15, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5621

16-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”

(లేదా...)

“కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో”

(న.చ. సాహిత్ శతావధానంలో జంధ్యాల సుబ్బలక్ష్మి గారి సమస్య)

16 కామెంట్‌లు:



  1. అరయగ జరిగిన భీకర
    కురుపాండవయుద్ధమందు గూలిరనేకుల్
    తరమౌనా లెక్కించగ
    “కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
    గండూరి

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఇరుదేశమ్ముల దురమున
    జరిగెను నరమేధ మెపుఁడు జరుగని రీతిన్
    ఒరిగెను నేలకు మనుజుల
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్

    రిప్లయితొలగించండి

  3. పరమాత్ముండా శ్రీహరి
    తిరుమలపై నిలిచె నంచు తిరువడు లెల్లన్
    దరలగ తిరువెంగడమున
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్.


    అరమెయి జోదు వాడు త్రిపురాంతకు డాతడె వేడి నంత యు
    ద్ధరణము నిచ్చు వాడని సదాగతి గోరుచు భక్తు లెందరో
    ఖరువు సమీక్షణమ్ము కయి కాశి పురంబున కేగు నట్టి యా
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో.

    రిప్లయితొలగించండి
  4. దురము కొనసాగిన యెడల
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
    ధరణిపయి చెదరి యుండుట
    నరయగ , నెవరికయిన నెద యలజడి నొందున్

    రిప్లయితొలగించండి
  5. భరతావనికి స్వతంత్రము
    దొరయింపగ నుద్యమమున దూఁకిన పిదపన్
    మరిదెబ్బల నోర్చినవగు
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్

    తరమగు వాంఛితమ్మని స్వతంత్రము గావలెనంచుఁ బల్కుచున్
    బిరబిరఁ బౌరులెల్లరును వెన్కకు బంపగ తెల్లవారలన్
    వెరవక నుద్యమింప మరి బెత్తపు దెబ్బల నోర్చినట్టివౌ
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో

    రిప్లయితొలగించండి
  6. కం: నరజాతిచరిత్ర యనగ
    పరపీడన పరత గాక స్వర్ణయుగములే
    నరపతుల కొరకు తెగినవి
    కరచరణాల్ గోటులు దలకాయల్ లక్షల్”
    (ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం- మహాకవి శ్రీ శ్రీ.)



    రిప్లయితొలగించండి
  7. చం: నరపతిముఖ్యులంచు బదునాలుగు పేర్లను వ్రాయ నద్దియే
    చరిత మటన్న జాలు నొకొ? జాతుల యుచ్ఛ వినాశనమ్ములన్
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో
    గురుతరపాత్ర మోసినవి కూడదు వానిని విస్మరించుటల్.
    (కేవలం కొందరు రాజుల కథలు అసలు చరిత్ర కాదు. ప్రతి జాతి యొక్క ఉత్థాన పతనాలలో అనేక కరచరణాలు అనగా భౌతికశ్రమ, తలకాయలు లక్షలు అనగా మేధాశక్తి, గుండె లెన్నియో అనగా ప్రజల దేశభక్తి,విప్లవావేసం మొదలైన ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. )




    రిప్లయితొలగించండి
  8. చం॥ కరుణకు తావు లేకనటు కౌరవ పాండవ యుద్ధ మొప్ప భీ
    కరముగ నిత్యమా పగిదిఁ గాలము చెల్లిన వారలెందరో
    హరహర చెప్ప శక్యమొకొ అయ్యయొ లెక్కకు మించి పోయెనే!
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో!

    రిప్లయితొలగించండి
  9. "కరచరణాలు గోట్లు దలకాయలు
    లక్షలు గుండెలెన్నియో"
    జరిగెన్ కౌరవ పాండవేయులకిలన్
    సంగ్రామమేపారగా
    నిరు పక్షంబుల బంధుమిత్రులనిలో
    నింపార నిల్చుండగన్
    పరగన్ మ్రోలను సవ్యసాచి హితులన్
    భాత్రాదులన్ గాంచె, చూ
    "పరులం గాంచిన పాండనందుడని
    విభ్రాంతుండునై భీతిలెన్.

    గండూరి

    రిప్లయితొలగించండి
  10. నర రూప రాక్షసులు నేఁ
    టి రాజు లతి నిర్దయులు కుటిల రణ చతురుల్
    దురమున నక్కట తెగినవి
    కర చరణాల్ గోటులు దలకాయల్ లక్షల్


    చరిత మనర్హ మైన నెద జాలి గుణం బది లేక మాన వో
    త్కరమున సుంత చిత్త మిడఁ గాసుల వంచక వైద్య నేతకున్,
    గరిమ నొసంగ నాయము సుఖమ్ముగ వైద్యులు విక్రయింపఁగాఁ
    గర చరణాలు గోట్లు దల కాయలు లక్షలు, గుండె లెన్నియో

    [కర చరణాదులు = అవయవములు; వైద్య నేతకున్ గుండె లెన్నియో]

    రిప్లయితొలగించండి
  11. జరిగెను భారతావనిని సంగ
    రమెంతొ భయంకరమ్ముగా
    కురు వరపాండవేయులకు గూలిరి
    నేల కనేక సైన్యమున్
    కరులునశ్వసమూహములు గాంచగ
    లెక్కకురాని యంగముల్
    "కరచరణాలు గోట్లు తలకాయలు
    లక్షలు గుండెలెన్నియో!"
    గండూరి

    రిప్లయితొలగించండి
  12. తిరుమల క్షేత్రమందు జగదేకవిభుండగు వేంకటేశునిన్
    శరణని మ్రొక్కిచేయు జనసంద్రపు ఘోషలు మిన్నునంట సం
    బరముగసాగు భక్తజనపాళిని లెక్కిడ సాధ్యమౌనొకో
    కరచరణాలు గోట్లు దలకాయలు లక్షలు గుండె లెన్నియో

    రిప్లయితొలగించండి
  13. జరిగిన. ఘోర రణంబున
    మరణంబులు సంభవించమరిమరి. గాంచన్
    తిరముగ నచ్చట. గన నగు
    కర చ, ర నా లు కోట్లు తల కాయలు లక్షల

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఇరు సైనికు లొకరినొకరు
    కరవాలమ్ముల శరముల కదనమునందున్
    నరుకగ తెగిపడి నట్టివి
    కరచరణాల్ గోటులుఁ దలకాయలు లక్షల్.

    రిప్లయితొలగించండి