18, అక్టోబర్ 2026, ఆదివారం

సమస్య - 5624

19-10-2026 (సోమవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు”

(లేదా...)

“పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా”

(న.చ. సాహిత్ శతావధానంలో హట్టి భానుమతి గారి సమస్య)

19 కామెంట్‌లు:

  1. తేటగీతి
    మూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగని
    పుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచి
    మాంస నైవేద్యమందించి మైమఱపున
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!

    మత్తకోకిల
    నైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగా
    సాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై
    రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతో
    పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!

    రిప్లయితొలగించండి
  2. పరమమును తనపయి దయ పరచమనుచు
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ;
    అటులనె పురజనుల కోర్కెలలవరించ
    బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు

    రిప్లయితొలగించండి


  3. పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!
    గరిక నర్పించి శ్రద్ధతో గజముఖుండా
    సన్నుతింతును సతతము సాకుమయ్య
    కినుక పూనకు నాయెడ కేలుమోడ్తు



    రిప్లయితొలగించండి

  4. సింధు జలమది చేపలుచ్ఛిష్ట మనుచు
    తగదు పూజకన్న నిక మాధవిని గోరి
    పుష్పకీటములవియేను ముట్ట నట్టి
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.


    వాజమయ్యది చేప లెంగిలి వాడకూడ దటంచు నీ
    పూజనీయులు పల్కినంతట పుష్ప కీటము తేనెపై
    మోజుతోడను వ్రాలనట్టివి మూర్ఖుడా కడు పూతమౌ
    పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా.

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. రాజ గృహమందు పండుగ రమ్యమనగ
      భృత్యులెల్లరు పూలకై వేగిరపడి
      మోజుగా గొని వచ్చిరా రాజు కడకు
      పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు

      రాజరాజు నివాసమందున రమ్యమైనది పండుగే
      సాజ మేమరి భృత్యులందరు సత్వరంబున సాగిరే
      మోజు తీరగ రాజ్యమందలి పూవులన్నియుఁ దెచ్చిరే
      పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా

      తొలగించండి
  6. తే.గీ.
    వరుణదేవుడు రోషించ కరుణమాలి
    క్షామమేర్పడె చినుకైన గానరాక
    నెండిపోయె నికుంజమ్ము లేమి సేతు
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు


    మత్తకోకిల:
    రోజురోజు వనమ్ముకుం జని లోకనాథుని భక్తితో
    పూజకై విరిబూవులన్ గొనిపోవ నేగఁగ నేడటన్
    భ్రాజితమ్మును గోలుపోయిన పాదపమ్ముల గాంచితిన్
    పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా

    రిప్లయితొలగించండి
  7. తే॥ పువులు దొరకున నిరుపేద పూజ కిపుడు
    ధరలు నధికమై పండుగ తరుణమందు
    దేవదేవ భక్తి గలదు దీనుఁడనయ
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు

    (సామాన్యంగా 100గ్రా 20రూ పండుగ తరుణములో 40రూ అండి)

    మత్త॥ రాజపుత్రుని పెండ్లి యంచును రమ్యమౌవిధి నచ్చటన్
    రాజిలంగను జేయఁ బూవులు రాజు గేహముఁ జేరఁగన్
    మోజుమీర నలంకరించఁగ మోద మొందఁగఁ బౌరులున్
    బూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా

    రిప్లయితొలగించండి
  8. తే.గీ: భక్తి యన బ్రదర్శన మయ్యె,ప్రజలు కనగ
    నగలు,ధనమును వచ్చెను మిగుల వచ్చె
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు, లేవు”
    భక్తియును, శ్రద్ధ సోకులే ప్రబలమయ్యె



    రిప్లయితొలగించండి
  9. ఉ;రాజితమ్మగు దేవళమ్మున ప్రార్థనన మ్మున కేగగా
    జాజి మల్లెలు, మొల్ల లాదిగ సర్వ జాతుల నీయ నే
    పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవు, లేకరు వయ్యెగా!
    ఈ జనమ్ముల పాటలే కడు నింపుగన్ బతుకమ్మకై.

    (నేను నానా రకాల పూలు తీసుకు వెళ్లగానే బతుకమ్మ పాటలు ఏకరువు పెట్టారు. )





    రిప్లయితొలగించండి
  10. కోరి పూజింప వె డ లితి కోవెల కట
    పూజ సేయ పీఠ మ్మున బువులు లేవు
    హృదయ సుమముల నర్పించి ముదము తోడ
    మ్రొ క్కు లి డి తిని శివునికి పెక్కు మార్లు

    రిప్లయితొలగించండి
  11. అనునయింప దుఃఖమ్మున నమ్మ లేదు
    చదువుకొనఁగఁ బొత్తమ్ములు గదిని లేవు
    నేను జేసిన పాపమ్ము గానరాదు
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు


    గాజు ముక్కలు రత్న రాసులు గావు పౌరుష హీనుఁడౌ
    రాజు గద్దె వహింప నెవ్విధి రాజ్య మేలును శూన్య పృ
    థ్వీజ రత్నచయంపుఁ బీఠము పీఠమే పరికింపఁగాఁ
    బూజ సేయఁగఁ బీఠ మందునఁ బూవులే కఱ వయ్యెఁగా

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఎల్ నినో ప్రభావము వల్ల నెండలెక్కు
    వయ్యె,మాడిపోయెను పూల వనములోని
    చెట్టులన్నియు, మ్రొక్కుచు శివుని కిపుడు
    పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.

    రిప్లయితొలగించండి