(2)చం:పలువిధ కష్టముల్ బడెడు భక్తుని తో నిటు బల్కె వాని చిం తల దొలగించ నర్చకుడు " ధర్మసుతున్ హరి గావ లేదె? ధు ష్టులయిన కౌరవుల్ తుదకు క్షోభనె పొందరె ?రాజ్యదంభదా సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్” (అర్చకుడు భక్తునికి ధైర్యం చెప్పాడు. రాజ్య దంభానికి దాసులైన కౌరవుల భరతం పెట్టిన హరి నిన్ను కాపాడతాడు అని. జ్ఞానవంతు డైన అర్చకుడు మెకానికల్ గా తీర్థ ప్రసాదాలు ఇచ్చి దక్షిణ తీసుకొని సంతృప్తి పడడు. భక్తులకి నాలుగు మంచి మాటలు కూడా చెపుతాడు.)
చంపకమాలిక
రిప్లయితొలగించండివెలసెనువేదవేద్యుడిలవిశ్వజనావళినుద్ధరించ శ్రీ
నిలయుడు గోపికాహృదయనిత్యరసోన్మయభక్తిగమ్యుడై
కలయుచు చిత్తనిష్క్రియతకైజడభావముబాపుచుండగన్
తలతురు దేహభావమున తత్త్వమెఱుంగక మూఢచిత్తులా
*“సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్”**?
(తేటగీతి సమస్యా పాదం కందంలో)
కం.
వినవలె వీనులలరకృ
ష్ణునిలీలలు దుష్టరాక్ష *“సుల* *భరతముఁ బ*
*ట్టిన హరి శుభము* *లిడుత”** జై
యనవలె నొవ్వంగనోరునచ్యుతుబొగడన్
అరయ గ దన ప సితనము నందె రక్క
రిప్లయితొలగించండిసుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
జరుగుననెడి నమ్మిక తోడ జనసమూహ
మెల్ల నతనిని కీర్తించ నెంచు కొనిరి
(3)
రిప్లయితొలగించండితే.గీ.
దొరకునాజన్మముమరల? దుష్టరాక్ష
*సుల* *భరతముఁ బట్టిన హరి శుభము* *లిడుత”**
వాసుదేవ, గోవింద,గోవర్ధన,హరి
యనుచు కీర్తించవెమనసా! అహమువిడుమ!
(4)
ఆ.వె.
సుఖమునొసగరాక్ష *సుల భరతముఁ* *బట్టి*
*న హరి శుభము*లిడుత* నందనంద
నా!ముకుంద! చిద్ఘనా! యశోదకిశోర!
యనుచు నోరునొవ్వగనుడువుముర.
రిప్లయితొలగించండిశిష్ట జనుల రక్షించుచు దుష్ట జనుల
కోలు పుచ్చగ నెంచుచు కువల యమున
నెన్నొ మార్లు తా నవతార మెత్తి రాక్ష
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత.
పలువురి ఇండ్లు జేరి సహ భావుల తోడను మంథజమ్ము మ్రు
చ్చిలుకొను వాడె పూతనను చెండెను శైశవ రూపమందునన్
ఖలు శిశుపాలునిన్ నరకు కాపురుషుండగు మేన మామ కం
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్.
తేటగీతి
రిప్లయితొలగించండిధర్మరక్షణార్థము నవతారమెత్తి
దుష్ట సంహారమొనరించి శిష్టులెల్ల
సేమమొందగ నెంచుచు క్షితిని రాక్ష
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
చంపకమాల
ఇలకు పరాత్పరుండు దిగి యింపుగ లీలలఁ జూపి ధర్మ మం
దలమున రాణ కెక్క నవతారము దాల్చెను ధర్మరక్షకై,
కలతల నింపి లోకమున కర్కశ రీతి చరించునట్టి కం
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
తే.గీ: భాగవతపఠనమ్ము జే బట్టితివట
రిప్లయితొలగించండిమాయ నెరుగనట్టి యశోద ,మన్ను తింటి
వనుచు దండించ భరియించు నట్టి భక్త
సులభ రతముఁ బట్టిన హరి శుభము లిడుత”
(నీవు భాగవతపఠనం చేస్తున్నందుకు సంతోషం.అమాయకు రాలైన యశోదమ్మ దండిస్తుంటే భరించిన భక్తసులభ రతం పట్టిన హరి నిన్ను రక్షించు గాక. )
(2)చం:పలువిధ కష్టముల్ బడెడు భక్తుని తో నిటు బల్కె వాని చిం
రిప్లయితొలగించండితల దొలగించ నర్చకుడు " ధర్మసుతున్ హరి గావ లేదె? ధు
ష్టులయిన కౌరవుల్ తుదకు క్షోభనె పొందరె ?రాజ్యదంభదా
సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్”
(అర్చకుడు భక్తునికి ధైర్యం చెప్పాడు. రాజ్య దంభానికి దాసులైన కౌరవుల భరతం పెట్టిన హరి నిన్ను కాపాడతాడు అని. జ్ఞానవంతు డైన అర్చకుడు మెకానికల్ గా తీర్థ ప్రసాదాలు ఇచ్చి దక్షిణ తీసుకొని సంతృప్తి పడడు. భక్తులకి నాలుగు మంచి మాటలు కూడా చెపుతాడు.)
చం॥ వలచిన వారి పెన్నిధిగ భక్తికిఁ బట్టముఁ గట్టు దేవుఁడై
రిప్లయితొలగించండితలఁపుల నింపి భామలటు తత్పరతా ధృతి వేడఁ జేకొనన్
మెలఁపుగ వారి ప్రార్థనల మెచ్చుచుఁ దప్పకఁ జేర దీసెడిన్
సులభ రతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
(అందరూ వారికి వారుగా కృష్ణుని కోరుకున్న వారలే కదండి)
కొలువుము గీత బోధకుని కూరిమి
రిప్లయితొలగించండితోడను చిత్తశుద్ధితో
గలతను జేందబోకు నిను గాచును
దుష్టుల బారినుండియున్
కలులనుసంహరించెగద గండర
గండుడ నేకవేళ దో
సుల భరతంబు బట్టిన యశోనిధి
కృష్ణుడు గావుమిమ్ములన్"
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిభక్త లోక నిరంతర పాలకుండు
రిప్లయితొలగించండిమత్త మాతంగ సన్నుత మాధవుండు
శిష్ట జన సంచయమును రక్షించి తామ
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
జలజ నిభాక్ష నీల ఘన సన్నిభ సుందర గాత్ర భాసితుం
డలఘు బలాన్వితుండు సుజనావన కార్య దురంధరుండు స
ల్లలిత పదాబ్జ నర్తన కళా మహిమన్ యము నాపగా నివా
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
క్లేశమెదురైన సమయాన గిరిఁ ధరించి
రిప్లయితొలగించండికురు సభాస్థలిఁ ద్రౌపతి పరువు గాచి
శిష్ట రక్షణ చేబూని దుష్ట రాక్ష
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
నిలువగ నీడకై నగమునే పెకలించిన శైలధారియున్
వలువల నిచ్చి ద్రోవదిని పన్నుగ కాచిన వాసుదేవుడున్
ఖలులను మట్టుపెట్టి తగఁ గచ్చిత మైన విధంబునన్ గరా
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
ఇలపయి బుట్టె నజుడుపేంద్రుడు కావ ప్రజాళి నిచ్చ గొ
రిప్లయితొలగించండిల్లలుగ జనించగా సురలు రక్తిని, కానల నుండు దైత్య జా
తులు కడు దుష్టులై సతము దుఃఖములన్ బొనరించ, గోత్రవా
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
తేటగీతి:
రిప్లయితొలగించండిధర్మ సంస్థాపనార్థము ధరణియందు
దుష్టజనులను శిక్షించి శిష్టజనుల
పూనికను గాఁవ పలుమార్లు బుట్టి రక్క
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత
చంపకమాల:
పలువురు రాక్షసాధములు బాలకుడైన యశోదనందనున్
బలిమిని జంపబూనుకొని వారలె చచ్చిరి కృష్ణు జేతిలో
నిలుపఁగ ధర్మమీ భువిని నీమము బూని జనించియా నరా
సుల భరతమ్ముఁ బట్టిన యశోనిధి కృష్ణుఁడు మిమ్ముఁ బ్రోచుతన్
(నరాసుడు=రాక్షసుడు)
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ధర్మమును నిలబెట్టగ ధరణి యందు
దుష్టులకు శిక్ష వేయుచు శిష్టుల నిల
రక్ష చేయగ నియమముల విడు రాక్ష
సుల భరతముఁ బట్టిన హరి శుభము లిడుత!