7, నవంబర్ 2026, శనివారం

సమస్య - 5644

8-11-2026 (ఆదివారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్”

(లేదా...)

“వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్”

12 కామెంట్‌లు:

  1. జనహిత కృత్యములు సలుప
    మునుకొని గణ నా థు గొలుచు పుడమియె భక్తిన్
    ఘనుడౌ విఘ్న పతి కి పా
    వన వి భు నకు మూ షి కమ్ము వాహన మ య్యె న్

    రిప్లయితొలగించండి
  2. కనగ గజము వాహనము భు
    వనవిభునకు ; మూషికమ్ము వాహనమయ్యెన్
    త్రినయుని సుతుడు గణపతికి
    పిన,పెద్ద శరీరులయ్యె పిప్పిలకముగా

    రిప్లయితొలగించండి

  3. మును ముందుగ పూజలు గొను
    ఘనుడా స్కందాగ్రజుండు కాలంజరికిన్
    దనయుడు గణాధిపతి త్రిభు
    వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.


    ఘనుడాయేనుగుమోము సామియె కదా గాంగేయుకున్ లోకమున్
    ముని వంద్యుండగు విఘ్ననాథునకు, సంపూజ్యుండు ఫాలాక్షుకున్
    తనయుండంచు ప్రసిద్ధుడాతడె సదాదానుండకున్ గౌరి జీ
    వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్.

    రిప్లయితొలగించండి
  4. మ॥ కనుమా బాలల చిత్రరాజమున వీక్ష్యమ్మొందఁగా వింతలన్
    జనుచున్ జీమయె హస్తి రక్షఁగనె! మార్జాలమ్మె యోడించుచున్
    శునకమ్మున్ విహరించ వ్యాఘ్రమటులన్ జోద్యమ్ముగా భీతిలెన్!
    వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్!

    వనరాట్ సింహము వీక్ష్యము ఆశ్చర్యము

    రిప్లయితొలగించండి
  5. కం:జననియె రౌతుగ నయ్యెను
    వనవిభునకు, మూషికమ్ము వాహనమయ్యెన్
    ఘన విఘ్నపతికి , వృషభము
    తన వాహనముగ నొనర్చె తాపసి భవుడున్.


    రిప్లయితొలగించండి
  6. మ:కనుడీ జీవుల భాగ్యమున్! ఘనము లోక మ్మందు హిందుత్వ, మె
    ద్దునకున్ రౌతుగ నయ్యె ప్రేమగనె రుద్రుం, డంబకున్ ఠీవిగా
    వనరాడ్వాహనమయ్యె , మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
    గణనాథున్ భరియించు రౌతుగ కనంగా జంతువుల్ ధన్యముల్.





    రిప్లయితొలగించండి
  7. ఘనుడౌ గంధర్వుండే
    ఘనాఘనుడు శాపమొసగ ఖనకంబయ్యెన్
    గనుగొనగా భక్త జనా
    వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్

    ఘనమౌ దేహము కల్గియున్న విభుడే కారుణ్యమున్ జూపగా
    ఖనకంబయ్యెను గాదె వాహనముగా! కావ్యాలు శోధించి నే
    కనుగొంటిన్ సురరాజు శాప మహిమన్ క్రౌంచుండు కుందెన్ జనా
    వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్

    రిప్లయితొలగించండి
  8. ఘన కార్యము దలబెట్టఁగ
    పెను యవరోధములనైన వెసఁదొలగించున్
    ఘనుడా గణనాథుఁడు పా
    వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్

    రిప్లయితొలగించండి
  9. పెను విఘ్నమ్ము లపాకరించుమన సంవేగమ్ముగా బాపునా
    ఘనుఁడౌ పార్వతి నందనుండు ఘనసంఘాతమ్ము తూలించు ధూ
    ననముం బోలిక నేగుచుండ ప్రజకున్ నందంబు గూర్చంగ పా
    వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్

    (ఘనసంఘాతము= మబ్బుల సమూహము)

    రిప్లయితొలగించండి
  10. అనుమానము సుంత వలదు
    కనఁ దర్కము నీటి మూషి కమ్మనఁ జెల్లున్
    వనచర మకరమ్ముఁ గనుక
    వన విభునకు మూషికమ్ము వాహన మయ్యెన్


    మనుజౌఘమ్మునకన్ సురావళికినిన్ మాన్యుండు హేరంబుఁడౌ
    ఘనుఁ డా మత్త గజాస్య భాసితుఁడు తద్గౌరీ కరాంభోజ సం
    జననుం డెల్లెడ సంచరించుటకు హర్షం బంది విఘ్నవ్ర జా
    వన రాడ్వాహన మయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్

    రిప్లయితొలగించండి
  11. కందం
    మును గంధర్వుఁడె శాప
    మ్ముననాఖువుగఁ జెలఁగంగ మునికుటిఁ, బాశ
    మ్మునఁ గొన గణపతి భృతి భా
    వన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్!

    మత్తేభవిక్రీడితము
    మును గంధర్వుఁడు క్రౌంచుడే కులిశికిన్ బొంగించ క్రోధమ్ముఁ జి
    వ్వున శాపమొసంగ నాఖువుగఁ గోపోద్రిక్తుఁడై నష్టమున్
    ముని ధామమ్ముననెంచ 'విఘ్నపతి'యే మొట్టంగనే భృత్యు భా
    వన 'రాడ్వా'హనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఘనుడగు పార్వతి పుత్రుని
    వినయముగా నెవరు వేడ విఘ్నము బాపున్
    జన హితమును కోరెడు పా
    వన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.

    రిప్లయితొలగించండి