తే.గీ: ఆదిభట్ల వారలు చెప్ప నాంధ్రముననె హరికథలను మా తాతయ్య యరవ దేశ మున వసించుట తమిళులు మురియు రీతి నరవమున వ్రాసెఁ బో ! తన హరికథలను” (ఆదిభట్ల నారాయణ దాసు గారు తెలుగు లో హరికథలు వ్రాస్తే మా తాతయ్య అరవం లో హరికథలు వ్రాసాడని ఒక మనుమడు చెప్పుకొన్నాడు.)
(అవునండి ఈ సమస్య మునుపు ఇచ్చినట్టుగా నాకు కూడా అనిపిస్తున్నదండి లీలగా. నాకు మళయాళము తెలియదు కానీ తమిళు కన్నడ తెలుగు మధ్యలో చాలా సామ్యాలున్నాయండి. హళెగన్నడ తమిళు మధ్య వ్యత్యాసం కూడ చాలా తక్కువ)
సరసన నుండిన పిల్లడి
రిప్లయితొలగించండిపరితుష్టి కొరకయి యతడు వ్రాయ దలచెగా
అరవమున ; వ్రాసెఁ బోతన
హరికథలను దెలుగుభాషనందున మనకై
రిప్లయితొలగించండితమిళ కవి యొకండట జేరి దక్షత గల
తెలుగు పండితున్ సేవించి తెలుగు నేర్చి
పండితులు మెచ్చు రీతిగన్ బటిమ జూపి
అరవమున వ్రాసెఁ, బోతన హరికథలను.
అరయగ నాతడే తమిళ మందున కోవిదు డైన నేమిరా
గురువుల పాద పద్మముల గూరిమి గోల్చుచు నేర్చి యాంధ్రమున్
భరవులు దూరదర్శనులు భక్త జనాళియె మెచ్చు రీతిగా
నరవమునందు, పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో.
*(పోతన తెలుగులో వ్రాసిన భాగవతాన్ని యతడు తమిళంలో వ్రాసాడని)*
(1)
రిప్లయితొలగించండిచంపకమాలిక:
ధరణిన కంబనుండొకడు ధన్యుడు రామునిగాథ వ్రాసెనే
అరవమునందు., పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసె పో
వరముగ రామదర్శనము
వాలిన భక్తిఫలంబుగాకృపా
ఝరులుగ వేద
శాస్త్రముల సారమునే తెనుగింపనెంచి శ్రీ
కరమగు కృష్ణ లీలలిక కర్షకయోగికి కానరాగ సం
బరముగ బుట్టెనౌషధము భాగవతంబుజగద్ధితంబుగన్
(2)
(తేటగీతి పాదం కందపద్యంలో)
కం.
అరుణాచల,రామేశ్వర,
తిరుచెందూర్,కంచి,పలని దివ్యస్థలములా
*యరవమున*!;;;*వ్రాసె పోతన*
*హరి కథలను** భాగవతమహాగ్రంథముగన్
పరమపదముకై చొక్కిలి పద్మనాభు
రిప్లయితొలగించండికరుణకై తెన్గు భాషలో పరవశమిడు
విరివనమున ప్రశాంతత వెల్లివిరియ
నరవమున వ్రాసెఁ బోతన హరికథలను
పరమపదమ్ముకై కొసరి పంకజనాభ కృపావలంబియై
పరుగులు తీయు చిత్తమునఁ, వ్యాసుడు వ్రాసిన గ్రంథరాజమున్
సరియగు రీతి తెన్గునఁ, బ్రశాంతత నిండిన పూలతోటలో
నరవమునందు పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
[అ + రవము = అరవము (శబ్దము లేకుండా - నిశ్శబ్దముగా)]
తే.గీ: ఆదిభట్ల వారలు చెప్ప నాంధ్రముననె
రిప్లయితొలగించండిహరికథలను మా తాతయ్య యరవ దేశ
మున వసించుట తమిళులు మురియు రీతి
నరవమున వ్రాసెఁ బో ! తన హరికథలను”
(ఆదిభట్ల నారాయణ దాసు గారు తెలుగు లో హరికథలు వ్రాస్తే మా తాతయ్య అరవం లో హరికథలు వ్రాసాడని ఒక మనుమడు చెప్పుకొన్నాడు.)
చంపకమాల:
రిప్లయితొలగించండిసురచవిగొన్న యుక్కివుడు సొచ్చెపుమైకమునందు జిక్కి క
ప్పరమున నేస్తగానిఁగని బల్కె నవాకుచెవాకు లిట్టులన్
అరవమునందు పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
వరముగ వ్యాసుడాంధ్రమున వ్రాసెను భారతగాథనింపుగన్
చం:అరయగ రామగాథను మహాకవు లెందెరొ వ్రాసినారు సం
రిప్లయితొలగించండిబరమున , వ్రాసినారు కద భారతమున్ గడు సొంపు మీరగా
నరవమునందు, పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
సురుచిర మైన తెల్గునను చూడము తాదృశ మన్య భాషలన్.
చం॥ తరుణమునందు స్ఫూర్తిఁ గని ద్రావిడ భాషల యందుఁ జక్కనౌ
రిప్లయితొలగించండితెరగున కావ్య మాధురులు దీపిల సృష్టినిఁ జేసిరెందరో!
అరయఁ దిరుక్కురళ్ మిగుల యాదర మొందుచు నొప్పె సర్వదా
అరవమునందు, పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
(అవునండి ఈ సమస్య మునుపు ఇచ్చినట్టుగా నాకు కూడా అనిపిస్తున్నదండి లీలగా. నాకు మళయాళము తెలియదు కానీ తమిళు కన్నడ తెలుగు మధ్యలో చాలా సామ్యాలున్నాయండి. హళెగన్నడ తమిళు మధ్య వ్యత్యాసం కూడ చాలా తక్కువ)
సురుచిరమైన రామ కథ సుందర కావ్యము వ్రాసి రెందరో
రిప్లయితొలగించండివరముగ తెల్గునన్, మధుర భారతమున్ లిఖియించ తెల్గున
న్నరవము నందు, పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
స్థిరమగు భక్తితో తెలుగు, చెన్నుగ పాడగ నిచ్చతోడుతన్
పరమ భాగవతుండును భక్త వరుఁడు
రిప్లయితొలగించండిరాఘ వాంకితముగ గొప్ప రచన సేసెఁ
బండితులు పామరులు గూడ దండిగ విన
న రవమున వ్రాసెఁ బోతన హరి కథలను
[అ రవమున = ధ్వని సేయక]
నరపతి కీయ కంకిత మనంతున కా రఘు వంశ సూతి కి
చ్చి రుచిర భంగినిం దెనుఁగు సేత నొనర్చె నశేష భక్తిమై
స్థిర మతి నెందఱో యనువదింప ముదమ్మున సుందరమ్ముగా
నరవము నందుఁ బోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో
6/4/2026 నాఁటి సదృశ పూరణములు:
నరవరులు! నిశ్చయమ్ముగఁ
గెరలిన దిప్పగిది యలరి గిరలను మీ రె
ల్లరును వినఁగ నేనే కా
ద రవమునం, దిక్కనయె మహాకవి సుమ్మీ
పుర జను లంద నచ్చెరువు భూతల నాథున కర్పణమ్ముగా
సురుచిర శబ్ద సంయుతము శుద్ధ కవీంద్రుఁడు బట్టు మూర్తియే
గురువుగ నెంచి తిక్కనను గోవిదు, నింపగు తెన్గు నంద, కా
దరవము నందుఁ దిక్కన మహాకవి, వ్రాసెను ద్వ్యర్థి కావ్యమున్
తేటగీతి
రిప్లయితొలగించండిరామ చంద్రుని యాజ్ఞతో రమ్యముగను
వాణి నోదార్చి కైవల్య పథమునెంచి
కావ్యకన్యకనమ్మియు కాసులందు
నరవమున, వ్రాసెఁ బోతన హరికథలను
రవము = చప్పుడు
అరవము = చప్పుడు లేక
చంపకమాల
ధరణిజ నాథుడే పిలిచి ధన్యత గూర్చెడుశౌరిగాథలన్
మెరయగ వ్రాయుమా యనగ మేలని శారదనూరడించుచున్
దొరలకు నమ్మి కావ్యమును దోసిట విత్తములందు రీతిగా
నరవమునందు పోతన మహాకవి భాగవతమ్ము వ్రాసెఁ బో!
,,
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
సుబ్రమణ్య భారతి కడు సుందరముగ
రచన చేసెను పెక్కగు గ్రంథములను
నరవమున; వ్రాసెఁ బోతన హరికథలను
తెలుగు జాతికి నర్ధమౌ తీరులోన.