    రిప్లయితొలగించండి
  7. ఇంద్రుడు విశ్వరూపుని చంపిన తర్వాత
    వృత్రాసురుడి జననము కోరి త్వష్టుడొనరించిన
    యాగము చూసి ప్రాణభీతితో శోకించాడు....

    ఘాతకుడగు సురపతిపై
    రోతపడెను త్వష్ట విశ్వరూపుని దునుమన్
    భీతిని గల్గించు సుధా
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్

    ఆ తెఱగంటిరేడు దునుమాడిన మీదట విశ్వరూపునిన్
    ఘాతుకమున్ సహింపనని క్రందిన త్వష్ట కడంగినాడటన్
    భీతినిగొల్పు సంస్తవము వృత్రుని పొందగనెంచి యా సుధా
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే

    [ సుధాసూతి = యజ్ఞము ]

    రిప్లయితొలగించండి
  8. భాతిగ నూరు యజ్ఞముల ప్రాప్తము కాగ మహేంద్ర లోకమే
    నీతినివీడి వర్తిలుచు నేరపు బుద్ధిని, స్వర్గవాసులన్
    యాతన పెట్టుచున్ నహుషు డచ్చట వర్తిల , చంద్ర వంశ రాట్
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను ప్రాణభీతిచే

    రిప్లయితొలగించండి
  9. కం:ఆతప పుత్రుని దౌ నీ
    ర్ష్యాతపమును, కవచకుండలాదుల గనగా
    నాతని గెలుచుట యెట్లని
    సూతినిఁ గని నాకవిభుఁడు శోకితుఁ డయ్యెన్”




    రిప్లయితొలగించండి
  10. ఉ:ఆ తపనాత్మజుండు పలు నస్త్రములన్ గలవాడు,జన్మతో
    నాతడు పొంది యుండె కవచాదుల క్రీడికి గండ మంచు దా
    సూతినిఁ గాంచి నాకపతి శోకమునొందెను, ప్రాణభీతిచే
    దాతృగుణమ్ము వీడకయె దాన మిడెన్ కవచమ్ము కర్ణుడున్ .


    రిప్లయితొలగించండి
  11. నాతి పయి రేఁగ మోహం
    బాతతముగ నంధుఁ డయ్యె నరసి నిజ మహా
    పాతకమును దీర్ఘతముని
    సూతినిఁ గని నాక విభుఁడు శోకితుఁ డయ్యెన్


    ఏ తఱి దైవ నిర్ణయము లెవ్విధి నుండునొ యేరి కెర్క సం
    పాతము సెంద విక్రమము వారక భండన మందు నింద్ర జి
    ద్ఘాత పరాజయుండు గత ధాముఁడు లుప్త యశుండు విశ్వవ
    స్సూతినిఁ గాంచి నాకపతి శోకము నొందెను బ్రాణ భీతిచే

    రిప్లయితొలగించండి