6, నవంబర్ 2026, శుక్రవారం

సమస్య - 5643

7-11-2026 (శనివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వానరులు జోతలిడిరి రావణుని మెచ్చి”

(లేదా...)

“వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్”

13 కామెంట్‌లు:

  1. సీత జాడను గనుగొని సేమ మరసి
    తిరిగి వఛ్చిన హనుమకు ధీరు డ నుచు
    వానరులు జోత లిడిరి :: రావణుని మె చ్చి
    ప్రేమ తోడ మండోదరి పెండ్లి యాడె

    రిప్లయితొలగించండి
  2. లంకయందలి పోరున రావణుపయి
    రాముడు శరములవిడుచు రాణనుగని
    వానరులు జోతలిడిరి ; రావణుని మెచ్చి
    యీశ్వరుడు పలు వరముల నిడినగూడ

    రిప్లయితొలగించండి

  3. మానవునిగ జనించిన మాధవునకు
    దండుగను చేరు భాగ్యము దక్కె మాకు
    నందులకు కారణమ్ము వాడంచు దలచి
    వానరులు జోతలిడిరి రావణుని మెచ్చి.


    జానకి బంది సేయుచును శత్రువు గా ప్రకటించి నందుకై
    మానవ రూప మందుగల మాధవుడే యని కేగు దెంచగా
    వాని సహాయమై కదులు భాగ్యము కల్గగ జేసినందుకా
    వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్.

    రిప్లయితొలగించండి
  4. (వానరులు రావణుని ధైర్య సాహసాలకు నమస్కరించారు అని, ప్రవర్తనకు కాదండి)

    తే॥ భీకరమగు యుద్ధము నందు భీతిఁ గనక
    పోరు సల్పి ధైర్యమొదవి పొందికగను
    నిలచి ప్రతిఘటించి తుదకు నేల గూల
    వానరులు జోతలిడిరి రావణుని మెచ్చి

    ఉ॥ పూని పరాక్రమమ్మొదవి పోరున జంకక నేక ధాటిగన్
    దానటు లస్త్రశస్త్రములఁ దాల్చిన రాముఁడు గూల్చ నాజిలో
    మానిత మొందె రావణుఁడు మన్ననఁ గాంచఁగ శౌర్య సంపదల్
    వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్

    రిప్లయితొలగించండి
  5. వెండికొండనే పెకలింప విర్రవీగి
    విఫలు డైన పిదప లంక విభుడు పలికె
    ను శివ తాండవ స్త్రోత్రమును వినుచు వహ
    వా! నరులు జోతలిడిరి రావణుని మెచ్చి

    తాను నగాధిరాజమును దర్పముతో పెకలింపబూనగా
    నేనుగుతోలుతాల్పదుమ నీరసుడైన విశేష రూపునన్
    దానవుడే సృజించె శివ తాండవ సంస్తుతి తత్క్షణాన వ
    హ్వా! నరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:వానరులు రాఘవుని మెచ్చి భక్తు లైరి
    కాని కలి చిత్రమేమొ రాఘవుని దిట్టి
    వారి విభుడు రావణు డని వాలరహిత
    వానరులు జోతలిడిరి రావణుని మెచ్చి”
    (వాలరహిత వానరులు= తోక లేని కోతుల వంటి మనుషులు. అసలైన కోతులు రాముడి భక్తులే కానీ ఈ తోక లేని కోతులు రాముణ్ని తిట్టి రావణుణ్ని మెచ్చుకుంటున్నారు. )




    రిప్లయితొలగించండి
  7. ఉ:వానరసేన లట్లు బలు భక్తుల సంస్థలు రామనామమున్
    గానము జేయుచున్ గదలగా, దశకంఠుని మూర్తి దెచ్చి యా
    హీనుని లీలలన్ దలచి హెచ్చగు భక్తిని తోక లేని యా
    వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్”

    (రామభక్తులు రామనామం తో కదులుతుంటే రావణ లీలా ఉత్సవాలకి రావణ భక్తులు అనబడే తోక లేని కోతులు బయలు దేరాయి. వానర సేనలు అన్నప్పుడు బజరంగదళ్ ని అన్యాపదేశం గా భావించ వచ్చు. )




    రిప్లయితొలగించండి
  8. తే.గీ: రాము డార్యుండట ,వీరు ద్రావిడు లట
    రాముడే శత్రు వట, నేత రావణుడట
    వేది పై వీరి పల్కుల విధము వింటి
    వా? నరులు జోతలిడిరి రావణుని మెచ్చి”



    రిప్లయితొలగించండి
  9. తే.గీ.
    రామరావణ ఘోర సంగ్రామమందు
    దశరథాత్మజుని శరసంధానముఁగని
    వానరులు జోతలిడిరి, రావణుని మెచ్చి
    ప్రోత్సహించిరి దురమున పొలసుదిండ్లు

    ఉ.
    దానవుడైన రావణుఁడు దక్షుఁడు పాలనయందు, నీశ్వరున్
    తానతి భక్తితో గొలుచు తద్దయు వేదవిదుండు శూరుడ
    వ్వాని ప్రశస్తి తాము విని వందన యోగ్యునిగానెరింగి యా
    వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్

    రిప్లయితొలగించండి
  10. రాక్షసేంద్రుఁడు చెండాడ రణము నందు
    రాక్షస వరేణ్యు లంది హర్షమ్ము నెదల,
    నేఁచి రావణు ధాటికిఁ జూచు చుండ
    వానరులు, జోత లిడిరి రావణుని మెచ్చి


    మానరు పోరు వానరులు మానిసి దిండ్లు చలమ్ము మీఱఁగా
    వానరు లెల్ల రాఘవునిఁ బార్థివ సూనునిఁ గాంచి మెచ్చఁ బం
    క్త్యానన విక్ర మోద్యమము నాజిఁ దృణీకృత సంఖ్య సంచర
    ద్వానరు లెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. తేటగీతి
      చచ్చినట్టి వానికి కళ్లు చారడేసి
      యన్న సామెత చెల్లంగ ననుసరించి
      యపర శివభక్తుడున్, బండితాఖ్యుఁడనుచు
      వానరులు జోతలిడిరి రావణుని మెచ్చి

      ఉత్పలమాల
      మేనులు పుల్కరించె విని మృత్యువు రావణు కౌగిలింపఁగన్
      సైనికులై కపీశ్వరులు, చచ్చినవానికి కళ్లు చారెడన్
      బూనిక, "వేదపండితుఁడు, బుధ్నుని భక్తుడు వీరుఁడం"చహో!
      వానరులెల్ల జోతలను బల్కిరి రావణుఁ జూచి మెచ్చుచున్!

      తొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    రాము డనిలోన గెలువగా ప్రేమ మీఱ
    వానరులు జోతలిడిరి; రావణుని మెచ్చి
    గొప్ప శివభక్తుడున్ శాస్త్ర కోవిదుండు
    రాజ ధర్మాల నెఱుగుము రావణు కడ
    యనుచు రాముడు లక్ష్మణున్ పనిచె నపుడు.

    రిప్లయితొలగించండి