8-11-2026 (ఆదివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్”
(లేదా...)
“వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్”
జనహిత కృత్యములు సలుపమునుకొని గణ నా థు గొలుచు పుడమియె భక్తిన్ ఘనుడౌ విఘ్న పతి కి పా వన వి భు నకు మూ షి కమ్ము వాహన మ య్యె న్
కనగ గజము వాహనము భువనవిభునకు ; మూషికమ్ము వాహనమయ్యెన్త్రినయుని సుతుడు గణపతికి పిన,పెద్ద శరీరులయ్యె పిప్పిలకముగా
మును ముందుగ పూజలు గొను ఘనుడా స్కందాగ్రజుండు కాలంజరికిన్ దనయుడు గణాధిపతి త్రిభు వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.ఘనుడాయేనుగుమోము సామియె కదా గాంగేయుకున్ లోకమున్ ముని వంద్యుండగు విఘ్ననాథునకు, సంపూజ్యుండు ఫాలాక్షుకున్ తనయుండంచు ప్రసిద్ధుడాతడె సదాదానుండకున్ గౌరి జీ వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్.
మ॥ కనుమా బాలల చిత్రరాజమున వీక్ష్యమ్మొందఁగా వింతలన్జనుచున్ జీమయె హస్తి రక్షఁగనె! మార్జాలమ్మె యోడించుచున్శునకమ్మున్ విహరించ వ్యాఘ్రమటులన్ జోద్యమ్ముగా భీతిలెన్!వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్!వనరాట్ సింహము వీక్ష్యము ఆశ్చర్యము
కం:జననియె రౌతుగ నయ్యెనువనవిభునకు, మూషికమ్ము వాహనమయ్యెన్ఘన విఘ్నపతికి , వృషభముతన వాహనముగ నొనర్చె తాపసి భవుడున్.
మ:కనుడీ జీవుల భాగ్యమున్! ఘనము లోక మ్మందు హిందుత్వ, మెద్దునకున్ రౌతుగ నయ్యె ప్రేమగనె రుద్రుం, డంబకున్ ఠీవిగావనరాడ్వాహనమయ్యె , మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్గణనాథున్ భరియించు రౌతుగ కనంగా జంతువుల్ ధన్యముల్.
ఘనుడౌ గంధర్వుండేఘనాఘనుడు శాపమొసగ ఖనకంబయ్యెన్గనుగొనగా భక్త జనావనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్ఘనమౌ దేహము కల్గియున్న విభుడే కారుణ్యమున్ జూపగాఖనకంబయ్యెను గాదె వాహనముగా! కావ్యాలు శోధించి నేకనుగొంటిన్ సురరాజు శాప మహిమన్ క్రౌంచుండు కుందెన్ జనావనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
ఘన కార్యము దలబెట్టఁగపెను యవరోధములనైన వెసఁదొలగించున్ఘనుడా గణనాథుఁడు పావనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్
పెను విఘ్నమ్ము లపాకరించుమన సంవేగమ్ముగా బాపునాఘనుఁడౌ పార్వతి నందనుండు ఘనసంఘాతమ్ము తూలించు ధూననముం బోలిక నేగుచుండ ప్రజకున్ నందంబు గూర్చంగ పావనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్(ఘనసంఘాతము= మబ్బుల సమూహము)
అనుమానము సుంత వలదు కనఁ దర్కము నీటి మూషి కమ్మనఁ జెల్లున్ వనచర మకరమ్ముఁ గనుక వన విభునకు మూషికమ్ము వాహన మయ్యెన్ మనుజౌఘమ్మునకన్ సురావళికినిన్ మాన్యుండు హేరంబుఁడౌ ఘనుఁ డా మత్త గజాస్య భాసితుఁడు తద్గౌరీ కరాంభోజ సంజననుం డెల్లెడ సంచరించుటకు హర్షం బంది విఘ్నవ్ర జావన రాడ్వాహన మయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
కందంమును గంధర్వుఁడె శాపమ్ముననాఖువుగఁ జెలఁగంగ మునికుటిఁ, బాశమ్మునఁ గొన గణపతి భృతి భావన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్! మత్తేభవిక్రీడితముమును గంధర్వుఁడు క్రౌంచుడే కులిశికిన్ బొంగించ క్రోధమ్ముఁ జివ్వున శాపమొసంగ నాఖువుగఁ గోపోద్రిక్తుఁడై నష్టమున్ముని ధామమ్ముననెంచ 'విఘ్నపతి'యే మొట్టంగనే భృత్యు భావన 'రాడ్వా'హనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.ఘనుడగు పార్వతి పుత్రునివినయముగా నెవరు వేడ విఘ్నము బాపున్జన హితమును కోరెడు పావన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.
జనహిత కృత్యములు సలుప
రిప్లయితొలగించండిమునుకొని గణ నా థు గొలుచు పుడమియె భక్తిన్
ఘనుడౌ విఘ్న పతి కి పా
వన వి భు నకు మూ షి కమ్ము వాహన మ య్యె న్
కనగ గజము వాహనము భు
రిప్లయితొలగించండివనవిభునకు ; మూషికమ్ము వాహనమయ్యెన్
త్రినయుని సుతుడు గణపతికి
పిన,పెద్ద శరీరులయ్యె పిప్పిలకముగా
రిప్లయితొలగించండిమును ముందుగ పూజలు గొను
ఘనుడా స్కందాగ్రజుండు కాలంజరికిన్
దనయుడు గణాధిపతి త్రిభు
వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.
ఘనుడాయేనుగుమోము సామియె కదా గాంగేయుకున్ లోకమున్
ముని వంద్యుండగు విఘ్ననాథునకు, సంపూజ్యుండు ఫాలాక్షుకున్
తనయుండంచు ప్రసిద్ధుడాతడె సదాదానుండకున్ గౌరి జీ
వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్.
మ॥ కనుమా బాలల చిత్రరాజమున వీక్ష్యమ్మొందఁగా వింతలన్
రిప్లయితొలగించండిజనుచున్ జీమయె హస్తి రక్షఁగనె! మార్జాలమ్మె యోడించుచున్
శునకమ్మున్ విహరించ వ్యాఘ్రమటులన్ జోద్యమ్ముగా భీతిలెన్!
వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్!
వనరాట్ సింహము వీక్ష్యము ఆశ్చర్యము
కం:జననియె రౌతుగ నయ్యెను
రిప్లయితొలగించండివనవిభునకు, మూషికమ్ము వాహనమయ్యెన్
ఘన విఘ్నపతికి , వృషభము
తన వాహనముగ నొనర్చె తాపసి భవుడున్.
మ:కనుడీ జీవుల భాగ్యమున్! ఘనము లోక మ్మందు హిందుత్వ, మె
రిప్లయితొలగించండిద్దునకున్ రౌతుగ నయ్యె ప్రేమగనె రుద్రుం, డంబకున్ ఠీవిగా
వనరాడ్వాహనమయ్యె , మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
గణనాథున్ భరియించు రౌతుగ కనంగా జంతువుల్ ధన్యముల్.
ఘనుడౌ గంధర్వుండే
రిప్లయితొలగించండిఘనాఘనుడు శాపమొసగ ఖనకంబయ్యెన్
గనుగొనగా భక్త జనా
వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్
ఘనమౌ దేహము కల్గియున్న విభుడే కారుణ్యమున్ జూపగా
ఖనకంబయ్యెను గాదె వాహనముగా! కావ్యాలు శోధించి నే
కనుగొంటిన్ సురరాజు శాప మహిమన్ క్రౌంచుండు కుందెన్ జనా
వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
ఘన కార్యము దలబెట్టఁగ
రిప్లయితొలగించండిపెను యవరోధములనైన వెసఁదొలగించున్
ఘనుడా గణనాథుఁడు పా
వనవిభునకు మూషికమ్ము వాహనమయ్యెన్
పెను విఘ్నమ్ము లపాకరించుమన సంవేగమ్ముగా బాపునా
రిప్లయితొలగించండిఘనుఁడౌ పార్వతి నందనుండు ఘనసంఘాతమ్ము తూలించు ధూ
ననముం బోలిక నేగుచుండ ప్రజకున్ నందంబు గూర్చంగ పా
వనరాడ్వాహనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
(ఘనసంఘాతము= మబ్బుల సమూహము)
అనుమానము సుంత వలదు
రిప్లయితొలగించండికనఁ దర్కము నీటి మూషి కమ్మనఁ జెల్లున్
వనచర మకరమ్ముఁ గనుక
వన విభునకు మూషికమ్ము వాహన మయ్యెన్
మనుజౌఘమ్మునకన్ సురావళికినిన్ మాన్యుండు హేరంబుఁడౌ
ఘనుఁ డా మత్త గజాస్య భాసితుఁడు తద్గౌరీ కరాంభోజ సం
జననుం డెల్లెడ సంచరించుటకు హర్షం బంది విఘ్నవ్ర జా
వన రాడ్వాహన మయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
కందం
రిప్లయితొలగించండిమును గంధర్వుఁడె శాప
మ్ముననాఖువుగఁ జెలఁగంగ మునికుటిఁ, బాశ
మ్మునఁ గొన గణపతి భృతి భా
వన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్!
మత్తేభవిక్రీడితము
మును గంధర్వుఁడు క్రౌంచుడే కులిశికిన్ బొంగించ క్రోధమ్ముఁ జి
వ్వున శాపమొసంగ నాఖువుగఁ గోపోద్రిక్తుఁడై నష్టమున్
ముని ధామమ్ముననెంచ 'విఘ్నపతి'యే మొట్టంగనే భృత్యు భా
వన 'రాడ్వా'హనమయ్యె మూషికము సంభావించి మ్రొక్కన్ సురల్
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఘనుడగు పార్వతి పుత్రుని
వినయముగా నెవరు వేడ విఘ్నము బాపున్
జన హితమును కోరెడు పా
వన విభునకు మూషికమ్ము వాహనమయ్యెన్.