18-10-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్షీరాబ్ధిసుత మనువాడె శివుని ముదముతో”
(లేదా...)
“క్షీరాంభోధితనూజ శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”
(న.చ. సాహిత్ శతావధానంలో కౌండిన్య తిలక్ గారి సమస్య)
నారాయణుని కళత్రము క్షీరాబ్ధిసుత ; మనువాడె శివుని ముదముతోమేరువు దౌహిత్రి గిరిజ ,దేవుల దేవేరుల కథ తెలియగ మేలౌ
కందంగౌరీదేవి వినతితోఁదీరియుఁ గుడిచి గరళము, దివ్య భవమునన్సారించి చూప హరినిన్క్షీరాబ్ధిసుత మనువాడె! శివుని ముదముతోశార్దూలవిక్రీడితము గౌరీదేవి విషమ్ము గ్రోలమనగన్ గల్లోలమున్ బాపఁగన్ధారాళంబుగ గ్రోలి నీలగళుడై, ద్రచ్చన్ సుధన్ బొందగన్బారావార భవానఁ జూప 'హరినిన్' భాగ్యంబుగానొప్పుచున్క్షీరాంభోధితనూజ శంకరునిఁ, 'దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్!'
ఘోరమగు తపము వీడుచు తారక సంహారిని గన త్ర్యక్షుండౌనన్ గౌరియు తపమును విడి హే క్షీరాబ్ధిసుత,! మనువాడె శివుని ముదముతో.ఆ రేద్రిమ్మరి తారకా సురుని సంహారమ్ము నే జేసెడిన్ ధీరుండైన సుతున్ గనన్ నగజ యా దేవేశి యే పేర్మితో భారంబంచు దలంచకుండ సురలే ప్రార్థింప హే క్షీరాంభోధితనూజ,! శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్.
కోరి హరిని మనువాడెను“క్షీరాబ్ధిసుత, మనువాడె శివుని ముదముతో”గౌరియె, సారసగర్భుని సౌరుగ మనువాడె వాణి సంతసమొదవన్
శౌరిన్ కోరి వరించి ప్రాణవిభుగా సాధించె నందంబుగాక్షీరాంభోధితనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్గౌరీదేవి తపంబొనర్చి, నలువన్ కాల్ద్రొక్కె నిల్లాలుగాధారాళమ్మగు ప్రీతి నెక్కొనఁగ విద్యాదేవి శ్రీవాణియే
కం:నారాయణు భాగ్యముగాక్షీరాబ్ధిసుత మనువాడె, శివుని ముదముతోఘోరమగు విషము మ్రింగగ దార యె యురికించె నివియె దైవమహిమలౌ.
నీరేరుహోదరుడ నాక్షీరాబ్ధిసుత మనువాడె; శివుని ముదముతోగౌరి మనువాడె కడకున్ఘోరతపమున వరము సమకూడినదనుచున్ పారావారముఁ జిల్కు వేళ కలిగెన్ బద్మాలయోద్భానమేధీరోధాత్తుడు విష్ణువే తన మదిన్ దీపింపఁ జేపట్టెనాక్షీరాంభోధితనూజ; శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్ఘోరంబౌ తపమాచరించి సతి సంకోచంబులే తొల్గగా [పద్మాలయ + ఉద్భానము = పద్మాలయోద్భానము (లక్ష్మి జననం)]
క్రమాలంకార పూరణ శా॥ పారావారముఁ జేర్చు కేశవుని నుద్వాహమ్మునన్ గైకొనెన్ధారాళమ్ముగఁ బ్రోచు నీతఁడనుచున్ దైత్యాళి భావించిరే!ఆరాధించుచుఁ గృష్ణు రుక్మిణియె యాహ్వానించి మోదమ్ముతోక్షీరాంబోధి తనూజ, శంకరునిఁ, దాఁ జేపట్టె బ్రాణేశుగన్
శా:క్షీరాంబోధి మథించు వేళ హరినే చేబట్టి శ్రీమూర్తియౌక్షీరాంభోధితనూజ,శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”స్త్రీరత్నమ్మగు గౌరి సర్పధరునిన్ సేవించి యీ యిర్వురున్ వేరౌ రీతుల జ్ఞాన సంపదల సాధ్వీ మాతలే మ్రొక్కగన్.
ఆరయ శివుఁ డన్నను శుభకారి యని నెఱుంగ వచ్చుఁ గమనీయముగా నారాయణుండు శివుఁడే క్షీరాబ్ధి సుత మనువాడె శివుని ముదముతో సారానంత ధనప్రదాయిని సదా సౌభాగ్య సంయుక్త యాక్షీరాంభోధి తనూజ చక్రిఁ దమిఁ దాఁ జేపట్టఁ బ్రాణేశుగా సారాచార సువేత్త్రి శీత నగ రాట్సంజాత, లేకున్న నా క్షీరాంభోధి తనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్ [పార్వతీ కల్యాణము నాఁటికి లక్ష్మీ దేవి యింకను క్షీర సముద్రము నుండి పుట్ట లేదు.]
ఆరయ నారాయణు నే క్షీరా బ్ది సుత మనువా డె :: శివుని ముదము తో కోరి తపంబు న పతి గా వారిజ నేత్ర యె వరించె వలచియు సుకవీ!
నారాయణుని కళత్రము
రిప్లయితొలగించండిక్షీరాబ్ధిసుత ; మనువాడె శివుని ముదముతో
మేరువు దౌహిత్రి గిరిజ ,
దేవుల దేవేరుల కథ తెలియగ మేలౌ
కందం
రిప్లయితొలగించండిగౌరీదేవి వినతితోఁ
దీరియుఁ గుడిచి గరళము, దివ్య భవమునన్
సారించి చూప హరినిన్
క్షీరాబ్ధిసుత మనువాడె! శివుని ముదముతో
శార్దూలవిక్రీడితము
గౌరీదేవి విషమ్ము గ్రోలమనగన్ గల్లోలమున్ బాపఁగన్
ధారాళంబుగ గ్రోలి నీలగళుడై, ద్రచ్చన్ సుధన్ బొందగన్
బారావార భవానఁ జూప 'హరినిన్' భాగ్యంబుగానొప్పుచున్
క్షీరాంభోధితనూజ శంకరునిఁ, 'దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్!'
రిప్లయితొలగించండిఘోరమగు తపము వీడుచు
తారక సంహారిని గన త్ర్యక్షుండౌనన్
గౌరియు తపమును విడి హే
క్షీరాబ్ధిసుత,! మనువాడె శివుని ముదముతో.
ఆ రేద్రిమ్మరి తారకా సురుని సంహారమ్ము నే జేసెడిన్
ధీరుండైన సుతున్ గనన్ నగజ యా దేవేశి యే పేర్మితో
భారంబంచు దలంచకుండ సురలే ప్రార్థింప హే
క్షీరాంభోధితనూజ,! శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్.
కోరి హరిని మనువాడెను
రిప్లయితొలగించండి“క్షీరాబ్ధిసుత, మనువాడె శివుని ముదముతో”
గౌరియె, సారసగర్భుని
సౌరుగ మనువాడె వాణి సంతసమొదవన్
శౌరిన్ కోరి వరించి ప్రాణవిభుగా సాధించె నందంబుగా
రిప్లయితొలగించండిక్షీరాంభోధితనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్
గౌరీదేవి తపంబొనర్చి, నలువన్ కాల్ద్రొక్కె నిల్లాలుగా
ధారాళమ్మగు ప్రీతి నెక్కొనఁగ విద్యాదేవి శ్రీవాణియే
కం:నారాయణు భాగ్యముగా
రిప్లయితొలగించండిక్షీరాబ్ధిసుత మనువాడె, శివుని ముదముతో
ఘోరమగు విషము మ్రింగగ
దార యె యురికించె నివియె దైవమహిమలౌ.
నీరేరుహోదరుడ నా
రిప్లయితొలగించండిక్షీరాబ్ధిసుత మనువాడె; శివుని ముదముతో
గౌరి మనువాడె కడకున్
ఘోరతపమున వరము సమకూడినదనుచున్
పారావారముఁ జిల్కు వేళ కలిగెన్ బద్మాలయోద్భానమే
ధీరోధాత్తుడు విష్ణువే తన మదిన్ దీపింపఁ జేపట్టెనా
క్షీరాంభోధితనూజ; శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్
ఘోరంబౌ తపమాచరించి సతి సంకోచంబులే తొల్గగా
[పద్మాలయ + ఉద్భానము = పద్మాలయోద్భానము (లక్ష్మి జననం)]
క్రమాలంకార పూరణ
రిప్లయితొలగించండిశా॥ పారావారముఁ జేర్చు కేశవుని నుద్వాహమ్మునన్ గైకొనెన్
ధారాళమ్ముగఁ బ్రోచు నీతఁడనుచున్ దైత్యాళి భావించిరే!
ఆరాధించుచుఁ గృష్ణు రుక్మిణియె యాహ్వానించి మోదమ్ముతో
క్షీరాంబోధి తనూజ, శంకరునిఁ, దాఁ జేపట్టె బ్రాణేశుగన్
శా:క్షీరాంబోధి మథించు వేళ హరినే చేబట్టి శ్రీమూర్తియౌ
రిప్లయితొలగించండిక్షీరాంభోధితనూజ,శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్”
స్త్రీరత్నమ్మగు గౌరి సర్పధరునిన్ సేవించి యీ యిర్వురున్
వేరౌ రీతుల జ్ఞాన సంపదల సాధ్వీ మాతలే మ్రొక్కగన్.
ఆరయ శివుఁ డన్నను శుభ
రిప్లయితొలగించండికారి యని నెఱుంగ వచ్చుఁ గమనీయముగా
నారాయణుండు శివుఁడే
క్షీరాబ్ధి సుత మనువాడె శివుని ముదముతో
సారానంత ధనప్రదాయిని సదా సౌభాగ్య సంయుక్త యా
క్షీరాంభోధి తనూజ చక్రిఁ దమిఁ దాఁ జేపట్టఁ బ్రాణేశుగా
సారాచార సువేత్త్రి శీత నగ రాట్సంజాత, లేకున్న నా
క్షీరాంభోధి తనూజ, శంకరునిఁ దాఁ జేపట్టెఁ బ్రాణేశుగన్
[పార్వతీ కల్యాణము నాఁటికి లక్ష్మీ దేవి యింకను క్షీర సముద్రము నుండి పుట్ట లేదు.]
ఆరయ నారాయణు నే
రిప్లయితొలగించండిక్షీరా బ్ది సుత మనువా డె :: శివుని ముదము తో కోరి తపంబు న పతి గా
వారిజ నేత్ర యె వరించె వలచియు సుకవీ!