22-10-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు”
(లేదా...)
“రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే”
(మొన్న రాజమండ్రిలో న.చ. సాహిత్ అష్టావధానంలో నేను ఇవ్వాలకున్న సమస్య. కాని తీరా సమయానికి నన్ను సంచాలకుణ్ణి చేశారు)
భారతావని నంతను బట్టిచూడ
రిప్లయితొలగించండిఆంధ్ర భాషపై పరిహాస మాడుట యగు
రాణ్మహేంద్రిలో నొక్కటే ; రాలు మణులు
కాదు రాళ్ళు , వినిన వారి కయిల నుండి
తేటగీతి:
రిప్లయితొలగించండికళల కాణాచి నిలయము కవివరులకు
గలగలా పారు గోదారి గంగనీరు
పంట భూములు తలపించు పసిడి గనులు
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు
మత్తకోకిల:
మృణ్మయమ్మగు పంటభూములు మేలు బంగరు క్షేత్రముల్
రాణ్మహేంద్రియె నన్నయార్యుని రాజితమ్మగు ధామమే
రాణ్మహేంద్రుఁడు రాజరాజు విరాజమానఁపు పాలనన్
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే
కవి వరే ణ్యు ల కేలోటు కాను పింప
రిప్లయితొలగించండిదట్టి పురమున వెలసియు నలరు నట్టి
కవిత లన్నియు శ్రేష్ఠ మై కమ్ర మగుచు
రా ణ్మ హేంద్రి లో నొక్కటే రాలు మణులు
షణ్మహాంగవిభాసవేదవిచారదక్షులు, సాహితీ
రిప్లయితొలగించండిత్విణ్మనోజ్ఞయశస్వరూపులు, ధీప్రకాండులు, కర్షకుల్,
ద్విణ్మదాంతకదివ్యశస్తసువీర్యు లందఱు నందఱే
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే.
రిప్లయితొలగించండికవుల బోషించు వారలే కలరచోట
నీదు పాండిత్యమును గాంచ నిశ్చయముగ
సత్కృతము దక్కు నచ్చోట సత్య మిదియె
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు.
రాణ్మహాత్ములు మెచ్చు కైతల వ్రాసెడిన్ గవి శ్రేష్టులన్
రాణ్మహేంద్రవరమ్ము నేలెడి రాజ రాజ నరేంద్రడే
షణ్మహాంగ విభాస వేదుల సత్కృతమ్మును జేయగా
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే.
షణ్ముఖాలయమునఁ జూడ చక్కనైన
రిప్లయితొలగించండిమృణ్మయ కలశము లభించె మెలుతకిచట
షణ్మతంబులు మెలఁగగ సమత తోడ
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు
మృణ్మయాలయ మొక్కటున్నది మేము గాంచిన తావునన్
షణ్ముఖుండిట దర్శనంబిడు సర్వవేళల యందునన్
షణ్మతంబుల వారికున్నవి సామ్యవాదపు భావనల్
రాణ్మహేంద్రవరమ్ము నందున రాలు రత్నము లొక్కటే
తేటగీతి
రిప్లయితొలగించండిసాహితీవేత్తల పటిమ సంబరమిడ
ప్రజ విభిన్నంపు రీతులన్ స్పందనలిడ
విరుల నభిషేకములు గాక వేరుగాను
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు!
మత్తకోకిల
మృణ్మయంపు మహత్యమేమియొ! మేధపొంగునునచ్చటన్!
రాణ్మహేంద్రుడు సంప్రదాయము రాణకెక్కగఁ గూర్చగన్
రాణ్మహేంద్రిని వారసత్వము రాజిలన్ కవనమ్ములన్
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే!
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
తొలగించండిమత్త॥ మృణ్మయమ్మగు ధాత్రినుండియె మేలిమిన్ గన సాధ్యమౌ
షణ్ముఖమ్ముల కాశ మొందుచుఁ జాన లొప్పఁగ నట్టులన్
రణ్మధూక్తుల పద్యగానము రమ్యమైచను రీతులన్
రాణ్మహేంద్రవరమ్మునందున రాలు రత్నము లొక్కటే
నట్ ప్రకాశించుట, రట్ మాట్లాడుట నాంత్రము పొగడ్త
(తూగోజి కవులకే కాదండి మంగళంపల్లి వారి లాంటి మహా గాయకులకు పుట్టినిల్లే)
(నేను చేసిన ఉద్యోగమే పద్యాలు వ్రాస్తు మరచి పోయినట్లుగా ఉన్నాను)
మత్త॥ మృణ్మయమ్మగు ధాత్రి లోపల మేటి సంపద రాజిలన్
నణ్మహాత్మ్యపు బుద్ధిఁ గాంచుచు నమ్మి దానిని తీయఁగన్
రాణ్మహేంద్రవరంపు గోష్ఠుల రాలు వాక్కుల వాహినిన్
రాణ్మహేంద్రవరమ్ము నందున రాలు రత్నము లొక్కటే
( ONGC Krishna-Godavari Basin, Exploratory team, ఎక్కడ త్రవ్వితే Oil n gas బయటికి వస్తాయో నిర్ధారించే దానికి ప్రయత్నిస్తుంది. వారి పలుకులు నిజమై రత్నాలు రాలుతాయని)
పొందు మన్నన నిత్యము ముద్దరాలు
రిప్లయితొలగించండిమాన్య లౌదురు మానినీ మణులు నెల్లఁ
దెల్ల మగును గనిన నిట్టి తీరు నచట
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు
విణ్మయమ్ములు పట్టణమ్మున వీథు లెల్లను వింతగా
రుణ్మనుష్యులు పోరు చుందురు లుప్త ధర్ములు సత్పరి
వ్రాణ్మహాత్ములు సంచరింతురు పాదచారులు భిక్షకై
రాణ్మహేంద్రవరమ్ము నందున రాలు రత్నము లొక్కటే
కవుల కాణాచి సహిత్య కళల వెలుగు
రిప్లయితొలగించండివాడ వాడల కనిపించు పద్యకవుల
సరస సాహిత్య సమ్మోద సంబరాల
రా ణ్మ హేంద్రి లో నొక్కటే రాలు మణులు
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
పసిడి పండెడు బంగరు వంటి నేల
పారు గోదావరీ నీరు పంటలకును
కళలకున్ బెట్టినది పేరు కవులకును
రాణ్మహేంద్రిలో నొక్కటే రాలు మణులు.