23-10-2026 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మామా యని సర్వముఁ దినె మా యల్లుండే”
(లేదా...)
“మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా”
(మొన్న రాజమండ్రిలో న.చ. సాహిత్ అష్టావధానంలో పాలపర్తి హవీలా గారి సమస్య)
ప్రేమగ మీయత్త సలిపెనీ మామిడి తొక్కు , తినుట కెట్లుః డెననన్యేమనుచు జెప్ప మనెదవుమామా ! యని సర్వముఁ దినె మా యల్లుండే”
ప్రేమగ నా సుతయే నను జేమనము కొరకు పిలువగ జేరగ నటకున్ జామాతయె నను గని రా మామా యని, సర్వముఁ దినె మా యల్లుండే. *(స్వంత బావమరిదికి కూతురు నిచ్చిన తండ్రి మాటలుగా)*మామా మీ గృహమందు వేడ్కలనుచున్ మా పుత్రియే పిల్వగా కోమన్ గైకొని చేర వచ్చితిని సంకోచింపకన్ జంటగా రా మామా యని బావవంచు నను సోత్ప్ర్యాసమ్ము తో పిల్చుచున్ మామా మామ యటంచు సర్వముఁ దినెన్, మామా స్వజామాతయా.
సామాన్యుడ నేనైననుప్రేమించితి నీతనయను వెరవకుమనుచున్జామాతగ మారినతరిమామా యని సర్వముఁ దినె మా యల్లుండేరామా రామ యటంచు సంతతము శ్రీరాముండనే గొల్చెదన్బ్రేమే గ్రుడ్డిదటంచు తెల్పి స్వజ తాఁ బ్రేమించెనా కల్లరిన్మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాత యారాముండే మము గాచునన్న తలపే రక్షించె ముమ్మాటికిన్
మామా! యేమని చెప్పుదున్ సతము నీమంబుల్ విచారించకన్ధామంబందున నల్లపిల్లి సరళిన్ తాఁజేరి దుర్బుద్ధితోజామాతా దశమగ్రహమ్మనెడు సౌజాత్యమ్ముగా నిచ్చలున్మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా
మామా! యేమని చెప్పుదుజామాతయె దాపురించె శనియై మాకున్నీమములను బాటింపకమామా యని సర్వముఁ దినె మా యల్లుండే
ఏమో మేనళ్ళుండనిప్రేమతొ నాబిడ్డనిచ్చి పెండలి జేయన్ఏమని చెప్పుదు ప్రేమగమామా యని సర్వముఁ దినె మా యల్లుండే
జామాత వచ్చె నను చును ప్రేమగ వండియు నరి సెలు ప్రీతి గ నొస గన్ కామిత ము గ మెక్కుచు రా మామా! యని సర్వము దినె మా యల్లు o డే
(బెంగళూరులో జరిగిన హనీట్రాప్ లో డబ్బు పోగొట్టుకున్న మిత్రుని దెప్పడం, నేటి కాలానికి అన్వయమండి)శా॥ ఏమో యీ ఋణమెద్దియో తెలుపుమా యీ రీతిగా సాగగన్బ్రేమన్ జూపుచుఁ జేరి నెమ్మదిగ నీవిత్తంబునున్ గైకొనెన్సామాన్యంబుగ దానధర్మముల నాస్వాందించవే చిత్రమే!మామ మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా?(Crime Reporting కు వెళుతున్న సమయంలో ఇలా మిత్రుడన్నాడని భావమండి)
గోముగ సతి మెచ్చుకొనుచు భామా మణి చేతి పిండి వంట లహో, నేనే మందును, బాగున్నవి మామా యని సర్వముఁ దినె మా యల్లుండే భామారత్నము నీయఁ దృప్తిలఁడు సంబంధమ్ము మీ పుణ్యమే మీ మాన్యమ్ములు పెక్కు లన్ని యకటా మీ కేల నా కిమ్మనెన్ ధామం బిమ్మనె వాహనమ్ము గొనె యర్థం బెంతొ యాశించెనే మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధీమంతుండని పిల్లనీయ కడు నుత్ప్రేక్షించి విశ్వాసమున్ప్రేమన్ జూపుచు వచ్చి దగ్గరకు సంప్రీతిన్ నివేదించుచున్క్షేమంబైన విధానమున్ విడిచి వంచించెన్ దురాచారుడై మామామామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా
జామాత రాగ యత్తయుప్రేమగ నరిసెలను వండి పిలిచిన యంతన్గోముగజూచుచు వడి రా*మామాయని సర్వము దినె మా యల్లుండే*జామాతకిష్టమనుచునుసేమియపాయసమువండి శ్రీమతి పిలువన్మోమోటమువిడి పిలువక*మామా యని సర్వము దినె మా యల్లుండే*
కందంమా మేనల్లుని బెంచితిఁబ్రేమారను తల్లిలేని పిల్లడటంచున్స్వామికిడని నైవేద్యముమా! మా! యని సర్వముఁ దినె మా యల్లుండే! శార్దూలవిక్రీడితముసామీప్యమ్మున నుండి చూచి మనదౌ సంబంధమున్ పెళ్లిలోమామాయంచును మిమ్ము, సోదరునిగన్ మన్నించినన్ బిల్చుచున్మీ మా బంధువటన్న నమ్మకమునన్ మెల్గన్ నిదానించితిన్మామా! మామ! యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా?
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ప్రేమగ పుత్రిక నిచ్చితినీమముగా పండుగకని నేనే పిలువన్జామాత లడ్లు గాంచియుమామా! యని సర్వముఁ దినె మా యల్లుండే.
ప్రేమగ మీయత్త సలిపె
రిప్లయితొలగించండినీ మామిడి తొక్కు , తినుట కెట్లుః డెననన్
యేమనుచు జెప్ప మనెదవు
మామా ! యని సర్వముఁ దినె మా యల్లుండే”
రిప్లయితొలగించండిప్రేమగ నా సుతయే నను
జేమనము కొరకు పిలువగ జేరగ నటకున్
జామాతయె నను గని రా
మామా యని, సర్వముఁ దినె మా యల్లుండే.
*(స్వంత బావమరిదికి కూతురు నిచ్చిన తండ్రి మాటలుగా)*
మామా మీ గృహమందు వేడ్కలనుచున్ మా పుత్రియే పిల్వగా
కోమన్ గైకొని చేర వచ్చితిని సంకోచింపకన్ జంటగా
రా మామా యని బావవంచు నను సోత్ప్ర్యాసమ్ము తో పిల్చుచున్
మామా మామ యటంచు సర్వముఁ దినెన్, మామా స్వజామాతయా.
సామాన్యుడ నేనైనను
రిప్లయితొలగించండిప్రేమించితి నీతనయను వెరవకుమనుచున్
జామాతగ మారినతరి
మామా యని సర్వముఁ దినె మా యల్లుండే
రామా రామ యటంచు సంతతము శ్రీరాముండనే గొల్చెదన్
బ్రేమే గ్రుడ్డిదటంచు తెల్పి స్వజ తాఁ బ్రేమించెనా కల్లరిన్
మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాత యా
రాముండే మము గాచునన్న తలపే రక్షించె ముమ్మాటికిన్
మామా! యేమని చెప్పుదున్ సతము నీమంబుల్ విచారించకన్
రిప్లయితొలగించండిధామంబందున నల్లపిల్లి సరళిన్ తాఁజేరి దుర్బుద్ధితో
జామాతా దశమగ్రహమ్మనెడు సౌజాత్యమ్ముగా నిచ్చలున్
మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా
మామా! యేమని చెప్పుదు
రిప్లయితొలగించండిజామాతయె దాపురించె శనియై మాకున్
నీమములను బాటింపక
మామా యని సర్వముఁ దినె మా యల్లుండే
ఏమో మేనళ్ళుండని
రిప్లయితొలగించండిప్రేమతొ నాబిడ్డనిచ్చి పెండలి జేయన్
ఏమని చెప్పుదు ప్రేమగ
మామా యని సర్వముఁ దినె మా యల్లుండే
జామాత వచ్చె నను చును
రిప్లయితొలగించండిప్రేమగ వండియు నరి సెలు ప్రీతి గ నొస గన్
కామిత ము గ మెక్కుచు రా
మామా! యని సర్వము దినె మా యల్లు o డే
(బెంగళూరులో జరిగిన హనీట్రాప్ లో డబ్బు పోగొట్టుకున్న మిత్రుని దెప్పడం, నేటి కాలానికి అన్వయమండి)
రిప్లయితొలగించండిశా॥ ఏమో యీ ఋణమెద్దియో తెలుపుమా యీ రీతిగా సాగగన్
బ్రేమన్ జూపుచుఁ జేరి నెమ్మదిగ నీవిత్తంబునున్ గైకొనెన్
సామాన్యంబుగ దానధర్మముల నాస్వాందించవే చిత్రమే!
మామ మామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా?
(Crime Reporting కు వెళుతున్న సమయంలో ఇలా మిత్రుడన్నాడని భావమండి)
గోముగ సతి మెచ్చుకొనుచు
రిప్లయితొలగించండిభామా మణి చేతి పిండి వంట లహో, నే
నే మందును, బాగున్నవి
మామా యని సర్వముఁ దినె మా యల్లుండే
భామారత్నము నీయఁ దృప్తిలఁడు సంబంధమ్ము మీ పుణ్యమే
మీ మాన్యమ్ములు పెక్కు లన్ని యకటా మీ కేల నా కిమ్మనెన్
ధామం బిమ్మనె వాహనమ్ము గొనె యర్థం బెంతొ యాశించెనే
మామా మామ యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధీమంతుండని పిల్లనీయ కడు నుత్ప్రేక్షించి విశ్వాసమున్
రిప్లయితొలగించండిప్రేమన్ జూపుచు వచ్చి దగ్గరకు సంప్రీతిన్ నివేదించుచున్
క్షేమంబైన విధానమున్ విడిచి వంచించెన్ దురాచారుడై
మామామామ యటంచు సర్వముఁ దినెన్ మామా స్వజామాతయా
రిప్లయితొలగించండిజామాత రాగ యత్తయు
ప్రేమగ నరిసెలను వండి పిలిచిన యంతన్
గోముగజూచుచు వడి రా
*మామాయని సర్వము దినె మా యల్లుండే*
జామాతకిష్టమనుచును
సేమియపాయసమువండి శ్రీమతి పిలువన్
మోమోటమువిడి పిలువక
*మామా యని సర్వము దినె మా యల్లుండే*
కందం
రిప్లయితొలగించండిమా మేనల్లుని బెంచితిఁ
బ్రేమారను తల్లిలేని పిల్లడటంచున్
స్వామికిడని నైవేద్యము
మా! మా! యని సర్వముఁ దినె మా యల్లుండే!
శార్దూలవిక్రీడితము
సామీప్యమ్మున నుండి చూచి మనదౌ సంబంధమున్ పెళ్లిలో
మామాయంచును మిమ్ము, సోదరునిగన్ మన్నించినన్ బిల్చుచున్
మీ మా బంధువటన్న నమ్మకమునన్ మెల్గన్ నిదానించితిన్
మామా! మామ! యటంచు సర్వముఁ దినెన్ మామా! స్వజామాతయా?
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ప్రేమగ పుత్రిక నిచ్చితి
నీమముగా పండుగకని నేనే పిలువన్
జామాత లడ్లు గాంచియు
మామా! యని సర్వముఁ దినె మా యల్లుండే.