21-10-2026 (బుధవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్”
(లేదా...)
“ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్”
(న.చ. సాహిత్ శతావధానంలో బీరం నాగేశ్వర రావు గారి సమస్య)
బర్మా దేశము నందున నర్మటుడయి వచ్ఛినట్టి నటకుడు నాకున్కర్మానుసార మమరినధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
కందముమర్మజ్ఞుడు శ్రీరాముడుశర్మంబిడు సకల జనుల సాకును భూమిన్ దుర్మార్గుడు రావణుఁడాధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?శార్దూలవిక్రీడితముమర్మజ్ఞుండగు రామచంద్రుఁడు భువిన్ మాన్యుండుగా నిల్వగన్శర్మంబున్ బ్రజలంద నేలికగఁ దా సాకెన్ గదా దైవమై!దుర్మార్గుండగు రావణున్ దునిమె విద్రోహమ్ములన్ జేయగన్,ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే? తానొప్పుఁ బాలింపఁగన్!
శార్దూలము:ధర్మాధర్మ మెఱింగి పాలితుఁడు శ్రద్ధావంతుఁడై నిచ్చలున్మర్మంబేమియు లేక యేలవలె సన్మార్గమ్మునన్ లోకులన్ధర్మమ్మున్ విడనాడి డుండుకునిగా తానున్న నేరీతిగాధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్?
దుర్మార్గుల్ చెలరేగకుండ నెపుడున్ దుర్నీతినే ద్రుంచుమా కర్మణ్యాభిరతిన్ స్వదేశ జనులన్ గాపాడుచున్ దేశమున్ నిర్మాణాత్మక రీతినిన్ బొలుపుచున్ నిశ్చింతగా నుండుమాధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్
దుర్మతి గతజన్మలదగుకర్మమున మనకు లభించె కలలోనైనన్నిర్మల చిత్తవిహీనుడుధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
కర్మ ఫలమ్మది తప్పదధర్మ పరుల కనెడి మాట తథ్యంబెకదా శర్మా, రావణుని గనగ ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్.మర్మం బేమి వచింపుమో హనుమ సామాన్యుండనే ప్రోవగా ధర్మం బియ్యది కాదు కాదనెడి సీతావల్లభున్ వ్రాలుచున్ ధర్మాత్మా శరణమ్మటంచు దరినిన్ దస్యుండు తా చేరినన్ ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్.
కం:నిర్మల మానస! నీకున్ కర్మఫలము గా లభించె కఠినుడు, సతి నన్ధర్మము జూపక విడువుముధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
శా॥ మర్మంబున్ గన నుగ్రవాదమును సమ్మానించి దుష్టాత్ములైతీర్మానమ్మున భారతావనిని సందేహించకే ప్రేచఁగన్గర్మంబంచును సర్ది చెప్పకయె సంఘాతమ్ములన్ గూల్చఁగన్ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలించఁగన్సంఘాతము గట్టిదెబ్బ(నీతి నియమాలు లేని వారికి బుద్ధి చెప్పేందుకు ధర్మాధర్మములు పనికి రావండి)
శా:ధర్మ మ్మేదొ, యధర్మ మేదొ, యెదియో తత్త్వమ్ము,శాస్త్రమ్ములన్మర్మ మ్మేమియొ, సామరస్య మెదియో, మాటాడు తీ రేదియోకర్మ మ్మందున యోగ మేదొ యెరుంగంగా రాజుగా నొప్పెడిన్ ధర్మాధర్మము లెంచ నట్టి నరుడే తానొప్పుఁ బాలింపఁగన్?(సమస్య లో ధర్మాధర్మములు అని ఉండాలి. కనుక భావం చెడకుండా సమస్య లో పదాలు మార్చక తప్ప లేదు. ఫై లక్షణా లన్నీ ఉన్న వాడు రాజు కావాలి కానీ ధర్మాధర్మ విచక్షణే లేని వాడు అర్హుడా?)
నిర్మలమగు హృదయంబు ను మర్మము లన్నియు నె రుగని మస్తిష్క o బు న్ కర్మలు నిర్దే శించ ని ధర్మా ధర్మము లెరుగని ధవు డేల దగు న్?
ధర్మాధర్మ విచక్షణమర్మమెఱిఁగి నేలరేడు మసలిన మేలౌశర్మముఁగూర్చక ప్రజలకుధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
వర్మ కరవాలము లడర చర్మం బల్లాడఁ బోరు సలుపక యున్నన్ మర్మ మెఱిఁగి పాలింపఁగ ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్ [ఏలఁ దగున్, తగఁడు] దుర్మార్గమ్మును సైపఁ డెన్నఁడును సంతుష్టుండు సంగ్రామపుంగర్మవ్రాతము నేరి నట్టి ధరణీ కాంతుండు నిష్ణాతుఁడే ధర్మాధర్మము లందు నెన్న నెద సత్యమ్మున్ ద్విషద్వాహినీ ధర్మాధర్మ మెఱుంగ నట్టి ధవుఁడే? తా నొప్పుఁ బాలింపఁగన్ [ధర్మాధర్మము = ధర్మబద్ధ మైన యధర్మము; ధవుఁడే? కాడు]
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్. మర్మము తెలియని పాలనధర్మ విరుద్ధపు పనులకు దండనలిడకన్మర్మము మదినిడి,యెటులధర్మాధర్మము లెఱుగని ధవుఁ డేలఁ దగున్?
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్. మర్మము తెలియని పాలనధర్మ విరుద్ధపు పనులకు దండనలిడకన్మర్మము మదినిడి,యెట్టులధర్మాధర్మము లెఱుగని ధవుఁ డేలఁ దగున్?
బర్మా దేశము నందున
రిప్లయితొలగించండినర్మటుడయి వచ్ఛినట్టి నటకుడు నాకున్
కర్మానుసార మమరిన
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
కందము
రిప్లయితొలగించండిమర్మజ్ఞుడు శ్రీరాముడు
శర్మంబిడు సకల జనుల సాకును భూమిన్
దుర్మార్గుడు రావణుఁడా
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
శార్దూలవిక్రీడితము
మర్మజ్ఞుండగు రామచంద్రుఁడు భువిన్ మాన్యుండుగా నిల్వగన్
శర్మంబున్ బ్రజలంద నేలికగఁ దా సాకెన్ గదా దైవమై!
దుర్మార్గుండగు రావణున్ దునిమె విద్రోహమ్ములన్ జేయగన్,
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే? తానొప్పుఁ బాలింపఁగన్!
శార్దూలము:
రిప్లయితొలగించండిధర్మాధర్మ మెఱింగి పాలితుఁడు శ్రద్ధావంతుఁడై నిచ్చలున్
మర్మంబేమియు లేక యేలవలె సన్మార్గమ్మునన్ లోకులన్
ధర్మమ్మున్ విడనాడి డుండుకునిగా తానున్న నేరీతిగా
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్?
దుర్మార్గుల్ చెలరేగకుండ నెపుడున్ దుర్నీతినే ద్రుంచుమా
రిప్లయితొలగించండికర్మణ్యాభిరతిన్ స్వదేశ జనులన్ గాపాడుచున్ దేశమున్
నిర్మాణాత్మక రీతినిన్ బొలుపుచున్ నిశ్చింతగా నుండుమా
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్
దుర్మతి గతజన్మలదగు
తొలగించండికర్మమున మనకు లభించె కలలోనైనన్
నిర్మల చిత్తవిహీనుడు
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
రిప్లయితొలగించండికర్మ ఫలమ్మది తప్పద
ధర్మ పరుల కనెడి మాట తథ్యంబెకదా
శర్మా, రావణుని గనగ
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్.
మర్మం బేమి వచింపుమో హనుమ సామాన్యుండనే ప్రోవగా
ధర్మం బియ్యది కాదు కాదనెడి సీతావల్లభున్ వ్రాలుచున్
ధర్మాత్మా శరణమ్మటంచు దరినిన్ దస్యుండు తా చేరినన్
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలింపఁగన్.
కం:నిర్మల మానస! నీకున్
రిప్లయితొలగించండికర్మఫలము గా లభించె కఠినుడు, సతి నన్
ధర్మము జూపక విడువుము
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
శా॥ మర్మంబున్ గన నుగ్రవాదమును సమ్మానించి దుష్టాత్ములై
రిప్లయితొలగించండితీర్మానమ్మున భారతావనిని సందేహించకే ప్రేచఁగన్
గర్మంబంచును సర్ది చెప్పకయె సంఘాతమ్ములన్ గూల్చఁగన్
ధర్మాధర్మ మెఱుంగనట్టి ధవుఁడే తానొప్పుఁ బాలించఁగన్
సంఘాతము గట్టిదెబ్బ
(నీతి నియమాలు లేని వారికి బుద్ధి చెప్పేందుకు ధర్మాధర్మములు పనికి రావండి)
శా:ధర్మ మ్మేదొ, యధర్మ మేదొ, యెదియో తత్త్వమ్ము,శాస్త్రమ్ములన్
రిప్లయితొలగించండిమర్మ మ్మేమియొ, సామరస్య మెదియో, మాటాడు తీ రేదియో
కర్మ మ్మందున యోగ మేదొ యెరుంగంగా రాజుగా నొప్పెడిన్
ధర్మాధర్మము లెంచ నట్టి నరుడే తానొప్పుఁ బాలింపఁగన్?
(సమస్య లో ధర్మాధర్మములు అని ఉండాలి. కనుక భావం చెడకుండా సమస్య లో పదాలు మార్చక తప్ప లేదు. ఫై లక్షణా లన్నీ ఉన్న వాడు రాజు కావాలి కానీ ధర్మాధర్మ విచక్షణే లేని వాడు అర్హుడా?)
నిర్మలమగు హృదయంబు ను
రిప్లయితొలగించండిమర్మము లన్నియు నె రుగని మస్తిష్క o బు న్
కర్మలు నిర్దే శించ ని
ధర్మా ధర్మము లెరుగని ధవు డేల దగు న్?
ధర్మాధర్మ విచక్షణ
రిప్లయితొలగించండిమర్మమెఱిఁగి నేలరేడు మసలిన మేలౌ
శర్మముఁగూర్చక ప్రజలకు
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్?
వర్మ కరవాలము లడర
రిప్లయితొలగించండిచర్మం బల్లాడఁ బోరు సలుపక యున్నన్
మర్మ మెఱిఁగి పాలింపఁగ
ధర్మాధర్మము లెఱుఁగని ధవుఁ డేలఁ దగున్
[ఏలఁ దగున్, తగఁడు]
దుర్మార్గమ్మును సైపఁ డెన్నఁడును సంతుష్టుండు సంగ్రామపుం
గర్మవ్రాతము నేరి నట్టి ధరణీ కాంతుండు నిష్ణాతుఁడే
ధర్మాధర్మము లందు నెన్న నెద సత్యమ్మున్ ద్విషద్వాహినీ
ధర్మాధర్మ మెఱుంగ నట్టి ధవుఁడే? తా నొప్పుఁ బాలింపఁగన్
[ధర్మాధర్మము = ధర్మబద్ధ మైన యధర్మము; ధవుఁడే? కాడు]
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మర్మము తెలియని పాలన
ధర్మ విరుద్ధపు పనులకు దండనలిడకన్
మర్మము మదినిడి,యెటుల
ధర్మాధర్మము లెఱుగని ధవుఁ డేలఁ దగున్?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
మర్మము తెలియని పాలన
ధర్మ విరుద్ధపు పనులకు దండనలిడకన్
మర్మము మదినిడి,యెట్టుల
ధర్మాధర్మము లెఱుగని ధవుఁ డేలఁ దగున్?