10, నవంబర్ 2026, మంగళవారం

సమస్య - 5647

11-11-2026 (బుధవారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె”

(లేదా...)

“ఆతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్”

18 కామెంట్‌లు:

  1. తేటగీతిక.

    బాల్యమందునె వైధవ్య బాధకలిగి
    యోగసాధనజేయుచుసాగుచుండ
    ధ్యాన మొనరించి సిద్ధులు తానుబొందె
    నరులగతజన్మలగుపించె నయనములకు
    మరలజన్మించెతనభర్త నరునిగానె
    యౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె

    రిప్లయితొలగించండి
  2. తాను వలచి పెండ్లాడిన తరుణమందు
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె ,
    తనవలె మరొక పడతి యతనని కోరు
    ననెడీ యనవసరమయిన యనుమ తోడ

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. భార్య యారోగ్య హీనయై బాధ పడుచు
      మంచము ను బట్టి యుందగా మగడు తనను
      తరచు లైంగిక వేదన తాళ లేక
      య వ్వ నా డ్యు డౌ పతిని గాంచి యాలి యే డ్చె

      తొలగించండి

  4. ప్రేమతో బెండ్లి యాడిన ప్రియవరునకు
    కుష్ట రోగము సోకెను , కొన్ని నాళ్ళె
    కాపురముచేసె నాజంట కాని సతము
    యౌవనాఢ్యుడౌపతిగాంచియాలియేడ్చె

    రిప్లయితొలగించండి

  5. సాతములపయి మోజది స్రగ్గనట్టి
    తండ్రికిని యౌవన మొసగి తన యుడపుడు
    వగ్గు డగుటను గాంచుచు బాధ చెంది
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె.



    సాతము లన్న మోహమది స్రగ్గని తండ్రియె కోరి నంతనే
    భూతుడు యౌవనమ్మొసగి మోదము గూర్చె యయాతి కప్పుడా
    నాతి గతాయువైన తన నాకుని దుస్థితికిన్ నెపమ్మె యౌ
    యాతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్.


    రిప్లయితొలగించండి
  6. (ఇది పరిశోధనలలో కూరుకు పోయిన వారి గురించి యండి సత్యము)

    ఉ॥ ఈతఁడు శాస్త్ర శోధనల నెప్పుడు ధ్యానము నుంచి సాగెనే!
    చేతన మంత యచ్చటయె చిత్రము భార్యను లెక్క పెట్టడే!
    ఈతని నెట్లు వేగెదనొ యేది గ్రహించఁగ నైతినే యహో
    ఆతత యౌవనాఢ్యుఁడగు నట్టి పతిం గని భార్య చింతిలెన్

    (శాస్త్ర శోధనలో ఇది తప్పదండి, భర్త మాత్రమే పరిశోధనలో ఉంటే. అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యే వేళకు కొంత వెసులు బాటుండగదండి. చాల చోట్ల అదే ల్యాబ్ లలో ఉన్న జంటలకు పెళ్లిళ్లు అవుతాయి. అప్పుడు గొడవ లేదు.)

    రిప్లయితొలగించండి
  7. రాశి చక్రముఁ బరికించి రచటి ఘనులు
    పుట్టి నంతటన్ జోస్యులే బుద్ధుడనిరి
    జ్ఞాన తృష్ణతో నాతడు సన్యసింప
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె

    ఆతడు పుట్టినంతట మహాత్మునిగా మదినెంచి జ్యోతిషుల్
    జాతకమే విశిష్టమని చప్పున చెప్పిరి కచ్చితంబుగన్
    చేతము చిందులేసెనని చివ్వున బుద్ధుడు సన్యసింపగా
    నాతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:తాను సవతి కూతురగుట తనను నేబ
    దేండ్ల పేదకు దన తల్లి యీయ,స్వంత
    కూతునకు కుదిర్చిన ధనికుడును మరియు
    యౌవనాఢ్యుఁడౌ, పతిఁ గాంచి యాలి యేడ్చె”

    రిప్లయితొలగించండి
  9. ఆతడు దేశరక్షణమునందున బాధ్యతగొన్న సైనికుం
    డాతని పత్ని గర్భవతి యా తరుణంబున యుద్ధభూమికిన్
    నాతిని వీడిబోవ నయనమ్ముల నశ్రువు లుప్పతిల్ల నా
    యాతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్

    రిప్లయితొలగించండి
  10. 2)ఉ:నా తలిదండ్రు లిద్దరును నన్నొక ప్రాయము జెల్లి, ప్రౌఢుడౌ
    నాతని కిచ్చిరయ్యొ! కని నంతట నీర్ష్యయె కల్గు మిత్ర యౌ
    నా తరుణీమణీ సుఖము నంచు చెలిన్ గని, యామె భాగ్యమౌ
    నాతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్”

    రిప్లయితొలగించండి
  11. నీతి నిజాయితీ గలిగి నిర్మల చిత్తముతో చరించుచున్
    ఖ్యాతి ఘటిల్లజేసి మను నాలికి, పుట్టగ రాచపుండు, మీ
    జాతిని వృద్ధి చేయటడి సాధ్యము కాదని చెప్పవైద్యుడే
    ఆతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్

    రిప్లయితొలగించండి
  12. ప్రాణ మస్థిరం బనుచుండఁ బ్రాయ మెంత
    పుచ్చుకొని కుమారుని నుండి మున్ను తిరిగి
    యౌవనమ్మును సుతున కీయంగ విగత
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె


    ఆతత తాపసోత్తము లనన్య మనోహర రూప మందు టే
    రీతిని వింత యౌను వ్యతిరేకము వింత యనంగ సత్యమౌ
    యీతని కే విధమ్మున గతించెను వార్ధక మౌర యంచు నా
    యాతత యౌవనాఢ్యుఁ డగు నట్టి పతిం గని భార్య చింతిలెన్

    [చింతిలు = ఆలోచించు]

    రిప్లయితొలగించండి
  13. తేటగీతి
    కలి వశాన వియోగము గలిగి పిదప
    నలుఁడు గర్కోటక విషానఁ గలఁగినంత
    స్తోకకాయాన, దమయంతి త్రుళ్లిపడదె!
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె!

    ఉత్పలమాల
    ఘాతుకమెంచఁగన్ గలియె కర్కశరీతి నలాధిపున్ బగన్
    యాతనలెన్నియో పడియు నన్నులమిన్న వియోగమొందుచున్
    భీతిని స్తోకకాయ ఫణి పీడితుఁడై దనముందునిల్వఁగా
    నాతత యౌవనాఢ్యుఁడగునట్టి పతిం గని భార్య చింతిలెన్

    రిప్లయితొలగించండి
  14. ముచ్చటలు మురిపాలింక ముగియలేదు
    యుద్ధమనివార్యమై సరిహద్దులందు
    దేశరక్షణ బాధ్యతఁ దీర్చఁ జనెడు
    యౌవనాఢ్యుఁడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    మార్గమందు కారు ప్రమాదమై శరీర
    మంత దెబ్బలతో నిండి యాసుపత్రి
    యందు జేర్చ పరీక్షల నన్ని చేసి
    పనికిరాడు స్త్రీ సంగమమునకనంగ
    యౌవనాఢ్యుడౌ పతిఁ గాంచి యాలి యేడ్చె.

    రిప్లయితొలగించండి