22, అక్టోబర్ 2026, గురువారం

సమస్య - 5628

23-10-2026 (శుక్రవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మామా యని సర్వముఁ దినె మా యల్లుండే”

(లేదా...)

“మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా”

(మొన్న రాజమండ్రిలో న.చ. సాహిత్ అష్టావధానంలో పాలపర్తి హవీలా గారి సమస్య)

14 కామెంట్‌లు:

  1. ప్రేమగ మీయత్త సలిపె
    నీ మామిడి తొక్కు , తినుట కెట్లుః డెననన్
    యేమనుచు జెప్ప మనెదవు
    మామా ! యని సర్వముఁ దినె మా యల్లుండే”

    రిప్లయితొలగించండి

  2. ప్రేమగ నా సుతయే నను
    జేమనము కొరకు పిలువగ జేరగ నటకున్
    జామాతయె నను గని రా
    మామా యని, సర్వముఁ దినె మా యల్లుండే.


    *(స్వంత బావమరిదికి కూతురు నిచ్చిన తండ్రి మాటలుగా)*

    మామా మీ గృహమందు వేడ్కలనుచున్ మా పుత్రియే పిల్వగా
    కోమన్ గైకొని చేర వచ్చితిని సంకోచింపకన్ జంటగా
    రా మామా యని బావవంచు నను సోత్ప్ర్యాసమ్ము తో పిల్చుచున్
    మామా మామ యటంచు సర్వముఁ దినెన్, మామా స్వజామాతయా.

    రిప్లయితొలగించండి
  3. సామాన్యుడ నేనైనను
    ప్రేమించితి నీతనయను వెరవకుమనుచున్
    జామాతగ మారినతరి
    మామా యని సర్వముఁ దినె మా యల్లుండే

    రామా రామ యటంచు సంతతము శ్రీరాముండనే గొల్చెదన్
    బ్రేమే గ్రుడ్డిదటంచు తెల్పి స్వజ తాఁ బ్రేమించెనా కల్లరిన్
    మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాత యా
    రాముండే మము గాచునన్న తలపే రక్షించె ముమ్మాటికిన్

    రిప్లయితొలగించండి
  4. మామా! యేమని చెప్పుదున్ సతము నీమంబుల్ విచారించకన్
    ధామంబందున నల్లపిల్లి సరళిన్ తాఁజేరి దుర్బుద్ధితో
    జామాతా దశమగ్రహమ్మనెడు సౌజాత్యమ్ముగా నిచ్చలున్
    మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా

    రిప్లయితొలగించండి
  5. మామా! యేమని చెప్పుదు
    జామాతయె దాపురించె శనియై మాకున్
    నీమములను బాటింపక
    మామా యని సర్వముఁ దినె మా యల్లుండే

    రిప్లయితొలగించండి
  6. ఏమో మేనళ్ళుండని
    ప్రేమతొ నాబిడ్డనిచ్చి పెండలి జేయన్
    ఏమని చెప్పుదు ప్రేమగ
    మామా యని సర్వముఁ దినె మా యల్లుండే

    రిప్లయితొలగించండి
  7. జామాత వచ్చె నను చును
    ప్రేమగ వండియు నరి సెలు ప్రీతి గ నొస గన్
    కామిత ము గ మెక్కుచు రా
    మామా! యని సర్వము దినె మా యల్లు o డే

    రిప్లయితొలగించండి
  8. (బెంగళూరులో జరిగిన హనీట్రాప్ లో డబ్బు పోగొట్టుకున్న మిత్రుని దెప్పడం, నేటి కాలానికి అన్వయమండి)

    శా॥ ఏమో యీ ఋణమెద్దియో తెలుపుమా యీ రీతిగా సాగగన్
    బ్రేమన్ జూపుచుఁ జేరి నెమ్మదిగ నీవిత్తంబునున్ గైకొనెన్
    సామాన్యంబుగ దానధర్మముల నాస్వాందించవే చిత్రమే!
    మామ మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా?

    (Crime Reporting కు వెళుతున్న సమయంలో ఇలా మిత్రుడన్నాడని భావమండి)

    రిప్లయితొలగించండి
  9. గోముగ సతి మెచ్చుకొనుచు
    భామా మణి చేతి పిండి వంట లహో, నే
    నే మందును, బాగున్నవి
    మామా యని సర్వముఁ దినె మా యల్లుండే


    భామారత్నము నీయఁ దృప్తిలఁడు సంబంధమ్ము మీ పుణ్యమే
    మీ మాన్యమ్ములు పెక్కు లన్ని యకటా మీ కేల నా కిమ్మనెన్
    ధామం బిమ్మనె వాహనమ్ము గొనె యర్థం బెంతొ యాశించెనే
    మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా

    రిప్లయితొలగించండి
  10. ధీమంతుండని పిల్లనీయ కడు నుత్ప్రేక్షించి విశ్వాసమున్
    ప్రేమన్ జూపుచు వచ్చి దగ్గరకు సంప్రీతిన్ నివేదించుచున్
    క్షేమంబైన విధానమున్ విడిచి వంచించెన్ దురాచారుడై
    మామామామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా

    రిప్లయితొలగించండి


  11. జామాత రాగ యత్తయు
    ప్రేమగ నరిసెలను వండి పిలిచిన యంతన్
    గోముగజూచుచు వడి రా
    *మామాయని సర్వము దినె మా యల్లుండే*
    జామాతకిష్టమనుచును
    సేమియపాయసమువండి శ్రీమతి పిలువన్
    మోమోటమువిడి పిలువక
    *మామా యని సర్వము దినె మా యల్లుండే*

    రిప్లయితొలగించండి
  12. కందం
    మా మేనల్లుని బెంచితిఁ
    బ్రేమారను తల్లిలేని పిల్లడటంచున్
    స్వామికిడని నైవేద్యము
    మా! మా! యని సర్వముఁ దినె మా యల్లుండే!

    శార్దూలవిక్రీడితము
    సామీప్యమ్మున నుండి చూచి మనదౌ సంబంధమున్ పెళ్లిలో
    మామాయంచును మిమ్ము, సోదరునిగన్ మన్నించినన్ బిల్చుచున్
    మీ మా బంధువటన్న నమ్మకమునన్ మెల్గన్ నిదానించితిన్
    మామా! మామ! యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా?

    రిప్లయితొలగించండి

  13. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ప్రేమగ పుత్రిక నిచ్చితి
    నీమముగా పండుగకని నేనే పిలువన్
    జామాత లడ్లు గాంచియు
    మామా! యని సర్వముఁ దినె మా యల్లుండే.

    రిప్లయితొలగించండి