19-10-2026 (సోమవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు”
(లేదా...)
“పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా”
(న.చ. సాహిత్ శతావధానంలో హట్టి భానుమతి గారి సమస్య)
తేటగీతి మూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగనిపుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచిమాంస నైవేద్యమందించి మైమఱపునపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!మత్తకోకిలనైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగాసాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతోపూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పరమమును తనపయి దయ పరచమనుచు పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ; అటులనె పురజనుల కోర్కెలలవరించ బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!గరిక నర్పించి శ్రద్ధతో గజముఖుండాసన్నుతింతును సతతము సాకుమయ్యకినుక పూనకు నాయెడ కేలుమోడ్తు
మీ పూరణ బాగున్నది. అభినందనలు. "గజముఖుండ" అనండి.
సింధు జలమది చేపలుచ్ఛిష్ట మనుచు తగదు పూజకన్న నిక మాధవిని గోరి పుష్పకీటములవియేను ముట్ట నట్టి పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.వాజమయ్యది చేప లెంగిలి వాడకూడ దటంచు నీ పూజనీయులు పల్కినంతట పుష్ప కీటము తేనెపై మోజుతోడను వ్రాలనట్టివి మూర్ఖుడా కడు పూతమౌ పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా.
రాజ గృహమందు పండుగ రమ్యమనగభృత్యులెల్లరు పూలకై వేగిరపడిమోజుగా గొని వచ్చిరా రాజు కడకుపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవురాజరాజు నివాసమందున రమ్యమైనది పండుగేసాజ మేమరి భృత్యులందరు సత్వరంబున సాగిరేమోజు తీరగ రాజ్యమందలి పూవులన్నియుఁ దెచ్చిరేపూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
తే.గీ.వరుణదేవుడు రోషించ కరుణమాలిక్షామమేర్పడె చినుకైన గానరాకనెండిపోయె నికుంజమ్ము లేమి సేతుపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవుమత్తకోకిల:రోజురోజు వనమ్ముకుం జని లోకనాథుని భక్తితోపూజకై విరిబూవులన్ గొనిపోవ నేగఁగ నేడటన్భ్రాజితమ్మును గోలుపోయిన పాదపమ్ముల గాంచితిన్పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తే॥ పువులు దొరకున నిరుపేద పూజ కిపుడు ధరలు నధికమై పండుగ తరుణమందుదేవదేవ భక్తి గలదు దీనుఁడనయపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు(సామాన్యంగా 100గ్రా 20రూ పండుగ తరుణములో 40రూ అండి)మత్త॥ రాజపుత్రుని పెండ్లి యంచును రమ్యమౌవిధి నచ్చటన్రాజిలంగను జేయఁ బూవులు రాజు గేహముఁ జేరఁగన్మోజుమీర నలంకరించఁగ మోద మొందఁగఁ బౌరులున్ బూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
తే.గీ: భక్తి యన బ్రదర్శన మయ్యె,ప్రజలు కనగ నగలు,ధనమును వచ్చెను మిగుల వచ్చెపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు, లేవు”భక్తియును, శ్రద్ధ సోకులే ప్రబలమయ్యె
ఉ;రాజితమ్మగు దేవళమ్మున ప్రార్థనన మ్మున కేగగాజాజి మల్లెలు, మొల్ల లాదిగ సర్వ జాతుల నీయ నేపూజ సేయఁగఁ బీఠమందునఁ బూవు, లేకరు వయ్యెగా!ఈ జనమ్ముల పాటలే కడు నింపుగన్ బతుకమ్మకై.(నేను నానా రకాల పూలు తీసుకు వెళ్లగానే బతుకమ్మ పాటలు ఏకరువు పెట్టారు. )
కోరి పూజింప వె డ లితి కోవెల కట పూజ సేయ పీఠ మ్మున బువులు లేవు హృదయ సుమముల నర్పించి ముదము తోడ మ్రొ క్కు లి డి తిని శివునికి పెక్కు మార్లు
అనునయింప దుఃఖమ్మున నమ్మ లేదు చదువుకొనఁగఁ బొత్తమ్ములు గదిని లేవు నేను జేసిన పాపమ్ము గానరాదు పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు గాజు ముక్కలు రత్న రాసులు గావు పౌరుష హీనుఁడౌ రాజు గద్దె వహింప నెవ్విధి రాజ్య మేలును శూన్య పృథ్వీజ రత్నచయంపుఁ బీఠము పీఠమే పరికింపఁగాఁ బూజ సేయఁగఁ బీఠ మందునఁ బూవులే కఱ వయ్యెఁగా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఎల్ నినో ప్రభావము వల్ల నెండలెక్కువయ్యె,మాడిపోయెను పూల వనములోనిచెట్టులన్నియు, మ్రొక్కుచు శివుని కిపుడుపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.
తేటగీతి
రిప్లయితొలగించండిమూఢ భక్తితో కన్నప్ప పురహరుఁగని
పుక్కిటి జలాభిషేకాన మురిసి కొలచి
మాంస నైవేద్యమందించి మైమఱపున
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!
మత్తకోకిల
నైజమందున వాస్తవంబును నల్గురున్ గనవచ్చుగా
సాజమైనది భక్త కన్నని శంకరార్చన మూఢమై
రాజశేఖరుఁ గొల్చినెంగిట రంజుగా పలలమ్ముతో
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపరమమును తనపయి దయ పరచమనుచు
రిప్లయితొలగించండిపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు ;
అటులనె పురజనుల కోర్కెలలవరించ
బట్టినను ప్రభుత్వము కడ పణము లేదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు!
గరిక నర్పించి శ్రద్ధతో గజముఖుండా
సన్నుతింతును సతతము సాకుమయ్య
కినుక పూనకు నాయెడ కేలుమోడ్తు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"గజముఖుండ" అనండి.
రిప్లయితొలగించండిసింధు జలమది చేపలుచ్ఛిష్ట మనుచు
తగదు పూజకన్న నిక మాధవిని గోరి
పుష్పకీటములవియేను ముట్ట నట్టి
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.
వాజమయ్యది చేప లెంగిలి వాడకూడ దటంచు నీ
పూజనీయులు పల్కినంతట పుష్ప కీటము తేనెపై
మోజుతోడను వ్రాలనట్టివి మూర్ఖుడా కడు పూతమౌ
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిరాజ గృహమందు పండుగ రమ్యమనగ
తొలగించండిభృత్యులెల్లరు పూలకై వేగిరపడి
మోజుగా గొని వచ్చిరా రాజు కడకు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు
రాజరాజు నివాసమందున రమ్యమైనది పండుగే
సాజ మేమరి భృత్యులందరు సత్వరంబున సాగిరే
మోజు తీరగ రాజ్యమందలి పూవులన్నియుఁ దెచ్చిరే
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
తే.గీ.
రిప్లయితొలగించండివరుణదేవుడు రోషించ కరుణమాలి
క్షామమేర్పడె చినుకైన గానరాక
నెండిపోయె నికుంజమ్ము లేమి సేతు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు
మత్తకోకిల:
రోజురోజు వనమ్ముకుం జని లోకనాథుని భక్తితో
పూజకై విరిబూవులన్ గొనిపోవ నేగఁగ నేడటన్
భ్రాజితమ్మును గోలుపోయిన పాదపమ్ముల గాంచితిన్
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితే॥ పువులు దొరకున నిరుపేద పూజ కిపుడు
రిప్లయితొలగించండిధరలు నధికమై పండుగ తరుణమందు
దేవదేవ భక్తి గలదు దీనుఁడనయ
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు
(సామాన్యంగా 100గ్రా 20రూ పండుగ తరుణములో 40రూ అండి)
మత్త॥ రాజపుత్రుని పెండ్లి యంచును రమ్యమౌవిధి నచ్చటన్
రాజిలంగను జేయఁ బూవులు రాజు గేహముఁ జేరఁగన్
మోజుమీర నలంకరించఁగ మోద మొందఁగఁ బౌరులున్
బూజ సేయఁగఁ బీఠమందునఁ బూవులే కరువయ్యెగా
తే.గీ: భక్తి యన బ్రదర్శన మయ్యె,ప్రజలు కనగ
రిప్లయితొలగించండినగలు,ధనమును వచ్చెను మిగుల వచ్చె
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు, లేవు”
భక్తియును, శ్రద్ధ సోకులే ప్రబలమయ్యె
ఉ;రాజితమ్మగు దేవళమ్మున ప్రార్థనన మ్మున కేగగా
రిప్లయితొలగించండిజాజి మల్లెలు, మొల్ల లాదిగ సర్వ జాతుల నీయ నే
పూజ సేయఁగఁ బీఠమందునఁ బూవు, లేకరు వయ్యెగా!
ఈ జనమ్ముల పాటలే కడు నింపుగన్ బతుకమ్మకై.
(నేను నానా రకాల పూలు తీసుకు వెళ్లగానే బతుకమ్మ పాటలు ఏకరువు పెట్టారు. )
కోరి పూజింప వె డ లితి కోవెల కట
రిప్లయితొలగించండిపూజ సేయ పీఠ మ్మున బువులు లేవు
హృదయ సుమముల నర్పించి ముదము తోడ
మ్రొ క్కు లి డి తిని శివునికి పెక్కు మార్లు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఅనునయింప దుఃఖమ్మున నమ్మ లేదు
రిప్లయితొలగించండిచదువుకొనఁగఁ బొత్తమ్ములు గదిని లేవు
నేను జేసిన పాపమ్ము గానరాదు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు
గాజు ముక్కలు రత్న రాసులు గావు పౌరుష హీనుఁడౌ
రాజు గద్దె వహింప నెవ్విధి రాజ్య మేలును శూన్య పృ
థ్వీజ రత్నచయంపుఁ బీఠము పీఠమే పరికింపఁగాఁ
బూజ సేయఁగఁ బీఠ మందునఁ బూవులే కఱ వయ్యెఁగా
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఎల్ నినో ప్రభావము వల్ల నెండలెక్కు
వయ్యె,మాడిపోయెను పూల వనములోని
చెట్టులన్నియు, మ్రొక్కుచు శివుని కిపుడు
పూజ సేయఁ బీఠమ్మునఁ బువులు లేవు.