కం;హంసను బెంచుచు జక్కని హంస యనుచు మాయ బడియు , నా పై నిజమౌ హంస గొనుచు బక్షి యయిన హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్. (హంసని పెంచి దాని అందానికి మాయ లో పడ్డాడు కానీ నిజమైన హంస ని అనగా సోహం తత్త్వాన్ని పొంది ఆత్నతత్త్వానికి చిక్కాడు. )
ఉ:హంసను బోలు నట్టి యొక యాలిని బొందియు,దెల్వి లేక యా హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా ధ్వంసము కాగ జీవితము తత్త్వము దెల్పెడు రామకృష్ణుడన్ హంసను బోలు సద్గురువు నందుట సాధ్యము గాక భ్రష్టుడై. (అతని భార్య ఒక హంస. బుద్ధిహీనుడై మొదట ఆమెను వదిలేసాడు. ఆత్మ విద్యకి లోబడ్డాడు కానీ దానికి రామకృష్ణ పరమ హంస లాంటి ఒక గురువు లభించటం సాధ్యము కాక ఉభయభ్రషుడై ఖిన్నుడయ్యాడు. )
సంసారము విడి జనులకు
రిప్లయితొలగించండిహింస వలదని నుడువ విని హితవరులిడు
శంశలకు లొంగి పోవగ
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్
కందము
రిప్లయితొలగించండిసంసృతి విడి చేయఁ దపము
సంసరణకు మేనక దిగ సరసమునందున్
ధ్వంసమ్మయ్యె ముని పథము!
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్!
ఉత్పలమాల
సంసృతి వీడి కౌశికుడు సాగుచునుండ తపమ్మునందునన్
సంసరణమ్ముకై దిగిన చంచల మేనక మోహమందునన్
ద్వంసము నై శకుంతల భవమ్మునకయ్యది మూలమయ్యెగా!
హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా!
రిప్లయితొలగించండిసంసిద్ధి గామి క్రొత్తగ
సంసృతి బంధమున జిక్కి సౌఖ్యం బనుచున్
మాంసము భుజంప మరుగుచు
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్.
సంసృతి సాగరమ్మనుచు సత్పురుషుల్ వచియించు చున్ సదా
హంసను గొల్చినన్ ముగితి యందు నటంచును చెప్పనేమిరా
మాంసము పైన ప్రీతిగల మందుడు హింసను కాదు వాడటన్
హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా.
హంసను జేరు పథమునిడు
రిప్లయితొలగించండిహంసుని మఠమందు జేరి హర్షితమనుచున్
సంసారముకై మ్రొగ్గుచు
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్
హంసను జేరు మార్గమిడి హర్షమొసంగు నటంచు నెంచుచున్
హంసుని యాశ్రమమ్మున గృహస్తుడు చేరెను శిక్షణంబుకై
సంసృతి పైన రక్తిఁ విడ సాధ్యము కాదను నిర్ణయంబుతో
హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా
[ హంస = పరమాత్మ; హంసుడు = ఆధ్యాత్మిక గురువు ]
కం. మాంసము మదిరలు ముట్టడు
రిప్లయితొలగించండిహింసించగ సాధువుల సహించడెపుఁడు వి
ధ్వంసమ్మును సృష్టించడు
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్
(హంస=మాత్సర్యము)
ఉత్పలమాల:
మాంసము ముట్టడెన్నఁడును మద్యముఁ ద్రావడు శాంత మూర్తియై
హింసను గోరడెన్నఁడు సహించ డధర్మము నెంతమాత్రమున్
ధ్వంసము గాగ నిష్ఠ యొక దారుణ సంఘటనమ్మువల్ల తా
హంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా
కం;హంసను బెంచుచు జక్కని
రిప్లయితొలగించండిహంస యనుచు మాయ బడియు , నా పై నిజమౌ
హంస గొనుచు బక్షి యయిన
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్.
(హంసని పెంచి దాని అందానికి మాయ లో పడ్డాడు కానీ నిజమైన హంస ని అనగా సోహం తత్త్వాన్ని పొంది ఆత్నతత్త్వానికి చిక్కాడు. )
ఉ:హంసను బోలు నట్టి యొక యాలిని బొందియు,దెల్వి లేక యా
రిప్లయితొలగించండిహంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా
ధ్వంసము కాగ జీవితము తత్త్వము దెల్పెడు రామకృష్ణుడన్
హంసను బోలు సద్గురువు నందుట సాధ్యము గాక భ్రష్టుడై.
(అతని భార్య ఒక హంస. బుద్ధిహీనుడై మొదట ఆమెను వదిలేసాడు. ఆత్మ విద్యకి లోబడ్డాడు కానీ దానికి రామకృష్ణ పరమ హంస లాంటి ఒక గురువు లభించటం సాధ్యము కాక ఉభయభ్రషుడై ఖిన్నుడయ్యాడు. )
హింసలకు బూ ని సతతము
రిప్లయితొలగించండిధ్వ o సపు కృత్య ములు సలుపు దనుజుని వోలె న్
సంసార ము లో నుండి యు
హంస ను విడి సాధ కుండె యాత్మ కు జి క్కె న్
మాంసమ్మును సేవించి ప్ర
రిప్లయితొలగించండిశంసల కెదఁ బొంగుచుండి సంతతమును మీ
మాంసను వల్లించి పరమ
హంసను విడి సాధకుండె యాత్మకుఁ జిక్కెన్
నక్ర సన్నిభములు దురతిక్రమములు
నరుల కింద్రియములు కారణములు చ్యుతికి
భువన వినుత పరమ హంసను విడి సాధ
కుండె యాత్మకుఁ జిక్కెన్ నరుం డొకండు
ధ్వంసము కాక తప్ప దిలఁ దాపస వర్యున కైన మాన వో
త్తంసున కైన నింద్రియ వితానముఁ గట్టడి సేయ కున్నచో
హింసను మెచ్చు బుద్ధిని జయింప నశక్యుఁడు నై మహాత్ము రా
డ్ఢంసను వీడి సాధకుఁడె యాత్మకు లోఁబడి ఖిన్నుఁడాయెగా
[రాట్ +హంస = రాడ్ఢంస; సన్యాసులలో శ్రేష్ఠుఁడు]