12-11-2026 (గురువారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంచమందు తిండి గలదు తినఁడు”
(లేదా...)
“కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్”
క్షామముండి కూడ కాననమందునకంచమందు తిండి గలదు ; తినఁడువాడు క్షుత్తు బాధ పడుచుండిననుకూడ ,అందు గరళమున్న యనుమతోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆటవెలది అనుసరించునఁగ నాహారనియమాలు తప్పడెప్పుడైనఁ దలఁచుకొనుచువైద్యుఁడొప్పనట్టి వైనాన వండఁగకంచమందు తిండి గలదు తినఁడుఉత్పలమాల మంచము పాలు గాక మను మర్మమటంచును జాగరూకుడై యెంచును నోగిరమ్ము తనువెంతయొ తాళగనొప్పు రీతిగన్బెంచును రోగకారకము వేదన గూర్చెడు శాక పూర్ణమౌకంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
ఆటవెలది మొదటి పాదములో టైపాటుసవరణ:అనుసరించుమనఁగ నాహారనియమాలు
ఉత్పలమాల:మించినయాశ పాదుకొని పేదల యాస్తులు మత్కుణమ్మటుల్వంచనజేసి కొల్లగొను స్వార్థపరుండయి వార్ధకమ్మునన్సంచిత సంపదల్ తనకు జబ్బులుగా పరిణామమొందగాకంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
రోగ బాధ చేత రోదించు చుండగవికల మ య్యె మనసు వెలితి కలిగి తిన్గగ బుద్ధి రాక దీనత తో తాను కంచ మందు తిండి గలదు తినడు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
*(కుంతి శ్రీ కృష్ణుని తో పలికినట్లుగా......)*పాండవులిక నిన్ను భ్రాతగా దలచుచు రాజు జేతురు కద రాజ్య మునకు రమ్మటంచు బిలువ రాననె కర్ణుడు కంచమందు తిండి గలదు, తినఁడు.వంచన జేసి స్నేహితుని స్వార్థము తోడ విలాతి గోరి నీ పంచన జేర లేననె ప్రభాకర సూనుడు తల్లి నంచు నా పంచన జేర భూపతిగ పట్టము గట్టెద నన్న నొప్పడే కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్.
-జూచె తల్లి చెంత జోరుగాను మొబైలువదల డౌర వాడు వదలడాయెపిల్ల వాడు జూడ పెంకిఘటమయయొకంచమందు తిండి గలదు తినడుజిలేబీయము
పెంచి పెద్దచేసి ప్రియమార లాలించి మంచి మనువు నిశ్చయించిన తఱికొంచెగాని వలచి కొమరిత తరలగా కంచమందు తిండి గలదు తినఁడుసంచితమైన సంపదను సత్వరమే విభజించి యిచ్చినన్బంచక నున్న యింటిని చివాలున పంచుమటంచు పిల్లలే యించుక సంశయింపక వచించిన పల్కులఁ గాంచి ఖిన్నుడైకంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
తే.గీ:ఎంచి యాట వెలది నుంచ బ్రాసలను రచించి సగమె యాపె చిరుత డిచట"మంచ మెక్క డయ్యె మగువ రమ్మని పిల్వకంచమందు తిండి గలదు తినఁడు”(ఒక పిల్లాడు ఆటవెలదికి ప్రాస అక్కర లేదనేది మరచి రెండు పాదాలు ప్రాసతో వ్రాసి ప్రాస దొరక్క సగం లో ఆపేసాడు.నేను అదే ప్రాస తో చెప్పాను. )
ఉ:వంచన జేసి దాసి యగు భార్యను, వేశ్యల గోరి యెన్నియో పంచల జేరె, శూన్య మయి పైకము నోపిక తగ్గి, స్వాస్థ్యమేయించుక లేక, పంటి బల మింతయు లేకయు నాలి బెట్టగా కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
ఎంత వేడుకున్న కొంతైన గదలడుమొండి వాడు లింగ మూర్తి జూడలేత మాంసమెట్టి లేవయ్య తనుమన్నకంచమందు తిండి గలదు తినడు
ఆటవెలది:పేదవారి నెల్ల పీడించి యాస్తులుకూడబెట్టినట్టి కుత్సితుండుడబ్బుతోడ తనకు జబ్బులు దరిజేరకంచమందు తిండి గలదు తినఁడు
మించఁగ నభి మాన మంచితముగ నెంచి కొంచె మైన నచట మంచి తనము మించఁ బిలువ రంచుఁ బెంచి సంకోచమ్ము కంచ మందు తిండి గలదు తినఁడు మించిన బాధ డెందమున మేటి మగండును గ్రుంక కుండునే పంచన నిల్చి యుండినను భార్యను జూడఁడు పల్కరింపఁడే మంచము పైన దొర్లు నణు మాత్రము జాఱఁడు నిద్ర లోనికిం గంచము లోని యన్నమునుఁ గాంచుచు నుండెఁ దినండు సుంతయున్
వేళమించిపోయె వేగమేరమ్మనిపిలుచుచుండనమ్మ ప్రేమతోడ బడికి వెళ్ళననుచు పలుకు బాలు నెదుట*"కంచమందు తిండి గలదు తినఁడు”*డా బల్లూరి ఉమాదేవి ఎంచగ హెచ్చె నప్పులవి యెవ్విధి తీర్తునటంచు బాధతోమంచముపైనచేరుచను మానసమందునచింతహెచ్చుగన్ముంచగ వచ్చె కష్టములు ముల్లటు గుండెల గుచ్చుచుండగా*“కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్”*
పిన్నక నాగేశ్వరరావు.హైదరాబాద్.లక్ష లప్పుజేసి లక్షణముగ పెంచవరద పాలు గాగ పంటలన్నివగపు తోడ రైతు దిగులుతో నుండగకంచమందు తిండి గలదు తినడు.
క్షామముండి కూడ కాననమందున
రిప్లయితొలగించండికంచమందు తిండి గలదు ; తినఁడు
వాడు క్షుత్తు బాధ పడుచుండిననుకూడ ,
అందు గరళమున్న యనుమతోడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆటవెలది
రిప్లయితొలగించండిఅనుసరించునఁగ నాహారనియమాలు
తప్పడెప్పుడైనఁ దలఁచుకొనుచు
వైద్యుఁడొప్పనట్టి వైనాన వండఁగ
కంచమందు తిండి గలదు తినఁడు
ఉత్పలమాల
మంచము పాలు గాక మను మర్మమటంచును జాగరూకుడై
యెంచును నోగిరమ్ము తనువెంతయొ తాళగనొప్పు రీతిగన్
బెంచును రోగకారకము వేదన గూర్చెడు శాక పూర్ణమౌ
కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
ఆటవెలది మొదటి పాదములో టైపాటుసవరణ:
తొలగించండిఅనుసరించుమనఁగ నాహారనియమాలు
ఉత్పలమాల:
రిప్లయితొలగించండిమించినయాశ పాదుకొని పేదల యాస్తులు మత్కుణమ్మటుల్
వంచనజేసి కొల్లగొను స్వార్థపరుండయి వార్ధకమ్మునన్
సంచిత సంపదల్ తనకు జబ్బులుగా పరిణామమొందగా
కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరోగ బాధ చేత రోదించు చుండగ
రిప్లయితొలగించండివికల మ య్యె మనసు వెలితి కలిగి
తిన్గగ బుద్ధి రాక దీనత తో తాను
కంచ మందు తిండి గలదు తినడు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండి*(కుంతి శ్రీ కృష్ణుని తో పలికినట్లుగా......)*
పాండవులిక నిన్ను భ్రాతగా దలచుచు
రాజు జేతురు కద రాజ్య మునకు
రమ్మటంచు బిలువ రాననె కర్ణుడు
కంచమందు తిండి గలదు, తినఁడు.
వంచన జేసి స్నేహితుని స్వార్థము తోడ విలాతి గోరి నీ
పంచన జేర లేననె ప్రభాకర సూనుడు తల్లి నంచు నా
పంచన జేర భూపతిగ పట్టము గట్టెద నన్న నొప్పడే
కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్.
-
రిప్లయితొలగించండిజూచె తల్లి చెంత జోరుగాను మొబైలు
వదల డౌర వాడు వదలడాయె
పిల్ల వాడు జూడ పెంకిఘటమయయొ
కంచమందు తిండి గలదు తినడు
జిలేబీయము
పెంచి పెద్దచేసి ప్రియమార లాలించి
రిప్లయితొలగించండిమంచి మనువు నిశ్చయించిన తఱి
కొంచెగాని వలచి కొమరిత తరలగా
కంచమందు తిండి గలదు తినఁడు
సంచితమైన సంపదను సత్వరమే విభజించి యిచ్చినన్
బంచక నున్న యింటిని చివాలున పంచుమటంచు పిల్లలే
యించుక సంశయింపక వచించిన పల్కులఁ గాంచి ఖిన్నుడై
కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
తే.గీ:ఎంచి యాట వెలది నుంచ బ్రాసలను ర
రిప్లయితొలగించండిచించి సగమె యాపె చిరుత డిచట
"మంచ మెక్క డయ్యె మగువ రమ్మని పిల్వ
కంచమందు తిండి గలదు తినఁడు”
(ఒక పిల్లాడు ఆటవెలదికి ప్రాస అక్కర లేదనేది మరచి రెండు పాదాలు ప్రాసతో వ్రాసి ప్రాస దొరక్క సగం లో ఆపేసాడు.నేను అదే ప్రాస తో చెప్పాను. )
ఉ:వంచన జేసి దాసి యగు భార్యను, వేశ్యల గోరి యెన్నియో
రిప్లయితొలగించండిపంచల జేరె, శూన్య మయి పైకము నోపిక తగ్గి, స్వాస్థ్యమే
యించుక లేక, పంటి బల మింతయు లేకయు నాలి బెట్టగా
కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్
ఎంత వేడుకున్న కొంతైన గదలడు
రిప్లయితొలగించండిమొండి వాడు లింగ మూర్తి జూడ
లేత మాంసమెట్టి లేవయ్య తనుమన్న
కంచమందు తిండి గలదు తినడు
ఆటవెలది:
రిప్లయితొలగించండిపేదవారి నెల్ల పీడించి యాస్తులు
కూడబెట్టినట్టి కుత్సితుండు
డబ్బుతోడ తనకు జబ్బులు దరిజేర
కంచమందు తిండి గలదు తినఁడు
మించఁగ నభి మాన మంచితముగ నెంచి
రిప్లయితొలగించండికొంచె మైన నచట మంచి తనము
మించఁ బిలువ రంచుఁ బెంచి సంకోచమ్ము
కంచ మందు తిండి గలదు తినఁడు
మించిన బాధ డెందమున మేటి మగండును గ్రుంక కుండునే
పంచన నిల్చి యుండినను భార్యను జూడఁడు పల్కరింపఁడే
మంచము పైన దొర్లు నణు మాత్రము జాఱఁడు నిద్ర లోనికిం
గంచము లోని యన్నమునుఁ గాంచుచు నుండెఁ దినండు సుంతయున్
వేళమించిపోయె వేగమేరమ్మని
రిప్లయితొలగించండిపిలుచుచుండనమ్మ ప్రేమతోడ
బడికి వెళ్ళననుచు పలుకు బాలు నెదుట
*"కంచమందు తిండి గలదు తినఁడు”*
డా బల్లూరి ఉమాదేవి
ఎంచగ హెచ్చె నప్పులవి యెవ్విధి తీర్తునటంచు బాధతో
మంచముపైనచేరుచను మానసమందునచింతహెచ్చుగన్
ముంచగ వచ్చె కష్టములు ముల్లటు గుండెల గుచ్చుచుండగా
*“కంచములోని యన్నమునుఁ గాంచుచునుండెఁ దినండు సుంతయున్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
లక్ష లప్పుజేసి లక్షణముగ పెంచ
వరద పాలు గాగ పంటలన్ని
వగపు తోడ రైతు దిగులుతో నుండగ
కంచమందు తిండి గలదు తినడు.