24-10-2026 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాటి పల్లెల్ గనము నంగనాచు లేల”
(లేదా...)
“నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్”
(మొన్న రాజమండ్రిలో పాలపర్తి వారి అష్టావధానంలో కవిశ్రీ సత్తిబాబు గారి సమస్య)
న్యాయమును దప్పి పాలించు నాయకులను నాటి పల్లెల్ గనము ; నంగనాచు లేలనేటి పురములందు జనులు నెగ్గ లేకయుండె నానేతలు సలుపు యుపధినుండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతి రైతు సంక్షేమమునె నాడు రాజుతలచ పాడిపంట సుభిక్షమై పరిఢవిల్లెఫలము లేక యెంచన్ బ్రజ పట్టణములనాటి పల్లెల్ గనము నంగనాచు లేల!మత్తకోకలనీట ముంచినయట్టి దుర్జన నేతలన్ గని వేదనన్మాటిమాటికి నొచ్చి కృంగుచు మారురూపులు దాల్చగన్బాటసారుల కైన కష్టము పల్లెసీమల గల్గఁగన్నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్!
ప్రకృతి సంపద కవియేను పట్టు గొమ్మ లంచు దలచిన నేమిరా యాధు నికము పేర కృత్రిమత్వ మదియె పెరుగ నేడు నాటి పల్లెల్ గనము నంగనాచు లేల.మేటిగానభివృద్ధి యంచును మిక్కుటమ్మగు మార్పులే ధాటిగానట చేరుచుండగ తత్త్వ నాశము జెందుచున్ జేటు గూర్చెడి యాంత్రి కత్వము చేరుచున్ నట గాంచగా నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్.
తేటగీతి:ప్రగతి మందగించగ నేడు పల్లెలందుపట్నవాసఁపు మోజుతో పల్లె ప్రజలుబ్రతుకుతెరువుకు బస్తీల బాటపట్టనాటి పల్లెల్ గనము నంగనాచు లేలమత్తకోకిల:ఏటికే యెదురీది రైతులు యేమిలబ్దిని గాంచకన్కూటి కోసము కష్టమైనను కూలి సేయగ సిద్ధమైబాటపట్టిరి పట్టణాలకు పల్లెలే విడనాడుచున్నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్
సాటి వారల కొనఁగూడు సాయమన్న మాట నిలిపిన పల్లెలే మాయమయ్యెనాటి పల్లెల్ గనము నంగనాచు లేలవాటి రూపురేఖలు మారె వన్నె తఱిగె సాటివారికి సాయమే మనసార చేసిన పల్లెలోరాటుదేలెను రాజకీయపు రాక్షసత్వపు భావనల్చేటుతెచ్చెను పల్లెలందున చెప్పలేని వికారముల్నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్
పల్లెలు పూర్వ వైభవము కోల్పోవడానికి కారణాలుతే॥ వైద్య సదుపాయముఁ గనక విద్యఁ బడయువిధముఁ గనక లాభముఁ గను వృత్తి గాకరైతు సంతుకు నచ్చక రైతులగుటనాటి పల్లెల్ గనము నంగనాచులేలతే॥ నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేలనిజము కాదయ్య తప్పిది నేఁడు కాలమహిమ విరియఁ గష్టముఁ బడు మనుజులేరి?సుఖముఁ గోరి సేద్యముఁ జేయు ముఖముఁ గనరెమత్త॥ నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్మేటి తప్పిదమిట్లు పల్కఁగ మెచ్చి నాగరికమ్మునున్మోటటంచును బ్రాఁత పద్ధతిఁ బొంద సౌఖ్యము మారిరే!పాటుమానిసులేరి కాలము పాడు చేసెనొ పల్లెలన్?ముఖము ప్రయత్నము పాటుమానిసి పాటుపడు మనిషి మోటు మూర్ఖము
పట్టణమ్ము లయ్యెను నేఁడు పల్లె లెల్లఁ జెప్పినది సేయ రెవ్వరు సెప్పి నట్లు సత్తెకాలపు నరు లున్నఁ జాలు మనకు నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల కోట లున్నను బాక లున్నను గూడి యుండిరు మిత్రులై మాట యిచ్చినఁ దప్ప రెన్నఁడు మానసమ్ములు వెన్నలే తోటి వారికి నెల్ల రప్పుడు తోడుగాఁ జరియించిరే నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్
ధాటిగా పనిచేసి నేత లుదాత్తమౌ పరిపాలనన్ బాటచూపిరి పూర్వకాల మభాగ్యులన్ గని ప్రీతితోనోటులిచ్చుచు యోట్లుపొంది వినూత్నరీతిని నేలగా నాటి పల్లెలు నేడు గానము నంగ నాచులె యేలగన్
న్యాయమును దప్పి పాలించు నాయకులను
రిప్లయితొలగించండినాటి పల్లెల్ గనము ; నంగనాచు లేల
నేటి పురములందు జనులు నెగ్గ లేక
యుండె నానేతలు సలుపు యుపధినుండి
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిరైతు సంక్షేమమునె నాడు రాజుతలచ
పాడిపంట సుభిక్షమై పరిఢవిల్లె
ఫలము లేక యెంచన్ బ్రజ పట్టణముల
నాటి పల్లెల్ గనము నంగనాచు లేల!
మత్తకోకల
నీట ముంచినయట్టి దుర్జన నేతలన్ గని వేదనన్
మాటిమాటికి నొచ్చి కృంగుచు మారురూపులు దాల్చగన్
బాటసారుల కైన కష్టము పల్లెసీమల గల్గఁగన్
నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్!
రిప్లయితొలగించండిప్రకృతి సంపద కవియేను పట్టు గొమ్మ
లంచు దలచిన నేమిరా యాధు నికము
పేర కృత్రిమత్వ మదియె పెరుగ నేడు
నాటి పల్లెల్ గనము నంగనాచు లేల.
మేటిగానభివృద్ధి యంచును మిక్కుటమ్మగు మార్పులే
ధాటిగానట చేరుచుండగ తత్త్వ నాశము జెందుచున్
జేటు గూర్చెడి యాంత్రి కత్వము చేరుచున్ నట గాంచగా
నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి:
రిప్లయితొలగించండిప్రగతి మందగించగ నేడు పల్లెలందు
పట్నవాసఁపు మోజుతో పల్లె ప్రజలు
బ్రతుకుతెరువుకు బస్తీల బాటపట్ట
నాటి పల్లెల్ గనము నంగనాచు లేల
మత్తకోకిల:
ఏటికే యెదురీది రైతులు యేమిలబ్దిని గాంచకన్
కూటి కోసము కష్టమైనను కూలి సేయగ సిద్ధమై
బాటపట్టిరి పట్టణాలకు పల్లెలే విడనాడుచున్
నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్
సాటి వారల కొనఁగూడు సాయమన్న
రిప్లయితొలగించండిమాట నిలిపిన పల్లెలే మాయమయ్యె
నాటి పల్లెల్ గనము నంగనాచు లేల
వాటి రూపురేఖలు మారె వన్నె తఱిగె
సాటివారికి సాయమే మనసార చేసిన పల్లెలో
రాటుదేలెను రాజకీయపు రాక్షసత్వపు భావనల్
చేటుతెచ్చెను పల్లెలందున చెప్పలేని వికారముల్
నాటి పల్లెలు నేడు గానము నంగనాచులె యేలఁగన్
పల్లెలు పూర్వ వైభవము కోల్పోవడానికి కారణాలు
రిప్లయితొలగించండితే॥ వైద్య సదుపాయముఁ గనక విద్యఁ బడయు
విధముఁ గనక లాభముఁ గను వృత్తి గాక
రైతు సంతుకు నచ్చక రైతులగుట
నాటి పల్లెల్ గనము నంగనాచులేల
తే॥ నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల
నిజము కాదయ్య తప్పిది నేఁడు కాల
మహిమ విరియఁ గష్టముఁ బడు మనుజులేరి?
సుఖముఁ గోరి సేద్యముఁ జేయు ముఖముఁ గనరె
మత్త॥ నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్
మేటి తప్పిదమిట్లు పల్కఁగ మెచ్చి నాగరికమ్మునున్
మోటటంచును బ్రాఁత పద్ధతిఁ బొంద సౌఖ్యము మారిరే!
పాటుమానిసులేరి కాలము పాడు చేసెనొ పల్లెలన్?
ముఖము ప్రయత్నము పాటుమానిసి పాటుపడు మనిషి మోటు మూర్ఖము
పట్టణమ్ము లయ్యెను నేఁడు పల్లె లెల్లఁ
రిప్లయితొలగించండిజెప్పినది సేయ రెవ్వరు సెప్పి నట్లు
సత్తెకాలపు నరు లున్నఁ జాలు మనకు
నాఁటి పల్లెల్ గనము నంగనాచు లేల
కోట లున్నను బాక లున్నను గూడి యుండిరు మిత్రులై
మాట యిచ్చినఁ దప్ప రెన్నఁడు మానసమ్ములు వెన్నలే
తోటి వారికి నెల్ల రప్పుడు తోడుగాఁ జరియించిరే
నాఁటి పల్లెలు నేఁడు గానము నంగనాచులె యేలఁగన్
ధాటిగా పనిచేసి నేత లుదాత్తమౌ పరిపాలనన్
రిప్లయితొలగించండిబాటచూపిరి పూర్వకాల మభాగ్యులన్ గని ప్రీతితో
నోటులిచ్చుచు యోట్లుపొంది వినూత్నరీతిని నేలగా
నాటి పల్లెలు నేడు గానము నంగ నాచులె యేలగన్