తే.గీ:రక్ష జేసె జన్నము బాల రాముడు కద! రాజ్యమును వీడె దశరథ రాముడు భళ! రావణుం జంపె జానకిరాముఁడు,గన నిన్ని రాములు నొక్క రామన్న గాదె! (తాటకని చంపినప్పుడు బాల రాముడే. రాజ్యమును పితృభక్తి తో వదలి నప్పుడు దశరథ రాముడు. రావణుణ్ని చంపింది జానకి కోసం కనుక జానకి రాముడు. ఎన్ని రకాల రాముళ్లైనా ఒక్క రాముడే. )
వానర యోధులు జానకమ్మ తో..
రిప్లయితొలగించండితేటగీతి
దివ్యరూపుని రాముని దేవునిగను
వినఁగఁ జెప్ప విభీషణు వినక యనిని
వైరి గా నిల్చి యెదిరించఁ బాపమదియె
రావణుం జంపె, జానకి! రాముఁడు గన
ఉత్పలమాల
తొలగించండిపావనిఁ జేర్చి లంకకును భ్రాతలుఁ, బత్నియు వీడమన్నఁ దాఁ
జేవను గల్గువాడనని జేయఁగ యుద్ధము కన్ను గానకన్,
'సేవకులైన వానరులుఁ జేరియు జుట్టు మహోగ్రరూపులై',
రావణుఁ జంపె, సీత! రఘురాముఁడు, 'సూడఁగ యుద్ధభూమిలో'
ధరణిజను విడి మపించగ దలచి , వెడలె
రిప్లయితొలగించండిలంకకు హనుమతోడుత , రణము నందు
రావణుంజంపె జానకిరాముఁడు , గన
జనులకూడి మెచ్చుకొనెను జానకియును
రిప్లయితొలగించండివారి రాశి దాటుచు లంక జేరనచట
భండనమ్మున నా రామబాణమదియె
రావణుం జంపె జానకి, రాముఁడు గన
ధర్మ రక్షకుడె నిజము ధరణియందు.
ఆవహమందు రాక్షసుని యంతము జేయుమటంచు లంకలో
పావనిచెప్పెనంచు కపిపల్కగ భండనమందు రాముడే
రావణుఁ జంపె సీత, రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
చేవను జూపి దానవుల చెండి విభీషణు రాజుసేసెనే.
రావణుఁ సంహరించినది రాఘవుడైనను సంగరమ్మునన్
రిప్లయితొలగించండిభావనసేయ రావణుఁడు ప్రక్షయమొందెను సీతవల్లనే
చావును గోరి తెచ్చుకొనె జానకినిం గొనివచ్చి, కావునన్
రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
తే.గీ:రక్ష జేసె జన్నము బాల రాముడు కద!
రిప్లయితొలగించండిరాజ్యమును వీడె దశరథ రాముడు భళ!
రావణుం జంపె జానకిరాముఁడు,గన
నిన్ని రాములు నొక్క రామన్న గాదె!
(తాటకని చంపినప్పుడు బాల రాముడే. రాజ్యమును పితృభక్తి తో వదలి నప్పుడు దశరథ రాముడు. రావణుణ్ని చంపింది జానకి కోసం కనుక జానకి రాముడు. ఎన్ని రకాల రాముళ్లైనా ఒక్క రాముడే. )
ఉ:"నీ వొక గడ్డి పోచ"వని నీచపు దృష్టిని జూపి "యింతటన్
రిప్లయితొలగించండిజావును దప్పు కొమ్మనుచు జంకక మాటల తోనె దుష్టుడౌ
రావణుఁ జంపె సీత, రఘురాముఁడు, సూడఁగ యుద్ధభూమిలో
రావణు గూల్చుటన్న నట రాలెను భౌతిక
రూపమే కదా!
(సీత రాముణ్ని మాటల తో ఎప్పుడో చంపేసింది. యుద్ధం లో రాముడు చంపింది భౌతికరూపాన్నే.)
బెదరక యశోకవనమున కుదురుకొన్నఁ
రిప్లయితొలగించండిదెవడెనుగద వైదేహి తాను విసిగించి
రావణుం జంపె జానకి! రాముఁడు గన
వచ్చె నలసట లేక నా వహమునందు
రావణుఁడా మహీసుతను గ్రక్కున నుంచె నశోకమందు నె
త్తావులు స్వాగతించునెడఁ! దాఁ విసికించుచు నిక్కమారయన్
రావణుఁ జంపె సీత! రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
జీవము లేనిరావణునిఁ జివ్వున గూల్చెను సంతసంబునన్!
మరణమును గోరి జానకీ మాతను గొని
రిప్లయితొలగించండిరావణుఁడు దెచ్చి బంధించె లంకయందు
దుష్ట దనుజుని శిక్షింప దురమునందు
రావణుం జంపె జానకిరాముఁడు గన
ఉ॥ ఆవిధి రామ గాథ విని యార్ద్రతఁ గాంచుచు జానకీ సతిన్
రిప్లయితొలగించండిభావన మీర మెచ్చుకొని భక్తినిఁ దల్చుచుఁ దత్పరుండనై
నోవును బొంది కష్టములనున్ గని తూగఁగ స్వప్నమందునన్
రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
మరొక పూరణ అండి
(పంప రామాయణములో లక్ష్మణుడు రావణుని వధించి నట్టుగా మరొక ప్రాంతములో సీత వధించినట్టుగా వ్రాసుకున్నారని)
ఉ॥ భావము మార్చి వ్రాయటయుఁ బ్రాభవ మొందఁగ గాథ చూడమే
ఆవిధి నొక్క ప్రాంతమున నమ్మను కొల్చెడి సంప్రదాయమే
పావనమై చనంగ నట వారల కావ్యము నందు క్రోధియై
రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
నిక్కముం బరికింపఁగఁ జక్కఁగాను
రిప్లయితొలగించండిదశముఖుఁడు సీత శోకాగ్ని దగ్ధుఁ డయ్యె
నాత్ర మంద నేల నిమిత్తమాత్రుఁ డౌను,
రావణుం జంపె జానకి, రాముఁడు గన
దైవ మలంఘనీయ మగుఁ దప్పిన ధర్మము ధాత కైననుం
జేవ నశించు నన్న నది చిత్రము కాదు చతుర్దశమ్మునన్
వావిరి పాప నాశన మవార్యము కావఁగఁ జాల దక్కటా
యే వర మైన నిత్య నయ హీనునిఁ జేసిన దుష్కృతమ్ములే
రావణుఁ జంపె సీత రఘురాముఁడు సూడఁగ యుద్ధ భూమిలో
[సీత రఘురాముఁడు = సీత యొక్క రఘు రాముఁడు]
కావరుడై చెలంగుచును కైకసి పుత్రుడు దాల్చి యస్త్రముల్
రిప్లయితొలగించండిభూవరులైన మానవుల పోరున చంపెద నంచు ప్రేలగా
పావనుడైన రాఘవుడు ప్రార్థనతో విడి బ్రహ్మయమ్ము నా
రావణుఁ జంపె సీత! రఘురాముఁడు సూడఁగ యుద్ధభూమిలో
కరణం రాజేశ్వరరావు
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
లంక యందున బంధించ రావణుండు
హనుమ సీతను కనుగొన వనమునందు
వానరుల సాయమున వచ్చి వార్ధి దాటి
రావణుం జంపె జానకిరాముడు, గన
భయము సుంతయు లేకను భండనమందు.
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
(సవరణతో....)
లంక యందున బంధించ రావణుండు
హనుమ సీతను కనుగొన వనమునందు
వానరుల సాయమున వచ్చి వార్ధి దాటి
రావణుం జంపె జానకిరాముడు,గన
భయము సుంతయు లేకను భండనమున.