11, నవంబర్ 2026, బుధవారం

సమస్య - 5648

12-11-2026 (గురువారం)

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కంచమందు తిండి గలదు తినఁడు”

(లేదా...)

“కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్”

19 కామెంట్‌లు:

  1. క్షామముండి కూడ కాననమందున
    కంచమందు తిండి గలదు ; తినఁడు
    వాడు క్షుత్తు బాధ పడుచుండిననుకూడ ,
    అందు గరళమున్న యనుమతోడ

    రిప్లయితొలగించండి
  2. ఆటవెలది
    అనుసరించునఁగ నాహారనియమాలు
    తప్పడెప్పుడైనఁ దలఁచుకొనుచు
    వైద్యుఁడొప్పనట్టి వైనాన వండఁగ
    కంచమందు తిండి గలదు తినఁడు

    ఉత్పలమాల
    మంచము పాలు గాక మను మర్మమటంచును జాగరూకుడై
    యెంచును నోగిరమ్ము తనువెంతయొ తాళగనొప్పు రీతిగన్
    బెంచును రోగకారకము వేదన గూర్చెడు శాక పూర్ణమౌ
    కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్

    రిప్లయితొలగించండి
  3. ఉత్పలమాల:
    మించినయాశ పాదుకొని పేదల యాస్తులు మత్కుణమ్మటుల్
    వంచనజేసి కొల్లగొను స్వార్థపరుండయి వార్ధకమ్మునన్
    సంచిత సంపదల్ తనకు జబ్బులుగా పరిణామమొందగా
    కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్

    రిప్లయితొలగించండి
  4. రోగ బాధ చేత రోదించు చుండగ
    వికల మ య్యె మనసు వెలితి కలిగి
    తిన్గగ బుద్ధి రాక దీనత తో తాను
    కంచ మందు తిండి గలదు తినడు

    రిప్లయితొలగించండి

  5. *(కుంతి శ్రీ కృష్ణుని తో పలికినట్లుగా......)*

    పాండవులిక నిన్ను భ్రాతగా దలచుచు
    రాజు జేతురు కద రాజ్య మునకు
    రమ్మటంచు బిలువ రాననె కర్ణుడు
    కంచమందు తిండి గలదు, తినఁడు.



    వంచన జేసి స్నేహితుని స్వార్థము తోడ విలాతి గోరి నీ
    పంచన జేర లేననె ప్రభాకర సూనుడు తల్లి నంచు నా
    పంచన జేర భూపతిగ పట్టము గట్టెద నన్న నొప్పడే
    కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్.

    రిప్లయితొలగించండి
  6. -
    జూచె తల్లి చెంత జోరుగాను మొబైలు
    వదల డౌర వాడు వదలడాయె
    పిల్ల వాడు జూడ పెంకిఘటమయయొ
    కంచమందు తిండి గలదు తినడు


    జిలేబీయము

    రిప్లయితొలగించండి
  7. పెంచి పెద్దచేసి ప్రియమార లాలించి
    మంచి మనువు నిశ్చయించిన తఱి
    కొంచెగాని వలచి కొమరిత తరలగా
    కంచమందు తిండి గలదు తినఁడు

    సంచితమైన సంపదను సత్వరమే విభజించి యిచ్చినన్
    బంచక నున్న యింటిని చివాలున పంచుమటంచు పిల్లలే
    యించుక సంశయింపక వచించిన పల్కులఁ గాంచి ఖిన్నుడై
    కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:ఎంచి యాట వెలది నుంచ బ్రాసలను ర
    చించి సగమె యాపె చిరుత డిచట
    "మంచ మెక్క డయ్యె మగువ రమ్మని పిల్వ
    కంచమందు తిండి గలదు తినఁడు”

    (ఒక పిల్లాడు ఆటవెలదికి ప్రాస అక్కర లేదనేది మరచి రెండు పాదాలు ప్రాసతో వ్రాసి ప్రాస దొరక్క సగం లో ఆపేసాడు.నేను అదే ప్రాస తో చెప్పాను. )





    రిప్లయితొలగించండి
  9. ఉ:వంచన జేసి దాసి యగు భార్యను, వేశ్యల గోరి యెన్నియో
    పంచల జేరె, శూన్య మయి పైకము నోపిక తగ్గి, స్వాస్థ్యమే
    యించుక లేక, పంటి బల మింతయు లేకయు నాలి బెట్టగా
    కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్


    రిప్లయితొలగించండి
  10. ఎంత వేడుకున్న కొంతైన గదలడు
    మొండి వాడు లింగ మూర్తి జూడ
    లేత మాంసమెట్టి లేవయ్య తనుమన్న
    కంచమందు తిండి గలదు తినడు

    రిప్లయితొలగించండి
  11. ఆటవెలది:
    పేదవారి నెల్ల పీడించి యాస్తులు
    కూడబెట్టినట్టి కుత్సితుండు
    డబ్బుతోడ తనకు జబ్బులు దరిజేర
    కంచమందు తిండి గలదు తినఁడు

    రిప్లయితొలగించండి
  12. మించఁగ నభి మాన మంచితముగ నెంచి
    కొంచె మైన నచట మంచి తనము
    మించఁ బిలువ రంచుఁ బెంచి సంకోచమ్ము
    కంచ మందు తిండి గలదు తినఁడు


    మించిన బాధ డెందమున మేటి మగండును గ్రుంక కుండునే
    పంచన నిల్చి యుండినను భార్యను జూడఁడు పల్కరింపఁడే
    మంచము పైన దొర్లు నణు మాత్రము జాఱఁడు నిద్ర లోనికిం
    గంచము లోని యన్నమునుఁ గాంచుచు నుండెఁ దినండు సుంతయున్

    రిప్లయితొలగించండి
  13. వేళమించిపోయె వేగమేరమ్మని
    పిలుచుచుండనమ్మ ప్రేమతోడ
    బడికి వెళ్ళననుచు పలుకు బాలు నెదుట
    *"కంచమందు తిండి గలదు తినఁడు”*


    డా బల్లూరి ఉమాదేవి

    ఎంచగ హెచ్చె నప్పులవి యెవ్విధి తీర్తునటంచు బాధతో
    మంచముపైనచేరుచను మానసమందునచింతహెచ్చుగన్
    ముంచగ వచ్చె కష్టములు ముల్లటు గుండెల గుచ్చుచుండగా
    *“కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్”*

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    లక్ష లప్పుజేసి లక్షణముగ పెంచ
    వరద పాలు గాగ పంటలన్ని
    వగపు తోడ రైతు దిగులుతో నుండగ
    కంచమందు తిండి గలదు తినడు.

    రిప్లయితొలగించండి